Sentences
-
అమెరికాలో మరణ శిక్ష ఎలా అమలు చేస్తారంటే..
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాలో ప్రస్తుతం దోషులకు విధిస్తున్న మరణ శిక్షలను విషపు ఇంజెక్షన్లు ఇవ్వడం ద్వారా అమలు చేస్తున్నారు. సకాలంలో కావాల్సిన విషపు మందులు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ మరణ శిక్షల అమల్లో ఆలస్యం కూడా జరగుతోంది. ఈ క్రిస్మస్ నుంచి మరణ శిక్షల అమలుకు ఇతర పద్ధతులను కూడా అమల్లోకి తెస్తున్నారు. ఒకప్పుడు పలు దేశాలు అమలు చేసిన ఎలక్ట్రిక్ చేర్‌కు కట్టేసి, గ్యాస్ చాంబర్లో నిర్బంధించి, తుపాకులతో కాల్చి చంపే పద్ధతులను అమల్లోకి తెస్తున్నారు. నవంబర్ 27వ తేదీనే అమెరికా జస్టిస్ విభాగం ఈ ప్రత్యామ్నాయ పద్ధతులను తీసుకొచ్చింది. వీటిలో భారత్‌లో లాగా ఉరి శిక్ష అమలు చేయడం లేదు. అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ జనవరి 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేసే నాటికి మరణ శిక్షలు త్వరితగతిన అమలు చేయడంలో విషపు ఇంజెక్షన్ల కొరత ఏర్పడ కూడదన్న ఉద్దేశంతో అమెరికా న్యాయ విభాగం మరణ శిక్షల అమలుకు ఈ ప్రత్యామ్నాయ మరణ శిక్షలను సూచించి ఉండవచ్చు. 2020, జనవరి నాటికి అమెరికాలో మరణ శిక్షలు పడి నిర్బంధంలో ఉన్న దోషులు 2,600 మంది కాగా, గత జూలై 14వ తేదీ నుంచి దేశాధ్యక్ష ఎన్నికలు జరిగే నాటికి డోనాల్డ్ ట్రంప్ యంత్రాంగం 1550కి పైగా మరణ శిక్షలను అమలు చేసింది. ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయాక బ్రాండెన్ బెర్నార్డ్ అనే 40 ఏళ్ల యువకుడికి గురువారం రాత్రి విషపు ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా మరణ శిక్ష విధించారు. చిన్న దోపిడీకే ఆ యువకుడికి మరణ శిక్ష పడింది. కిమ్ కర్దాషియన్ సెలబ్రిటీలు నిందితుడికి క్షమాభిక్ష ప్రసాదించాల్సిందిగా విజ్ఞప్తులు చేసినా లాభం లేకపోయింది. అమెరికాలో మరణ శిక్షలు వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో వాటిని తాను అధికారంలోకి రాగానే రద్దు చేస్తానని నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కారణంగా ఆయన వచ్చేలోగా మరో ఐదుగురికి మరణ శిక్షలు అమలు చేసేందుకు ట్రంప్ యంత్రాంగం ఇది వరకే సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఒకప్పుడు అమెరికాలోనూ ఉరి శిక్షలు అమెరికాలో ఒకప్పుడు మరణ శిక్షలను ఉరి తీయడం ద్వారా అమలు చేసేవారు. అందులో అమానుషత్వం ఉందని భావించి 1936లో ఆ విధానానికి స్వస్తి చెప్పారు. కెంటకీలో రెయినీ బెతియా అనే వ్యక్తిని ఉరి తీసినప్పుడు ఆయన వెన్నుపూస విరిగి నరక యాతన అనుభవించడంతో ఆ విధానం సరైనది కాదని న్యాయ నిపుణులు భావించారు. ఆ తర్వాత హఠాత్తుగా ఉరి బిగుసుకునేలా కాకుండా మెడకు తాడు కట్టి మెల్లగా వేలాడదీశేవారు. అలా నల్లజాతీయులనే ఎక్కువగా ఉరి తీశారు. 