సూళ్లురుపేటలో నిలిచిపోయిన షార్ వాహనాలు
సూళ్లురుపేట(నెల్లూరు జిల్లా): శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లురుపేటలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం కేఆర్పీ కాలనీ వద్ద శ్రీహరికోట-సూళ్లురుపేట రోడ్డులో వైఎస్సార్సీపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా షార్కు వెళ్లే వాహనాలు సుమారు రెండుగంటల పాటు నిలిచిపోయాయి. బంద్‌తో పట్టణంలోని పలు దుకాణాలు మూతపడ్డాయి. అంతేకాకుండా అపాచీ, నిప్పో వంటి పెద్ద పెద్ద కంపెనీలు సైతం బంద్ సందర్భంగా మూసివేసినట్టు సమాచారం.