shivaprasad
-
ఇందుకే బీసీలు వైఎస్ జగన్ వెంట ఉంటారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ సాధారణ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు బీసీలపై ఎక్కడలేని ప్రేమ ఒలక బోస్తున్నాయి. 2019 ఎన్ని కల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలు పొందడంలో బీసీలు ప్రముఖ పాత్ర పోషించారు. అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీల ఆత్మగౌరవం ప్రతిబింబించే విధంగా వారికి వందలాది నామినేటెడ్ పదవులు ఇచ్చారు. వారి సంక్షేమానికి అత్యధికంగా నిధులు ఇచ్చారు. దీంతో బీసీలు శాశ్వతంగా జగన్ వెంట నడవడానికి సిద్ధమయ్యారని విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్ర జనాభాలో 52 శాతం ఉన్న బీసీలను వైసీపీ నుంచి వేరు చేసి వారి మద్దతు పొందేందుకు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన లాంటి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఎన్టీఆర్ కాలంలో టీడీపీ ప్రభుత్వం బీసీలకు చేసిన మంచిని చంద్రబాబు క్లెయిమ్ చేసుకోవడం విడ్డూరం. 2014లో బీసీ డిక్లరేషన్ విడుదల చేసి అధికారం లోకి వచ్చిన తర్వాత టీడీపీ ఆ డిక్లరేషన్‌లోని అంశాలను పట్టించుకోలేదు. అందుకే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి బీసీలు మద్దతు పలికారు. మరి ఇప్పుడు టీడీపీకి వారు ఓట్లెలా వేస్తారు? బీజేపీ కూడా ఇటీవల ఏపీలో బీసీలతో సామాజిక చైతన్య సభ నిర్వహించి బీసీలకు పలు హామీలు ఇచ్చింది. చట్టసభలలో తమకు రిజర్వేషన్లు కావాలనీ, దేశవ్యాప్తంగా బీసీల జనాభా లెక్కించాలనీ అనేక దశాబ్దాలుగా బీసీలు అనేక ఉద్యమాలు చేస్తున్నారు. స్వయంగా బీసీ అయిన ప్రధాన మంత్రి ఈ డిమాండ్లను పట్టించు కోవడం లేదు. ఏ ముఖంతో రాష్ట్ర బీజేపీ నాయకులు బీసీలను ఓట్లడుగుతారు? తనకు కులం అంటగట్ట వద్దని అంటూనే కాపుల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు జనసేనాని పవన్ కల్యాణ్. కాపులను బీసీలలో చేర్చే అంశంపై బీసీలు, కాపుల మధ్య చాలాకాలంగా వివాదం నడుస్తోంది. ఈ పరిణామాలతో బీసీలు పవన్ కల్యాణ్‌కు మద్దతు తెలిపే అవకాశమే లేదు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే 83 వేల కోట్ల రూపాయలు నేరుగా బీసీల ఖాతాలలో వేయడం విశేషం. రాష్ట్రంలో ఉన్న 17 మంత్రి పదవులలో 11 మంత్రి పదవులు బీసీలకు కేటాయించారు. అదే విధంగా 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి 56 చైర్మన్లను కేబినెట్ హోదాతో నియమించడం, ఆ 56 కార్పొరేషన్లలో 732 మంది బీసీలను డైరెక్టర్లుగా నియమించడం తెలిసిందే. జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్ల పదవుల్లో 50 శాతం పైగా బీసీలకు కేటాయించడమూ నిజమే కదా. బీసీ ఉద్యమ నాయకులు ఆర్. కృష్ణయ్యను రాజ్యసభకు పంపి బీసీల గొంతును పార్లమెంట్లో బలంగా వినిపించే అవకాశాన్ని సృస్టించారు. ఇంత చేసిన జగన్ వెంట బీసీలు ఉంటారని వేరే చెప్పనవసరం లేదు. (క్లిక్ చేయండి: ప్రజల హృదయాలను గెలుచుకున్న జగన్ అజేయుడే!) - కైలసాని శివప్రసాద్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
మాజీ ఎంపీ శివప్రసాద్‌కు అంతిమ వీడ్కోలు
