Shatavahana college
-
చాంప్స్ శాతవాహన, ఎస్ఎస్బీఎన్ కాలేజి జట్లు
విజయవాడ స్పోర్ట్స్: సాక్షి మీడియా గ్రూప్, కేఎల్ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించిన సాక్షి ప్రీమియర్ లీగ్ (ఎస్పీఎల్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో జూనియర్స్ విభాగంలో శాతవాహన జూనియర్ కాలేజీ (శ్రీకాకుళం)... సీనియర్స్ విభాగంలో శ్రీ సాయిబాబా నేషనల్ డిగ్రీ కాలేజి (అనంతపురం) జట్లు చాంపియన్స్‌గా నిలిచాయి. జూనియర్ విభాగం ఫైనల్లో శాతవాహన కాలేజి రెండు వికెట్ల తేడాతో ఎమరాల్డ్స్ జూనియర్ కాలేజి (తిరుపతి, చిత్తూరు) జట్టుపై నెగ్గింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఎమరాల్డ్స్ కాలేజి నిర్ణీత 10 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 80 పరుగులు చేసింది. ప్రణయ్ (33 పరుగులు), గగన్ (15 పరుగులు) రాణించారు. శాతవాహన కాలేజి బౌలర్ ఉదయ్ మూడు వికెట్లు పడగొట్టాడు. 81 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శాతవాహన కాలేజి 9.4 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసి విజయం సాధించింది. వాసు (19), ఉదయ్ (18), సోమేశ్ (28 నాటౌట్) ఆకట్టుకున్నారు. ఉదయ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద ఫైనల్’ అవార్డు లభించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో ఎమరాల్డ్స్ కాలేజి 20 పరుగుల ఆధిక్యంతో చీరాల పాలిటెక్నిక్ కాలేజి (ప్రకాశం) జట్టును ఓడించి ఫైనల్ చేరింది. తొలుత ఎమరాల్డ్స్ జట్టు 10 ఓవర్లలో మూడు వికెట్లకు 90 పరుగులు చేసింది. సోహన్ (47), గగన్ (28) దూకుడగా ఆడారు. అనంతరం 91 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన చీరాల పాలిటెక్నిక్ కాలేజీ జట్టు 10 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసి ఓడిపోయింది. జూనియర్స్ విభాగంలో చీరాల పాలిటెక్నిక్ కాలేజి మూడో స్థానంలో నిలిచింది. ఖాదర్ వలీ విజృంభణ సీనియర్స్ విభాగంలో శ్రీ సాయిబాబా నేషనల్ డిగ్రీ కాలేజి (ఎస్ఎస్బీఎన్–అనంతపురం), కృష్ణ చైతన్య డిగ్రీ, పీజీ కాలేజి (నెల్లూరు) జట్ల మధ్య ‘బెస్ట్ ఆఫ్ త్రీ’ పద్ధతిలో ఫైనల్స్ నిర్వహించారు. గురువారం చెరో మ్యాచ్‌లో నెగ్గి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. శుక్రవారం జరిగిన చివరి ఫైనల్ మ్యాచ్‌లో ఎస్ఎస్బీఎన్ డిగ్రీ కాలేజి ఎనిమిది వికెట్ల తేడాతో కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజిపై విజయం సాధించి ఓవరాల్‌గా 2–1తో టైటిల్‌ను సొంతం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కృష్ణ చైతన్య కాలేజి నిర్ణీత 10 ఓవర్లలో 72 పరుగులకు ఆలౌటైంది. ఫారూఖ్ 18 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఎస్ఎస్బీఎన్ కాలేజి బౌలర్ ఖాదర్ వలీ నాలుగు వికెట్లు పడగొట్టాడు. 73 పరుగుల లక్ష్యాన్ని ఎస్ఎస్బీఎన్ కాలేజి 8.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి అధిగమించి గెలిచింది. బౌలింగ్‌లో నాలుగు వికెట్లతో అదరగొట్టిన ఖాదర్ వలీ బ్యాటింగ్‌లోనూ రాణించి 23 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో బ్యాట్స్‌మన్ రోహిత్ రోషన్ 41 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన ఖాదర్ వలీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. విజేత జట్లకు కేఎల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వైవీఎస్‌ఎస్‌ఎస్‌యూ ప్రసాద రావు, సాక్షి రెసిడెంట్ ఎడిటర్ ఎం.రమణమూర్తి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సాక్షి జనరల్ మేనేజర్ బొమ్మారెడ్డి వెంకటరెడ్డి, సాక్షి విజయవాడ బ్రాంచ్ మేనేజర్ సింహాద్రి అప్పన్న, హెచ్ఆర్ సంతోష్, ఈవెంట్ ఆర్గనైజర్ శ్రీహరి పాల్గొన్నారు. జూనియర్స్ విభాగంలో ఉదయ్ ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’... గగన్ ‘బెస్ట్ ఆల్‌రౌండర్’... సోహన్ ‘బెస్ట్ బ్యాట్స్‌మన్’... ఉదయ్ ‘బెస్ట్ బౌలర్’ అవార్డులు గెల్చుకున్నారు. సీనియర్స్ విభాగంలో ఎస్ఎస్బీఎన్ కాలేజికి చెందిన ఖాదర్ వలీ ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’... మహేంద్ర ‘బెస్ట్ ఆల్‌రౌండర్’... రోహిత్ రోషన్ ‘బెస్ట్ బ్యాట్స్‌మన్’... ఖాదర్ వలీ ‘బెస్ట్ బౌలర్’ పురస్కారాలు అందుకున్నారు. సీనియర్స్ విభాగంలో విజేతగా నిలిచిన ఎస్ఎస్బీఎన్ కాలేజి (అనంతపురం) జట్టు -
