Shiv Sena-BJP
-
మాది అమీర్, కిరణ్‌ల సంబంధం వంటిది
ముంబై: శివసేన, బీజేపీలది అమీర్‌ఖాన్, కిరణ్ రావుల మధ్య సంబంధం వంటిదని ఎంపీ సంజయ్‌రావుత్ వ్యాఖ్యానించారు. ఇరుపార్టీల మధ్య స్నేహం ఉందని స్పష్టంచేశారు. 15 ఏళ్ల వివాహ బంధానికి చెక్ పెడుతూ విడాకులు తీసుకున్నట్లు ఇటీవలె అమీర్ దంపతులు ప్రకటించారు. ఇద్దరి మధ్య సంబంధం మారిపోయినా, ఇంకా కలిసే ఉన్నట్లు వారిద్దరూ ఓ ప్రకటనలో స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. మరోవైపు బీజేపీ, సేనలు శత్రువులు కాదని ఇటీవల మాజీ సీఎం ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంజయ్ రావుత్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సోమవారం సంజయ్ మాట్లాడుతూ.. ‘‘అమీర్ ఖాన్, కిరణ్ రావులను చూడండి. (వారి) దారులు విడిపోయాయి. కానీ, వారు స్నేహితులు. ఇక్కడ కూడా అంతే. (మా) మార్గా లు వేరు కానీ, స్నేహం అలాగే ఉంది. రాజకీయాల్లో స్నేహం ఉంటుంది. కానీ మేం (మహారాష్ట్రలో) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని దీని అర్థం కాదు. తేడాలు ఉన్నాయి, కానీ నేను చాలా కాలంగా చెబుతున్నట్లుగా, మేం (సేన, బీజేపీ) భారతదేశం–పాకిస్తాన్ కాదు. సమావేశాలు, చర్చలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మార్గాలు వేరయ్యాయి. రాజకీయాల్లో మా మార్గాలు విడిపోయాయి’’ అని అన్నారు. -
‘మహా’ రాజకీయం : ఎమ్మెల్యేలు జారిపోకుండా..
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతుండటంతో వేరేపార్టీ వలలో తమ ఎమ్మెల్యేలు పడకుండా ఉండేందుకు కాంగ్రెస్ ముందస్తు చర్యలకు దిగడం తెల్సిందే. మహారాష్ట్రలో గెల్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలు రాజస్తాన్ రాజధాని జైపూర్‌లోని బుయెనా విస్టా రిసార్ట్స్‌కు తరలించింది. ఈ రిసార్ట్‌లోని 50 విల్లాల్లో ఎమ్మెల్యేలు బస చేస్తుండగా ఒక్కో విల్లా రోజువారీ టారిఫ్ దాదాపు రూ.1.20 లక్షలు. ప్రతి విల్లాకు ఒక ప్రైవేట్ స్విమ్మింగ్‌పూల్ వంటి హంగులున్నాయి. ఎమ్మెల్యేల దృష్టి ఇతర అంశాలపైకి పోకుండా ఉండేందుకు వరుసగా పలు కార్యక్రమాలు నిర్వహించినట్లు అంచనా. బ్యుయెనా విస్టా రిసార్ట్ వెబ్సైట్ ప్రకారం గార్డెన్ విల్లా ఒకరోజు టారిఫ్ రూ.24వేలు ఉండగా, ప్రైవేట్ పూల్తో కూడిన హెరిటేజ్ విల్లాకు రూ.25వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక రాయల్ ఎగ్జిక్యూటివ్ విల్లాకైతే ఏకంగా రూ.1.20 లక్షలు ఖర్చు అవుతుంది. మూడు దశాబ్దాల బంధం ముగిసింది! శివసేనకు చెందిన ఏకైక మంత్రి అరవింద్ సావంత్ మోదీ కేబినెట్ నుంచి రాజీనామా చేయడంతో హిందుత్వ భావాలున్న ఏకైక భాగస్వామ్య పారీ్టతో బీజేపీ మూడు దశాబ్దాల బంధం ముగిసినట్లయింది. సీట్ల పంపిణీ కుదరక రెండు పారీ్టలు 2014 శాసనసభ ఎన్నికల్లోనే విడివిడిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఫలితాల అనంతరం ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతిచి్చంది. అనంతరం స్థానిక ఎన్నికల్లో బీజేపీ బలం పెంచుకుంటూ వస్తోంది. దీంతో మోదీ, అమిత్ షాల నేతృత్వంలో హిందుత్వ సిద్ధాంతంతో నడుస్తున్న బీజేపీ నీడలో ఉండాల్సిన పరిస్థితి శివసేనకు ఏర్పడింది. వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే‡ ఉన్నంత కాలం మహారాష్ట్రలో ఒక వెలుగువెలిగిన తమను బీజేపీ తుడిచిపెడుతుందనే అనుమానాలు శివసేనలో ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడంతోనే శివసేన అనుమానం మరింత బలపడింది. కోరిన మంత్రి పదవి ఇవ్వనందునే కేంద్ర కేబినెట్లో శివసేన తమ నేత అనిల్ దేశాయ్‌ను చేరనివ్వలేదు. అధికార పక్షం తీరుపై పార్టీ పత్రిక సామ్నాలో ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పిస్తూ అంటీముట్టనట్లు వ్యవహరిస్తోంది. -