తిరుపతి రూరల్/తిరుపతి అర్బన్: చిత్తూరు మాజీ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ శివప్రసాద్ అంత్యక్రియలు ఆదివారం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం అగరాలలో పూర్తి చేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న శివప్రసాద్ చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందిన విషయం విదితమే. పార్టీలకతీతంగా నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మంత్రులు గల్లా అరుణకుమారి, అమరనాథ్‌రెడ్డి, లోకేష్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, అమరరాజ ఇండస్ట్రీస్ చైర్మన్ గల్లా రామచంద్రనాయుడు, మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ తదితరులు నివాళులు అర్పించి శివప్రసాద్ కుటుంబాన్ని ఓదార్చారు. సాయంత్రం 4.01 గంటల సమయంలో తిరుపతి నుంచి ఊరేగింపుగా చంద్రగిరి మండలం అగరాల సమీపంలోని శివప్రసాద్ సొంత స్థలంలో ఖననం చేశారు. పెద్దల్లుడు వేణుగోపాల్ చేతుల మీదుగా అంత్యక్రియలు పూర్తి చేశారు. బాల్య మిత్రుడిని కోల్పోయా..: చంద్రబాబు బాల్య మిత్రుడు శివప్రసాద్‌ను కోల్పోవడం ఎంతో బాధాకరంగా ఉందని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. తిరుపతి నగరంలోని ఎన్జీవో కాలనీలోని శివప్రసాద్ నివాసానికి చేరుకుని నివాళి అర్పించారు. ఆయనతో చిన్ననాటి స్నేహం నుంచి నాటి రాజకీయాలతో ముడిపడి ఉన్న బంధాన్ని గుర్తుచేసుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. బాల్యంలో తాము ఇద్దరం తిరుపతిలో కలసి చదువుకున్నామని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత వైద్యవృత్తిలో ఉన్న ఆయన్ని తానే రాజకీయాల్లోకి ఆహ్వానించినట్లు చెప్పారు. కాగా చదువుకునే రోజుల నుంచి ఆయనకు నటనపై ఎంతో మక్కువ ఉండేదన్నారు. దాంతోనే బాల్యం నుంచి చక్కటి నాటకాలను ప్రదర్శించేవారని చెప్పారు. పాడెను మోసిన ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ చెవిరెడ్డి శివప్రసాద్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కన్నీరుపెట్టుకున్నారు. వైఎస్ రాజారెడ్డి అనుచరుడిగా, వైఎస్ రాజశేఖరరెడ్డి› ఆత్మీయుడిగా ఉన్న శివప్రసాద్‌తో తనకు 30 ఏళ్ల అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. పాడెను మోసి తన అభిమానాన్ని చాటుకున్నారు. త్వరలోనే శివప్రసాద్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. -
టీడీపీ ఎంపీ శివప్రసాద్‌పై హిజ్రాల ఆగ్రహం
-
సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం
బెజ్జూర్(సిర్పూర్) : మండలంలోని మర్తడిలో గురువారం రాత్రి స్రవంతికి చెందిన ఇల్లు ప్రమాదవశాత్తు సిలిండర్ పేలి దగ్దమైంది. ప్రమాదంలో ఇంట్లోని ఆహార ధాన్యాలు, బట్టలు అన్ని పూర్తిగా కాలిపోయాయి. విషయం తెలుసుకున్న బెజ్జూర్ ఎస్సై శివప్రసాద్, తహసీల్దార్ రఘునాధ్‌లు సంఘటన స్థలానికి వెళ్ళి పరిశీలించారు. సర్పంచ్ ఉమ్మెర పోచక్కలింగయ్య, ఎంపీటీసీ బూస సుశీలసారయ్య, కోఆప్షన్ సభ్యులు బసరాత్ ఖాన్, వార్డు మెంబర్ శంకర్ బాధితురాలిని పరామర్శించారు. బాధిత మహిíßళకు మండల కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి నహీర్ అలీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాచకొండ శ్రీవర్దన్, మండల శాఖ అధ్యక్షుడు దేవనపల్లి సత్యనారాయణ, నాయకులు పూల్లూరి సతీష్, జిల్లాల సుధాకర్‌గౌడ్, శంకర్, పెంటయ్య, బాపు, తిరుపతి, ఎంపీటీసీ తాళ్ళ ఇందిరా రామయ్య, నియోజక వర్గ నాయకులు రావి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 25కిలోల బియ్యం, బట్టలతో పాటు వెయ్యి రూపాయల నగదు అందజేశారు. -
'అవినీతి' రఘు రిటెర్మైంట్ ఫంక్షన్ విదేశాల్లో..!