ఫైనల్లో శాతవాహన జూనియర్ కాలేజి
విజయవాడ స్పోర్ట్స్: సాక్షి మీడియా గ్రూప్, కేఎల్ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న సాక్షి ప్రీమియర్ లీగ్ (ఎస్పీఎల్) రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నీ తుది అంకానికి చేరుకుంది. విజయవాడలో గురువారం సెంట్రల్ ఆంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల జూనియర్, సీనియర్ జట్లు తలపడ్డాయి. ఉదయ్ 4 బంతుల్లో 4 వికెట్లు... జూనియర్ జట్లకు నిర్వహించిన రెండు లీగ్ మ్యాచ్‌లలో ఉత్తరాంధ్ర (శాతవాహన జూనియర్ కాలేజీ, శ్రీకాకుళం) జట్టు విజయం సాధించి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. సెంట్రల్ ఆంధ్ర (చీరాల పాలిటెక్నిక్ కాలేజి, ప్రకాశం) జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఉత్తరాంధ్ర జట్టు నాలుగు పరుగుల తేడాతో నెగ్గింది. ఉత్తరాంధ్ర జట్టు 10 ఓవర్లలో 41 పరుగులు చేసింది. రమణ (12), సుధమ్ (19) రాణించగా... 42 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన సెంట్రల్ ఆంధ్ర జట్టు 37 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. నాలుగు ఓవర్లు ముగిశాక 25/3 స్కోరుతో విజయం దిశగా సాగుతున్న సెంట్రల్ ఆంధ్ర జట్టును ఐదో ఓవర్లో ఉదయ్ దెబ్బ తీశాడు. ఉదయ్ వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు పడగొట్టాడు. రాయలసీమ జట్టు (ఎమరాల్డ్ జూనియర్ కాలేజి)తో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో ఉత్తరాంధ్ర (శాతవాహన జూనియర్ కాలేజి) జట్టు 19 పరుగుల తేడాతో గెలిచింది. -
సివిల్స్‌కు తగ్గిన హాజరు
దరఖాస్తు చేసింది 15,589 33 శాతానికి మించని హాజరు కట్టుదిట్టమైన ఏర్పాట్లు విజయవాడ సెంట్రల్ : సివిల్స్ (ప్రిలిమినరీ) పరీక్షకు అభ్యర్థుల హాజరు శాతం గణనీయంగా తగ్గింది. నగరంలో 32 కేంద్రాల్లో ఆదివారం పరీక్షలు నిర్వహించారు. 15,589 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోగా ఉదయం 5,201(33.36) శాతం, మధ్యాహ్నం 5,133 (32.93) శాతం మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు. మూడుసార్లకు మించి పరీక్ష రాసే అవకాశం లేకపోవడంతో అభ్యర్థులు ఆచి తూచి వ్యవహరించారు. దీంతో హాజరుశాతం తగ్గినట్లు అధికారులు అంచనా కట్టారు. ఒక్కో కేంద్రంలో 20 నుంచి 24 మంది విద్యార్థులు పరీక్ష రాసే విధంగా ఏర్పాట్లు చేశారు. హాజరు శాతం తగ్గడంతో 2 నుంచి 10 మంది విద్యార్థులు మాత్రమే కనిపించారు. అభ్యర్థులు లేక కొన్ని గదులు ఖాళీగా కనిపించాయి. శాతవాహన కళాశాల ఆవరణలో వికలాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రం లో 43 మందికిగాను 18 మంది హాజరయ్యారు. ఉదయం 9.30 నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 వరకు రెండు విడతలుగా పరీక్షలు నిర్వహించారు. ఉదయం హాజ రైన అభ్యర్థుల్లో 68 మంది మధ్యాహ్నం డుమ్మా కొట్టారు. చివరి నిమిషంలో కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులు పరుగులు తీయాల్సి వచ్చింది. పకడ్బందీగా ఏర్పాట్లు బిషప్ అజరయ్య స్కూల్, శాతవాహన కళాశాల ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను కలెక్టర్ బాబు.ఏ పరిశీలించారు. ఇన్విజిలేటర్లకు సూచనలు, సలహాలు అందించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జేసీ-2 ఒంగోలు శేషయ్య ఆధ్వర్యంలో పని చేసిన నలుగురు అధికారుల బృం దం ఏర్పాట్లపై పర్యవేక్షణ చేశారు. సెల్ఫోన్లను తీసుకు వెళ్లకుండా నిరోధించారు. నిరుపయోగంగా పరీక్షలకు చెందిన బుక్‌లెట్స్‌ను కాల్చివేశా రు. ఉపకేంద్రాల నిర్వాహకుల సమస్యల్ని పరిష్కరించేందుకు గ్రీవెన్స్‌సెల్ ఏర్పాటు చేశా రు. ఫిర్యాదుల పరిష్కారం కోసం నలుగురు అధికారులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు బెంజిసర్కిల్ సమీపంలోని నారాయణ కళాశాల, గాంధీ, మాంటిస్సోరి, చైతన్య, ఆంధ్రా లయో లా కళాశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. సబ్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, నగరపాలక సంస్థ కమిషనర్ జి.వీరపాండియన్ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. సీపీ గౌతం సవాంగ్ నేతృత్వంలో పోలీసులు కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలు చేశారు.