Sheethal Goutham
-
సానియా మీర్జా బెస్ట్ ఫ్రెండ్.. టీమిండియా మాజీ క్రికెటర్ భార్య.. ‘మాయచేసే’ విద్య (ఫొటోలు)
-
ఊతప్పకు ధోని భార్య థ్యాంక్స్!
ముంబై: క్రికెటర్ రాబిన్ ఊతప్పకు మహేంద్రసింగ్ ధోని భార్య సాక్షి ధోని ధన్యవాదాలు తెలిపారు. మహి, తనను కలిపింది అతడేనని వెల్లడించి, ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు. సాక్షి తన 30వ పుట్టిన రోజు వేడుకలను ముంబైలోని ఓ హోటల్లో ఇలీవల జరుపుకున్నారు. ఈ పార్టీకి రాబిన్ ఊతప్పతో పాటు హార్థిక్ పాండ్యా, పలువురు సన్నిహితులు హాజరయ్యారు. ధోని కూతురు జీవా ఈ పార్టీలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ గాయకుడు రాహుల్ వైద్య పలు బాలీవుడ్ హిట్ సాంగ్స్ పాడి అలరించారు. సాక్షి, పాండ్యా కూడా రాహుల్‌తో కలసి ‘యే దిల్ హై ముష్కిల్’ సినిమాలోని ‘చన్నా మేరాయా’ పాట ఆలపించారు. పార్టీ పూర్తయ్యాక తన పుట్టిన రోజు వేడుకలకు వచ్చిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. రాబిన్ ఊతప్ప, అతడి భార్య శీతల్ గౌతమ్‌తో కలిసివున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. 2010లో ధోని, సాక్షి పెళ్లి చేసుకున్నారు. వీరికి మూడేళ్ల కూతురు జీవా ఉంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌కు ఎంపిక కాకపోవడంతో ధోని అంతర్జాతీయ కెరీర్‌కు బ్రేక్ పడింది. 2018 సంవత్సరం ధోని కెరీర్లో అత్యంత చెత్తగా నిలిచింది. ఈ ఏడాది ఇప్పటివరకు 19 మ్యాచ్‌లు ఆడి కేవలం 275 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో అతడి వ్యక్తిగత అత్యధిక స్కోరు 42 నాటౌట్. 2019 వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్‌కు కొద్ది నెలల సమయం మాత్రమే ఉండటంతో ధోని ఫామ్ టీమిండియాను కలవరపెడుతోంది. -
శీతల్ గౌతమ్ తో రాబిన్ నిశ్చితార్థం
బెంగళూరు: ఇటీవల ముప్ఫైవ పుట్టినరోజు జరుపుకున్న భారత మాజీ ఓపెనర్, కర్ణాటక ఆటగాడు రాబిన్ ఊతప్ప త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. గత ఏడు సంవత్సరాలుగా ప్రేమాయణం సాగిస్తున్న తన చిన్ననాటి స్నేహితురాలు, టెన్నిస్ క్రీడాకారిణి శీతల్ గౌతమ్ తో రాబిన్ ఏడు అడుగులు నడవనున్నాడు. ఈ మేరకు వారిద్దరి నిశ్చితార్థం తాజాగా జరిగిపోయింది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రాబిన్ .. తాము అతి త్వరలో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేశాడు. గత కొన్నిరోజులుగా రంజీ ట్రోఫీ మ్యాచ్ లకు దూరంగా ఉండటంతో శీతల్ వద్ద పెళ్లి ప్రస్తావన తేవడానికి సమయం దొరికినట్లు రాబిన్ తెలిపాడు. తమ సుదీర్ఘ ప్రేమకు శీతల్ కూడా వెంటనే అంగీకారం తెలపడంతో నిశ్చితార్థం కార్యక్రమం కూడా వెంటనే జరిగిపోయినట్లు వెల్లడించాడు. ఎప్పట్నుంచో తన ప్రేమను పెళ్లిగా మార్చుకుందామని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపాడు. ఇదిలా ఉండగా, తమ పెళ్లికి సంబంధించిన ప్రపోజల్ కోసం రాబిన్ నెలలుగా నిరీక్షిస్తున్నవిషయం తనకు తెలియదని శీతల్ తెలిపింది. ఈ మధ్య కాలంలో టీమిండియా జట్టులో స్థానం దొరకని క్రికెటర్లు పెళ్లికి సిద్ధమవుతున్నారు. గత నెల్లోఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్-గీతా బస్రాల పెళ్లి జరగగా, కొన్ని రోజుల క్రితం హజిల్ వుడ్ -యువరాజ్ సింగ్ ల నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. తన తండ్రి యోగరాజ్ సింగ్ అంగీకారంతో బ్రిటీష్ నటి హజిల్ తో పెళ్లికి యువీ సిద్ధమయ్యాడు. వీరి పెళ్ళి వచ్చే ఫిబ్రవరిలో జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. కాగా, రాబిన్ -శీతల్ ల వివాహానికి సంబంధించి ఇంకా తేదీ ఖరారు కాలేదు.