Shreyasi Singh
-
బిహార్‌లో విజయం సాధించిన ప్రముఖులు
పట్నా: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన బిహార్ అసెంబ్లీ హోరాహోరీ ఎన్నికల పోరులో అధికార ఎన్డీయో కూటమి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. మొత్తం 243 స్థానాల అసెంబ్లీలో మెజారిటీ మార్క్ 122 కాగా, అంతకన్నా కేవలం రెండు సీట్లు ఎక్కువ గెలుచుకుని 124 సీట్లతో ఎన్డీయే అధికారం చేపట్టనుంది. విపక్ష మహాకూటమి మొత్తంగా 111 స్థానాలకు పరిమితమైంది. బిహార్ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. నియోజకవర్గాల వారిగా ప్రముఖుల ఫలితాలు: తేజస్వి యాదవ్ (రాఘోపూర్ నియోజకవర్గం): మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ రాఘోపూర్ నియోకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. సమీప బీజేపీ ప్రత్యర్థి సతీష్ కుమార్‌పై 38,174 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. 2015లో కూడా తేజస్వి యాదవ్ ఈ నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. గతంలో తేజస్వి తండ్రి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ 1995, 2005 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. జితాన్ రామ్ మంజి (ఇమామ్ గంజ్ నియోజకవర్గం): బిహార్ మాజీ సీఎం, హిందూస్థానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) చీఫ్ జితాన్ రామ్ మంజి బిహార్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 76 ఏళ్ల జితాన్ ఆర్జేడీ అభ్యర్థి ఉదయ్ నరేన్ చైదరిపై 16,034 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జితాన్ 29,408 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. శ్రేయాసి సింగ్ (జముయి నియోజకవర్గం): కామన్ వెల్త్ గేమ్స్-2018 స్వర్ణపతక విజేత, ఎస్ షూటర్ శ్రేయాసి సింగ్ బీజేపీ అభ్యర్థిగా బిహార్ ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించారు. మాజీ కేంద్ర మంత్రి దివంగత దిగ్విజయ్ సింగ్ కుమార్తె అయిన శ్రేయాసి సమీప ఆర్జేడీ అభ్యర్థి విజయ్ ప్రకాష్‌పై 41,049 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆమె అక్టోబర్ 4న బీజేపీలో చేరి జముయి ఎమ్మెల్యే అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల పోటీలో నిలిచారు. అనంత కుమార్ సింగ్ (మోకామా నియోజకవర్గం): బిహార్‌లో ‘బాహుబలి’ నేతగా పిలువబడే అనంత కుమార్ సింగ్ మోకామా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన 35,750 ఓట్ల మెజార్టీతో సమీప జేడీయూ అభ్యర్థి రాజీవ్ లోచన్ నారాయణ్ సింగ్‌పై గెలుపొందారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు సన్నిహితంగా ఉండే అనంత 2015లో ఆర్జేడీలో చేరారు. ఇక ఆయన జేడీయూలో ఉన్నప్పుడు స్వతంత్య్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించిన విషయం తెలిసిందే. -
బీజేపీలో చేరిన షూటర్ శ్రేయాసి సింగ్
పట్నా : ప్రముఖ షూటర్ శ్రేయాసి సింగ్ బీజేపీ బిహార్ శాఖ చీఫ్ భూపేంద్ర యాదవ్ సమక్షంలో ఆదివారం ఆ పార్టీలో చేరారు. జుముయ్ జిల్లా గిధౌర్‌కు చెందిన శ్రేయాసి సింగ్‌ను బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అమర్పూర్ నుంచి బీజేపీ బరిలో దింపవచ్చని భావిస్తున్నారు. ఆమె 2018లో ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం, స్కాట్లాండ్లో జరిగిన 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో వెండి పతకం సాధించారు. 2013లో మెక్సికోలో జరిగిన ట్రాప్ షూటింగ్ వరల్డ్ కప్‌లోనూ శ్రేయాసి సింగ్ భారత జట్టు తరపున ప్రాతినిథ్యం వహించారు. కాగా, 2018లో షూటింగ్ విభాగంలో ఆమె అర్జున అవార్డును పొందారు. శ్రేయాసి గతంలో ఆర్జేడీ సహా పలు ఇతర పార్టీలతో సంప్రదింపులు జరిపినా చివరికి బిహార్ అసెంబ్లీ ఎన్నికలు మరో నెలలో జరగనుండగా బీజేపీలో చేరాలని ఆమె నిర్ణయించుకున్నారు. శ్రేయాసి తండ్రి దిగ్విజయ్ సింగ్ గతంలో అప్పటి ప్రధానమంత్రి చంద్రశేఖర్ కేబినెట్లో పలు మంత్రిత్వ శాఖలను చేపట్టారు. అటల్ బిహార్ వాజ్‌పేయి ప్రభుత్వంలో రైల్వే శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. శ్రేయాసి సింగ్ తల్లి పుతుల్ సింగ్ బిహార్‌లోని బంకా నుంచి ఎంపీగా పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహించారు. చదవండి : బిహార్ ఎన్నికలు : జేడీయూకు షాక్ -
పసిడి పతకం నెగ్గిన భారత షూటర్
-
'స్వర్ణ' శ్రేయసి..
మరోసారి భారత షూటర్లు కచ్చితమైన గురితో అదరగొట్టారు. కామన్వెల్త్ గేమ్స్ షూటింగ్ ఈవెంట్లో మరో మూడు పతకాలు అందించారు. మహిళల డబుల్ ట్రాప్‌లో శ్రేయసి సింగ్ ‘షూట్ ఆఫ్’లో స్వర్ణం ఖాయం చేసుకోగా... పురుషుల 50 మీటర్ల పిస్టల్ విభాగంలో ఓంప్రకాశ్ మితర్వాల్... డబుల్ ట్రాప్ విభాగంలో అంకుర్ మిట్టల్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. దాంతో ఏడో రోజు పోటీలు ముగిశాక భారత్ 12 స్వర్ణాలు, 4 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి మొత్తం 24 పతకాలతో మూడో స్థానంలో కొనసాగుతోంది. గోల్డ్‌కోస్ట్: నాలుగేళ్ల క్రితం గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో నెగ్గిన 14 స్వర్ణాల సంఖ్యను గోల్డ్‌కోస్ట్‌లో ఈసారి భారత క్రీడాకారులు అధిగమించడం ఖాయమైంది. పోటీల తొలి రోజు మొదలైన పసిడి వేటను ఏడో రోజూ భారత క్రీడాకారులు కొనసాగించారు. తమపై పెట్టుకున్న అంచనాలు నిజం చేస్తూ మళ్లీ భారత షూటర్లు రాణించి మూడు పతకాలు సాధించారు. మహిళల డబుల్ ట్రాప్ ఈవెంట్లో ఢిల్లీకి చెందిన 26 ఏళ్ల శ్రేయసి సింగ్ విజేతగా నిలిచి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో నిర్ణీత 120 షాట్ల తర్వాత శ్రేయసి సింగ్, ఎమ్మా కాక్స్ (ఆస్ట్రేలియా) 96 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచారు. విజేతను నిర్ణయించడానికి ‘షూట్ ఆఫ్’ను నిర్వహించారు. శ్రేయసి రెండు పాయింట్లు సాధించి స్వర్ణం ఖాయం చేసుకోగా... ఎమ్మా కాక్స్ ఒక పాయింటే స్కోరు చేసి రజతంతో సరిపెట్టుకుంది. ‘2014 గ్లాస్కో గేమ్స్‌లో రజతం లభించాక చాలా నిరాశకు లోనయ్యాను. ఈసారి కూడా ఫైనల్లో వెనుకబడటంతో స్వర్ణంపై ఆశలు వదులుకున్నాను. అయితే షూట్ ఆఫ్ రూపంలో స్వర్ణం నెగ్గే మరో అవకాశం రావడంతో దానిని సద్వినియోగం చేసుకున్నాను. ఈసారి ప్రదర్శనతో పూర్తి సంతృప్తిగా ఉన్నాను. ఈ స్వర్ణం నా కెరీర్లో మైలురాయి లాంటిది’ అని శ్రేయసి వ్యాఖ్యానించింది. పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో ఫేవరెట్ జీతూ రాయ్ 105 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలువగా... ఓంప్రకాశ్ 201.1 పాయింట్లు సాధించి కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. పురుషుల డబుల్ ట్రాప్ ఫైనల్లో అంకుర్ మిట్టల్ 53 పాయింట్లతో కాంస్య పతకాన్ని సంపాదించాడు. భారత్‌కే చెందిన అసబ్ 43 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. అంకుర్ మిట్టల్ ,ఓంప్రకాశ్ -
భారత్ ఖాతాలో మరో పసిడి
గోల్డ్‌కోస్ట్: కామన్వెల్త్ గేమ్స్‌లో షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. ఇప్పటికే మను భాకర్... జీతూ రాయ్.. హీనా సిద్దూ పసిడి పతకాలు సొంతం చేసుకోగా.. తాజాగా శ్రేయాసి సింగ్ భారత్‌కు మరో బంగారు పతకాన్ని అందించింది. మహిళల డబుల్ ట్రాప్ షూటింగ్లో పోటీపడిన శ్రేయాసి.. ఫైనల్లో ఆస్ట్రేలియా ఫేవరేట్ ఎమ్మా కాక్స్‌పై గెలిచి ఇండియాకు 12వ గోల్డ్ మెడల్ సాధించింది. 2014 లో జరిగిన గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో సిల్వర్ గెలిచిన శ్రేయాసి, ఈసారి స్వర్ణాన్ని ముద్దాడింది. ఇదే ఈవెంట్లో మరో ఇండియన్ షూటర్ వర్ష వర్మన్ ఒక్క పాయింట్ తేడాతో నాలుగో స్థానంలో నిలిచింది. మరోవైపు పురుషుల డబుల్ ట్రాప్‌లో భారత్‌కు చెందిన షూటర్ అంకుర్ మిట్టల్‌కు కాంస్యం దక్కింది. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ 24 పతకాలతో మూడోస్థానంలో కొనసాగుతోంది. -
జోరు తగ్గినా...
