Seetanagaram
-
‘రాజ’ముద్ర’ ‘సిరి’పుత్రులు
సాక్షి, సీతానగరం (పార్వతీపురం): కొండకోనల్లో నివాసం. నాగరిక సమాజానికి దూరం. పేదరికం శాపం. అక్షర జ్యోతులు వెలగవు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడవు. శతాబ్ధాల తరబడి గిరిపుత్రుల సంక్షేమం కాగితాలకే పరిమితం. అడవి బిడ్డల బతుకుల్లో వెలుగులు పూయించాలి. విద్య సుగంధాలు గుబాళించాలి.. అదే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆకాంక్షించారు. అనుకున్నదే తడవు ఆచరణలో పెట్టారు. ఆ మహానుభావుడు ఏర్పాటు చేసిన విద్యాలయాలు గిరిజన యువతకు బంగారుబాట పరిచాయి. సీతానగరం మండలం జోగింపేటలో ఏర్పాటు చేసిన గిరిజన ప్రతిభా విద్యాలయ సముదాయం ఎందరో అడవి బిడ్డల బతుకుల్ని తీర్చిదిద్దుతోంది. తమను ఉన్నతంగా తీర్చిదిద్దిన రాజన్న రుణం తీర్చుకోలేమంటున్న గిరిపుత్రుల అంతరంగమిది. రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ జిల్లాల్లోని గిరిపుత్రుల వెనుకబాటుకు కారణం విద్య లేకపోవడమేనని రాజన్న గుర్తించారు. సీతానగరం మండలంలో ఖాళీగా ఉన్న జోగింపేట పట్టు పరిశ్రమ కేంద్రం స్థలాల్లో గిరిజన ప్రతిభా విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆయన పుణ్యమా అని ఉత్తరాంధ్రలోని గిరిజన విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించి ఉపాధ్యాయులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వైద్యాధికారులు, బ్యాంక్ ఉద్యోగులుగా ఉన్నత స్థానాల్లో వెలుగుతున్నారు. బిడ్డల ప్రయోజకత్వానికి వారి కుటుంబాలు మురిసిపోతున్నాయి. అట్టడుగున ఉన్న తమను ఉన్నత స్థాయికి తెచ్చిన రాజన్నకు కృతజ్ఞతాభివందనాలు అర్పిస్తున్నాయి. ఏటా రూ.12 లక్షల వేతనం మాది పేద గిరిజన కుటుంబం. చదివించే స్తోమత లేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. 2007 నుంచి 2010 వరకూ జోగింపేట ప్రతిభా విద్యాలయంలో 8 నుంచి 10 వరకూ చదివాను. పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ చదివి బీటెక్ చేశాను. ప్రస్తుతం నేను అహ్మదాబాద్‌లో ఎనలిస్ట్ మెడి ట్యాబ్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా ఏటా రూ.12 లక్షల వేతనంపై పని చేస్తున్నాను. – సవర గోవింద్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, బాతుపురం, సోంపేట మండలం, శ్రీకాకుళం జిల్లా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యా మా తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. వ్యయప్రయాసల కోర్చి ప్రాథమిక విద్యనందించారు. జోగింపేటలో ఏర్పాటు చేసిన ప్రతిభా విద్యాలయంలో 2008– 2012 విద్యాసంవత్సరంలో చదివాను. అప్పట్లో నిట్‌లో చదవడానికి అవకాశం వచ్చింది. ప్రస్తుతం దుర్గాపూర్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నా. దివంగత ముఖ్యమంత్రి దయతో ఏటా రూ.9 లక్షలు జీతం అందుకుంటున్నాను. మేమంతా రాజన్నకు రుణపడి ఉంటాం. – పి.ప్రసాద్, కళ్ళికోట, కొమరాడ మండలం డెంటిస్టుగా సేవలు నా తల్లిదండ్రులు పోడు వ్యవసాయం చేస్తూ నన్ను ప్రాథమిక పాఠశాలలో చదివించారు. రాజన్న ప్రభుత్వం ఏర్పాటు చేసిన గిరిజన ప్రతిభా విద్యాలయంలో చదువుకున్నాను. అనంతరం ఆంధ్ర వైద్య కళాశాలలో బీడీఎస్ వైద్య కోర్సు చదివి.. ప్రస్తుతం విశాఖలో డెంటిస్టుగా సేవలందిస్తున్నాను. – డాక్టర్ ఎ.కనకాలమ్మ, బొద్దాపుట్, పెదబయలు, విశాఖ జిల్లా వైద్యాధికారిగా.. జోగింపేట ప్రతిభా విద్యాలయంలో 2009– 2012 విద్యాసంవత్సరంలో చదువుకుని రంగరాయ వైద్య కళాశాలలో వైద్యాధికారిగా సేవలందిస్తున్నాను. పేద కుటుంబంలో జన్మించిన నన్నింతటి వాడిని చేసిన రాజన్నకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. – సిహెచ్.లక్ష్మణ్‌నాయక్, కనిమెర్ల, మైలవరం మండలం, కృష్ణా జిల్లా యూనియన్ బ్యాంక్‌లో ఏబీఎం మా తల్లిదండ్రులు వ్యవసాయం చేసేవారు. జోగింపేట గిరిజన విద్యాలయంలో చదివిన అనంతరం బీటెక్ చేశాను. యూనియన్ బ్యాంక్ ఏబీఎంగా ఉద్యోగం సంపాదించాను. నా తోబట్టువులను కూడా చదివిస్తున్నాను. – ఆర్.రమేష్‌రెడ్డి, పి.ఎర్రగొండ, రామవరం మండలం, తూర్పు గోదావరి జిల్లా -
ఇసుక గోతులతో ఉసురు తీస్తారా?
