shilpa kala
-
ఈ ఏడాది నా జీవితం పూరిపూర్ణమైంది
‘‘ఈ వేదికపై (శిల్ప కళా వేదిక) జరిగిన వందల ఆడియో ఫంక్షన్లకు వచ్చాను. నా పాటలు కూడా ఆవిష్కరించబడ్డాయి. కానీ ఆ ఫంక్షన్స్‌లో హీరోలను చూసేందుకు ప్రేక్షకులు వచ్చేవారు. కానీ ఈ రోజు ఇక్కడ పాట హీరో.. సంగీతం హీరో.. సాహిత్యం హీరో. ‘తాజ్‌మహల్’ సినిమాతో నన్ను రామానాయుడుగారు పరిచయం చేశారు. 1995లో మొదలైన నా ప్రయాణం 2023 వరకూ.. 28 సంవత్సరాలు.. 860కి పైగా సినిమాలు.. 3600లకు పైగా పాటలు రాశాను. ఈ ఏడాది నాకు, నా జీవితానికి, నా సాహిత్యానికి పరిపూర్ణతను తీసుకొచ్చింది. ఈ ఏడాది నాపై పురస్కారాల వర్షం కురిసింది. ఫిబ్రవరిలో గోల్డెన్‌గ్లోబ్ అవార్డు, హాలీవుడ్ క్రిటిక్స్ చాయిస్, క్రిటిక్స్ అవార్డు, అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్, బాంబే హంగామా అవార్డు, ఉత్తమ జాతీయ గీతరచయిత అవార్డు.. ఇలా వరుసగా ఒకే సంవత్సరం నన్ను ఆరు పురస్కారాలు వరించాయి. మన తెలుగుకు వెయ్యేళ్ల సాహిత్య చరిత్ర ఉంది. రెండువేల సంవత్సరాల భాషా చరిత్ర ఉంది. నా మిత్రుడు ఒకరు ‘సంకల్పం’ అనే పుస్తకం తెలుగులో రాసి, ఈ పుస్తకం కోసం వారం రోజులు సెలవు పెట్టి అమెరికా నుంచి వచ్చారు. ఆ తర్వాత అమెరికా వెళ్లినప్పుడు ఆయన సహోద్యోగి ఎందుకు సెలవు పెట్టారని అడగ్గా... తెలుగు భాష పుస్తకం కోసం అని చెప్పగా.. ఆవిడ తెలుగు అంటే.. ఆ నాటు నాటు లాంగ్వేజ్ అన్నారట. ప్రపంచంలో తెలుగు అనేది ఒకటి ఉందని చాలామందికి తెలియదు. కానీ మొట్టమొదటిసారి ‘నాటు పాట’తో ఇది నాటు భాష అని తెలిసింది. ఈ పాట సృష్టికర్తల్లో నేను ఒకడిని. నా జన్మ చరితార్థమైంది. ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించిన నిహారిక, ప్రదీప్, సరస్వతిలకు, వారి కుటుంబసభ్యులకు ధన్యవాదాలు’’ అని అన్నారు. ఈ ఏడాది ఆస్కార్, జాతీయ అవార్డులతో పాటు మరెన్నో అవార్డులను సొంతం చేసుకున్న రచయిత చంద్రబోస్‌ని సత్కరించడానికి ‘తెలుగు జాతీయ చంద్రబోస్’ పేరిట శనివారం హైదరాబాద్‌లో నటుడు ప్రదీప్ ఓ వేడుక నిర్వహించారు. ఈ వేదికపై చంద్రబోస్‌ని, ఆయçన సతీమణి, నృత్యదర్శకురాలు, దర్శకురాలు సుచిత్రా చంద్రబోస్‌ని సత్కరించారు. ఈ సందర్భంగా రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ– ‘‘ఆస్కార్, జాతీయ అవార్డు అందుకున్న చంద్రబోస్‌గారికి మా కవి కులం తరఫున అభినందనలు. బోస్‌గారి ప్రయాణం, ప్రస్థానం ఆదర్శవంతంగా ఉంటాయి. ఈ గొప్పదనం, ఆదర్శం ఒక్కరోజులో రాదు. తొలి రోజు నుంచే కష్టపడుతూ ఉండాలి. ఓ రచయితకు జరిగిన ఈ సన్మానాన్ని అక్షరానికి జరిగిన సన్మానంలా భావిస్తున్నాను’’ అన్నారు. ఈ వేడుకలో పలువురు కళాకారులను సన్మానించారు. మురళీమోహన్, ముప్పలనేని శివ, ఎంఎం శ్రీలేఖ, చంద్రబోస్ సోదరుడు రాజేందర్‌తో పాటు పలువురు సినీ, టీవీ నటీనటులు పాల్గొన్నారు. -
