‘తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వమే నిర్వహించాలి’
ఆత్మకూర్: తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని కోరుతూ బీజేవైఎం ఆధ్వర్యంలో బుధవారం ఆత్మకూర్ తహసీల్దార్ ప్రేమ్రాజ్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణ ప్రజలకు మాత్రం నిజాం పాలన నుంచి సెప్టెంబర్ 17వ తేదీన విముక్తి లభించిందన్నారు. విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని ప్రగల్బాలు గతంలో కేసీఆర్ పలికారని, ఇప్పుడు మాత్రం తాను అధికారంలో ఉన్నప్పటికీ విమోచన దినంపై మాట్లాడకపోవడం విడ్డూరమన్నారు. అలాగే ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో బీజే వైఎం నాయకులు మహేందర్రెడ్డి, మేర్వశ్రీను, తదితరులు పాల్గొన్నారు.