సాక్షి, విజయవాడ: ఆదాయానికి మించి ఆస్తులు కలిగిఉన్న కేసులో గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏసీబీకి చిక్కిన టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ జి.వి.రఘును అరెస్టు చేసి విశాఖపట్నం తరలించారు. షిర్డీలో రఘు అక్క పేరిట ఉన్న హోటల్ డాక్యుమెంట్లను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈయన కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఈ నెలాఖరుకు రిటైర్ కానున్న రఘు విదేశాలలో గుట్టుగా హైక్లాస్‌లో రిటైర్మెంట్ ఫంక్షన్ చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఇందుకోసం సింగపూర్, మలేషియా, హాంకాంగ్‌లకు వెళ్లేందుకు కుటుంబ సభ్యులు, సన్నిహితులకు ఇప్పటికే విమాన టికెట్లు కూడా బుక్ చేశారు. విశాఖపట్నం కోర్టులో మంగళవారం హాజరుపరచనున్నారు. శివప్రసాద్ ఇంట్లో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు విజయవాడ: అక్రమంగా డబ్బు సంపాదించి దొరికిపోయిన శివప్రసాద్ నివాసంలో ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం కూడా సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ టెక్నికల్‌గా పనిచేస్తున్న శివప్రసాద్ ఇంట్లో సోమవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అనంతరం శివప్రసాద్ అక్రమంగా కోట్లు తరలించినట్టుగా సోదాల్లో గుర్తించారు. పలు డాక్యుమెంట్లు, నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు శివప్రసాద్‌ను గన్నవరం నివాసం నుంచి అరెస్ట్ చేసి ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించిన అధికారులు నేడు కోర్టులో హాజరుపర్చనున్నారు. ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ రూ. 100 కోట్లు అని అధికారులు అంచనా వేస్తున్నారు. నగలకు సంబంధించి శివప్రసాద్ సతీమణి గాయత్రిని కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. రఘు బినామీలు, వారి ఆస్తుల వివరాలపై తమకు ఇంకా సమాచారం అందుతోందని, వాటిపై కూడా దాడులు చేయనున్నట్లు తెలుస్తోంది. -
500 కోట్ల ‘అనకొండ’
-
500 కోట్ల ‘అనకొండ’
సాక్షి నెట్వర్క్: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే సమాచారంతో ఏసీబీ అధికారులు సోమవారం ఏపీ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గొల్ల వెంకట రఘు, ఆయన బినామీ విజయవాడ టౌన్ ప్లానింగ్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ నల్లూరి శివప్రసాద్ నివాసాలపై ఏకకాలంలో దాడులు చేశారు. షిర్డీ సహా రాష్ట్రంలోని 23 ప్రాంతాల్లో ఉంటున్న వారి బంధువులు, బినామీల నివాసాల్లోనూ సోదాలు జరిపారు. ఈ సందర్భంగా బయటపడిన ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కానీ వాటి మార్కెట్ విలువ రూ.500 కోట్లకు పైమాటే ఉంటుందని అంచనా వేస్తున్నారు. రఘు ఆస్తులివే.. మంగళగిరిలోని రఘు నివాసంతో పాటు స్వగ్రామమైన చిత్తూరు జిల్లా