మునా‘వార్’... కామెడీ షో కోసం వస్తున్న మునావర్ ఫారూఖీ
గచ్చిబౌలి/అబిడ్స్: స్టాండ్ అప్ కమిడియన్, లాక్ అప్ షో విజేత మునావర్ ఫారూఖీ లైవ్ షోకి సైబరాబాద్‌లోని శిల్పకళా వేదిక ముస్తాబవుతుండగా..ఆయనను అడ్డుకుంటామని, దాడులు చేస్తామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రటించడంతో నగరంలో వాతావరణం హీటెక్కింది. శనివారం లైవ్ షో ఉన్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే రాజాసింగ్‌ను ముందస్తు అరెస్టు చేశారు. ఆయన్ను తొలుత లాలాపేట, ఆపై బొల్లారం ఠాణాలకు తరలించారు. మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో శనివారం సాయంత్రం 6.30 గంటలకు ‘డోంగ్రీ టు నౌహియర్’ పేరితో మునావర్ షో ఇస్తున్నారు. మునావర్ రాకను, ఈ షోను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రాజాసింగ్ కొన్ని రోజులుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయనపై దాడులు చేస్తామని గతంలో ప్రకటించారు. తాజాగా పోలీసులు కూడా ఈ షోకు అనుమతి ఇచ్చిన విషయం తెలుసుకున్న ఆయన మునావర్‌తో పాటు ఆయన షో నిర్వహించనున్న వేదికనూ ధ్వంసం చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఫారూఖీ లైవ్ షోను అడ్డుకోవడంతో పాటు వేదికను తగులబెడతామని చేసిన వ్యాఖ్యలతో హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. శిల్పకళా వేదికకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. హైటెక్ సిటీ చుట్టుపక్కల మార్గాల్లోనూ సిబ్బందిని మోహరిస్తున్నారు. అనుమతి ఉంది..భద్రత కల్పిస్తాం ఈ షో కు అనుమతి ఉందని, అవసరమైన భద్రత, బందోబస్తు కల్పిస్తామని మాదాపూర్ ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ తెలిపారు. శిల్పకళా వేదిక, మాదాపూర్ పరిసరాలలో మాదాపూర్ పోలీసులు శనివారం ఉదయం నుంచి బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఈ లైవ్ షోకు రెండు వేల మంది వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. టికెట్‌తో వచ్చే ప్రతి ఒక్కరినీ పూర్తిస్థాయిలో తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతించనున్నారు. అనుమానితులు కనిపిస్తే ముందస్తు అరెస్ట్‌లు తప్పవని పోలీసులు పేర్కొంటున్నారు. ఇప్పటికే మునావర్ ఫారూఖీ షోకు సంబంధించిన ఎంట్రీ టికెట్లు ఆన్లైన్లో విక్రయిస్తున్నారు. షో ఎక్కడ అనే అంశాన్ని ఆ వెబ్సైట్ శుక్రవారం రాత్రి 7 గంటల వరకు సైతం ప్రకటించలేదు. మునావర్ తన ఇన్‌స్టా్రగామ్‌లో డోంగ్రీ టు నో హియర్ పేరుతో లైవ్ షో ఉందని ప్రకటించిన నాటి నుంచి ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్రంగా స్పందిస్తున్నారు. రాజాసింగ్ అరెస్ట్..