20 శతాబ్దం ఆరంబం నుంచి మరణ శిక్షల అమలుకు ప్రత్యామ్నాయ పద్ధతులను అన్వేషించడం ప్రారంభించారు. తొలి అన్వేషణలోనే ‘ఎలక్ట్రిక్ చైర్’ మరణ శిక్షను అమలు చేయడం మంచిదనిపిచ్చింది. ఈ పద్ధతిని 1890, ఆగస్టు ఆరవ తేదీన న్యూయార్క్ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా హంతకుడు విలియం కెమ్లర్కు అమలు చేశారు. ఎలక్ట్రిక్ చైర్ విధానం అమానుషమంటూ కెమ్లర్ పెట్టుకున్న పిటిషన్‌ను అమెరికా సుప్రీం కోర్టు కొట్టివేసింది. దేశవ్యాప్తంగా ఆ విధానాన్ని అనుసరించడమే ఉత్తమమని 20వ శాతాబ్దంతో న్యాయ నిపుణుల బృందాలు సూచించాయి. ఎలక్ట్రిక్ చేర్ వల్ల నరాలు కుంచించుకుపోయి ప్రాణం పోవడం కన్నా ముందే మెదడు పని చేయకుండా పోతుంది కనుక మరణ యాతన ఉండదనే ఉద్దేశంతో అదే మంచి పద్ధతని చాలాకాలం భావించారు. 1980వ దశకం వరకు ఈ విధానం అమెరికా అంతటా కొనసాగింది. 1990లో ఒకసారి, 1997లో ఒకసారి మరణ శిక్ష అమలు సందర్భంగా ఎలక్ట్రిక్ చైర్లు అంటుకొని దోషులు మాడిపోవడంతో ఆ విధానం వివాదాస్పదం అయింది. ఆ దేశంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం స్వతంత్ర చట్టాలు చేసుకునే కొన్ని ప్రత్యేకాధికారాలు కూడా ఉండడంతో వర్జీరియా రాష్ట్రం 2013 వరకు కూడా దోషులకు మరణ శిక్షలు అమలు చేసేందుకు ఎలక్ట్రిక్ చైర్ విధానాన్నే అనుసరిస్తూ వచ్చింది. 21వ శతాబ్దంలో గ్యాస్ చేంబర్లు జార్జియాలోని సుప్రీం కోర్టు జస్టిస్ కరోల్ డబ్లూ అన్స్టెయిన్ ‘ఎలక్ట్రిక్ చైర్’ ద్వారా మరణ శిక్ష అమలు చేయడం కూడా ఉరి శిక్ష విధించడం లాంటి అమానుషమేనని తీర్పునివ్వడంతో మళ్లీ ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించారు. 1922లో నేవడలో మొదటిసారి అమలు చేసిన గ్యాస్ చేంబర్ పద్ధతి మళ్లీ చర్చకు వచ్చింది. వెంటిలేటర్లులేని ఓ గదిలో దోషిని నిర్బంధించి నైట్రోజెన్ గ్యాస్‌ను పంపించి చంపడమే ఆ పద్ధతి. ఏ జైల్లోనూ ఈ పద్ధతిలో మరణ శిక్షను అమలు చేయడానికి సైరైన్ సదుపాయాలులేక విమర్శలు వెల్లువెత్తాయి. మరణ శిక్షను ప్రత్యక్షంగా వీక్షించిన సాక్షులు, జైల్లో ఉంటున్న ఇతర ఖైదీలు ఆ గ్యాస్ ప్రభావానికి లోనై దగ్గుతుండడం విమర్శలకు కారణం. 1924 నుంచి 1977 వరకు ఈ పద్ధతిన పలు రాష్ట్రాలు మరణ శిక్షలు అమలు చేశాయి. 22 ఏళ్ల తర్వాత ఆఖరి సారి 1999లో ఉపయోగించారు. మరోపక్క ప్రత్యామ్నాయంగా 1900 నుంచి 2010 వరకు ఫైరింగ్ స్క్వాడ్‌తో మరణశిక్షలు అమలు చేశారు. ఆ తర్వాత విషపు ఇంజెక్షన్ల ద్వారా మరణ శిక్ష అమలు చేయడం వచ్చింది. ట్రంప్ హయాంలో ఒక్క ఉరిశిక్ష తప్ప మరణ శిక్షలకు పాత పద్ధతులన్నీ మళ్లీ అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరిగాయి. -
