share markets
-
స్టాక్స్ కొనడానికి అదే బెస్ట్ టైం..!
-
‘మార్గదర్శి’ డాక్యుమెంట్లే సీజ్
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి చిట్ ఫండ్స్, అనుబంధ సంస్థల డేటా మినహా మరే ఇతర సంస్థలకు చెందిన డేటా తాము సీజ్ చేసిన డాక్యుమెంట్లలో లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. సీజ్ చేసిన డాక్యుమెంట్ల జాబితాపై నాంపల్లి 14వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సంతకం చేశారని, ఆ కాపీని కోర్టుకు కూడా సమర్పించామని తెలిపింది. ఎలాంటి ఆధారాలు లేకుండా, విచారణను జాప్యం చేసేందుకే పిటిషనర్ ఆరోపణలు చేస్తున్నారని స్పష్టం చేసింది. తమ సంస్థలో తనిఖీలు చేపట్టడాన్ని సవాల్ చేస్తూ బ్రహ్మయ్య అండ్ కో, పెద్ది చంద్రమౌళి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. దీనిపై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి శుక్రవారం మరోసారి విచారణ చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున స్పెషల్ కౌన్సిల్ పి.గోవింద్‌రెడ్డి వాదనలు వినిపించారు. తనిఖీలు ఆపాలని మాత్రమే కోరారు.. ‘మార్గదర్శిపై పలు ఆరోపణలున్నాయి. చిట్స్ ద్వారా వచ్చిన నగదును షేర్మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్‌కు మళ్లిస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. ప్రధాన కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఇది బడా వైట్ కాలర్ నేరం. సంస్థకు చెందిన పలు కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. బ్రహ్మయ్య అండ్ కో కార్యాలయ తనిఖీల్లో మాత్రం పోలీసులు పాల్గొన్నారు. ప్రధాన కేసు విచారణ సందర్భంగా పలు డాక్యుమెంట్లను అధికారులు అడిగారు. మార్గదర్శి చార్టర్డ్ అకౌంటెంట్‌గా వ్యవహరిస్తున్న బ్రహ్మం అండ్ కో వాటిని ఇవ్వకుండా జాప్యం చేస్తుండటంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. తనిఖీలు ఆపాలని మాత్రమే పిటిషనర్ కోరారు. అవి ఎప్పుడో ముగిశాయి కనుక పిటిషన్‌ను కొట్టివేయాలి’ అని గోవిందరెడ్డి కోర్టుకు నివేదించారు. ప్రత్యేకంగా విచారణ ఎందుకు? ‘మార్గదర్శి చిట్స్‌కు సంబంధించి కోర్టు విధుల సమయం ముగిసిన తర్వాత కూడా ప్రత్యేకంగా విచారణ జరపాల్సిన అవసరం ఏమొచ్చింది? సామాన్యుడికి ఏదైనా ప్రాణం మీదకు వస్తే కోర్టు ఇలాగే వ్యవహరిస్తుందా..? ఇది ఎంత వరకు సమంజసమో ఆలోచించాల్సిన అవసరం ఉంది. లంచ్‌మోషన్ పిటిషన్లు వేయడం, కోర్టు విధులు ముగిసిన తర్వాత అత్యవసరంగా విచారణ జరిపి ఉత్తర్వులు పొందడం ద్వారా మార్గదర్శికో నీతి – సామాన్యుడికో నీతి అనే అభిప్రాయం నెలకొనే అవకాశం ఉంది’ అని విచారణ సందర్భంగా స్పెషల్ కౌన్సిల్ పి.గోవింద్‌రెడ్డి న్యాయస్థానానికి నివేదించారు. వాదనల అనంతరం కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను న్యాయమూర్తి ఏప్రిల్ 13వతేదీకి వాయిదా వేశారు. తనిఖీలు ముగిశాక విచారణా? తనిఖీలు ముగిసిన తర్వాత వాటిని ఆపాలన్న విజ్ఞప్తిపై ఇక విచారణ ఎలా కొనసాగిస్తామని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది నళిన్‌కుమార్‌ను న్యాయమూర్తి ప్రశ్నించారు. ఆ పిటిషన్లో ఇంటర్ లొక్యుటరీ అప్లికేషన్(ఐఏ) దాఖలు చేశామని నళిన్‌కుమార్ నివేదించారు. -
కీలాడీ దంపతులు.. వారే టార్గెట్!
