seismic zone
-
ఏమిటీ సీస్మిక్ జోన్లు.. మనం ఎక్కడున్నాం?
భూకంపాలు వచ్చేందు కు అవకాశం ఉండే ప్రాంతాలను సీస్మిక్ జోన్లుగా పేర్కొంటారు. భూమి లోపలి పొరల పరిస్థితి, వాటి మధ్య ఖాళీలు, పగుళ్లు, కదలికలు వచ్చే అవకాశం వంటి అంశా లను పరిశీలించి వీటిని.. ఎంత స్థాయిలో ప్రకంపనలు రావొచ్చనేది అంచనా వేస్తారు. ఆ తీవ్రతను బట్టి ఒకటి నుంచి ఐదు వరకు జోన్లుగా విభజిస్తారు. జోన్–1లో ఉంటే అత్యంత స్వల్ప స్థాయిలో... జోన్–5లో ఉంటే తీవ్ర స్థాయిలో తరచూ భూకంపాలు వచ్చే ప్రాంతం అని చెప్పవచ్చు.రాష్ట్రంలో భూకంప జోన్లు ఇలా..జోన్–1: అతి స్వల్ప స్థాయిలో ప్రకంపనలకు అవకాశం ఉండే ప్రాంతాలు. ఇక్కడ ప్రకంపనలు వచ్చినా మనం గుర్తించలేనంత స్వల్పంగా ఉంటాయి.జోన్–2: ప్రకంపనల తీవ్రత 0.1 నుంచి నాలుగు పాయింట్ల వరకు ఉండే ప్రాంతాలివి. రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు, నిజామాబాద్, నల్లగొండతోపాటు ఏపీలోని కర్నూల్, నంద్యాల, అనంతపురం ప్రాంతాల వరకు జోన్–2లో ఉన్నాయి. ఇక్కడ వచ్చే ప్రకంపనలతో దాదాపుగా ఎలాంటి నష్టం ఉండదు.జోన్–3:భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేలుపై 5 నుంచి 6 వరకు నమోదయ్యే అవకాశం ఉన్న ప్రాంతాలివి. మహారాష్ట్రలో చంద్రాపూర్ నుంచి మొదలై ఉత్తర తెలంగాణలో గోదావరి నది వెంట ఉన్న రామగుండం, మంచిర్యాల, భూపాలపల్లి, బెల్లంపల్లి, భద్రాచలం, ఖమ్మంతోపాటు ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలు, ఒంగోలు, నెల్లూరు తదతర ప్రాంతాలు జోన్–3 పరిధిలోకి వస్తాయి. దేశంలో చూస్తే పశ్చిమ తీర ప్రాంతాలు, గంగా, యమునా నది పరీవాహక ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడి భూకంపాలతో కొంత వరకు నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది.జోన్–4:భూప్రకంపనల తీవ్రత 6 నుంచి 7 పాయింట్ల వరకు ఉండే ప్రాంతాలివి. ముంబై సహా మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, గుజరాత్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, ఢిల్లీ వంటివి జోన్–4లో ఉన్నాయి. ఇక్కడ భారీ భూకంపాలు, తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది.జోన్–5: భూకంపాల తీవ్రత 7 పాయింట్లు, అంతకు మించి వచ్చే ప్రమాదమున్న ప్రాంతాలివి. హిమాలయ పర్వత ప్రాంతాలు, జమ్మూకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, గుజరాత్ రాష్ట్రంలోని కొంత భాగం దీని పరిధిలో ఉన్నాయి. ఇక్కడ వచ్చే భూకంపాలు అత్యంత నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. -
భూ అంతర్భాగంలో భారీ నిర్మాణం
మేరిల్యాండ్: శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూ విశ్వానికి సంబంధించిన పలు రహస్యాలు కనుగొంటున్న విషయం తెలిసిందే. అదే విధంగా భూ అంతర్భాగానికి సంబంధించిన విషయాలు, రహస్యాలను తెలుసుకోవడానికి కూడా నిరంతరం పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు పసిఫిక్ మహాసముద్రం కింద ఉన్న భూమిలో పరిశోధనలు చేసి భూమి లోపల ఉండే మంటిల్ పొర వద్ద ఓ భారీ నిర్మాణాన్ని కనుగొన్నారు. మేరీల్యాండ్ విశ్వవిద్యాలయానికి చెందిన డోయోన్ కిమ్, అతని సహచరులు దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని అగ్నిపర్వత మార్క్వాస్ దీవుల కింద ఉన్న భూమిలో ఓ కొత్త నిర్మాణాన్ని కనుగొన్నట్లు తెలిపారు. (జుకర్ బర్గ్ దంపతుల సంచలనం : ట్రంప్‌కు షాక్) వేల కిలోమిటర్ల అడుగున భూ అంతర్భంగంలోని ఈ నిర్మాణాన్ని కనుగొనడానికి భూకంపాలు సంభవించినప్పుడు వెలువడే తరంగాల డేటాను విశ్లేషించినట్లు వెల్లడించారు. ఈ నిర్మాణాన్ని భూమి లోపల 2900 కిలోమీటర్ల వద్ద గుర్తించామని తెలిపారు. అల్ట్రా లో వెలాసిటీ(యూఎల్‌వీ)జోన్ అని పిలువబడే ఈ నిర్మాణం 1000 కిలోమీటర్ల వ్యాసం, 25 కిలోమీటర్ల మందంతో ఉన్నట్లు కిమ్ తెలిపారు. భూకంపకాలు సంభవించినప్పుడు వచ్చే తరంగాలు భూమిలో వేల కిలోమీటర్లు ప్రయాణించగలవు. ఈ తరంగాల ప్రతిధ్వనుల సాయంతో భూమి ఉపరితల భౌతిక లక్షణాలతోపాటు భూగర్భంలోని పలు నిర్మాణాలను కనుగొనవచ్చుని పేర్కొన్నారు. దీనికోసం 1990 నుంచి 2018 వరకు పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతం చూట్టూ సంభవించిన సుమారు 7000 భూకంపాలకు సంబంధించిన తరంగాల రికార్డులను విశ్లేషించినట్లు డోయోన్ కిమ్ తెలిపారు.(వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. మల్టీ లాగిన్) -
ఇస్తాంబుల్‌కు భూకంప ప్రమాదం
అంకార : టర్కీలోని ప్రధాన నగరమైన ఇస్తాంబుల్‌కు భారీ భూకంపం ముంచుకొచ్చే ప్రమాదం పొంచి ఉంది. ఇది ఇటీవల కాలిఫోర్నియాను కుదిపేసిన తీవ్రతకన్నా, అంటే రిక్టర్ స్కేల్‌పై 7.1 శాతం నుంచి 7.4 శాతం వరకు ఉండవచ్చని నిపుణుల అధ్యయనంలో తేలింది. మార్మరా సముద్రం అట్టడుగు భాగంలో భూ పొరల మధ్య ఒత్తిడి బాగా పెరుగుతోందని, దాని పర్యవసానంగా భారీ భూకంపం వచ్చే ప్రమాదం పూర్తిగా ఉందని ‘జీయోసీ’ ప్రాజెక్ట్ మేనేజర్ ప్రొఫెసర్ హైడ్రన్ కోప్ హెచ్చరించారు. 1776లో ఇస్తాంబుల్ నగరంలో వచ్చిన 7.5 స్థాయి భూకంపంలో వేలాది మంది మరణించారు. భూ ఉపరితలం పైన సంభవించే భూకంపాలను శాటిలైట్ ఛాయా చిత్రాల ద్వారా అంచనా వేయవచ్చని, సముద్ర గర్భంలో వచ్చే భూకంపాలను ఈ పద్ధతిలో అంచనా వేయలేమని హైడ్రన్ కోప్ తెలిపారు. నీటిలో 800 మీటర్ల లోతున, సముద్రంలో వివిధ భాగాల్లో జరిపిన పరీక్షల్లో భూకంపాలు పొంచి ఉన్నట్లు తేలిందని ఆయన చెప్పారు. ఎంతకాలంలో ఈ భూకంపాలు వస్తాయన్నది ఇప్పుడే చెప్పలేమని అన్నారు. 1999లో ఇదే నగరంలో 7.1 నుంచి 7.4 మధ్య తీవ్రతతో వచ్చిన భూకంపాల్లో 17 వేల మంది మరణించారు. -
భూప్రకంపన జోన్ లో విజయవాడ
నూతన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఏర్పాటు కానుందనే దానిపై మరికొద్దిరోజుల్లో స్పష్టత రానుంది. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని నిర్మాణానికి ఎక్కువ అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ప్రాంతం భూప్రకంపన జోన్ లో ఉందంటూ భారత భూవిజ్ఞాన శాస్త్ర సంస్థ(జీఎస్ఐ) శాస్త్రవేత్తలు బాంబు పేల్చారు. ఇక్కడ భూమి కంపించే అవకాశాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. ఈ ప్రాంతం భారత భూవిజ్ఞాన శాస్త్ర సంస్థకు చెందిన హైదరాబాద్ లోని భూకంపనాల అధ్యయన దక్షిణవిభాగం ఈ విషయాన్ని తెలిపింది. నైరుతి గుణదల, మంగళగిరిలోని కొండ ప్రాంతాలు అత్యంత సున్నితమైన ప్రాంతాలని జూన్ లో సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఒక అంతస్థు భవనాలు నిర్మించడానికి కూడా ఇవి అనువైన ప్రాంతాలు కాదని స్పష్టం చేసింది. ఇంద్రకీలాద్రి కొండల్లోని తూర్పు ఘాట్ ప్రాంతానికి భూకంపనాల ముప్పు ఉందని పేర్కొంది. నిడమర్రు నైరుతి ప్రాంతం, తాడేపల్లి తూర్పువైపు, నున్న దక్షిణ ప్రాంతంతో పాటు కృష్ణా నది పరివాహక ప్రాంతంలోనూ భూకంపనాలకు అవకాశముందని జీఎస్ఐ తెలిపింది. విజయవాడకు 300 కిలోమీటర్ల పరిధిలో భూప్రకంపనాలు సంభవించేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని హైదరాబాద్ ఐఐఐటీ పరిశోధకులు అంచనా వేశారు. అయితే భూకంపాలు ఎప్పుడు సంభవిస్తాయనేది కచ్చితంగా చెప్పలేమని హైదరాబాద్ ఐఐఐటీ పరిశోధకరాలు డాక్టర్ నీలిమా సత్యం అన్నారు. ఉపద్రవం వచ్చినప్పుడు మాత్రమే దాని తీవ్రత తెలసుస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన- భూకంప ముప్పు ఉన్న 63 నగరాల్లో విజయవాడ కూడా ఉందని తెలిపారు. పర్యావరణ అసమతుల్యత, అపక్రమత కారణంగా భూకంపాలు వచ్చే అవకాశం ఎక్కువని వివరించారు.