మోదీ వర్సెస్ ‘గ్యాంగ్ ఆఫ్ ఫోర్’
ప్రధానితో తలపడుతున్న నాలుగు ‘మహా’ పార్టీలు ముంబై: మహారాష్ట్రలో మారిన రాజకీయ సమీకరణాలు ఆసక్తికర పరిణామాలకు దారితీస్తున్నాయి. శివసేన-బీజేపీ, కాంగ్రెస్-ఎన్సీపీల ప్రధాన కూటముల పొత్తు విచ్ఛిన్నమైన నేపథ్యంలో.. ఐదు ప్రధాన పార్టీలు ఒంటరిపోరుకు దిగడం తెలిసిందే. దీంతో అవి పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటూ రాజకీయాలను రక్తి కట్టిస్తాయని పరిశీలకులు భావించారు. అయితే చిత్రం గా.. వీటిలో నాలుగు పార్టీలకు ఒకే ఒక్కరు శత్రువుగా మారారు. ఆయనే ప్రధాని నరేంద్ర మోదీ! శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ, ఎమ్మెన్నెస్‌లు.. మోదీని, ఆయన పార్టీ బీజేపీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు సంధిస్తున్నాయి. ఖండనమండనల్లో ఒకదాన్నొకటి మించిపోయి కమలదళాన్ని చీల్చిచెండాడుతున్నాయి. వీటిలో ఒకదానిపై ఒకదాని విమర్శలకంటే అన్ని కలిసి మోదీపై చేస్తున్న దాడే తీవ్రంగా ఉంది. దీంతో అసెంబ్లీ ఎన్నికలు ‘గ్యాంగ్ ఆఫ్ ఫోర్’ పార్టీలకు, దేశ నాయకుడైన మోదీకి మధ్య జరుగుతున్నట్లు కనిపిస్తోంది. మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు రాష్ట్రానికి ‘వెలుపలి వ్యక్తుల’ని గ్యాంగ్ ఆఫ్ ఫోర్ పార్టీలు మండిపడుతున్నాయి. మహా రాష్ట్రను విభజించేందుకు, ముంబైని రాష్ట్రం నుంచి వేరుచేసేందుకు యత్నిస్తున్నారంటూ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాయి. మోదీ నాయకత్వంలోనే బీజేపీ తమకు వెన్నుపోటు పొడిచింద ని శివసేన విరుచుకుపడుతోంది. విమర్శల దాడిని తట్టుకోవడానికి బీజేపీ కేవలం మోదీపైనే ఆధారపడుతోంది. సీఎం పదవికి అందరికీ ఆమోదయోగ్యమైన నేత లేకపోవడంతో రాష్ట్ర కమలనాథుల పరిస్థితి దయనీయంగా మారింది. ఎన్నికల్లో మోదీనే తమను గట్టెక్కించే ఆపద్బాంధవుడని భావిస్తోంది. మహారాష్ట్రను విభజించే ప్రసక్తే లేదని బీజేపీ నేతలు కుండబద్ధలు కొడుతున్నా ‘గ్యాంగ్ ఆఫ్ ఫోర్’ ప్రచారం ముందు దాని మాట గట్టిగా వినిపించడం లేదు. ఎన్నికల్లో బాగా ముందుకొచ్చే కుల, ప్రాంతీయ రాజకీయాలు ‘మోదీ వర్సెస్ గ్యాంగ్ ఆఫ్ ఫోర్’ పోరుతో వెనక్కి మళ్లడం గమనార్హం. -
ప్రచార సామగ్రికి డిమాండ్
సాక్షి, ముంబై: ఎన్నికల ప్రచార సామగ్రి విక్రయించే షాపులన్నీ కొనుగోలుదార్లతో కిటకిటలాడుతున్నాయి. శివసేన-బీజేపీ నేతృత్వంలోని మహాకూటమి, కాంగ్రెస్-ఎన్సీపీ ప్రజాస్వామ్య కూటముల మధ్య పొత్తు ఉంటుందా..? ఊడుతుందా...? అనే దానిపై మొన్నటి వరకు ఇరు పార్టీల నాయకులు సందిగ్ధంలో పడిపోయారు. దీంతో ఎన్నికల సామగ్రి కొనుగోలు చేయలేకపోయారు. కాని ఇరు కూటముల మధ్య పొత్తు బెడిసి కొట్టడంతో రాష్ట్రంలోని మొత్తం 288 శాసనసభ నియోజకవర్గాల్లోనూ అన్ని పార్టీల అభ్యర్థులు పోటీచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకు అన్ని నియోజక వర్గాల్లోనూ ప్రచారం చేసేందుకు అవసరమైన ప్రచార సామగ్రి కూడా భారీ మొత్తంలో కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. షాపుల్లో ముఖ్యంగా పార్టీ గుర్తులతో ముద్రించిన క్యాపులు, బ్యాడ్జీలు, కండువాలు, మాస్క్‌లు, చిన్న, పెద్ద జెండాలు, చీరలు, టీ-షర్టులు, కుర్తాలు, తలకు చుట్టుకునే రిబ్బన్లు, బ్యానర్లు, ప్ల కార్డులు, కరపత్రాలు ఇలా మొత్తం 25 రకాలకు పైగా ప్రచార సామగ్రి విక్రయానికి ఉంచారు. నగరంలో లాల్బాగ్, దాదర్, క్రాఫర్డ్ మార్కెట్, నటరాజ్ మార్కెట్ తదితర ప్రాంతాలు ప్రచార సామగ్రి తయారీకి ప్రసిద్ధి చెందాయి. పొత్తు బెడిసికొట్టడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున డిమాండ్ పెరిగింది. దీంతో మార్కెట్లో, షాపుల్లో సామగ్రి కొరత ఏర్పడింది. కొందరు నాయకులు అర్డర్లు ఇచ్చి మరీ తయారు చేయించుకుంటున్నారు. ఎన్నికల పుణ్యమాని అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తోంది. కరపత్రాలు, ఇతర ప్రచార సామగ్రి ముద్రించే ప్రింటింగ్ ప్రెస్‌లకు, ఆఫ్సెట్ ప్రింటింగ్ పనులకు పెద్ద ఎత్తున అర్డర్లు దొరికాయి. అందులో ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులకు తోడు అదనంగా కార్మికులను నియమించాల్సి వస్తోంది. అయినప్పటికీ సమయానికి సామగ్రి అందజేయలేకపోతున్నారు. ఎన్నికలకు సమయం చాలా తక్కువ ఉండడంతో సాధ్యమైనంత త్వరగా ప్రచార సామగ్రి అందజేయాలని నాయకులు వారిపై ఒత్తిడి తెస్తున్నారు. అందుకు వారు అడిగినంత చెల్లించేందుకు సైతం సిద్ధపడుతున్నారు. ఒక్కసారిగా పెరిగిన డిమాండ్‌తో వ్యాపారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎన్నికల సమయంలో ప్రింటింగ్ ప్రెస్ రంగంలో రూ.70-80 కోట్ల మేర వ్యాపార లావాదేవీలు జరుగుతాయని ఓ వ్యాపారి తెలిపాడు. ఏదేమైనా ఈ ఎన్నికలు నిరుద్యోగులకు ఒక వరంగా పరిణమించాయని చెప్పవచ్చు. -
ఎన్నికల ప్రచారంలో హెలికాప్టర్లు
సాక్షి, ముంబై: శాసన సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో హెలికాప్టర్ల డిమాండ్ మరింత పెరిగిపోయింది. సాధ్యమైనన్ని ప్రచార సభలు నిర్వహించాలని నాయకుల ప్రణాళికలు రూపొందించుకున్నారు. అందుకు ప్రచార సభలకు హాజరయ్యేందుకు పెద్ద సంఖ్యలో హెలికాప్టర్లను వినియోగించనున్నారు. శివసేన-బీజేపీ, కాంగ్రెస్-ఎన్సీపీ ప్రధాన కూటముల మధ్య పొత్తు విషయం ఎటూ తేలకపోవడంతో సమయం వృథా అయింది. చివరకు పోత్తు విచ్ఛిన్నం కావడంతో అన్ని పార్టీలు ఒంటరిగా బరిలో దిగాల్సిన పరిస్థితి దాపురించింది. ఒక్కో రోజుకు జరిగే నాలుగైదు ప్రచారాల సభలో పాల్గొనేందుకు అన్ని పార్టీల కీలక నాయకులకు తగినంత సమయం దొరకడం లేదు. రోడ్డు, రైలు మార్గం కంటే నాయకులు హెలికాప్టర్లనే ఎంచుకుంటున్నారు. విమానాలు, హెలికాప్టర్లు అద్దెకు ఇచ్చే కంపెనీల దిశగా నాయకులు పరుగులు తీస్తున్నారు. నేడు అన్ని పార్టీల బహిరంగ సభలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన పార్టీల నాయకుల సోమవారం నుంచి బహిరంగ సభలు, పర్యటనలు ప్రారంభం కానున్నాయి. రోజు దాదాపు 40 హెలికాప్టర్లు, చార్టర్డ్ విమానాలు ఆకాశంలో గిరిగిర తిరగనున్నాయి. అందుకు లక్షల్లో అద్దె చెల్లించాల్సి ఉంటుంది. అయినప్పటికీ వెనకాడే ప్రసక్తే లేదంటున్నారు నాయకులు. కొన్ని పార్టీలు ముందుగానే వాటిని బుక్ చేసుకున్నాయి. ఎన్సీపీ తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్, మాజీ మంత్రులు అజీత్ పవార్, ఆర్.