వరంగల్‌క్రైం: షేర్ మార్కెట్ అంటూ నకిలీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన కిలాడీ దంపతులను వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైం, సుబేదారి పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. వారినుంచి రూ.2.50లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రెండు ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌డిస్క్, స్వైపింగ్ మిషనర్, 8 సెల్ఫోన్లు, చెక్‌బుక్‌లు, బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులు, స్టాంపులు, కరపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. గోగుల శ్రీనివాస్ అనే నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ మేరకు సీపీ డాక్టర్ తరుణ్‌జోషి శుక్రవారం నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. కేరళ రాష్ట్రం కొచ్చి జిల్లా ఎర్రాకులానికి చెందిన రేష్మి రవీంద్రన్ నాయర్, బిజ్జు మాధవన్‌లు భార్యాభర్తలు. వీరు ప్రస్తుతం ఢిల్లీలోని ద్వారాక ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈ దంపతులు కేరళలో ఉన్నప్పుడు జల్సాలకు అలవాటుపడి సులభంగా డబ్బులు సంపాదించాలన్న ఆశతో షేర్ మార్కెట్లో డబ్బులు పెడితే అధిక లాభాలు వస్తాయని స్థానికులను మోసం చేశారు. బాధితులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు కావడంతో దంపతులిద్దరూ ఢిల్లీకి మకాం మార్చారు. పీవీఆర్ కన్సల్టెన్సీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరున బోగస్ సంస్థను ఏర్పాటు చేసి హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నంతోపాటు ఇతర ప్రధాన నగరాల్లో సంస్థ తరఫున ప్రతినిధులను నియమించారు. పీవీఆర్ కన్సల్టెన్సీ పేరున ఆన్లైన్ షేర్మార్కెట్లో పెట్టుబడులు పెడితే 4నుంచి 8శాతం కమీషన్ అందజేస్తామని ప్రజలకు మాయమాటలు చెప్పారు. నమ్మకం కలిగేందుకు ముందుగా పెట్టుబడులకు భారీగా కమీషన్లు చెల్లించారు. నమ్మకం కుదిరిన ప్రజలు ఈ సంస్థలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టారు. ఎక్కువ మొత్తంలో బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బు జమ అయిన వెంటనే వీరు డబ్బును డ్రా చేసుకుని ప్రజలను మోసం చేసేవారు. హనుమకొండవాసి ఫిర్యాదుతో.. హనుమకొండకు చెందిన ఒక వ్యక్తి సదరు కంపెనీ ప్రతినిధి అంటూ చెప్పుకున్న గోగుల శ్రీనివాస్ ద్వారా కిలాడీ దంపతులతో ఆన్లైన్లో పరిచయమై సుమారు కోటి రూపాయలకుపైగా పెట్టుబడులు పెట్టాడు. కొద్ది రోజులు సక్రమంగానే కమీషన్ చెల్లించిన నిందితులు.. ఆ తరువాత కన్సల్టెన్సీను మూసివేయడంతోపాటు ఫోన్లో కూడా అందుబాటులో లేకపోవడంతో మోసపోయానని గ్రహించి సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి దీనిని సీరియస్‌గా తీసుకుని సైబర్ క్రైంతో పాటు సుబేదారి పోలీసులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లి కిలాడీ దంపతులను