ముగ్గురు భారతీయులకు 517 ఏళ్ల జైలు
దుబాయ్ : యూఏఈలోని దుబాయ్ స్పెషల్ బెంచ్ కోర్టు సంచలన తీర్పుని వెలువరించింది. 200 మిలియన్ డాలర్ల చీటింగ్ కేసులో ముగ్గురు భారతీయులకు 517 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ దుబాయ్ కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. ఇందులో భార్యాభర్తలతో పాటు మరో వ్యక్తికి కూడా 517 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తున్నట్లు న్యాయమూర్తి డాక్టర్ మొహమ్మద్ హనాఫీ ఆదివారం తీర్పు వెల్లడించారు. గోవాకు చెందిన సిడ్నీ లెమోస్, అతడి భార్య వలనీ, రేయాన్ డీసౌజాలు, ఎసెన్షియల్ ఫారెక్స్‌ను నిర్వహించి సుమారు 200 మిలియన్ల డాలర్ల మోసానికి పాల్పడినట్టు దుబాయ్ న్యాయస్థానం నిర్ధారించింది. నిందితుల్లో ఒక్కొక్కరిపై 500పైగా కేసులు నమోదయ్యాయని, లక్షల డాలర్ల మోసాలకు పాల్పడ్డారని, అభియోగాలు అన్నీ రుజువయ్యాయని న్యాయమూర్తి హనాఫీ వెల్లడించారు. తీర్పు వెలువరించే సమయంలో వందలాదిమంది బాధితులు అక్కడ ఉన్నారు. ఈ సందర్భంగా దోషుల నుంచి నగదు స్వాధీనం చేసుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. వారిపై మోపిన అభియోగాలు, తీర్పు ప్రతులను చదవడానికి న్యాయమూర్తికి 10 నిమిషాలకు పైగా సమయం పట్టింది. -
ఉరిశిక్ష అమలు సూర్యోదయానికి ముందే ఎందుకు?
న్యూఢిల్లీః ఇండియాలో తీవ్ర నేరాల్లోనూ అత్యంత అరుదుగా విధించే శిక్షల్లో ఉరిశిక్ష ఒకటి. ఇటీవలి కాలంలో పాకిస్తానీ టెర్రరిస్ట్ అజ్మల్ అమిర్ కసబ్, పార్లమెంట్ దాడుల్లో కీలక నిందితుడైన అఫ్జల్ గురు కేసుల్లో ఉరిశిక్షను అమలు చేసిన విషయం తెలిసిందే. అయితే అసలు మరణ శిక్షను సమర్థించాలా లేదా అన్న అంశంపై చర్చలు కొనసాగడం అలా ఉంచి.. ఈ ఉరిశిక్షను తెల్లవారు జామునే ఎందుకు అమలు చేస్తారు? అన్న అంశం మాత్రం ఆసక్తిని రేపుతుంది. సూర్యోదయానికి ముందే ఉరిశిక్షను అమలు చేస్తారన్న విషయం అందరికీ తెలిసినదే. అయితే అలా తెల్లవారుజామునే ఈ శిక్ష ఎందుకు అమలు చేస్తారన్న విషయంపై ఆరాతీస్తే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా ఉరిశిక్ష అమలు చేయడం మనం సినిమాల్లోనే చూస్తాం. ఓ ఖైదీకి ఉరిశిక్ష అమలు చేసే సమయంలో అక్కడ సాక్ష్యంగా ఓ తలారి, మెజిస్ట్రేట్ లేదా ఆయన ప్రతినిధి, ఓ వైద్యుడు మరి కొందరు పోలీసులు మాత్రం ఉన్నట్లు చూపిస్తారు. అయితే భారతదేశంలో సూర్యోదయాన్నే ఎందుకు మరణ శిక్షను అమలు చేస్తారు అన్నదానికి మరిన్ని కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉండటంతో పాటు ఎంతో శక్తిని కలిగి ఉంటుందని, జైలు అధికారులు అన్ని రకాలుగా పూర్తి దృష్టిని కేంద్రీకరించగల్గుతారని, వారి ఇతర రోజువారీ కార్యక్రమాలపై కూడా ఆ ప్రభావం పడకుండా ఉంటుందని తెల్లవారుజామునే ఉరిశిక్షను అమలు చేస్తారని తెలుస్తోంది. అంతేకాక శిక్షను అమలు చేసేందుకు ముందు, తర్వాత ఎన్నో విధానాలను పాటించాల్సి రావడం, వివిధ రకాలైన వైద్య పరీక్షలు నిర్వహించడం, వాటిని పలురకాల రిజిస్టర్లలో నమోదు చేయడం వంటి పనులన్నీ చేపట్టాల్సి ఉంటుంది. దీనికితోడు.. అమలు అనంతరం పోస్ట్ మార్టం నిర్వహించి, అదేరోజు వారి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేపట్టేందుకు వీలుగా భౌతిక కాయాన్ని అప్పగించాల్సి ఉంటుంది. మరోవైపు సూర్యోదయానికి ముందే... అంటే రోజు ప్రారంభం కాకముందే మరణ శిక్షను అమలు చేయకుంటే.. శిక్ష అనుభవించాల్సి వ్యక్తి రోజంతా మానసిక ఒత్తిడి అనుభవించాల్సి ఉంటుంది. అటువంటి సందర్భాన్ని నిరోధించేందుకు కూడా తెల్లవారుజామున ఉరిశిక్షను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే సమాజంనుంచీ ఎదురయ్యే అకస్మాత్ పరిణామాలను నిరోధించేందుకు, వారినుంచీ ఎదురయ్యే వ్యతిరేక సమస్యలు నిరోధించేందుకు అంతా నిద్రలో ఉండే సమయంలో.. సూర్యోదయానికి ముందే ఉరిశిక్షను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
నా సభ, నా ప్రసంగం, నా ఇష్టం
కొన్ని గొప్ప వాక్యాలు దొర్లినప్పుడు కరతాళాల కోసం కొంచెం వ్యవధి ఇవ్వాల్సిన సంప్రదాయాన్ని వదిలేది లేదు. ప్రసంగం అర్ధగంట దాటితే, అధ్యక్షుని అనుమతి కోసం అన్నట్టు చూసి మళ్లీ కొనసాగించేవాడిని. సభా మర్యాదల్ని తు.చ. తప్పించే సమస్య లేదు. అక్షర తూణీరం జనం మె చ్చారు. అశేష పాఠకులు మె చ్చకుండా ఉం డలేకపోయా రు. చివరకు మెచ్చే పోయా రు. అంత గొప్ప సాహిత్యాన్ని బ్లాగ్కే పరిమితం చేయడం దేశద్రోహం కంటె నేరం- అంటూ నిందాస్తుతి చేశారు. చివరకు పుస్తకంగా తీసుకురాకుండా ఉండలేకపోయాను. ఒక శుభోదయాన బొడ్డు తెంచుకుని భూమ్మీ ద పడింది నా తొలి పుస్తకం. ఉద్వేగ భరితంగా చెప్పుకు వెళ్తుంటే కళ్లు చెమర్చాయి. బ్లాగ్ మీదే కదా, కలం పేరు పెట్టుకున్నారు దేనికి- అని అడిగితే నా బ్లాగు నా ఇష్టం. నేను రాసుకుంటా, నేనే ఎడిట్ చేసుకుంటా, చివరకు నా చావేదో నే చస్తా... అనే సరికి ఎరక్కపోయి అడిగానని నోరు మూసుకున్నాను. అయితే సిద్ధార్థుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు, ‘‘నా చావేదో నే చస్తా’’ అన్న ఏడక్షరాలు నాకు దిశానిర్దేశం చేశాయి. నా జీవితాన్ని కొత్త మలుపు తిప్పాయి. మా అపార్ట్మెంట్కి ముందువైపు బాల్కనీ ఉంది. అలవోకగా నాలుగు కుర్చీలు పడతాయి. రోజూ పగలు భోజనం చేశాక బాల్కనీలో కుర్చీలు వేసి, ముందొక