ఆర్.పాటిల్, సునీల్ తట్కరే, కాంగ్రెస్ తరుఫున మాజీ ముఖ్యమంత్రులు పృథ్వీరాజ్ చవాన్, అశోక్ చవాన్, మాజీ మంత్రులు నారాయణ్ రాణే, కాంగ్రెస్ ప్రదేశ్ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే, మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ మోహన్ ప్రకాశ్, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాందీ, శివసేనకు చెందిన ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, తనయుడు ఆదిత్య ఠాక్రే, బీజేపీ తరఫున జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ, ప్రదేశ్ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ ఖడ్సే లాంటి దిగ్గజాలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ప్రచార సభలకు హెలికాప్టర్లను వినియోగించ డానికి ఆయా పార్టీలు రూపొందించాయి. అందుకు సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్‌కు గంటకు రూ.80 వేల నుంచి రూ.1.50 లక్షలు, డబుల్ ఇంజిన్ ెహ లికాప్టర్‌కు గంటకు రూ.1.75 లక్షల నుంచి రూ.మూడు లక్షల వరకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఇవి గంటకు 225 కి.మీ. నుంచి 300 కి.మీ. వేగంతో దూసుకెళతాయి. రాజకీయ నాయకులకు ఒక్కో రోజులో కనీసం నాలుగు బహిరంగా సభల్లో పాల్గొనేందుకు వీలుకానుంది. -
మహారాష్ట్రలో విచ్చిన్నమైన పొత్తులు
-
ఏ సెగ్మెంట్లో ఎవరికెంత బలం..?
పింప్రి, న్యూస్‌లైన్ : అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైనప్పటికీ ఏ నియోజక వర్గం ఎవరికో తెలియని పరిస్థితి నెలకొంది. అధికార పీఠం కోసం సీట్ల పేచీ కొలిక్కిరాలేదు. పశ్చిమ మహారాష్ట్రలోని ఐదు జిల్లాల్లో గతంలో చేసుకొన్న పొత్తులు తారుమారు అయ్యే సూచనలున్నాయి. కొందరు నాయకుల సీట్ల కోసం పార్టీలను సైతం మారే పరిస్థితులున్నాయి. ఇప్పటికే కొన్ని పార్టీల నాయకులు జంప్ జిలానీలుగా అవతారమెత్తారు. శివసేన-బీజీపీకి సమాన బలం షోలాపూర్ జిల్లాలో మొత్తం 11 అసెంబ్లీ సెగ్మెంట్లలల్లో కాషాయ కూ ట మిలో భాగంగా శివసేన 8, బీజేపీ 3 పోటీ చేస్తూ వస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలలో శివసేన 8 స్థానాల్లో పోటీ చేయగా ఒక్కటీ గెలుచుకోలేకపోయింది. బీజేపీ రెండు స్థానాల్లో గెలిచి, ప్రస్తుతం అధిక సీట్లకు పోటీ చేయాలని భావిస్తోంది. ఈ జిల్లాలో పార్టీల బలాబలాలు సమానంగా ఉన్నాయని పలువురి అభిప్రాయం. చోటా మోటా నాయకులు శివసేనలోకి వెళ్లిపోవడంతో ఈ సారి కొంత బలం పుంజుకొంది. గ్రా మీణ ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థుల కోసం వెతుక్కోవలసిన పరిస్థితి దాపురించింది. జిల్లాలో జంప్ జిలానీల మూలంగా శివసేన బలపడుతోంది. సాంగ్లీలో సత్తా ఉన్న నాయకులే కరువు సాంగ్లీ జిల్లాలో మొత్తం 8 అసెంబ్లీ స్థానాలల్లో సొంతంగా పోటీ చేసి గెలిచే సత్తా అటు బీజేపీకి గానీ ఇటు శివసేనకు గానీ లేదు. కండబలం, ధన బలం ఉన్న అభ్యర్థులు లేరు. జిల్లాలో బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు ముగ్గురు ఉన్నారు. సాంగ్లీ నుంచి సంభాజీ పవార్, జత్ నుంచి ప్రకాష్ శేండగే, మిరజ్ నుంచి సురేష్ ఖాడే ఉన్నారు. శివసేనకు ఇక్కడ అంత బలం లేదు. శివసేనకు అభ్యర్థులను వెతుక్కోవలసిన పరిస్థితి