అదుపులోని స్థానిక న్యాయమూర్తి ముందు ప్రవేశ పెట్టి వరంగల్ పోలీస్ కమిషనరేట్ తరలించినట్లు సీపీ వెల్లడించారు. తప్పించుకున్న మరో నిందితుడు శ్రీనివాస్ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ప్రతిభ కనబరిచిన అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్, ఏసీపీలు జితేందర్ రెడ్డి, నందిరాంనాయక్, సైబర్ క్రైం, సుబేదారి ఇన్స్పెక్టర్లు జనార్దన్‌రెడ్డి, రాఘవేందర్ ఎస్ఐ పున్నం చందర్, సైబర్ క్రైం ఎస్ఐ నిహారిక, ఏఏఓ ప్రశాంత్, సల్మాన్‌పాషా,ఏఎస్ఐ సత్తయ్య, సైబర్ క్రైం కానిస్టేబుల్ కిషోర్, సుబేదారి కానిస్టేబుళ్లు కమల, రాములును పోలీస్ కమిషనర్ అభినందించారు. -
11,300 దిగువకు నిఫ్టీ
ఆసియా మార్కెట్ల బలహీనతలతో మన మార్కెట్ కూడా బుధవారం నష్టపోయింది. ఆ్రస్టాజెనెకా ఫార్మా కంపెనీ వ్యాక్సిన్ ట్రయల్స్‌ను ఆపేయడం ప్రతికూల ప్రభావం చూపించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ జోరుగా పెరిగినా, సూచీలను నష్టాల నుంచి గట్టెక్కించలేకపోయింది. కానీ ఈ షేర్ పెరగడం, యూరప్ మార్కెట్లు లాభాల్లో మొదలవడం వల్ల సెన్సెక్స్, నిఫ్టీల ఇంట్రాడే నష్టాలు తగ్గాయి. ఇంట్రాడేలో 430 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ చివరకు 171 పాయింట్ల నష్టంతో 38,194 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 39 పాయింట్లు క్షీణించి 11,278 పాయింట్లకు చేరింది. వరుసగా రెండో రోజూ స్టాక్ సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 5 పైసలు పుంజుకొని 73.55 వద్దకు చేరింది. బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో ఒడిదుడుకులు తప్పవని విశ్లేషకులంటున్నారు. టెక్నాలజీ షేర్ల పతనం కొనసాగడంతో మంగళవారం అమెరికా స్టాక్ సూచీలు భారీగా నష్టపోయయి. ఈ ప్రభావంతో బుధవారం ఆసియా మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. ♦రిలయన్స్ ఇండస్ట్రీ రిటైల్ విభాగం, రిలయన్స్ రిటైల్‌లో 1.75 శాతం వాటా కోసం అమెరికా ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం సిల్వర్ లేక్ రూ.7,500 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నది. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ శాతం 2.5 లాభంతో రూ.2,161 వద్ద ముగిసింది. ♦ఎస్బీఐ 4 శాతం నష్టంతో రూ.194 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో అత్యధికంగా నష్టపోయిన షేర్ ఇదే. ♦ఆ్రస్టాజెనెకా ఫార్మా షేర్ 3 శాతం నష్టంతో రూ.4,074 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్ 13 శాతం పతనమైంది. ఈ కంపెనీ మాతృసంస్థ కరోనా వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ను ఆపేయడమే ఈ నష్టాలకు కారణం. ♦100కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి. టాటా ఎలెక్సీ, అదానీ గ్రీన్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. హ్యాపియెస్ట్ మైండ్స్ ఐపీఓ... అదుర్స్: 51 రెట్లు ఓవర్ సబ్‌స్రై్కబ్ హ్యాపియెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు అదిరిపోయే స్పందన లభించింది. బుధవారం ముగిసిన ఈ ఐపీఓ 151 రెట్లు ఓవర్ సబ్స్రై్కబయింది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.702 కోట్లు సమీకరించనున్నది. ఐపీఓలో భాగంగా మొత్తం 2.32 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయనుండగా, మొత్తం 300 కోట్లకు పైగా షేర్లకు దరఖాస్తులు వచ్చాయి. సోమవారం ఆరంభమైన ఈ ఐపీఓ ప్రైస్‌బ్యాండ్ రూ.165–166గా ఉంది. ఈ కంపెనీ షేర్లు ఈ నెల 17న స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్నాయి. గ్రే మార్కెట్ ప్రీమియమ్ (జీఎమ్‌పీ) రూ. 100కు పైగా ఉండటంతో ఈ షేర్ రూ. 300 రేంజ్లో లిస్ట్ కావచ్చని అంచనా. -
గణాంకాలు, ఫలితాలు కీలకం
ఈ వారం వెలువడే వివిధ గణాంకాలు, కంపెనీల ఆర్థిక ఫలితాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని నిపుణులంటున్నారు. కరోనా వైరస్ కేసుల తీవ్రత, ఈ వైరస్ వ్యాక్సిన్ సంబంధిత వార్తలు, అమెరికా–చైనా వాణిజ్య ఒప్పందం పరిణామాలు కూడా కీలకమేనని వారంటున్నారు. వీటితో పాటు ప్రపంచ మార్కెట్ల పోకడ, దేశీ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, ముడి చమురు ధరల గమనం, వివిధ దేశాల్లో లాక్డౌన్ సంబంధిత వార్తలు... ఇవన్నీ కూడా తగిన ప్రభావం చూపనున్నాయని విశ్లేషకులంటున్నారు. ఈ నెల 12న(మంగళవారం) మార్చి నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వస్తాయి. అదే రోజు ఏప్రిల్ నెల రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడతాయి. ఇక ఏప్రిల్ నెల టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ నెల 14న (గురువారం) వస్తాయి. మారుతీ సుజుకీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బంధన్ బ్యాంక్ తదితర మొత్తం 50కు పైగా కంపెనీలు ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటం, కంపెనీల ఆర్థిక ఫలితాలు– ఈ రెండు అంశాలు పెట్టుబడులపై ప్రభావం చూపుతాయి. రిలయన్స్ రైట్స్ ఇష్యూకి రికార్డు తేది మే14 ప్రతిపాదిత రైట్స్ ఇష్యూకి మే 14ను రికార్డు తేదీగా నిర్ణయించినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. ఇష్యూ ప్రారంభ, ముగింపు తేదీలను తర్వాత ప్రకటించనున్నట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. -
బంగారంలాంటి అవకాశం
పశ్చిమగోదావరి, నరసాపురం: మొన్నటి వరకూ మిడిసిపడిన పసిడి ధర నేలవైపు చూస్తుంది. ఊహించని స్థాయిలో బంగారం ధరలు దిగి వచ్చాయి. నరసాపురం మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.32,600, 22 క్యారెట్ల 916 ఆభరణాల బంగారం రూ.30,500గా ట్రేడవుతోంది. అంటే 916 ఆభరణాల బంగారం కాసు (8 గ్రాములు) ధర రూ.24,400గా పలుకుతోంది. గత 15 రోజులుగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. ఇటీవల కాలంలో