భారత్ ఖాతాలో నాలుగు పతకాలు శ్రేయాసికి రజతం, అసబ్‌కు కాంస్యం ఓంకార్, పూనమ్లకూ కాంస్యాలు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ మరో నాలుగు పతకాలతో మెరిసింది. తొలి మూడు రోజులతో పోలిస్తే నాలుగో రోజు జోరు కాస్త తగ్గినా... షూటింగ్, వెయిట్‌లిఫ్టింగ్‌లలో రజత, కాంస్య పతకాలు దక్కడంతో మురిసింది. అయితే ఈ రెండు క్రీడాంశాల్లో స్వర్ణావకాశాలు చేజార్చుకోవడంతోపాటు టేబుల్ టెన్నిస్‌లో కాంస్య పతక పోరులో మహిళల జట్టు విఫలమై కాస్త నిరాశపరిచింది. గ్లాస్గో: పతకాల వేటలో భారత్ మున్ముందుకు దూసుకెళుతోంది. ఆదివారం భారత క్రీడాకారులు పసిడి వెలుగులు విరజిమ్మకపోయినా.... ఓ రజతం, మూడు కాంస్యాలు తమ ఖాతాలో వేసుకున్నారు. మొత్తం పతకాల సంఖ్యను 20కి పెంచుకున్నారు. శ్రేయాసి వెండి వెలుగులు... అసబ్ కంచు మోత భారత్‌కు పతకాల పంట పండిస్తున్న షూటింగ్... ఆదివారం మరో రెండు పతకాలనందించింది. మహిళల డబుల్ ట్రాప్ ఈవెంట్లో శ్రేయాసి సింగ్ రజతం సాధించగా, పురుషుల డబుల్ ట్రాప్‌లో మహమ్మద్ అసబ్ కాంస్యం నెగ్గాడు. ఈ ఇద్దరికీ ఇవే తొలి కామన్వెల్త్ పతకాలు కావడం విశేషం. మహిళల ఫైనల్స్‌లో ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల శ్రేయాసి మొత్తం 92 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలవడం ద్వారా వెండి పతకాన్ని కైవసం చేసుకుంది. ఇంగ్లండ్ షూటర్లు కెర్వుడ్ 94 పాయింట్లతో స్వర్ణం, రాచెల్ పారిష్ 91 పాయింట్లతో కాంస్యం దక్కించుకున్నారు. అయితే మరో భారత మహిళా షూటర్ వర్ష వర్మన్ 81 పాయింట్లు మాత్రమే సాధించి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక పురుషుల డబుల్ ట్రాప్‌లో నాథన్ జురెబ్ (మాల్టా)తో చివరిదాకా ఉత్కంఠభరితంగా జరిగిన పోరులో ‘మీరట్ వీరుడు’ అసబ్ 26 పాయింట్లు నమోదు చేసి కాంస్యాన్ని సొంతం చేసుకున్నాడు. జురెబ్ 24 పాయింట్లు మాత్రమే నమోదు చేయగలిగాడు. మరో భారత షూటర్ అంకుర్ మిట్టల్... క్వాలిఫికేషన్స్‌లో రెండో స్థానంతో సత్తా చాటినా తుదిపోరులో ఐదో స్థానానికి పడిపోయి నిరాశ పరిచాడు. కాంస్యాలు నెగ్గిన ఓంకార్, పూనమ్ భారత్‌కు పతకాలు సాధించిపెడుతున్న మరో క్రీడాంశం వెయిట్‌లిఫ్టింగ్‌లో మరో రెండు కాంస్యాలు భారత్ సొంతమయ్యాయి. పురుషుల 69 కేజీల విభాగంలో ఓంకార్ ఒటారి, మహిళల 63 కేజీల విభాగంలో పూనమ్ యాదవ్‌లు కాంస్య పతకాలు సాధించారు. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల 69 కేజీల విభాగంలో ఓంకార్ మొత్తం 296 కేజీలు (స్నాచ్‌లో 136 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 160 కేజీలు) ఎత్తాడు. ఇక ఆదివారం జరిగిన మహిళల 63 కేజీల పోటీల్లో పూనమ్ 202 కేజీలు ఎత్తి మూడో స్థానంతో కాంస్యం దక్కించుకుంది. స్నాచ్‌లో 88 కేజీలు ఎత్తిన పూనమ్... క్లీన్ అండ్ జెర్క్‌లో 114 కేజీలు నమోదు చేసింది. అయితే మరో భారత లిఫ్టర్ వందనా గుప్తా 198 కేజీలతో నాలుగో స్థానానికే పరిమితమైంది. మహిళల టీటీ టీమ్ ఈవెంట్ కాంస్య పతక పోరులో భారత్ 1-3తో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది.