shooting In school
-
బ్రెజిల్ స్కూల్లో కాల్పులు.. 8 మంది మృతి
సావో పౌలో: బ్రెజిల్‌లోని సావో పౌలో నగర శివార్లలోని ఓ పాఠశాలలోకి బుధవారం ఇద్దరు దుండగులు ప్రవేశించి కాల్పులు జరిపి 6 మందిని పొట్టనబెట్టుకున్నారు. దుండగులిద్దరూ కౌమార దశలో ఉన్నవారని అధికారులు చెప్పారు. కాల్పులు జరిపిన అనంతరం వారే ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటారని భావిస్తున్నామన్నారు. సంఘటన స్థలంలో ఐదుగురు చిన్నారులు, ఓ టీచర్, ఇద్దరు దుండగులు సహా మొత్తం 8 మృతదేహాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మరో 17 మంది గాయపడ్డారని బ్రెజిల్‌కు చెందిన ఓ వార్తా వెబ్సైట్ తెలిపింది. -
అమెరికా స్కూల్లో కాల్పులు
-
కాలిఫోర్నియా స్కూల్లో కాల్పులు
లాస్ ఎంజెలెస్: కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ బెర్నార్డినోలోని ప్రాధమిక పాఠశాలలో జరిగిన హత్నాయత్నం ఘటనలో ముగ్గురు చనిపోవడం కలకలం రేపింది. రెండేళ్ల క్రితం బెర్నార్డినోలో జరిగిన ఉగ్రదాడిలో 14 మంది మరణించిన సంఘటన మరువక ముందే జరిగిన తాజా ఘటన..స్థానికులను ఆందోళనకు గురి చేసింది. అయితే తాజా ఘటన కుటుంబ కలహాల కారణంగానే జరిగిందని పోలీసులు నిర్ధారించారు. సెడ్రిక్ అండర్సన్ అనే 53 ఏళ్ల వ్యక్తి...అదే స్కూల్లో టీచర్‌గా వున్న తన భార్య కారెన్ ఎలైన్ స్మిత్‌పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో భార్య చనిపోగా, తీవ్రంగా గాయపడిన మార్టినెజ్ అనే బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. మరో ఇద్దరు బాలురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘాతుకానికి పాల్పడ్డ అండర్సన్...కాల్పులు జరిగిన తర్వాత అదే గన్‌తో పేల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని టార్గెట్ విద్యార్థులు కాదని, తననుంచి విడిపోయిందనే కోపంతో భార్యను చంపడానికే అతను స్కూల్ వచ్చి కాల్పులు జరిపాడని పోలీసులు చెప్తున్నారు. -
తండ్రిని చంపి.. ఆపై స్కూల్లో కాల్పులు
ఓ యువకుడు తన తండ్రిని ఇంట్లోనే కాల్చి చంపి.. ఆపై సమీపంలో ఉన్న ఎలిమెంటరీ స్కూలుకు వెళ్లి అక్కడ హ్యాండ్‌గన్‌తో కాల్పులు జరిపాడు. దాంతో ఇద్దరు విద్యార్థులు, ఒక టీచర్ గాయపడ్డారు. ఈ ఘటన అమెరికాలో గన్ కల్చర్‌పై మరోసారి చర్చకు దారితీసింది. అట్లాంటాకు ఈశాన్యంగా 110 మైళ్ల దూరంలో ఉన్న టౌన్‌విల్లె అనే గ్రామీణ ప్రాంతంలో కాల్పులు మొదలైన కొద్ది నిమిషాలకే పోలీసులు వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులలో ఒకరికి కాలిలో బుల్లెట్ గాయం కాగా, మరొకరికి పాదంలో తగిలిందని కెప్టెన్ గార్లండ్ మేజర్ తెలిపారు. ఇక ఓ ఉపాధ్యాయినికి భుజంలో బుల్లెట్ దిగింది. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో కాల్పులు మొదలయ్యాయి. దానికి ముందు అతడు తన ఇంట్లో తండ్రి జెఫ్రీ ఆస్బోర్న్ (47)ను కాల్చి చంపాడు. తర్వాత అక్కడి నుంచి రెండు మైళ్ల దూరంలో ఉన్న స్కూలుకు వెళ్లి కాల్పులు జరిపాడు. అయితే అతడు ఎందుకు ఈ ఘాతుకానికి పాల్పడిందీ ఇంకా తెలియడంలేదు. కాల్పులు ముగిసి, యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్న వెంటనే పిల్లలను సమీపంలో ఉన్న చర్చికి బస్సులో పంపేశారు. అక్కడ వాళ్ల తల్లిదండ్రులు ఉండి, పిల్లలను తీసుకున్నారు. స్కూల్లో నర్సరీ నుంచి ఆరో తరగతి వరకు చదివే 300 మంది విద్యార్థులున్నారు.