Sherin
-
‘30 ఏళ్ల తర్వాతే పెరోల్‌కు అర్హుడు’
వాషింగ్టన్ : రెండేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మూడేళ్ల భారతీయ బాలిక షెరిన్ మాథ్యూస్ మృతి కేసులో అరెస్టయిన ఆమె దత్తత తండ్రి వెస్లీ మాథ్యూస్‌కి డల్లాస్ కోర్టు బుధవారం జీవిత ఖైదు విధించింది. 30 ఏళ్ల పాటు శిక్ష అనుభవించిన తర్వాతే అతను పెరోల్‌కు అర్హుడని తేల్చి చెప్పింది. ఓ మూడేళ్ల చిన్నారి పట్ల అమానుషంగా ప్రవర్తించినందుకు అతని మిగతా జీవితం అంతా జైలులోనే గడపాలని కోర్టు ఆదేశించింది. కేరళకు చెందిన సైనీ, వెస్లీ దంపతులు 2016లో బిహారులోని ఓ శరణాలయం నుంచి ప్రత్యేక అవసరాలున్న షెరిన్‌ను దత్తత తీసుకుని అమెరికాకు తీసుకెళ్లారు. 2017 అక్టోబరు 7న షెరిన్ కనపించకుండా పోయిందంటూ వెస్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సరిగ్గా పాలు తాగనందుకు షెరిన్పై ఆగ్రహించిన వెస్లీ పాపను తెల్లవారుజామున మూడుగంటల ప్రాంతంలో షెరిన్‌ని ఒంటరిగా ఇంటి బయట నిలబెట్టనాన్నడు. తర్వాత వచ్చి చూసేసరికి పాప కనిపించలేదని వెస్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నారిని ఇంటి నుంచి పంపించిన 15 నిమిషాలకే తాను వెళ్లి చూశానని.. అప్పటికే పాప అక్కడ లేదని వెస్లీ చెప్పాడు. అయితే అఫిడవిట్లో మాత్రం తాను సూర్యోదయం అయ్యాక వెళ్లి చూశానని పేర్కొన్నాడు వెస్లీ. కొన్నిరోజుల తార్వత వెస్లీ ఇంటికి సమీపంలో ఓ చిన్నారి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. వైద్య పరీక్షల్లో ఆ మృతదేహం చిన్నారి షెరిన్‌దేనని తేలింది. దీంతో వెస్లీని విచారించగా.. అసలు విషయం బయటపెట్టాడు. ఘటన జరిగిన రోజు షెరిన్ పాలు తాగనని మారాం చేసిందని.. దాంతో తాను బలవంతంగా ఆమెతో పాలు తాగించానని వెస్లీ చెప్పాడు. ఈ క్రమంలో ఆమెకు వూపిరాడలేదని తెలిపాడు. కొద్ది సేపటికే ఆమె శ్వాస తీసుకోవడం ఆగిపోయిందని.. పల్స్ కూడా కొట్టుకోలేదని, దీంతో ఆమె చనిపోయినట్లు అర్థమైందని చెప్పాడు. ఆ తర్వాత మృతదేహాన్ని తానే ఇంటి నుంచి దూరంగా తీసుకెళ్లి గుర్తు పట్టరాకుండా చేసి కల్వర్టులో పడేశానని అంగీకరించాడు. -
అమెరికాలో భారత చిన్నారి కథ విషాదాంతం?
టెక్సస్ : పాలు తాగలేదని, కన్నతండ్రి ఇంటి నుంచి బయటకు పంపేసిన చిన్నారి షెరిన్ మాథ్యూస్ కథ విషాదాంతమైందా?. టెక్సస్ పోలీసులు చెబుతున్న వివరాలు ఈ విషయాన్ని ధ్రువపరుస్తున్నాయి. పాలు తాగట్లేదని తన మూడేళ్ల కుమార్తెను ఇంటి నుంచి బయటకు పొమ్మన్నాడు వెస్లీ మాథ్యూస్. రాత్రంతా ఇంట్లోకి రావొద్దంటూ శిక్ష విధించాడు. కొద్దిసేపటికి బయటకు వచ్చి చూసిన తండ్రికి షెరిన్ కన్పించకుండా పోయింది. దాదాపు రెండు వారాల అనంతరం మాథ్యూస్ ఇంటి సమీపంలోని డ్రైనేజిలోని టన్నెల్లో చిన్నపాప మృతదేహాన్ని టెక్సస్ పోలీసులు గుర్తించారు. ఈ మృతదేహం షెరిన్‌దేనని అనుమానిస్తున్నారు. బాలికను అర్థరాత్రి ఇంటి బయట నిలబెట్టినందుకు వెస్లీ మాథ్యూస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. షెరిన్ భారత్‌లో జన్మించింది. మాథ్యూస్ కుటుంబం ఆమెను దత్తత తీసుకుని అమెరికాకు తీసుకెళ్లారు. -
హర్రర్ చిత్రంతో రీ ఎంట్రీ
నటి షెరీనా కొంచెం గ్యాప్ తరువాత కోలీవుడ్‌లో హర్రర్ చిత్రం ద్వారా రీ ఎంట్రీ అవుతున్నారు. నటి షెరీనా మంచి అందగత్తె అనడంలో ఎలాంటి సందేహం లేదు. ధనుష్ సరసన తుళ్లువదో ఇళమై చిత్రంలో నటించి కుర్రకారును తన అందాలతో గిలిగింతలు పెట్టించారు. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించినా హీరోయిన్గా పెద్దగా పేరు సంపాదించుకోలేకపోయారు. టాలీవుడ్‌లోను డేంజర్ వంటి కొన్ని చిత్రాల్లో నటించినా షెరీనా తాజాగా తిగిల్ అనే చిత్రం ద్వారా తమిళ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. హర్రర్ కథాంశంతో కూడిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రాన్ని మిరాకిళ్ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. సంతోష్ కొటంకేరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అశోక్ హీరోగా నటిస్తున్నారు. కల్కి శృతి, రావికనే, విజయ్ ఆనంద్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ చెన్నైలో నివసించే షెరీనా తన కాబోయే భర్తను కలుసుకోవడానికి మైసూరు బయలు దేరుతుందన్నారు. రాత్రి కావడంతో మధ్యలో కూర్గ్ అనే ప్రాంతంలోని ఒక ఎత్తయిన కొండ ప్రాంతంలోని బంగ్లాలో బస చేస్తుందని తెలిపారు. ఆ రాత్రి ఆ బంగ్లాలో ఆమె ఎదుర్కొనే సంఘటనల సమాహారమే తిగిల్ చిత్రం అని చెప్పారు. హర్రర్ కథాంశంతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రం షూటింగ్‌ను చెన్నై, కూర్గ్, మైసూర్ తదితర ప్రాంతాల్లో పూర్తి చేసినట్లు తెలిపారు.