సీతానగరం: అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక తవ్వకాలతో జేబులు నింపుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలక మండలి (సీజీసీ) సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి విమర్శించారు. సీతానగరంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. నీరు లేనపుడు కృష్ణా నదిలో టీడీపీ నేతలు గుంటలు చేసి ఇసుక అమ్ముకుని, పుష్కరాల్లో అవే గుంటల్లో పడి ఐదుగురు విద్యార్థుల మరణానికి కారణమయ్యారని విమర్శించారు. గత కృష్ణా పుష్కరాల్లో ఇద్దరు చనిపోతే నాటి సీఎం వైఎస్ రాజీనామాకు డిమాండ్ చేసిన టీడీపీ నేతలు గోదావరి పుష్కరాల్లో 29 మంది, కృష్ణా పుష్కరాల్లో ఐదుగురి మరణాలకు ఏం సమాధానం చెబుతారని ఆమె ప్రశ్నించారు. పుష్కరాల మరణాలకు బాధ్యత వహిస్తూ సీఎం చంద్రబాబు, ఆయన కృష్ణా జిల్లా ప్రతినిధి దేవినేని ఉమామహేశ్వరావు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైతుల తరపున ఉద్యమిస్తాం ఖరీఫ్‌కు సాగునీరు అందించడంలో తెలుగుదేశం ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విజయలక్ష్మి అన్నారు. అవసరమైతే తాము రైతుల తరఫున ఉద్యమిస్తామని చెప్పారు. కలవచర్ల పుష్కర లిఫ్ట్ ద్వారా సీతారాంపురం, మురారి, సింగరాయపాలెం, గాదరాడలలోని 4,500 ఎకరాలకు నీరు అందించాల్సి ఉండగా, ఇప్పటి కేవలం 25 ఎకరాల్లో మాత్రమే ఊడ్పులయ్యాయన్నారు. గతంలో వ్యవసాయమే దండగ అన్న చంద్రబాబు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక రైతులు క్రాఫ్ హాలిడే ప్రకటించే పరిస్థితులు కల్పించారన్నారు. అధికార పార్టీ ధన దాహం వల్లే :పాపారాయుడు మండపేట : అధికారపార్టీ నేతల ధన దాహం వల్లే కృష్ణా పుష్కరాల్లో విషాదం చోటుచేసుకుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు అన్నారు. కృష్ణానది పాయలో ఇసుక కోసం తవ్విన గుంతలో పడి ఐదుగురు విద్యార్థులు మృత్యువాత పడానికి టీడీపీ నేతలు బాధ్యత వహించాలని ఆయనన్నారు. స్థానిక కామత్ ఆర్కేడ్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు హయాంలో ఇసుక దందా యథేచ్ఛగా సాగిపోతోందని విమర్శించారు. నిబంధనలకు నీళ్లొదిలి ఇష్టానుసారం అధికార పార్టీ నేతలు తవ్వకాలు సాగిస్తున్నారన్నారు. పెద్దపెద్ద గోతులు ఏర్పడుతుండండగా నీళ్లు వచ్చిన తర్వాత అవి కానరాక అమాయక ప్రజలు, మూగజీవాలు వాటిలో పడి ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. -
తిరగబడిన రైతులు
-
తిరగబడిన రైతులు
విజయనగరం: సీతానగరం మండలంలో రైతులు తిరగబడ్డారు. తమ ప్రతాపం చూపారు. ఎన్‌సిఎస్ షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తమ బకాయిలు చెల్లించాలని రైతులు ఆందోళనకు దిగారు. వందల సంఖ్యలో రైతులు షుగర్ ఫ్యాక్టరీ లోపలకు చొచ్చుకుపోయారు. లోపల యంత్రాలను, అద్దాలను ధ్వంసం చేశారు. ఫ్యాక్టరీ ఆవరణలోని చెట్లను కూడా పెకలించివేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యం బకాయిలు చెల్లించకుండా రైతులను బాధలకు గురిచేస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సొమ్ముతో వ్యాపారం చేసుకుంటున్నారని వారు మండిపడ్డారు. అప్పులు చేసి చెరకు పండించి ఫ్యాక్టరీకి సరఫరా చేశామని చెప్పారు. ఏడాదిన్నర నుంచి తమకు రావాల్సిన సొమ్మును ఇవ్వకుండా యాజమాన్యం వేధిస్తోందని వారు వాపోయారు. అధికారులు, పాలకులు కూడా తమను పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఫ్యాక్టరీ దాదాపు 32 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించవలసి ఉంది. ఆవేదనతో రెచ్చిపోతున్న రైతులను అదుపు చేయడం పోలీసుల తరం కావడంలేదు. ఎంత ప్రయత్నించినా రైతులు వినే పరిస్థితి లేదు. రైతులు, పోలీసుల తోపులాటలో ఇరువైపుల పలువురికి గాయాలయ్యాయి. బకాయిల చెల్లింపుపై యాజమాన్యం ఒక ప్రకటన చేస్తే తప్ప తాము రైతులను అదుపు చేయలేమని పోలీసులు చెబుతున్నారు. అవసరమైతే అదనపు పోలీస్ బలగాలను రప్పించే ప్రయత్నంలో జిల్లా యంత్రాంగం ఉంది. ** -
టీడీపీ దాడిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త మృతి
సీతానగరం: తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు జరిపిన దాడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్త మృతి చెందారు. ఈ దుర్ఘటన తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో చోటు చేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మృతి చెందారనే వార్తతో ఆప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. సుమారు 200 మంది కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేసినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.