selfe
-
వారణాసిలో ఏపీకి చెందిన అన్నదమ్ముల బలవన్మరణం
వారణాసి/ఏలూరు: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు వారణాసిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక సెల్ఫీ వీడియోలు తీసి ఆత్మహత్య చేసుకోవడంతో విషాదం నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఏలూరు జిల్లా ఉంగటూరులోని నారాయణపురానికి చెందిన అన్న దమ్ములు వినోద్, లక్ష్మీనారాయణలు రియల్ ఎస్టేట్,ఫైనాన్స్ వ్యాపారం చేస్తుండేవారు. వ్యాపార నిర్వహణకు స్నేహితులు, స్థానికుల వద్ద అప్పులు చేశారు.అయితే వ్యాపారంలో నష్టాలు రావడం, తమ డబ్బులు ఇవ్వాలంటూ ఒత్తిడి చేయడంతో అన్నదమ్ములు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు .అనంతరం ఏపీ నుంచి వారణాసికి వెళ్లారు. అక్కడ ఆంధ్రా ఆశ్రమంలో గదిని అద్దెకు తీసుకుని.. అందులోనే ఉంటున్నారు.ఇదీ చదవండి : ప్రశ్నార్ధకంగా విశాఖ ఉక్కు పరిశ్రమఈ తరుణంలో వ్యాపారంలో నష్టాలు, అప్పులు ఇచ్చిన వారిని నుంచి ఒత్తిడి పెరిగిపోతుందని, తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియో తీశారు. ప్రాణాలు పోగొట్టుకున్నారు. సెల్ఫీ వీడియోపై సమాచారం అందుకున్న వారాణాసి పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అన్నదమ్ములిద్దరు ప్రాణాలు విడిచినట్లు నిర్ధారించారు. అన్నదమ్ముల మృతిపై ఏపీలోని వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
చిల్ సెల్ఫీ
సందడి సందడిగా షూటింగ్లో పాల్గొంటూ షాట్ గ్యాప్‌లో చిల్ అవుతుంటారు నటీనటులు. సరదాగా సెల్ఫీకు ఫొజులిస్తుంటారు కూడా. అలాంటిదే ఇది. ‘వెంకీ మామ’ షూటింగ్ గ్యాప్‌లో నాగచైతన్యతో రాశీఖన్నా క్లిక్ చేసిన సెల్ఫీ ఇది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. వెంకటేశ్, నాగ చైతన్య హీరోలుగా కేయస్ రవీందర్ (బాబీ) తెరకెక్కిస్తున్నారు. పాయల్ రాజ్‌పుత్, రాశీ ఖన్నా హీరోయిన్లు. -
ముద్దు మీరిన అభిమానం
సాక్షి, హైదరాబాద్: రాజ్‌కోట్ టెస్టులో అభిమాని మైదానంలోకి దూసుకొచ్చి కోహ్లితో సెల్ఫీ తీసుకున్న ఘటన తర్వాత ఇప్పుడు రెండో టెస్టుల్లో మళ్లీ అలాంటిదే జరిగింది. ఈసారి కోహ్లి ఫ్యాన్‌గా చెప్పుకున్న ఆ యువకుడు తన అభిమానాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లాడు. సరిగ్గా చెప్పాలంటే అతిగా వ్యవహరించి క్షణ కాలం పాటు కోహ్లినే భయపెట్టేశాడు. విండీస్ ఇన్నింగ్స్‌లో 15వ ఓవర్ ముగిసిన తర్వాత ఈ ఘటన జరిగింది. కోహ్లి ఫీల్డింగ్ కోసం మరో ఎండ్‌కు వెళ్లే ప్రయత్నంలో ఉండగా వెస్ట్ గ్యాలరీ నుంచి ఒక యువకుడు నేరుగా అతని వైపు దూసుకొచ్చాడు. ప్రమాదాన్ని ఊహించిన కోహ్లి తప్పించుకునే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. వేగంగా వచ్చిన అతను వెంటనే కోహ్లికి చేరువగా వచ్చి సెల్ఫీ తీసేసుకున్నాడు. దీనికి కూడా సరేలే అన్నట్లుగా కెప్టెన్ సర్దుకున్నాడు. కానీ ఆ వ్యక్తి అంతటితో ఆగలేదు. అనూహ్యంగా కోహ్లి భుజాల మీదుగా చేతులు వేసి దగ్గరకు లాక్కున్నాడు. దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టే ప్రయత్నం కూడా చేయడంతో బిత్తరపోవడం కోహ్లి వంతైంది. అతడి నుంచి తల తిప్పుకొని ఎలాగోలా దూరం జరిగిన విరాట్ ఆ ముద్దును తప్పించుకోగలిగాడు. ఇంత జరిగిన తర్వాత నింపాదిగా వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది మొత్తానికి ఆ యువకుడిని అక్కడి నుంచి తీసుకొని వెళ్లిపోయారు. కోహ్లిని చూస్తే అతను కూడా ఒకింత ఆందోళనకు లోనైనట్లు కనిపించింది. ఈ రెండు ఘటనలు చూస్తే వీటిని ఏమాత్రం సరదాగా, అభిమానంతో చేసే పనులుగా చూడాల్సిన పరిస్థితి దాటిపోయింది. మైదానంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరాన్ని ఇది చూపించింది. -
సెల్ఫీ సరదా.. ఎంత పని చేసింది!
-
గూడ్స్ రైలు ఎక్కి సెల్ఫీ దిగుతుండగా..
అరకు: సెల్ఫీ పిచ్చి ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. గూడ్స్ రైలు ఎక్కి సెల్ఫీ తీసుకోవడానికి యత్నించిన యువకుడు హైటెన్షన్ వైర్లు తాకడంతో.. తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన విశాఖ జిల్లా అరకులో సోమవారం జరిగింది. జాన్ అనే బీటెక్ విద్యార్థి సంక్రాంతి పండుగ సందర్భంగా స్నేహితులతో కలిసి అరకు వెళ్లాడు. ఈ క్రమంలో సోమవారం సెల్ఫీ దిగడానికి యత్నిస్తూ.. తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.