ఫిలిఫ్పీన్స్ నౌకా ప్రమాదంలో 24మంది మృతి
మనిలా : ఫిలిప్పీన్స్లో ఘోర ప్రమాదం జరిగింది. ఫిలిప్పీన్స్ ఓడరేవు సెబుకు సమీపంలో అర్థరాత్రి దాటాక జరిగిన నౌకా ప్రమాదంలో 24మంది దుర్మరణం చెందారు. 700 మందితో ప్రయాణిస్తున్న నౌక అటుగా వస్తున్న మరో కార్గో షిప్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. కార్గోషిప్ను ఢీకొట్టిన గంటన్నరలోనే నౌక సముద్రంలో మునిగిపోయింది.
ఈ దుర్ఘటనలో నౌకలోని 24 మంది చనిపోయారు.మరో 217మంది గల్లంతు అయ్యారు. మిగతా వారిని కోస్టుగార్డులు కాపాడారు. నౌక ఢీకొన్న విషయాన్ని గుర్తించిన కొందరు సముద్రంలోకి దూకేసి ప్రాణాలు కాపాడుకున్నారు. మొత్తం 629 మందిని కోస్టు గార్డులు కాపాడారు. ప్రమాదం జరిగిన సమయంలో చాలా మంది నిద్రావస్థలో ఉన్నారని, చీకట్లో తమకు ఎటువెళ్ళాలో తెలియక ఇబ్బంది పడ్డామనీ ప్రయాణికులు చెప్పారు.