shiva prasad reddy
-
ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌ను బెదిరించిందెవరు?
ప్రొద్దుటూరు : జిల్లాలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్ ఫోన్‌కాల్స్ బెదిరింపు వ్యవహారంపై జోరుగా చర్చ జరుగుతోంది. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఎమ్మెల్సీని బెదిరించాల్సిన అవసరం ఎవరికి ఉంది.. ఎవరు బెదిరించారనే విషయంపై రెండు రోజుల క్రితం ప్రొద్దుటూరు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, ఎమ్మెల్సీ ఆర్.రమేష్‌యాదవ్‌ల మధ్య విభేదాలు సృష్టించడానికే ఇలా చేసి ఉండొచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయి. మున్సిపల్ ఇన్చార్జి మాజీ చైర్పర్సన్ ఆర్.వెంకటసుబ్బయ్య కుమారుడైన రమేష్ యాదవ్ హైదరాబాద్‌లో అబాకస్ కన్సల్టెన్సీ నిర్వహిస్తుండేవారు. మూడేళ్ల క్రితం ఆయన ప్రొద్దుటూరుకు వచ్చి ఆర్వీఎస్ సోషల్ సపోర్టు ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వీటిని గుర్తించిన ఎమ్మెల్యే రాచమల్లు ప్రోత్సహించారు. అలాగే మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా నిలిపేందుకు ఎమ్మెల్యే అన్ని ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధిష్టానం ఆదేశాలతో సామాజిక సమీకరణాల్లో భాగంగా చివరి సమయంలో చేనేత వర్గానికి చెందిన భీమునిపల్లి లక్ష్మీదేవిని చైర్‌పర్సన్‌గా ఎంపిక చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో అధిష్టానం ఆదేశాలను ఎమ్మెల్యే శిరసావహించాల్సి వచ్చింది. రమేష్ యాదవ్ చైర్మన్‌గా ఎన్నికయ్యేందుకు ఒకింత డబ్బు ఖర్చు చేయగా ఎమ్మెల్యే రెండింతలు ఖర్చు చేయాల్సి వచ్చింది. పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన ఎమ్మెల్యే పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు. రమేష్ యాదవ్ చేత డబ్బు ఖర్చు పెట్టించారని ప్రతిపక్షాలు విమర్శించగా తన డబ్బును తిరిగి ఇస్తానని మీడియా ద్వారా స్వయంగా ఎమ్మెల్యే వివరించారు. ఎమ్మెల్సీ పదవి ఇప్పించేందుకు ఎమ్మెల్యే కృషి: మున్సిపల్ చైర్మన్‌గా అవకాశం కోల్పోయిన రమేష్‌యాదవ్‌కు ప్రభుత్వంలో ప్రాతినిథ్యం కల్పించాలని ఎమ్మెల్యే ఆలోచించారు. అదే సమయంలో ఎమ్మెల్సీ స్థానాన్ని బీసీ యాదవ సామాజిక వర్గానికి కేటాయించాలని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నిర్ణయించింది. ఈ విషయంపై అవగాహన ఉన్న ఎమ్మెల్యే రాచమల్లు రమేష్ యాదవ్ సమస్యను సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై మూడు మార్లు సీఎంతో ఎమ్మెల్యే భేటీ అయినట్లు తెలిసింది. ఏది ఏమైనా మూడు నెలల క్రితం కౌన్సిలర్ అయిన రమేష్ యాదవ్‌కు ఎమ్మెల్సీ పదవి ఇప్పించడంలో ఎమ్మెల్యే సఫలీకృతులయ్యారు. ప్రొద్దుటూరు మున్సిపల్ చరిత్రలో కౌన్సిలర్లు ఎవ్వరూ ఎమ్మెల్సీగా ఎన్నిక కాలేదు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయిన రమేష్ యాదవ్ గత నెల 21న ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత నాలుగు రోజులకే ఇంటర్నెట్ కాల్స్ ద్వారా ఆయనకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. జూన్ 26వ తేదీన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేయడానికి రమేష్ యాదవ్ మున్సిపల్ కార్యాలయానికి రాగా అక్కడే ఉన్న వైఎస్సార్సీపీ నాయకుడు పాతకోట బంగారు మునిరెడ్డితో చర్చించారు. వెంటనే బంగారు మునిరెడ్డి ఎమ్మెల్సీని డీఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లి ఫోన్‌కాల్స్ బెదిరింపుపై ఆరా తీయాలని కోరినట్లు తెలిసింది. ఫోన్ కాల్స్‌లో నందం సుబ్బయ్య పేరును ప్రస్తావించడం వెనుక దురుద్దేశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య దూరం పెంచడానికి ఉద్దేశపూర్వకంగా ఫోన్ కాల్స్ చేశారా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. గత సోమవారం ఎమ్మెల్యే శ్రీరాములపేటలో వైఎస్సార్ హెల్త్ క్లినిక్ నిర్మాణానికి భూమి పూజ చేసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీతో ఫోన్‌కాల్స్ బెదిరింపు విషయంపై మాట్లాడారు. ఎమ్మెల్సీ పదవి ఇప్పించడానికి చేసిన ప్రయత్నాలను అందరికి ఎమ్మెల్యే కుండబద్దలు కొట్టినట్లు వెల్లడించారు. కొంత మంది ప్రతిపక్ష నాయకులు ఇదే అదునుగా భావించి ఎమ్మెల్సీని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో ఓ ప్రతిపక్ష నాయకుడు కూడా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. -
నిర్మాత శివప్రసాద్ రెడ్డి కన్నుమూత
కామాక్షి మూవీస్ అధినేత, ప్రముఖ నిర్మాత డి. శివ ప్రసాద్ రెడ్డి శనివారం (అక్టోబర్ 27) ఉదయం 6.30 నిమిషాలకు చెన్నై అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. కొంత కాలంగా హృదయ సమస్యలతో బాధపడుతున్న శివప్రసాద్‌కి ఇటీవల అపోలో హాస్పిటల్లో ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. నెల్లూరు జిల్లాలోని ఉత్తరమూపులో 1956లో డీవీ శేషారెడ్డి, సుదర్శనమ్మ దంపతులకు శివప్రసాద్‌రెడ్డి జన్మించారు. నెల్లూరులో హై స్కూల్ చదువును పూర్తి చేసిన ఆయన విజయవాడలోని ఆంధ్రా లయోలా కళాశాలలో బీఏ పట్టభద్రులయ్యారు. చదువు పూర్తయిన తర్వాత సినిమాలకు ఫైనాన్స్ చేయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. 1985లో కామాక్షి మూవీస్ బ్యానర్ స్థాపించి శోభన్ బాబుతో ‘కార్తీక దీపం, శ్రావణ సంధ్య’, చిరంజీవితో ‘ముఠామేస్త్రీ’ సినిమాలు నిర్మించారు. ఆయన బ్యానర్లో ఎక్కువ శాతం నాగార్జునతోనే సినిమాలు చేశారు. వీళ్ల కాంబినేషన్లో 11 సినిమాలు వచ్చాయి. అందులో ‘అల్లరి అల్లుడు, సీతారామరాజు, నేనున్నాను, కింగ్, రగడ, గ్రీకువీరుడు’ తదితర చిత్రాలున్నాయి. 1987లో ‘విక్కీ దాదా’తో నాగార్జునకు, శివ ప్రసాద్‌కు స్నేహం మొదలైంది. అలా వీళ్ల అనుబంధం కొనసాగుతూనే ఉంది. నాగార్జున కుమారుడు నాగచైతన్యతో ‘దడ’ చిత్రాన్ని శివప్రసాద్ రెడ్డి నిర్మించారు. నిర్మాతగానే కాకుండా కొన్ని సినిమాలను డిస్ట్రిబ్యూట్ కూడా చేశారు. నిర్మాతగా ‘గ్రీకువీరుడు’ ఆయన చివరి చిత్రం. సున్నితమైన ఎంటర్టైన్మెంట్, తెలుగు నేటివిటీకు తన సినిమాల్లో పెద్ద పీట వేశారు. శివప్రసాద్ రెడ్డికి ఇద్దరు కుమారులు. ఆయన కుటుంబానికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ‘‘నా ఆప్త మిత్రుడిని కోల్పోయాను. శివప్రసాద్ రెడ్డి నా కుటుంబానికి చాలా దగ్గరివాడు. నా 33 ఏళ్ల సినీ కెరీర్లో ప్రముఖుడు. ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను’’ అని నాగార్జున ట్వీట్ చేశారు. ‘‘శివప్రసాద్‌రెడ్డి నాతో ‘ముఠా మేస్త్రి చిత్రం చేశారు. ఆయన సాత్వికుడు. నాకు మంచి మిత్రుడు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని చిరంజీవి సంతాపం వ్యక్తపరిచారు. నేడు శివప్రసాద్‌రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. -
దర్శి కొత్తపాలెంలో వైఎస్ఆర్ కుటుంబం
-
బాబు వాగ్దానాలపై నమ్మకం పోయింది
దర్శి, న్యూస్‌లైన్: ఎన్నికలు వచ్చేసరికి బూటకపు వాగ్దానాలు చేసే చంద్రబాబు మాటలపై నమ్మకం పోయిందని, జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాలపై నమ్మకంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరామని శివరాజ్‌నగర్, లక్ష్మీనగ ర్కు చెందిన దర్శి నియోజకవర్గ ముస్లిం డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మాజీ కన్వీనర్ షేక్ మస్తాన్‌వలి, బండారు పండు, బాల వెంకటయ్య అన్నారు. దర్శి(కురిచేడు రోడ్డు)-5 ఎంపీటీసీ పరిధిలోని శివరాజ్‌నగర్, కొత్తపల్లి ఎంపీటీసీ పరిధిలోని లక్ష్మీపురానికి చెందిన ఆరేకటిక, రజకులు, వడిరాజులు, రెడ్డి కులాలకు చెందిన 500 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో రోజురోజుకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ పెరుగుతోందన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల వలన రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో చెప్పుకోవడానికి కూడా అభివృద్ధి లేక వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టి అమలు చేసిన పథకాలను కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజన్న రాజ్యం రావాలంటే జగన్మోహన్రెడ్డి సీఎం కావాలని అన్నారు. కార్యకర్తలందరూ సమష్టిగా పనిచేసి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో బత్తుల శోభన్‌బాబు, బత్తుల వెంకటేశ్వర్లు, పిచ్చయ్య, కిశోర్, జనార్ధన్, చిన్న నారాయణ, వినోద్, శామ్యేల్, బ్రహ్మం, రామకృష్ణ, రఘురామ్, వెంకటరావు, ఏడుకొండలు, చెన్నయ్య, కోటేశ్వరరావు, వెంకటేశ్వర్లు, బాలస్వామి, రంగా, కొండ, శ్రీను ముత్తులూరి వెంకటేశ్వర్లు, బండారు బాలాంజనేయులు, వీరాంజనేయులు, రామాంజనేయులు, చిన్న ఆంజనేయులు, హనుమంతు, వెంకట య్య, శ్రీను, గోవిందు, సురేష్, వెంకటేశ్వర్లు, చౌడయ్య, రామయ్య, సీహెచ్ రమణారెడ్డి, మాదిరెడ్డి గోవిందరెడ్డి, శ్రీనివాసరెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, తిరుపతిరెడ్డి, కృష్ణారెడ్డి, శివారెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, బ్రహ్మారెడ్డి, వీరారెడ్డి తదితరులున్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి, సాగర్ కుడికాలువ వైస్‌చైర్మన్ సద్దిపుల్లారెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు కుమ్మిత అంజిరెడ్డి, ఎంపీపీ అభ్యర్థి సోము దుర్గారెడ్డి, యూత్ కన్వీనర్ వీసీ రెడ్డి, లింగారెడ్డి, పేరెడ్డి, చిన్న అబ్బాయి, నాగిరెడ్డి పాల్గొన్నారు.