మహాసముద్రం, షిర్డీ, విజయవాడ, తిరుపతి, చిత్తూరు, విశాఖ జిల్లాల్లోని రఘు బంధువులు, బినామీల నివాసాల్లో ఏసీబీ సిబ్బంది సోదాలు జరిపారు. రఘు నివాసంలో జరిపిన సోదాల్లో.. కృష్ణా జిల్లా గన్నవరం వద్ద 300 ఎకరాల్లో వెంచర్, బొమ్ములూరులో 1,033 చదరపు గజాల ఇంటి స్థలం, తాడేపల్లిలో నివాస స్థలాలు, మంగళగిరి కొండపనేని లేఅవుట్లో 220 చదరపు గజాల స్థలం, చిత్తూరు జిల్లా పులివెల్లంలో 2 ప్లాట్లు, విశాఖలో రూ.80 లక్షల విలువైన ఫ్లాట్, షిర్డీలోని హోటల్, డూప్లెక్స్ హౌస్‌కు సంబంధించిన డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. అలాగే రూ.12 లక్షల విలువైన బంగారం, రూ.5 లక్షల విలువైన గృహోపకరణాలు, రూ.10 లక్షల నగదును ఏసీబీ స్వాధీనం చేసుకుంది. మంగళగిరిలోని రఘు నివాసానికి సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో ఆయనకు చెందిన రెండు కార్లను అధికారులు గుర్తించారు. చిత్తూరు జిల్లా రాంపల్లెలోని రఘు అత్త కళావతమ్మ ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. ఆమె పేరు మీదున్న పలు ఆస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ ఆశీల్మెట్టలోని ప్రైవేటు సర్వేయర్ గోవింద్‌రాజు ఇంట్లో తనిఖీలు చేసి.. రూ.2.5 లక్షల నగదు, పలు రికార్డులు స్వాధీనపరుచుకున్నారు. కిర్లంపూడిలోని రఘు స్నేహితుడు కాంట్రాక్టర్ భాస్కరరెడ్డి ఇంట్లో సోదాలు చేసిన ఏసీబీ సిబ్బంది.. పలు రికార్డులు తీసుకెళ్లారు. కాగా, సోమవారం సాయంత్రం కూడా సోదాల నిమిత్తం మరో బృందం రావడంతో.. వారిపై రఘు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంట్లోకి రావొద్దంటూ కేకలు వేయడంతో పాటు అరెస్ట్ చేస్తే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించారు. బినామీ ఇంట్లో భారీగా బంగారం.. రఘు బినామీ అయిన శివప్రసాద్(గుణదల) నివాసంలో ఏసీబీ జరిపిన దాడుల్లో కోట్లాది రూపాయల విలువైన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు లభించాయి. శివప్రసాద్‌కు భారతీనగర్‌లో 16 ఫ్లాట్లు, గన్నవరం సమీపంలోని చినఅవుట్‌పల్లి 1.40 ఎకరాల్లో సాయి మిథిల కన్వెన్షన్ హాల్ ఉంది. ఆయన భార్య గాయత్రి పేరుతో భారతీనగర్, గుణదలలో రెండు భవనాలున్నాయి. పలు ప్రాంతాల్లో 11.65 ఎకరాల పొలముంది. అంతేకాకుండా ఆమె పేరు మీద సాయి సదన్ ఇన్ఫ్రా ప్రైవేటు లిమిటెడ్, సాయి సుధా అవెన్యూ ప్రైవేటు లిమిటెడ్, సబురి బిల్డర్స్ ప్రైవేటు లిమిటెడ్, శ్రీ మాతా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనే కంపెనీలున్నాయి. వీరి కుమార్తె పేరుతో భారతీనగర్‌లోనే రూ.80 లక్షల విలువైన స్థలంలో ఓ భవనం, హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఓ ప్లాట్ ఉంది. శివప్రసాద్ కుటుంబసభ్యులు, బంధువుల పేరు మీద విజయవాడలోని గుణదల, భారతీనగర్, కృష్ణా జిల్లాలోని పోతేపల్లి, బొమ్ములూరు, గుంటూరు జిల్లా కటికలపూడి, సుకృతికోటపాడు ప్రాంతాల్లో 18కి పైగా ఖరీదైన ఇళ్ల స్థలాలున్నట్టు ఏసీబీ సిబ్బంది గుర్తించారు. అలాగే 8 కిలోల బంగారు, వజ్రాభరణాలు, 23 కిలోల వెండి వస్తువులను అధికారులు శివప్రసాద్ నివాసం నుంచి స్వాధీనం చేసుకున్నారు. వీటిలో బంగారంతో చేసిన ఆరు రకాల వడ్డాణాలు, జడలు, నాలుగు అరవంకలు, 25కు పైగా గాజులు, పావు కిలో బరువైన ప్లేట్లు, గ్లాసులు, వెండితో తయారు చేసిన పూజ సామగ్రి తదితర ఆభరణాలున్నాయి. అలాగే రూ.44 లక్షల నగదు కట్టలను స్వాధీనం చేసుకున్నారు. బినామీలు ఇంకెంతమందో! ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్న రఘుపై ఏసీబీ దాడులు నిర్వహించడం చర్చనీయాంశమైంది. మరోవైపు శివప్రసాద్‌ను రఘుకు బినామీ అని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. గతంలో విజయవాడలో పనిచేసిన రఘుతో శివప్రసాద్, ఆయన భార్య చింతమనేని గాయత్రి కలసి విధులు నిర్వహించారు. శివప్రసాద్ ఇంట్లో దొరికిన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు గాయత్రి పేరుతోనూ, బంగారు ఆభరణాలకు సంబంధించిన బిల్లులు రఘు పేరుతోనూ ఉన్నట్టు సమాచారం. దీంతోనే శివప్రసాద్, గాయత్రీలను రఘు బినామీలుగా ఏసీబీ నిర్ధారించింది. కాగా, ఈ కేసులో దర్యాప్తు సాగుతోందని ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ చెప్పారు. సోమవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ ఏసీబీ డీఎస్పీ కృష్ణారావు, స్పెషల్ టీం డీఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించినట్టు చెప్పారు. దొరికిన డాక్యుమెంట్లపై విచారణ జరుగుతోందన్నారు. రఘు, శివప్రసాద్ లింకులపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రఘు బినామీలు, వారి ఆస్తుల వివరాలపై తమకు ఇంకా సమాచారం అందుతోందని, వాటిపై కూడా దాడులు చేస్తామని ఠాకూర్ చెప్పారు. కాగా, జీవీ రఘును మంగళవారం ఉదయం విశాఖ నగరానికి తీసుకువచ్చి విచారించనున్నారు. -
ఉద్యోగాల సాధనలో సత్తాచాటిన యువకుడు
కంభాళాపూర్(పెబ్బేరు): మండల పరిధిలోని కంభాళాపూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో సత్తా చాటాడు.ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా 10కి పైగా ఉన్నతస్థాయి ఉద్యోగాలకు అర్హత సాధించగా నాలుగు ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలను సొంతం చేసుకున్నాడు. వివరాలిలా.. పెబ్బేరు మండలం కంభాళాపూర్ గ్రామానికి చెందిన మేకల చిన్న జోగన్న కుమారుడు ఎం.శివ ప్రసాద్‌కు చిన్నతనం నుంచే చదువు పై శ్రద్ధ, ఆసక్తి ఉన్నాయి. దీంతో పేదరికం తన పట్టుదల ముందు చిన్నబోయింది. ఇటిక్యాల మండలం బీచుపల్లి గురుకుల పాఠశాలలో పదోతరగతి పూర్తి చేసుకున్న శివ ప్రసాద్ ఉన్నత చదువులు చదువుతూనే వివిధ పోటీ పరీక్షలకు సన్నధమయ్యాడు. తన తొలి ప్రయత్నంలోనే ఎఫ్‌సీఐ (పుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా)ఉన్నత ఉద్యోగానికి ఎంపికయ్యాడు.