ఉద్రిక్తత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరికల నేపథ్యంలో శుక్రవారం ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ధూల్‌పేటలోని రాజాసింగ్ ఇంట్టి వద్ద ఉదయం నుంచే మోహరించిన పోలీసులు..సాయంత్రం అరెస్ట్ చేసి లాలాగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా తీవ్ర వాగి్వవాదం జరిగింది. ముందుగా పోలీసులు హౌస్ అరెస్టు చేస్తున్నామని ఇంట్టి వద్ద ప్రకటించారు. ఎమ్మెల్యే రాజాసింగ్ పోలీసుల తీరును నిరసిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీపీ సతీ‹Ùకుమార్ ఆధ్వర్యంలో మంగళ్‌హాట్ ఇన్స్పెక్టర్ రవి, ఇతర సిబ్బంది సాయంత్రం సమయంలో ఎమ్మెల్యేను అరెస్ట్ చేయడంతో అక్కడే ఉన్న పార్టీ కార్యకర్తలు సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసుల తీరుపట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎమ్మెల్యేను ఎలా అరెస్ట్ చేస్తారని, పోలీసు వాహనాన్ని అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు వారిని తొలగించి రాజాసింగ్‌ను తీసుకువెళ్లారు. అరెస్టుపై ఏసీపీ సతీ‹Ùకుమార్‌ను వివరణ కోరగా ముందు జాగ్రత్త చర్యగానే ఎమ్మెల్యేను అరెస్ట్ చేశామని తెలిపారు. (చదవండి: కార్పొరేట్ కాలేజీల వేధింపులతో ఆత్మహత్యా యత్నాలు చేస్తున్న విద్యార్థులు ) -
జయితి..జగద్విఖ్యాతి
మెంటాడ: అపూర్వమైన శిల్ప కళా సౌందర్యం. అబ్బురపరిచే ఆలయాల సమూహం. అవే మెంటాడ మండలంలోని జయితి ఆలయాలు. మెంటాడకు సుమారు 7, గజపతినగరానికి సుమారు 20, జిల్లా కేంద్రానికి సుమారు 40 కిలో మీటర్ల దూరంలో జయితి గ్రామం ఉంది. ఈ ఆలయాలను గ్రామస్తులే కమిటీగా ఏర్పడి అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ఆలయ కమిటీ చైర్మన్‌గా గేదెల సత్యం నాయుడు వ్యవహరిస్తున్నారు. ఏటా మహాశివరాత్రి, కార్తీక మాసం, ఇతర పర్వదినాల్లో గ్రామస్తుల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. రవాణా సదుపాయాలు విజయనగరం, గజపతినగరం నుంచి ప్రతి 2 గంటలకు బస్సు సౌకర్యం ఉంది. ఆటోలు నిరంతరం తిరుగుతుంటాయి. శివరాత్రికి ప్రత్యేక బస్సులను నడుపుతారు. ఇక్కడి శిల్ప కళా సంపదను పరిశీలించిన అధికారులు, పురావస్తు శాఖాధికారులు ప్రశంసించి అభివృద్ధి చేస్తామని హామీలివ్వడం తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2014 నవంబరు 22న ఇదే గ్రామానికి చెందిన వజ్రపు తిరుపతిరావు మృత్యుంజయ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 1992లో ముచ్చెర్ల రామచంద్రరరావు ఆధ్వర్యంలో గ్రామస్తులు కమిటీగా ఏర్పడి మల్లికార్జున ఆలయాన్ని పునరుద్ధరించారు. ఆకర్షిస్తున్న