selection of judges
-
నాలుగు హైకోర్టులకు సీజేలను సిఫార్స్ చేసిన కొలీజియం
న్యూఢిల్లీ: పట్నా, హిమాచల్ ప్రదేశ్, గువాహటి, త్రిపుర హైకోర్టులకు నూతన ప్రధాన న్యాయమూర్తులను ఎంపికచేస్తూ కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులు పంపింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియంలో జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్ సభ్యులుగా ఉన్నారు. కేరళ హైకోర్టు జడ్జి జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌ను పట్నా హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా, జస్టిస్ సబీనాను హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకు సీజేగా, త్రిపుర హైకోర్టు సీజేగా జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్‌ను, జస్టిస్ సందీప్ మెహతాను గువాహటి హైకోర్టు సీజేగా ఎంపికచేయాలంటూ కొలీజియం.. కేంద్రప్రభుత్వానికి తాజాగా సిఫార్సుచేసింది. -
జడ్జీల నియామకానికి ఉమ్మడి పరీక్ష!
► దిగువ స్థాయి కోర్టుల్లో ఖాళీల భర్తీకి కేంద్రీకృత వ్యవస్థ ► సంబంధిత ‘కాన్సెప్ట్ నోట్’ విడుదల న్యూఢిల్లీ: దిగువ స్థాయి కోర్టుల్లో జడ్జీల ఎంపికకు ఏకైక ఉమ్మడి పరీక్ష నిర్వహించాలన్న ప్రతిపాదనను సుప్రీంకోర్టు త్వరలో పరిశీలించనుంది. ఈ వ్యవహారంలో కోర్టుకు సహాయకారిగా వ్యవహరిస్తున్న సీనియర్ న్యాయవాది అరవింద్ దాతర్ రూపొందించిన ‘కాన్సెప్ట్ నోట్’ను గురువారం సుప్రీంకోర్టు వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. దేశంలో జిల్లా, ఇతర దిగువ స్థాయి కోర్టుల్లో మొత్తం జడ్జీలు సుమారు 21వేలు ఉండాల్సి ఉండగా, అందులో 4,800 ఖాళీగా ఉన్నట్లు నోట్ పేర్కొంది. జడ్జీల నియామక ప్రక్రియ సజావుగా సాగేలా కేంద్రీకృత నియామక విధానం(సీఎస్ఎం) కింద డిస్ట్రిక్ట్ జడ్జెస్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్(డీజ్యూర్) నిర్వహించాలని అందులో ప్రతిపాదించారు. డీజ్యూర్ ద్వారా ఏటా 300 ఖాళీలను భర్తీ చేయాలని సూచించింది. ఈ విధానం కేవలం ‘అభ్యర్థుల పూల్’ను మాత్రమే ఇస్తుందని, అందులో నుంచి ఇంటర్వ్యూల ద్వారా అర్హులను ఎంపిక చేయాలని స్పష్టత ఇచ్చింది. ‘అర్హులైన న్యాయవాదులు లేకపోవడంతో జిల్లా జడ్జీల పదవులు ఖాళీగా ఉంటున్నాయి. క్రమబద్ధమైన పరీక్ష విధానం లోపించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. అభ్యర్థులు ముందస్తుగా సన్నద్ధమయ్యేందుకు ప్రత్యేక సిలబస్ అంటూ లేదు. ఇలాంటి లోటుపాట్లను డీజ్యూర్తో అధిగమించొచ్చు’ అని నోట్ పేర్కొంది. ‘ఎంపిక ప్రక్రియకు సంబంధించి రాష్ట్రాల స్వయంప్రతిపత్తికి డీజ్యూర్ ఆటంకంకలిగించదు. రిజర్వేషన్లు, అర్హత నియమాలు ఎప్పటిలాగే కొనసాగుతాయి’ అని నోట్ పునరుద్ఘాటించింది. -
జడ్జీల నియామకాల్ని హైజాక్ చేయలేరు: చీఫ్ జస్టిస్ ఠాకూర్
న్యూఢిల్లీ: న్యాయమూర్తుల నియామకాల ప్రక్రియను హైజాక్ చేయలేరని, న్యాయవ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ అన్నారు. జడ్జీల ఎంపిక విషయంలో కార్యనిర్వాహక వ్యవస్థపై న్యాయవ్యవస్థ ఆధారపడకూడదని ఆయన పేర్కొన్నారు. భీమ్సేన్ సచార్ మెమోరియల్‌లో ‘స్వతంత్ర న్యాయవ్యవస్థ-ప్రజాస్వామ్యానికి పరిరక్షణ’ అంశంపై గురువారం మాట్లాడుతూ... న్యాయవ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించకపోతే రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులకు అర్థం ఉండదన్నారు. అన్నింటి కంటే స్వతంత్య్ర న్యాయ వ్యవస్థే ప్రజాస్వామ్యానికి ముఖ్యమని జస్టిస్ ఠాకూర్ అభిప్రాయపడ్డారు. నియమకాల పక్రియను హైజాక్ చేయడం ద్వారా న్యాయవ్యవస్థ ప్రభావితమయ్యే పరిస్థితి రాకూడదని ఎన్‌జేఏసీపై విచారించిన రాజ్యాంగం ధర్మాసనం అభిప్రాయపడిందని తెలిపారు. న్యాయ శాఖ మంత్రి, ప్రభుత్వం నియమించిన ప్రతినిధులు జడ్జీలను ఎంపిక చేయడం స్వతంత్ర న్యాయవ్యవస్థకు విఘాతమని ఠాకూర్ పేర్కొన్నారు.