అనంతరం ఎల్ఐసీ లో, తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో ఉన్నత ఉద్యోగానికి ఎంపికై ప్రస్తుతం బ్యాంక్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఒక వైపు బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తూనే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఉద్యోగాలకు ప్రిపేరయ్యాడు. దీంతో ఇటీవల ఎస్ఎస్సీ వారు నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణుడై సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, సీబీఐ సబ్ఇన్స్పెక్టర్ వంటి ఉన్నత పోస్టులకు ఎంపికయ్యాడు.సాప్ట్వేర్ రంగంలో మంచి జీతం వచ్చినా ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే ప్రభుత్వానికి, ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుందన్న లక్ష్యంతో ముందుకెళ్లినట్లు శివ ప్రసాద్ సాక్షి కి తెలిపారు.ఏకాగ్రత, సరైన ప్రణాళిక, కృషి, పట్టుదల తో శ్రమిస్తే విజయం తప్పక లభిస్తుందని ఆయన అన్నారు.తన విజయం వెనుక తల్లిదండ్రుల ఆశిస్సులు, ప్రోత్సాహం, బంధుమిత్రుల సహకారం ఎంతో ఉందన్నారు. -
సమష్టి కృషితోనే అందరికీ ఉపాధి
సదగోడు (ఉప్పునుంతల), న్యూస్‌లైన్: ఉపాధి హామీ పథకంలో కూలీలతో ఏర్పాటు చేసిన సమాఖ్యల భాగస్వామ్యంతో పదిమందికి ఉపయోగపడే నాణ్యమైన పనులు చేపట్టినప్పుడే ఆశించిన ఫలితాలు సాధిస్తామని ఈజీఎస్ స్టేట్ ప్రాజెక్టు మేనేజర్ (టెక్నికల్) శివప్రసాద్ అన్నా రు. శుక్రవారం మండల పరిధిలోని సదగోడులో శ్రమశక్తి సంఘాలు, గ్రామ సమాఖ్య ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సమాఖ్యలు ఏర్పడిన తర్వాత పథకం పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం చేపడుతున్న పనులు, వేతనాలపై ఆరా తీశారు. గ్రామాల్లో అందరికీ ఉపయోగపడే పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈజీఎస్‌లో వందశాతం సబ్సిడీతో పండ్ల తోటల పెంపకానికి అవకాశం కల్పిస్తున్నామన్నారు. మొక్కలతోపాటు ఐదేళ్లపాటు నిర్వాహణ ఖర్చులు కూడా అందజేస్తామన్నారు. మహిళా సంఘాల మాదిరిగా శ్రమశక్తి సంఘాలు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. పనుల గుర్తింపుపై కూలీలకు అవగాహన కలిపంచేందుకు సమావేశాలు ఏర్పాటు చేయాలని ఏపీఓ సాయిశంకర్‌కు సూచించారు. 360 మండలాల్లో సమాఖ్యలు.. రాష్ట్ర వ్యాప్తంగా 360 మండలాలో పెలైట్ ప్రాజెక్టుగా శ్రమశక్తి సంఘాలను ఎంపిక చేసి వారిని చైతన్యవంతం చేసేందుకు కృషిచేస్తున్నామన్నారు. సమాఖ్యలు, కూలీల్లో చట్టంపై పూర్తిగా అవగాహన కల్పించేందుకు చర్యలు తీ సుకుంటున్నామన్నారు. చట్టప్రకారం వారికి కల్పించిన హక్కులను పొందడానికి వారు అధికారులను ప్రశ్నించే స్థాయికి ఎదగాలన్నారు. కూలీలు పనులకు దరఖాస్తులు చేసుకున్న 15 రోజుల్లో పని కల్పించకపోతే వారికి జీవన భృతి చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఆనంతరం ఆయన ఉప్పునుంతల మండల కార్యాలయంలో పథకం అమ లు తీరు సమీక్షించారు. కార్యక్రమంలో ఏపీడీ పాపయ్య, ఈ జీఎస్ ఏపీఓ సాయిశంకర్, సిబ్బంది పాల్గొన్నారు.