గోపురాలు ఇక్కడి శిల్ప గోపురాలు జైనుల కాలం నాటివని చరిత్రకారుల కథనం. అందుకే ఈ గ్రామానికి జయితి అని పేరు లభించిందంటారు. మల్లికార్జున స్వామి ఆలయానికి ఎడమ వైపున్న గోపురంపై వినాయకుడు, విష్ణు, బ్రహ్మ, కుమారస్వామి తదితర విగ్రహాలున్నాయి. ఈ ఆలయాన్ని ఇటీవల తొలగించి పునర్నిర్మిస్తున్నారు. కుడి వైపున్న గోపురంలో పార్వతీ దేవి ఆలయం అని చెబుతున్నారు. తొమ్మిది చేతులతో నటరాజు విగ్రహం ఇక్కడ గొప్ప ఆకర్షణగా నిలుస్తోంది. ఈ పరిసరాలకు ఉత్తర దిశలో కొండపైన శివ–పార్వతుల ఆలయం ఉందని పూర్వీకుల కథనం. ఇక్కడున్న పర్వతం వద్ద బంగారు లోయ ఉందని గ్రామస్తులు తెలిపారు. దాని మార్గం నేరుగా కాశీ వరకు ఉందంటారు. గతంలో ఈ లోయ ఎంతదూరం వరకూ ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నించినా గమ్యం కానరాలేదని చెబుతున్నారు. 1984, 85, 86 సంవత్సరాల్లో ఢిల్లీ, భువనేశ్వర్, అమెరికా, ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన చెందిన పురాతత్వ శాఖ నిపుణులు ఆలయాలను సందర్శించారని ఆలయ కమిటీ చైర్మన్లు తాజా, మాజీ చాపాన జోగినాయుడు, గేదెల సత్యంనాయుడు, సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు బెవర వీరునాయుడు, మన్నేపురి రామచంద్రుడు తెలిపారు. -
ఆ శిలా తోరణాలు ఓ మహాలయపు ఆనవాళ్లు
ఓరుగల్లు కాకతీయ తోరణాల గుట్టు విప్పిన అమెరికా పరిశోధకుడు వాగనర్ సాక్షి, హైదరాబాద్: నాలుగున్నర ఎకరాల సువిశాల స్థలం.. దానికి నాలుగు దిక్కులా ఒక్కోటి 30 అడుగుల ఎత్తుతో భారీ తోరణ ద్వారాలు.. లోపల నాలుగు నంది మండపాలు... మధ్యలో సద్యోజాత, వామదేవ, అఘోర, ఈశాన... ఇలా చతుర్ముఖ రూపంతో శివలింగం.. ఒక్కో ద్వారం నుంచి ఒక్కో రూపం దర్శనం! ఎత్తయిన స్తంభాలు, ప్రతి స్తంభం అద్భుత శిల్ప కళా వైభవానికి నిలువుటద్దం.. వెరసి సర్వతోభద్ర ఆలయం! ఈ గొప్ప ఆలయం ఉంది ఎక్కడో కాదు.. మన వరంగల్‌లో! ఆ ఆలయ తోరణాలే కాకతీయ తోరణాలు!! రాష్ట్ర అధికారిక చిహ్నంగా భాసిల్లుతున్న ఈ తోరణాల గుట్టు వీడింది. ఇన్నాళ్లూ అక్కడో దేవాలయం ఉండేదని, అందులో భాగంగానే వాటిని ఏర్పాటు చేశారని తెలుసు. కానీ.. వాటి అసలు రహస్యాన్ని తాజాగా అమెరికాకు చెందిన ఓ పురావస్తు పరిశోధకుడు తేల్చాడు. కేవలం తోరణాలే కాదు, ఆ ప్రాంతానికి చెందిన సరికొత్త అంశాలను వెలుగులోకి తెచ్చాడు. అది సర్వతోభద్ర ఆలయం సర్వతోభద్ర ఆలయం.. అన్ని వైపులా ప్రధాన శక్తులను ఆవాహన చేసి సర్వం క్షేమదాయకంగా ఉండాలని ఈ తరహా ఆలయాలను నిర్మిస్తారు. ఇవి చాలా అరుదు. ఇందులో నాలుగు వైపులా ద్వారాలు ఉండటం, ఒక్కో ద్వారం నుంచి మూల విరాట్టు ఒక్కో రూపంలో కనిపించడం ప్రత్యేకత. అలాంటి అరుదైన ఆలయం ఓరుగల్లు కోటలో ఒకప్పుడు వెలుగొందింది. ఆ ఆలయానికి ఏర్పాటు చేసిన ద్వారాలే ఈ కాకతీయ తోరణాలు. ఈ ఆలయానికి సంబంధించిన మూలవిరాట్ల స్థానంలో స్థాపితమైన చతుర్ముఖ లింగం.. ఇప్పుడు శంభుడి గుడిగా పిలుచుకునే మరో దేవాలయం ప్రాంగణంలో ఓ పక్కన భూమిలోకి కొంత కూరుకుపోయి ఉంది. ఈ చతుర్ముఖ శివలింగం పీఠం వరంగల్ కోటలో ఉత్తరం వైపున ఉన్న తోరణ ద్వారం పక్కన శిథిలాల్లో పడి ఉంది. ఈ వివరాలను తాజాగా అమెరికాలోని బోస్టన్ సమీపంలో ఉన్న మిడిల్‌టౌన్‌లోని వెస్లియాన్ వర్సిటీ ప్రొఫెసర్ ఫిలిప్ బి.వాగనర్ వెల్లడించారు. వీటిపై అధ్యయనం చేసి ఓ నివేదికను రూపొందించారు. గణపతి దేవుడి హయాంలో నిర్మాణం గణపతిదేవుడి కాలంలో 1220–1240 మధ్య ఈ ఆలయాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. ఆలయం నిర్మాణం పూర్తయ్యే తరుణంలో ఢిల్లీ సుల్తాన్ల సైనికాధికారిగా ఉన్న ఉలూఘ్ఖాన్ వరంగల్‌పై దండయాత్ర చేసి గణపతిదేవుడిని ఓడించాడు. ఆ సమయంలో ఈ ఆలయం «పూర్తిగా ధ్వంసమైంది. ఆ రాళ్లతోనే ఆయన అక్కడ మసీదు నిర్మాణం జరిపినట్టు కూడా కొన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కోటలోపలి భాగంలో నిలిచి ఉన్న కొన్ని రాతి స్తంభాలు మసీదువేనని ప్రొఫెసర్ వాగనర్ పేర్కొంటున్నారు. తర్వాత ఆ ప్రాంతాన్ని పద్మనాయకులు స్వాధీనం చేసుకొని మసీదును ధ్వంసం చేసి ఉంటారని భావిస్తున్నారు. నిజాం హయాంలో 1920 ప్రాంతంలో పురావస్తుశాఖకు సంచాలకులుగా ఉన్న గులాం యాజ్దానీ హయాంలో వరంగల్ కోటలో తవ్వకాలు జరిపారు. ఆ సమయంలో చతుర్ముఖ శివలింగంతోపాటు ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న శిథిలాలు వెలుగుచూశాయి. శివలింగం పీఠం మరో ప్రాంతంలో కనిపించింది. ఇప్పుడు వాగనర్ చెప్పేంతవరకు అది శివలింగం పీఠమనే విషయం తెలియకపోవటం విశేషం. ముస్లిం రాజుల దాడిలో ఈ శైవక్షేత్రం నేలమట్టమైనా.. దానికి వినియోగించిన నాలుగు తోరణ ద్వారాలు మాత్రం చెక్కు చెదరలేదు. వ్యూహాత్మకంగానే వారు వాటి జోలికి వెళ్లలేదని వాగనర్ పేర్కొంటున్నారు. ఈ తోరణాలపై ఎక్కడా హిందూ దేవుళ్ల విగ్రహాలు, ఆకృతులు లేవు. దీంతో వాటిని మసీదుకు ద్వారాలుగా చేసుకునే ఉద్దేశంతోనే ధ్వంసం చేసి ఉండకపోవచ్చు అని ఆయన వివరించారు. అరుదు.. అత్యద్భుతం: వాగనర్ ఈ సర్వతోభద్ర ఆలయాలు చాలా అరుదు. దక్షిణ భారతదేశంలో వాటి సంఖ్య చాలా తక్కువ. కోటలో విలసిల్లిన ఆలయం అత్యద్భుతంగా నిర్మించారు. ఆలయం చాలా పెద్దదిగా నిర్మించి ఉంటారని పునాదుల ఆనవాళ్లు చెబుతున్నాయి. దీన్ని రామప్ప ఆలయం తర్వాతనే నిర్మించినా.. అలాగే నిలిచి ఉంటే దేశంలోనే గొప్ప ఆలయ నిర్మాణంగా చరిత్రలో ఉండేదేమో! సరిపోలిన లింగం పీఠం.. లింగం చుట్టుకొలత.. ప్రస్తుతం వరంగల్ కోటకు వెళ్తే.. నాలుగు తోరణాల మధ్యలో ధ్వంసమైన శిల్పాలు, ఇతర