ఉంది. పుంజుకొంటున్న బీజేపీ సతారా జిల్లాలోని 8 నియోజక వర్గాలల్లో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన నాయకులు బీజేపీలో చేరడంతో జిల్లాలో బీజేపీ బలం పుంజుకుంది. మాజీ ఎమ్మెల్యే దిలీప్ యేలాగావ్కర్, సదాశివ్ సత్కాల్, రవీంద్ర సరామణే ఇతరుల రాకతో బీజేపీ కదం తొక్కుతుండగా, శివసేనకు 5 నియోజక వర్గాలలో అభ్యర్థుల కరువు నెలకొంది. కూటమితో ఫలితం అహ్మద్‌నగర్ జిల్లాలో మొత్తం 12 నియోజక వర్గాలల్లో మహా కూటమి లో భాగంగా గతంలో 7 నియోజక వర్గాలు అకోలా, సంగంనేర్, కోపర్గావ్, శ్రీరాంపూర్, శివ్డీ, నగర్, పార్నెర్ శివసేన ఆధీనంలో ఉండగా, రాహూరీ, శ్రీ గోందా, కర్జత్-జాంఖేడ్, శేవ్‌గావ్, నేవాసా నియోజక వర్గాలు బీజేపీకి ఉన్నాయి. జిల్లాలో సమానంగా పార్టీల బలం ఉంది. కూటమి ద్వారా పోటీ చేస్తే అటు బీజేపీ, శివసేనకు ప్రయోజనం ఉంటుంది. బబన్‌రావు పాచ్‌పుతే బీజేపీ లోకి రావడం ఆ పార్టీకి కొంత కలసివచ్చే అవకాశం ఉంది. పుణేలో ఒంటరిగానైనా సరే పుణే జిల్లాలో గతంలో బీజేపీ కసబాపేట్, శివాజీనగర్, పర్వతి, పింప్రి, మావల్, శిరూర్, దౌండ్, ఖడక్వాస్లా మొత్తం 8 నియోజక వర్గాల నుంచి పోటీ చేయగా, శివసేన వడగావ్ శేరి, కోత్రోడ్, పుణే కంటోన్మెంట్, హడప్సర్, ఖేడ్, ఆంబేగావ్, జున్నర్, భోర్, పురంధర్, బారామతి, ఇందాపూర్, చించ్వడ్, బోసిరి మొత్తం 13 నియోజక వర్గాలలో పోటీ చేసింది. సీట్ల సర్దుబాటు కుదరక ఒంటరిగా పార్టీలు బరిలోకి దిగితే.. కొందరు నాయకులు బీజేపీ గూటికి చేరే అవకాశం ఉంది. దీని ద్వారా బీజేపీ బలం పెంచుకునే యోచనలో ఉంది. కొల్హాపూర్ శివసేనదే హవా కొల్లాపూర్ జిల్లాలో గతంలో 10 నియోజక వర్గాలలో 8 స్థానాలకు గాను శివసేన పోటీ చేయగా, రెండు స్థానాలకు బీజేపీ పోటీ చేసింది. ఇచ్ఛల్ కరంజి నుంచి ప్రస్తుతం బీజేపీ నాయకుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కొల్హాపూర్, కర్వీర్, కాగల్, చందఘడ్, రాధనగరి, శిరోల్, హత్ కణంగలే, షాహువాడి నుంచి శివసేన పోటీ చేయగా, కొల్హాపూర్, కర్వీర్, మత్ కణంగల్ మాత్రమే శివసేన గెలుపొందింది. ఈ ప్రాంతాలలో శివసేన పార్టీ ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ బలంగా ఉన్నారు. స్వభిమాన్ శేత్కారి సంఘటన... శివసేనకు చెందిన చందఘడ్, రాధనగరి, శిరోల్ స్థానాలకు ఎసరు పెట్టనుంది. -
తేలని ‘మహా’ సర్దుబాట్లు
కాంగ్రెస్-ఎన్సీపీ, శివసేన-బీజేపీ మధ్య కొలిక్కిరాని సీట్ల పంపకాలు ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ (అక్టోబర్ 15న పోలింగ్) అధికార కాంగ్రెస్-ఎన్సీపీ, ప్రతిపక్ష శివసేన-బీజేపీ కూటముల మధ్య సీట్ల సర్దుబాటు అంశం చిచ్చురేపుతోంది. రాష్ట్రంలోని మొత్తం 288 స్థానాలకుగానూ మెజారిటీ స్థానాల కోసం నాలుగు పార్టీలూ ఈసారి పట్టుబడుతుండటంతో అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ప్రక్రియ శనివారం ప్రారంభమైనప్పటికీ సీట్ల సర్దుబాటు చర్చల్లో తీవ్ర ప్రతిష్టంభన నెలకొంది. ఈ పరిణామం కూటమి పార్టీల ఆశావహ అభ్యర్థుల్లో గుబులు రేపుతోంది. అయితే ఒకవేళ చర్చలు ఫలించకపోతే ఒంటరి పోటీకి సిద్ధమనే సంకేతాలను నాలుగు పార్టీలూ ఇస్తుండటం గమనార్హం. కాంగ్రెస్‌కు ఎన్సీపీ 24 గంటల గడువు సీట్ల సర్దుబాటు అంశం కొలిక్కిరాకపోవడంపై అసహనంతో ఉన్న శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ ఈ అంశంపై తేల్చేందుకు కాంగ్రెస్‌కు శనివారం 24 గంటల గడువు ఇచ్చింది. కాంగ్రెస్ ఇస్తామన్న 124 సీట్ల ప్రతిపాదనను నిర్ద్వందంగా తిరస్కరించింది. తమకు 144 సీట్లు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది. ఎన్సీపీ ఉపాధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ శనివారం ముంబైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్‌కు ఈ విషయంలో మరో రోజు గడువు ఇస్తున్నట్లు చెప్పారు. నామినేషన్ల ప్రక్రియ దాఖలైనందున ఇంతకుమించి తాము వేచిచూడలేమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇస్తామంటున్న 124 సీట్లు మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కుదరదన్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో కాంగ్రెస్‌కన్నా తమ పార్టీయే ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకుందని...అందువల్ల సీట్ల సర్దుబాటుపై పాత లెక్కలు ప్రస్తుతం వర్తించబోవన్నారు. 2004లోనే తమ పార్టీ 124 సీట్లలో పోటీ చేసిందని ఆయన గుర్తుచేశారు. ఆదివారంలోగా కాంగ్రెస్ నేతలు స్పష్టత ఇవ్వకుంటే సోమవారం సీఎం పృథ్వీరాజ్ చవాన్‌ను కలిసి ఏదో విషయం తేల్చుకుంటానన్నారు. ఒకవేళ అవసరమైతే ఎన్సీపీ ఒంటరిగా పోటీ చేస్తుందా? అని విలేకరులు ప్రశ్నించగా ఆ అవకాశం అన్ని పార్టీలకూ ఉందన్నారు. మరోవైపు మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ మాణిక్‌రావు ఠాక్రే ఢిల్లీలో ఈ అంశంపై స్పందిస్తూ ఎన్సీపీ తమ ప్రతిపాదనకు ఒకటి, రెండు రోజుల్లో ఒప్పుకోకుంటే తాము అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధం కావాల్సి ఉంటుందని చెప్పారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 174 స్థానాల్లో పోటీ చేయగా ఎన్సీపీ 114 సీట్లలో పోటీ చేసింది. శివసేన-బీజేపీ పరిస్థితీ ఇంతే... కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి తరహాలోనే శివసేన-బీజేపీ కూటమి కూడా సీట్ల సర్దుబాటుపై శుక్ర, శనివారాల్లో రెండు విడతలుగా చర్చలు జరిపినా ప్రతిష్టంభనకు తెరపడలేదు. చెరో 135 సీట్లలో పోటీ చేసి మిగిలిన 18 సీట్లను కూటమిలోని చిన్న పార్టీలైన ఆర్పీఐ, స్వాభిమాని శేత్కరి సంఘటనలకు ఇద్దామంటూ బీజేపీ చేసిన ప్రతిపాదనను తోసిపుచ్చిన శివసేన తాము 155 సీట్లలో పోటీ చేస్తామని ప్రతిపాదించింది. అయితే మహారాష్ట్ర శాసన మండలిలో విపక్ష నేత, బీజేపీ నాయకుడు వినోద్ తావ్దే శనివారం మాట్లాడుతూ శివసేన ప్రతిపాదన తమకు ఆమోదయోగ్యం కాదన్నారు. శివసేన గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన 59 సీట్లతోపాటు తాము పోటీ చేసి ఓడిన 19 సీట్లను మార్చుకుంటే బాగుంటుందని తావ్దే సూచించారు. ఎన్నికల్లో కూటమి తరఫున 200 సీట్లు గెల్చుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే సీట్ల సర్దుబాటు విషయంలో మరో 24 గంటల్లో స్పష్టత వస్తుందని భావిస్తున్నట్లు తావ్దే పేర్కొన్నారు. మరోవైపు ఆదివారం జరిగే తమ పార్టీ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో పార్టీ చీఫ్ ఉద్ధవ్‌ఠాక్రే తుది నిర్ణయం తీసుకుంటారని శివసేన ప్రతినిధి, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. బీజేపీకి 125 సీట్లు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. గత ఎన్నికల్లో శివసేన 169 