తండ్రిని చంపి.. ముక్కలుగా కోసి...
ఆస్తికోసం ఓ ఐటీ ఉద్యోగి కిరాతకం
చెంగన్నూర్: ఆస్తికోసం ఏకంగా తండ్రినే అత్యంత కిరాతకంగా కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. చంపిన తర్వాత శరీరాన్ని ముక్కలుగా కోసి పలుచోట్ల పాతిపెట్టాడు. కేరళలోని చెంగన్నూర్‌లో వారం క్రితం జరిగిన ఈ దుర్ఘటన సోమవారం వెలుగుచూసింది. షెరిన్ జాన్ (36) ఐటీ హబ్‌లోని టెక్నోపార్క్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన తండ్రి జాయ్ వి.జాన్ (68) మూడు దశాబ్దాలుగా అమెరికాలో ఉంటున్నారు.
వారం క్రితం ఇక్కడి తన పూర్వీకుల ఇంటికి వచ్చారని, అనంతరం హత్యకు గురయ్యారని పోలీసులు చెప్పారు. షెరిన్ వాంగ్మూలం ఆధారంగా పోలీసులు వివిధ ప్రాంతాల నుంచి జాయ్ తల, కాలు, ఇతర శరీరభాగాలను సేకరించారు. గత బుధవారం ఏసీ రిపేరు కోసం కొడుకుతో కలసి వెళ్లినప్పటి నుంచి ఆయన కనిపించకుండాపోయారు. వీరిద్దరు ఇంటికి తిరిగి రాలేదంటూ జాయ్ భార్య మరియమ్మ చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ జరపగా గుట్టురట్టయింది.