శిథిలాలు కనిపిస్తాయి. ఇవి ఏంటన్న అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు. అవి ఏ కట్టడం తాలూకు భాగాలన్న వివరాలు లభ్యం కాలేదు. అమెరికా ప్రొఫెసర్ వాగనర్ వరంగల్‌పై అంతర్జాతీయ స్థాయిలో టూర్‌గైడ్ తయారీ కోసం ఇటీవల ఓరుగల్లు వచ్చారు. ఈయనకు దక్షిణ భారత్‌లో హంపి వంటి ఎన్నో చారిత్రక ప్రదేశాలపై విస్తృతంగా అధ్యయనం చేసిన అనుభవం ఉంది. ఆరు రోజులు వరంగల్‌లోనే ఉండి అక్కడి చాలా ప్రాంతాలను పరిశీలించారు. కోటకు చేరువలోని శంభుడి గుడి ప్రాంగణంలో చతుర్ముఖ లింగాన్ని చూడగానే ఇక్కడ సర్వతోభద్ర ఆలయం ఉండొచ్చని భావించారు. కోటలో నాలుగు వైపులా ఉన్న కీర్తి తోరణాలు ఆలయ ద్వారాలుగా నిర్ధారించుకుని వాటిని చతుర్ముఖ లింగంతో అన్వయించుకున్నప్పుడు కొంత స్పష్టత వచ్చింది. దీంతో నాలుగు తోరణాల మధ్య ఉన్న స్థలంలో పునాదుల ఆనవాళ్లను పరిశీలించగా అది నాలుగు మండపాలు, వాటికి నాలుగు వైపులా ద్వారాలు ఉన్నట్టు స్పష్టమైంది. దీంతో అది సర్వతోభద్ర ఆలయం ఉన్న స్థలంగా నిర్ధారించారు. ఇక్కడే శిథిలాల్లో చతుర్ముఖ లింగం పీఠం కనిపించింది. అది అష్టభుజి ఆకృతిలో ఉంది. దాని చుట్టుకొలత, చతుర్ముఖ లింగం చుట్టు కొలత సరిగ్గా సరిపోయాయి. ఆ ఆలయం ధ్వంసమైనప్పుడు అన్నీ వేర్వేరు ప్రాంతాల్లో పడిపోయాయి. -
లేపాక్షి.. ఘనకీర్తి
-
శిల్పకళ అద్భుతం
హిందూపురం అర్బన్/లేపాక్షి : లేపాక్షి ఆలయంలోని శిల్పకళా నైపుణ్యం అద్భుతమని రాష్ర్ట గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రశంసలు కురిపించారు. ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందడానికి ఇక్కడి శిల్పకళా నైపుణ్యం, ఆలయ చరిత్రపై విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గురువారం ఆయన లేపాక్షి విరుపాక్షేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు. ప్రాకారాలు, నాలుగు వైపులున్న ద్వారాలు, ఆలయ విశిష్టత తెలిపే శాసనాలు, గార, ఇటుక, కోడిగుడ్డు మిశ్రమంతో నిర్మించిన పైకప్పు, వినాయకుడి విగ్రహం, ఏడు శిరసుల నాగేంద్రుడు, అక్కమ్మ దేవతలు, శ్రీకాళహస్తి మహత్యంకు సంబంధించిన సాలే పురుగు, ఏనుగు, పాము శిల్పాలు తిలకించారు. విరుపణ్ణ గోడకు వేసిన కళ్లు, అర్ధంతరంగా ఆగిపోయిన కల్యాణమంటపం, లతా మంటపంలోని వివిధ రకాల డిజైన్లను ఆసక్తిగా గమనించారు. అనంతరం సీతమ్మ పాదం, శివలింగాలు, నాట్యమంటపం, పైకప్పులో భూకైలాస్, మననీతి కథ, గోడలకున్న భక్తశిరియాళ, కిరాతార్జునీయం బొమ్మలను తిలకించారు. అంతరిక్ష స్తంభం, వటపత్రసాయి చిత్రాలు చూశారు. స్థానిక పురావస్తు శాఖ అటెండర్ తెలుగులో ఆలయ విశిష్టతను వివరించగా హైదరాబాద్ నుంచి వచ్చిన పురావస్తు శాఖ సూపరింటెండెంట్ బాబ్జిరావు ఆంగ్లంలో