సీట్లలో, బీజేపీ 119 సీట్లలో పోటీ చేశాయి. హర్యానా ఎన్నికల బరిలో సుష్మా సోదరి: విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ చెల్లెలు వందన శర్మ హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. శనివారం 47 మంది అభ్యర్థుల పేర్లతో బీజేపీ విడుదల చేసిన తుది జాబితాలో ఆమె పేరూ ఉంది. బీజేపీ చీఫ్ అమిత్‌షా, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, సుష్మా తదితరులతో కూడిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ శనివారం ఢిల్లీలో సమావేశమై జాబితాకు ఆమోదం తెలిపింది. -
బలమెంతో తేలాలంటే ఒంటరిగా పోటీ చేయండి
ఛగన్ భుజ్‌బల్ సూచన ముంబై : ఇటు అధికార, అటు ప్రతిపక్ష కూటముల మధ్య సీట్ల పంపిణీపై ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో అన్నిరాజకీయ పార్టీలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి తమ సొంత బలమెంతో తేల్చుకోవాలని ఎన్సీపీ నాయకుడు, మంత్రి ఛగన్ భుజ్‌బల్ సూచించారు. అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి నెల రోజుల కన్నా తక్కువగా సమయం మిగిలి ఉన్నప్పటికీ ఇటు కాంగ్రెస్- ఎన్సీపీల మధ్య, అటు బీజేపీ- శివసేనల మధ్య సీట్ల పంపిణీపై ప్రతిష్టంభన నెలకొంది. ఈ ప్రతిష్టంభనకు ప్రధాన కారణం కూటమిలో జూనియర్ భాగస్వాములైన బీజేపీ, ఎన్సీపీలే. ఈ రెండు పార్టీలు క్రితంసారి పోటీ చేసిన సీట్లకన్నా ఈసారి అధికంగా కోరుతున్నాయి. ఈ నాలుగు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఎన్నికలముందు పొత్తు ఖరారు కావడం లేదు గనుక, అన్నీ ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగాలని భుజబల్ సూచించారు. రాష్ట్రంలో ఎవరికి వారే తమకు బలముందని చెప్పుకుంటున్నారని, ఒంటిరిగా పోటీ చేస్తే అది ఎంతుందో తేలిపోతుందని అన్నారు. కాషాయకూటమిలోలుకలుకలు కాంగ్రెస్-ఎన్సీపీపై ఎటువంటి ప్రభావం చూపబోవని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. రాష్ట్రంలో తమ పార్టీ కాంగ్రెస్‌కన్నా బలంగా ఉందని ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీ నాలుగు సీట్లు గెలుచుకుందని అన్నారు. భుజబల్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తేలికగా తీసుకుంది. తాము పొత్తును కొనసాగించాలనుకుంటున్నామని, శరద్‌పవార్‌తో చర్చలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌చవాన్ చెప్పారు. -
బీఎంసీ, టీఎంసీల్లో విజయకేతనం
సాక్షి, ముంబై: ముంబై, ఠాణే మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన మేయర్ ఎన్నికలు మహాకూటమికి మరింత ఉత్సాహాన్నిచ్చాయి. ఈ ఎన్నికల ఫలితాలతో ఈ కూటమిలోని ప్రధాన భాగస్వామ్య పక్షాలైన శివసేన, బీజేపీ కార్యకర్తల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. వచ్చే నెలలో శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే ఈ ఎన్నికలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 288 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా ముంబై, ఠాణే జిల్లాల్లో 60 సెగ్మెంట్లున్నాయి. దీంతో మేయర్ ఎన్నికల ఫలితాల ప్రభావం తమకు లాభం చేకూరుస్తుందనే ధీమాతో ఈ రెండు పార్టీలు ఉన్నాయి. మరోవైపు నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్ఎంసీ) మేయర్ పదవికి శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెన్నెస్‌కు చెందిన ఇద్దరు కార్పొరేటర్లు చేరడం శివసేనకు కలిసొచ్చే అవకాశముంది. ఠాణే కొత్త మేయర్ సంజయ్ మోరే ఠాణే మున్సిపల్ కార్పొరేషన్ (టీఎంసీ)లో శివసేన మరోసారి జయకేతనం ఎగురవేసింది. ఈ కార్పొరేషన్ జరిగిన ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా మహాకూటమి తరఫున బరిలోకి దిగిన శివసేనకు చెందిన సంజయ్ మోరే ఠాణే విజయం సాధించారు. రెండున్నరేళ్ల క్రితం ఈ ఎన్నికలు హోరాహోరీగా జరగ్గా, ఈసారి మాత్రం లాంఛనంగానే ముగిశాయి. ఊహించినవిధంగానే సంజయ్ మోరే మేయర్‌గా, డిప్యూటీ మేయర్‌గా రాజేంద్ర సాప్తేలు విజయం సాధించారు. ఈ పదవికోసం ప్రజాసామ్య కూటమి నుంచి కాంగ్రెస్ కార్పొరేటర్ మేయర్ అభ్యర్థిగా విక్రాంత్ చవాన్, డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా మేఘనా హండోరేలు బరిలోకి దిగారు. సంజయ్ మోరేకి 66 ఓట్లు రాగా విక్రాంత్ చవాన్‌కు కేవలం 46 ఓట్లు దక్కాయి. 20 ఓట్ల తేడాతో మహాకూటమి అభ్యర్థి విజయం సాధించారు. మరోవైపు మహారాష్ట్ర నవనిర్మాణసేన (ఎమ్మెన్నెస్)కు చెందిన కార్పొరేటర్లు తటస్థంగా ఉండిపోగా, కాంగ్రెస్‌కు చెందిన నలుగురు కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు. దీంతో శివసేన అభ్యర్థులు అలవోకగా విజయం సాధించారు. రెండున్నరేళ్ల క్రితం బలాబలాలు సమానంగా ఉన్న కారణంగా ఈ ఎన్నికలు ఉత్కంఠభరితంగా జరిగాయి. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్పొరేటర్ రవీంద్ర ఫాటక్తోపాటు ఆయన సతీమణి జయశ్రీ ఫాటక్ శివసేనలో చేరారు. శివసేన-బీజేపీల సంఖ్యాబలం (65) అలాగే ఉన్నప్పటికీ వీరి రాజీనామా కారణంగా కాంగ్రెస్-ఎన్సీపీల సంఖ్యాబలం 63కు తగ్గిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకుగాను కార్పొరేటర్లందరినీ ఎన్నికల సమయం వరకు అజ్ఞాతంలోనే ఉంచారు. -
కాషాయ కూటమికి ఢోకా లేదు
సామ్నాలో ఉద్ధవ్ ఠాక్రే సాక్షి , ముంబై: హిందూత్వ నేపథ్యంలో శివసేన-బీజేపీ కూటమికి చీలిక భయంలేదని, అది కొనసాగుతుందని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. పార్టీ అధికార పత్రిక ‘సామ్నా’లో సోమవారం ప్రచురితమైన సంపాదకీయంలో తనదైన శైలిలో ప్రత్యర్థులపై మండిపడుతూనే మరోవైపు బీజేపీతో పొత్తుపై ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టంచేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత శివసేన, బీజేపీల మధ్య ఆధిపత్యంపై మాటల పోరు కొనసాగుతోంది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు వికటి స్తుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇలాంటి నేపథ్యంలో శివసేన సామ్నా పత్రిక సంపాదకీయం ద్వారా శివసేన బీజేపీతో పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేయడంతో అనేక మందిలో నెలకొన్న అయోమయానికి తెరపడింది. బీహార్‌లో హిందూవాదం సిద్ధాంతాల ముడి లేకపోవడంతో అక్కడ పొత్తు వికటించింది కాని మహారాష్ట్రలో ఇద్దరి మధ్య హిందూత్వవాదంపై ఉన్న ముడి చాలా గట్టిదని ఇది విడిపోయే ప్రసక్తేలేదని ఉద్ధవ్ పేర్కొన్నారు. శివసేనతోపాటు బీజేపీకి కూడా ఈ విషయం తెలుసన్నారు. అయితే హిందూవాదులకు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేసేవారికి ప్రజలు బుద్ధి చెబుతారని ఉద్ధవ్ ఠాక్రే ఈ సందర్భంగా బీజేపీని హెచ్చరించారు.