వడదెబ్బకు ఇద్దరి మృతి
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం కారేపల్లి క్రాస్‌రోడ్డు గ్రామంలో ఇద్దరు కార్మికులు వడదెబ్బ కారణంగా మృతి చెందారు. షేక్ మొగిలి ఆటో డ్రైవర్‌గా కాగా, ఆదివారం పగలంతా ఆటో నడిపిన అతడు రాత్రి ఇంటికి చేరుకుని వాంతులతో అస్వస్థతకు గురయ్యాడు. సోమవారం ఉదయం మృతి చెందాడు. బొమ్మల రవి ఉపాధి హామీ కూలీ పనులకు వెళ్లగా వారం క్రితం తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అప్పటి నుంచి ఇంటి పట్టునే ఉంటున్న అతడు పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం ఉదయం మృతి చెందాడు.