గవర్నర్‌కు అనువదించారు. అనంతరం వీరభద్రస్వామి, దుర్గాదేవి, రఘనాథస్వామి, పాపనాశేశ్వర స్వాములకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆలయంలో శిల్ప కళ అబ్బురపరుస్తోందన్నారు. టూర్ గైడ్ల సంఖ్య పెరగాలన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం తనవంతుగా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తానని చెప్పారు. ఆలయంలో వినాయకుడి విగ్రహం చోరీ కేసు గురించి విలేకరులు ప్రస్తావించగా.. అది దేవుడే చూసుకుంటాడన్నారు. పెనుకొండలో పర్యాటక అభివృద్ధి జరగడం లేదని, కొండపై గవర్నర్ అతిథి గృహ నిర్మాణం తేలలేదని గవర్నర్ దృష్టికి తేగా.. పనులు జరుగుతున్నాయి కదా అని అన్నారు. అనంతరం లేపాక్షి ఆలయం నుంచి ప్రధాన రహదారిలో ఉన్న నంది విగ్రహాన్ని దర్శించుకుని కిరికెర అతిథి గృహానికి వెళ్లిపోయారు. అంతకు ముందు ఆలయంలో గవర్నర్‌కు కలెక్టర్ లోకేష్‌కుమార్, ఎస్పీ సెంథిల్కుమార్తోపాటు దేవాదాయశాఖ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. జాయింట్‌కలెక్టర్ సత్యనారాయణ గవర్నర్‌ను సత్కరించి, పట్టువస్త్రాలు అందజేశారు. వేదపండితులు ఆశీర్వచనాలు పలికారు. దేవాదాయ శాఖ ఏసీ మల్లికార్జున విరుపాక్షేశ్వరస్వామి చిత్రపటాన్ని గవర్నర్‌కు అందజేశారు. గవర్నర్‌కు ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మడకశిర ఎమ్మెల్యే వీరన్నతో పాటు ఆలయ కమిటి చైర్మన్ సుబ్రమణ్యం, కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్ జయప్ప, జెడ్పీటీసీ సభ్యుడు ఆదినారాయణరెడ్డి, ఎంపీపీ అభ్యర్థి హనోక్ పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అభివృద్ధికి సిఫార్సు చేయండి లేపాక్షి దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సిఫార్సు చేయాలని రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు లేపాక్షి దేవాలయ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సభ్యులు రామాంజనేయులు, రాంప్రసాద్, కేశవరెడ్డి తదితరులు వినతి పత్రాన్ని అందజేశారు. వినతిపత్రంలో కింది అంశాలున్నాయి. లేపాక్షిలో టీటీడీ ఆధ్వర్యంలో కల్యాణ మంటపం ఏర్పాటు చేయాలి. ఆలయానికి తూర్పు వైపు స్థలంలో పార్కు అభివృద్ధి చేయాలి. ఆలయం వెనుక వున్న మాజీ రాష్ర్టపతి వి.వి.గిరి బీటీ రోడ్డును అభివృద్ధి చేయాలి. ఆలయానికి సరిపడే జనరేటర్‌ను సమకూర్చాలి. విరుపణ్ణ మంటపం స్థలంలో మరుగుదొడ్లు, విశ్రాంతి భవనం నిర్మించాలి. లేపాక్షి హ్యాండిక్రాప్ట్ అండ్ సిల్క్ ఎంపోరియం, ఆలయం వెనుక ఆరెకరాల స్థలంలో చిన్నపిల్లల పార్కు అభివృద్ధి చేయాలి. లేపాక్షి -బింగిపల్లి రోడ్డులో జటాయువు పక్షి విగ్రహం ఏర్పాటు చేయాలి. నాట్యమంటపం, మ్యూజియం ఏర్పాటు చేయాలి.