servent
-
నేను రాజ్యాంగానికి సేవకుడిని
న్యూఢిల్లీ/ముంబై: రాజ్యాంగానికి, చట్టానికి తానో సేవకుడినని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. నిర్దేశించిన స్థానాన్ని అనుసరించాల్సి ఉంటుందని అన్నారు. సీజేఐ సారథ్యంలోని ధర్మాసనం శుక్రవారం కార్యకలాపాలు ప్రారంభించగానే, మాథ్యూస్ జె.నెడుంపర అనే న్యాయవాది ఓ అంశాన్ని ప్రస్తావిస్తూ..సీనియర్ న్యాయవాది హోదా విధానాన్ని రద్దు చేయడంతోపాటు కొలీజియం వ్యవస్థలో సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. దీనిపై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ..‘మనస్సులో ఉన్న విషయం చెప్పే స్వేచ్ఛ మీకుంది. భారత ప్రధాన న్యాయమూర్తిగా, ఒక జడ్జిగా, నేను చట్టానికి, రాజ్యాంగానికి సేవకుడిని. నాకు నిర్దేశించిన స్థానాన్ని అనుసరించాల్సి ఉంటుంది. అంతేతప్ప, నాకు నచ్చింది కాబట్టి, ఇది నేను చేస్తాను అని చెప్పలేను’అని పేర్కొన్నారు. లాయర్లకు సీనియర్ హోదా ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ నెడుంపర మరో ఏడుగురు వేసిన పిటిషన్పై అక్టోబర్లో విచారణ చేపట్టిన అప్పటి సుప్రీంకోర్టు బెంచ్.. సీనియర్ న్యాయవాది హోదాను ప్రతిభకు గుర్తింపుగా పేర్కొంటూ పిటిషన్ను కొట్టివేసింది. అదేవిధంగా, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్(సీఏటీ) ముంబై ధర్మాసనం కొత్త కార్యాలయాన్ని శుక్రవారం సీజేఐ ప్రారంభించారు. న్యాయమూర్తుల నియామకంపై అంతిమ నియంత్రణ ఎవరిదనే అంశంపై నిత్యం తర్జనభర్జనలు జరుగుతూనే ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన అన్నారు. జడ్జీల పోస్టుల ఖాళీలు పెరుగుతుండగా, నియామకాలుపెండింగ్లో ఉంటున్నాయని చెప్పారు. కోర్టుల్లో జాప్యాలను నివారించి, సకాలంలో న్యాయం అందించే విషయంలో ట్రిబ్యునళ్లు కీలకంగా మారాయన్నారు. -
పనిమనిషిగా చేరి చోరీ
మత్తుమందు కలిపి నగలు అపహరణ ఎట్టకేలకు నిందితుల అరెస్టు రాజమహేంద్రవరం క్రైం : ఇంట్లో పని మనిషిగా చేరి కాఫీలో మత్తు మాత్రలు వేసి వారు స్పృహ కోల్పోయాక బంగారు నగలతో ఉడాయిస్తున్న నిందితులను త్రీటౌన్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. సోమవారం త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో సెంట్రల్ జోన్ డీఎస్పీ జె.కులశేఖర్ వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం రాజమహేంద్రవరం కోర్లమ్మపేట ఒకటో వీధికి చెందిన చెన్నుపాటి రవి శంకర్ ఇంట్లో పనిచేసేందుకు 15 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రానికి చెందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం, పాములపల్లికి చెందిన పొడుతూరి రాధ (ప్రస్తుతం రాజమహేంద్రవరం సీటీఆర్ఐ వద్ద ఉంటోంది) పని మనిషిగా చేరింది. 15 రోజులుగా ఇంట్లో పనులు చేస్తు అందరికీ చేరువైంది. అదే ఇంట్లో పై పోర్షన్లో ఉంటున్న రవిశంకర్ తల్లి చెన్నుపాటి సత్యనారాయణకు కాఫీలో మత్తుమాత్రలు కలిపి ఇచ్చింది. ఆమె నిద్రలోకి జారుకున్న తరువాత ఆమె శరీరంపై ఉన్న ఆరు కాసుల గొలుసు, మూడు కాసుల పగడాల దండ తీసుకొని పరారైందని తెలిపారు. అప్పటి నుంచి రాధ కనిపించకపోవడంతో బాధితులు త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన త్రీటౌన్ ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు, సెంట్రల్ జోన్ డీఎస్పీ ఆదేశాల మేరకు పొడుతూర్తి రాధ, ఆమెకు సహకరించిన ఖమ్మం జిల్లా చర్ల మండలం కుదునూరుకు చెందిన గడిదేశే సునీల్ బాబులను సోమవారం రాజమహేంద్రవరంలోని గోకవరం బస్టాండ్ వద్ద అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి తొమ్మిది కాసుల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితులను త్వరితగతిన అరెస్ట్ చేసినందుకు సెంట్రల్ జోన్ డీఎస్పీ జె.కులశేఖర్ త్రీటౌన్ సీఐ ముక్తేశ్వరరావును, ఎస్సై వెంకటేశ్వరరావును, సిబ్బందిని అభినందించారు. నిందితులను మూడో అదనపు ఏజేఎఫ్సీఎం కోర్టులో హాజరు పరిచారు.