టీపాయ్ అమర్చి అప్పుడు నిద్రకు మళ్లేవాడిని. సరిగ్గా ఆరు గంటలు కాగానే ఎవరో పిలిచినట్టు - కాదు, సాదరంగా ఆహ్వానించినట్టు బాల్కనీ మధ్య కుర్చీలో కూర్చుంటాను. అప్పుడు నా చేతిలో కొన్ని కాగితాలుంటాయి. కుర్చీలో లాం ఛనప్రాయంగా కూర్చున్నాక, నిలబడి మైకు ముం దుకు వచ్చేవాణ్ణి. మైకు ఉన్నట్టు నన్ను నేనే భ్రమిం పచేసేవాణ్ణి. ఏరోజు టాపిక్ ఆరోజు తాజాగా అనుకుని, దానికి తగిన హోమ్‌వర్క్ తప్పనిసరి అయ్యే ది. అవసరమైతే పాయింట్స్ నోట్ చేసుకునేవాణ్ణి. ముందు, అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు చెప్పడం మరిచేది లేదు. కొన్ని గొప్ప వాక్యా లు దొర్లినపుడు కరతాళాల కోసం కొంచెం వ్యవధి ఇవ్వాల్సిన సంప్రదాయాన్ని వదిలేది లేదు. ప్రసం గం అర్ధగంట దాటితే, అధ్యక్షుని అనుమతి కోసం అన్నట్టు చూసి మళ్లీ కొనసాగించేవాడిని. సభా మర్యాదల్ని తు.చ. తప్పించే సమస్య లేదు. ఆ రోజు ఏడు కావస్తున్నా సభ ప్రారంభం కాలే దు. లోపల్నించి ఏమైందని కేక. ‘‘ట్రాఫిక్ జామ్’’ అన్నాను. ‘‘బాగా ముదిరింది. కొంపలో ట్రాఫిక్ జామ్ ఏమిటండీ!’’ అని అరిచింది. అదే ఇవ్వాళ్టి అంశం. ఉపగ్రహాలు తోకచుక్కలు ఉల్కలతో అంతరిక్షంలో ట్రాఫిక్‌జామ్‌లు అవుతున్నాయి. ప్రతి ఇల్లూ బోలెడు అభిప్రాయాలు అభిరుచులు ఆశలతో జామ్ అవుతోంది. ఏమి, త్యాగరాయ గానసభలో ఆలస్యంగా మొదలవడం లేదా? ప్రతిదానికీ నన్నూ, నా ముఖ్యమంత్రిని కార్నర్ చేస్తారేంటి? సహించను కోస్తా... తీస్తా... తిత్తితీస్తా..’’ నా ధోరణిని అడ్డుకుని, ‘‘దానికంత సీనెందుకు, ఇంతోటి బోడి సభకి’’ అనేసి లోపలికి వెళ్లిపోయింది. నవ్విపోదురు గాక, నాకేటి వెరపు అనుకుని నా దినచర్య నేను నడుపుకుంటున్నా. ఒక రోజు గ్రంథావిష్కరణ, మరోరోజు మహామహుల సంస్మరణ, ఇంకోరోజు సంతాపం- ఇలాగ ఎంతో వైవిధ్యం పాటించే వాణ్ణి. గురువారం సభ ఉండదు. ఆ రోజు బాబా హారతికి వెళ్లడం ముఖ్యం. నన్ను గమనించిన ఇరుగు పొరుగులో ఒకరిద్దరు తాము కూడా పాల్గొంటామని ఐచ్ఛికంగా ముందుకు వచ్చారు. అభిప్రాయభేదాలొస్తాయేమో, అందుకని ఆలోచించి చెబుతానన్నాను. ఇంటా బయటా కూడా నా సభా కార్యక్రమాలకి ప్రాచుర్యం వచ్చింది. మనవడు మనవరాలు సాయంత్రం అయితే చాలు, తాతగారు ఆడుకుంటున్నారని అనుకునేవారు. కొంతవరకు నా నాలిక దురద తీరుతోంది. అయినా ఏదో వెలితి. ఒకరోజు పొద్దున్నే మా కోడలు నా చేతికి రెండు కాగితాలు ఇచ్చింది. ఒక ఫొటో, ఏవేవో వార్తలతో ఉన్న ఫొటోస్టాట్ కాగితాలవి. ‘‘మావయ్య గారూ! ఇది డైలీ సిటీ ఎడిషన్. మీరు పొద్దుటే చదువుకుంటే సాయంత్రం సభకి ఒక నిండుతనం వస్తుంది...’’ అనే సరికి నా వెలితి తీరింది. ఇప్పుడు మా కాలనీలో ‘‘బాల్కనీ దీక్షితులు’’గా నా పేరు ప్రసిద్ధమైంది. శ్రీరమణ