ఏ వ్యాధినైనా షెర్లాక్తో పట్టేయొచ్చు..!
బోస్టన్: మానవశరీరంలోని వ్యాధులను కచ్చితత్వంతో గుర్తించే ప్రత్యేకమైన కాగితాన్ని అమెరికాకు చెందిన మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. షెర్లాక్(స్పెసిఫిక్ హై
సెన్సిటివిటీ రిపోర్టర్ అన్లాకింగ్)గా పిలుస్తున్న ఈ కాగితాన్ని ఆర్ఎన్ఏ శాంపిల్స్‌లో ముంచడం ద్వారా శరీరంలో ఏయే రోగాలున్నాయో వెంటనే తెలుసుకోవచ్చని ఎంఐటీకి చెందిన ఫెంగ్ జెహాంగ్ తెలిపారు. షెర్లాక్ ద్వారా ట్యూమర్ డీఎన్ఏ, ఊపిరితిత్తుల కేన్సర్, జికా, డెంగ్యూ వైరస్‌లను గుర్తించగలిగామని వెల్లడించారు. షెర్లాక్లో ప్రధానంగా సీఏఎస్ 13 అనే ఎడిట్‌చేసిన ప్రొటీన్ ఉంటుందని ఫెంగ్ తెలిపారు. ఏదైనా శాంపిల్స్లోకి సీఏఎస్ 13ను ముంచినప్పుడు అందులోని రోగకారక క్రిముల ఆధారంగా ఈ ప్రొటీన్ ఆర్ఎన్ఏలుగా విడిపోతుందన్నారు. తద్వారా రోగికి ఏ వ్యాధి సోకిందో వెంటనే తెలుసుకోవచ్చని వెల్లడించారు.