Shiv Pal Yadav
-
రామ మందిరం : ములాయం కోడలి సంచలన వ్యాఖ్యలు
లక్నో : సమాజ్ వాదీ పార్టీలోని రాజకీయ విబేధాలు ఒక్కొటిగా బయటపడుతున్నాయి. వారం రోజుల క్రితమే సమాజ్వాదీ పార్టీ అసమ్మతిదారుడిగా పేరొందిన శివపాల్ సింగ్ యాదవ్ కొత్త పార్టీని పెడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ములాయం చిన్న కోడలు అపర్ణ యాదవ్ కూడా ఇదే బాటలో నడవనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా రామ మందిరం నిర్మాణం గురించి అపర్ణ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అయోధ్యలో రామ మందిర నిర్మాణం తప్పక జరగాల్సిందే. జనవరిలో జరగబోయే కోర్టు విచారణ కోసం మేము ఎదురు చూస్తున్నాం’ అంటూ అపర్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక శివ్పాల్ యాదవ్ స్థాపించిన ప్రగతిశీల్ సమాజవ్ వాదీ పార్టీ 2019 ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని అపర్ణ తెలిపారు. ‘2019 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తే ఏ పార్టీ నుంచి రంగంలోకి దిగుతారు’ అని ప్రశ్నించగా.. ‘పెద్దలు ఎటువైపు ఉంటే నేను అటే. అయినా 2019 ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంద’న్నారు. దాంతో అపర్ణ కూడా శివ్పాల్, నేతాజీ(ములాయం సింగ్ యాదవ్)ల దారిలోనే నడవనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కుమారుడు.. సోదరుని మధ్య విభేదాలతో సతమతమవుతోన్న నేతాజీకి చిన్న కోడలు అపర్ణ వ్యాఖ్యలు మరిన్ని కొత్త సమస్యలు తెచ్చి పెట్టేలా ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. -
మాజీ సీఎం సోదరుడి సొంత కుంపటి
ఢిల్లీ: జాతీయస్థాయిలో మహాకూటమికి చెక్ పడేలా కనిపిస్తోంది. సమాజ్వాదీ పార్టీ అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ సోదరుడు శివపాల్ యాదవ్ సొంత పార్టీ స్థాపించారు. సమాజ్వాదీ సెక్యులర్ మోర్చా పేరుతో పార్టీని పెట్టారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఈ పార్టీతో ఎస్పీ-బీఎస్పీ పొత్తుకు షాక్ తగిలేలా ఉంది. ఎస్పీ-బీఎస్పీ పొత్తు ప్రభావాన్ని తగ్గించేందుకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యూహం పన్నినట్లు స్థానిక రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి. ఎస్పీ, బీఎస్పీ పొత్తు కారణంగా ఉత్తరప్రదేశ్లో ఇటీవల జరిగిన మూడు ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన సంగతి తెల్సిందే. సమాజ్వాదీ సెక్యులర్ మోర్చా పార్టీ అధ్యక్షుడు శివపాల్ యాదవ్ తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తన పార్టీ 2019 లోక్సభ ఎన్నికల్లో యూపీలోని అన్ని సీట్లలో పోటీ చేస్తుందని చెప్పారు. తన పార్టీ మద్దతు లేకుండా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అసాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు. సమాజ్వాదీ పార్టీలో తనను పదేపదే అవమానించారని పేర్కొన్నారు. సమాజ్వాదీ సెక్యులర్ మోర్చా 2022 నాటికి బలమైన పార్టీగా అవతరిస్తుందని జోస్యం చెప్పారు. సమాజ్వాదీ పార్టీలో నిర్లక్ష్యానికి, అవమానానికి గురైన వారిని తమ పార్టీ ఆహ్వానిస్తుందని శివపాల్ తెలిపారు. కార్యకర్తలు గ్రామ, బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని శివపాల్ పిలుపునిచ్చారు. -
అఖిలేశ్ మైకు లాక్కున్న శివ్పాల్
అఖిలేశ్, శివ్పాల్లు వేదికపైనే గట్టిగా అరుచుకున్నారు. ములాయం సింగ్తో పాటు ఇతర నేతలు, కార్యకర్తలు నిశ్చేష్టులయ్యారు. గందరగోళం మధ్యే అఖిలేశ్ నుంచి శివ్పాల్ మైకు లాక్కుని .. ‘ములాయం చెమటోడ్చి పార్టీని బలోపేతం చేశారు. అంతేగాని మీ నినాదాల వల్ల కాదు’ అని అఖిలేశ్ మద్దతుదారులపై మండిపడ్డారు. ఈ నాలుగేళ్లలో పార్టీ పటిష్టం కోసం ప్రతి జిల్లాకు మూడు నాలుగు సార్లు తిరిగి కష్టపడ్డానని శివ్పాల్ చెప్పగా.. కార్యకర్తల్లో ఒకరు స్పందిస్తూ ‘శివ్పాల్ సొంతానికి ప్రభుత్వ హెలికాప్టర్ వాడుకున్నారు’ అని తప్పుపట్టారు. ‘మీ నాన్న సొంత హెలికాప్టరా? నేను మంత్రిని’ అంటూ శివపాల్ అన్నారు.