అనుమతి లేకుండా బోరుబావి తవ్వితే ఏడేళ్ల జైలు
చెన్నై : రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా బోరుబావులు తవ్వితే ఏడేళ్ల జైలు శిక్ష విధించేలా అసెంబ్లీలో సోమవారం ముసాయిదా ప్రవేశపెట్టారు. సాగునీటి కోసం విచ్చలవిడిగా బోరుబావులు తవ్వడం ఎక్కవైపోయింది. చిన్నారులు వాటిల్లో పడిపోయి ప్రాణాలు కోల్పోవడం తరచూ జరుగుతోంది.
ఈ ప్రమాదాలను నివారించేలా చట్టంలో మార్పులను తీసుకువస్తున్నారు. అనుమతి తీసుకోకుండా బోరును తవ్విన యజమానికి 3 నుంచి 7 ఏడేళ్ల వరకు కారాగార శిక్ష, 50 వేల రూపాయల జరిమానా విధించేలా ముసాయిదా బిల్లు ప్రవేశపెట్టారు.