కాసు బంగారం ధర రూ.1,500 వరకూ తగ్గింది. ధరలు ఇంకా దిగివస్తాయని అంచనాలు కడుతున్నారు. ఇప్పటికే దాదాపు రెండేళ్ల కనిష్టానికి ధరలు చేరాయి. ఇంకా తగ్గితే మొన్నటి వరకూ ధరల పెరుగుదలలో ఆల్‌టైమ్ హైలతో రికార్డులు సృష్టించిన బంగారం ఇప్పుడు ధరల తగ్గుదలలోనూ అదే రికార్డుస్థాయి ఒరవడిని కొనసాగిస్తుంది. అయితే అంతర్జాతీయంగా ఆ పరిస్థితి లేదని, ధరలు తగ్గుదల తాత్కాలికమేనని బులియన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మధ్య కాలంలో బంగారం ధరలు ఇంతగా క్షీణించడం ఇదే ప్రథమం. ఇదే ఏడాది జనవరిలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.34 వేల మార్కును రెండోసారి దాటి రికార్డును సృష్టించింది. అప్పట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.35 వేల మార్కును చేరుకుంటుందని అంచనా కట్టారు. అయితే మళ్లీ బంగారం ధరలు కాస్త తగ్గుతూ వచ్చాయి. మరోవైపు వెండి ధరలు కూడా బంగారం దారిలోనే కొనసాగుతున్నాయి. కిలోవెండి ధర రూ.38,600గా ట్రేడవుతుంది. వెండి ధర కూడా రూ.2 వేలు కూడా తగ్గింది. ఒడిదుడుకుల్లో షేర్ మార్కెట్లు మరోవైపు షేర్ మార్కెట్లు కూడా ఒడిదుడుకుల్లోనే కొనసాగుతున్నాయి. నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ముదుపర్లు సురక్షితమైన పెట్టుబడిగా బంగారాన్ని భావించి పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. అందుకే షేర్మార్కెట్ల పతనం సమయంలో బంగారం ధరలు పెరుగుతుంటాయి. కానీ ఈసారి మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. షేర్ మార్కెట్లు పతనాల్లో ఉన్నా కూడా ప్రస్తుతం బంగారం ధరల్లో ధరలు తగ్గుదల కనిపిస్తుంది. అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ తగ్గడం, దేశీయంగా ఎన్నికల నేపథ్యంలో బంగారం దిగుమతులపై ఎలాంటి కీలక నిర్ణయాలు లేకపోవడం ధరల తగ్గుదలకు కారణంగా చెబుతున్నారు. చైనా భారీగా అమ్మకాలకు పూనుకోవడం కూడా కారణంగా కనిపిస్తోంది. అమెరికాలో కూడా బంగారం నిల్వలను అమ్మకాలకు పెడితే మాత్రం ధరలు మరింత అనూహ్యంగా పడిపోతాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా కడుతున్నారు. అయితే బంగారం ధరల పెరుగుదల, తగ్గుదల విషయంలో ఏమీ చెప్పలేమని కొనుగోళ్లు, అమ్మకాలు విషయంలో వినియోగదారులు విజ్ఞత మేరకు ఆలోచించాలని బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలా మంచి ధరల్లో బంగారం ఉందని, ఇప్పుడే బంగారం కొనడానికి ఇదే గోల్డెన్ చాన్స్ అని అంటున్నారు. దీంతో కొనుగోలు దారులు ఏకీభవిస్తున్నారు కూడా. దీంతో బంగారం దుకాణాలు కళకళలాడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా బంగారం కొనుగోళ్లు దాదాపు 40 శాతం పెరిగాయని అంచనా. జిల్లాలో పెరిగిన అమ్మకాలు జిల్లాలో నరసాపురం, పాలకొల్లు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం లాంటి ప్రధాన పట్టణాల్లో గడిచిన వారం రోజులుగా రోజుకు రూ.3 కోట్లు పైనే అమ్మకాలు పెరిగినట్టు అంచనా. మొత్తం ఆభరణాల అమ్మకాలు పెరిగాయని చెబుతున్నారు. ధరలు తగ్గడం, ఎన్నికల తరువాత జనం చేతుల్లో కాస్త డబ్బు మసలడం లాంటి కారణాలతో అమ్మకాలు పెరిగినట్టుగా చెబుతున్నారు. మరోవైపు పెట్టుబడులపై మగ్గు చూపకపోవడంతో బిస్కట్ అమ్మకాలు మందకొడిగా సాగుతున్నాయని బులియన్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే మంచి తరుణం బంగారం ధరలు చాలా బాగా తగ్గాయి. బంగారం కొనడానికి ఇదే మంచి సమయం. ఇంత బాగా ధరలు తగ్గుతాయని మేం ఊహించలేదు. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులరీత్యా ధరలు కాస్త తగ్గొచ్చు, లేదంటే పెరగొచ్చు. తగ్గుదల మాత్రం తాత్కాలికమే. ప్రస్తుతం అమ్మకాలు మాత్రం మంచి ఊపుమీద సాగుతున్నాయి.– వినోద్‌కుమార్ జైన్, బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, నరసాపురం -
ఘోరంగా పడిపోయిన యస్ బ్యాంక్ షేరు
ముంబై : ప్రైవేట్ రంగానికి చెందిన యస్ బ్యాంక్ నేటి ట్రేడింగ్‌లో భారీగా పడిపోయింది. దలాల్ స్ట్రీట్‌లో ట్రేడింగ్ ప్రారంభమైన కొన్ని క్షణాల్లోనే యస్ బ్యాంక్ షేరు 30 శాతానికి పైగా కుప్పకూలింది. 2008 జనవరి తర్వాత ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. బ్యాంక్ సీఈవో, ఎండీ రానా కపూర్ పదవీ కాలాన్ని కుదించి, ఆయన్ని 2019 జనవరి వరకు తన పదవి నుంచి దిగిపోవాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించడం షేరును అతలాకుతలం చేసింది. 2004లో బ్యాంక్ ఏర్పాటు చేసినప్పటి నుంచి బ్యాంక్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్‌గా కపూరే ఉన్నారు. మూడేళ్ల పాటు అంటే 2021 ఆగస్టు 31 వరకు ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని బ్యాంక్ షేర్ హోల్డర్స్ కోరారు. అయితే ఆ అభ్యర్థనను రెగ్యులేటర్ కొట్టివేసింది. 2019 జనవరి వరకు కపూర్ స్థానంలో బ్యాంక్‌కు కొత్త సీఈవో, ఎండీ రావాల్సిందేనని తెలిపింది. ఈ ఏడాది జూన్‌లోనే కపూర్‌ను మరో మూడేళ్ల పాటు రీ-అపాయింట్మెంట్ చేస్తూ యస్ బ్యాంక్ షేర్ హోల్డర్స్ అంగీకరించారు. అది తుది ఆమోదం కోసం ఆర్బీఐ వద్దకు వెళ్లింది. కానీ ఆర్బీఐ మాత్రం మరో మూడేళ్ల పొడిగింపుపై ససేమీరా అనేసింది. ప్రస్తుతం పదవి కాలం ఆగస్టు 31తో ముగిసింది. తుదుపరి నోటీసులు పంపే వరకు ఆ పదవిలో కపూర్ కొనసాగనున్నారు. కపూర్, 2008లో చనిపోయిన అశోక్ కపూర్లు ఇద్దరూ యస్ బ్యాంక్ వ్యవస్థాపక టీమ్‌లో సభ్యులు. ప్రమోటర్‌గా, కపూర్, ఆయన కుటుంబానికి బ్యాంక్‌లో 10.66 శాతం వాటా ఉంది. కాగా ట్రేడింగ్ ప్రారంభంలోనే 10 శాతం మేర నష్టపోయిన యస్ బ్యాంక్షేరు రూ.287.30గా నమోదైంది. ఆ అనంతరం అర్థగంటకి మరింత కుదేలై రూ.218.10కి చేరింది. నష్టాలను కొంతమేర తగ్గించుకున్న యస్ బ్యాంక్, ప్రస్తుతం 17.48 శాతం నష్టంలో రూ.263.40 వద్ద ట్రేడవుతోంది. -
షేర్ మార్కెట్లపై సాక్షి మైత్రి అవగాహన సదస్సు
-
వీడని చిక్కుముడులెన్నో..?
మణికొండ: నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చెట్టపొదల్లో మూడు, కారులో రెండు మృతదేహాలు లభ్యమైన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బుధవారం అశోక్‌నగర్‌లోని అతని ఇంట్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు షేర్ మార్కెట్‌కు సంబందించిన పత్రాలు, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. తన భార్య మాధవి(28), కుమారుడు వశిష్ట్‌రెడ్డి(రెండున్నరేళ్లు), పిన్ని కొండాపురం లక్ష్మి(45), ఆమె కుమార్తె సిందూజ(16)లకు పథకం ప్రకారం విషం ఇచ్చి మృతి చెందిన తర్వాత వారిని చోట చెట్ల పొదల్లో పడేసి, తన కుమారునితో పాటు రెండు కిలోమీటర్ల దూరం వెళ్లిన ప్రభాకర్‌రెడ్డి కుమారునితో పాటు విషం తీసుకుని చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. అమీన్పూర్లో ఓ స్థలాన్ని కొనుగోలు చేసి అపార్ట్మెంట్ నిర్మించాలనుకున్న అతను సదరు స్థలం డిఫెన్స్ భూమిగా తేలటంతో కోలుకోలేని దెబ్బ పడింది. అప్పటికే అధిక ఆదాయం చూపుతూ బంధువులు, మిత్రుల నుంచి పెట్టుబడుల కోసం తీసుకున్న అతను మాట నిలుపునే క్రమంలో అప్పులపై అప్పులు చేసినట్లు సమాచారం. తన వద్ద పెట్టుబడులు పెట్టిన వారికి అధిక వడ్డీకి డబ్బులు తిరిగి ఇచ్చేవాడని తెలిపారు. ప్రభాకర్‌రెడ్డిని నమ్మి అతనివద్ద షేర్మార్కెట్లో పెట్టుబడులు పెట్టడంతో పాటు, వడ్డీకి డబ్బును ఇచ్చిన వారు వందమందికి పైగా ఉన్నట్లు సమాచారం. శంకర్పల్లి మండలం పామెన గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ప్రభాకర్‌రెడ్డికి రూ. 5కోట్ల వరకు అప్పు ఇచ్చాడని, ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవటంతో అతను షాక్‌కు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. ప్రభాకర్‌రెడ్డి అప్పులు రూ. 30నుంచి రూ.50కోట్ల వరకు ఉండవచ్చునని స్థానికులు పేర్కొంటున్నారు. ఆర్ధిక లావాదేవీలే కారణం: రమణగౌడ్, నార్సింగి సీఐ ప్రభాకర్‌రెడ్డి ఆర్ధిక లావాదేవీలే ఐదుగురి మృతికి కారణంగా భావిస్తున్నాము. అతని షేర్‌మార్కెట్, రియల్ఎస్టేట్, చేసిన అప్పుల వివరాలను తెలుసుకుంటున్నాం. వారి సెల్ఫోన్లు కనిపించనందున విచారణలో జాప్యం జరుగుతోంది. అవన్నీ బయటకు వస్తే ఆత్మహత్యలకు కారణం తెలుస్తుంది. త్వరలోనే చిక్కుముడి విప్పుతాం. -
సాంకేతిక సమస్యతో మూతపడ్డ బీఎస్ఈ సెన్సెక్స్
బీఎస్ఈ ఆగిపోయింది. వరుసగా రెండో రోజు కూడా సాంకేతిక సమస్య కారణంగా దాని ఇండెక్సులన్నీ నిలిచిపోయాయి. బుధవారం ఉదయం కొద్దిసేపు కనెక్టివిటీ సమస్య కారణంగా నిలిచిపోయి, మళ్లీ మొదలైంది. అయితే, గురువారం ఉదయం సెన్సెక్స్ 26 వేలకు సమీపంలో ఉండగా మళ్లీ కనెక్టివిటీ సమస్య తలెత్తడంతో స్టాక్ మార్కెట్లను మూసేయాలని బీఎస్ఈ నిర్ణయించింది. షేరు ధరలు, ఇండెక్సులు అన్నీ ఆగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు హెచ్‌సీఎల్ బృందం కృషి చేస్తోందని.. సమస్య పరిష్కారం అయితే మళ్లీ మార్కెట్లు తెరుచుకుంటాయని బీఎస్ఈ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇంట్రాడే ట్రేడర్లకు ఇది కాస్త చేదువార్తే అవుతుంది. బీఎస్ఈలో షేర్లను అమ్మడం, కొనడం చేసే ఇంట్రా డే ట్రేడర్లు ఇలా ట్రేడింగ్ ఆగిపోయినప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి ఎదురవుతుంది. అయితే.. ఇప్పటికే డెలివరీగా స్టాకులు ఉన్నవాళ్లు మాత్రం వాటిని ఎన్ఎస్ఈ లేదా ఎంసీఎక్స్-ఎస్ఎక్స్లో అమ్ముకోవచ్చు. కేవలం పావుగంట పాటు ట్రేడింగ్ జరిగిన తర్వాత సెన్సెక్స్ ఆగిపోయింది. ఉదయం 9.53 గంటల సమయంలో మార్కెట్లు మూతపడ్డాయి.