Shyam prasadreddy
-
నవ్వించి ఏడిపిస్తాం
‘‘ఆ ముగ్గురి కామెడీ చూస్తే నాకు ఎనర్జీ వస్తుంది. నా ఐప్యాడ్‌లో ఎప్పుడూ వీళ్లు చేసిన స్కిట్స్ ఉంటాయి’’ అన్నారు ప్రముఖ నిర్మాత శ్యామ్‌ప్రసాద్ రెడ్డి. ‘జబర్దస్త్’ ఫేమ్ సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రామ్‌ప్రసాద్ హీరోలుగా నటించిన చిత్రం ‘త్రీ మంకీస్’. కారుణ్య చౌదరి కథానాయిక. ఓరుగుల్లు సినీ క్రియేషన్స్ పతాకంపై అనిల్‌కుమార్ జి. దర్శకత్వంలో నగేశ్ జి. నిర్మించారు. ఈ చిత్రం లోగో, ఫస్ట్ లుక్‌ను శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, నటుడు, నిర్మాత నాగబాబు ఆవిష్కరించారు. శ్యామ్‌ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఆవకాయ, పప్పు, నెయ్యి కలిస్తే ఎంత టేస్ట్ ఉంటుందో వీరి కామెడీ అలా ఉంటుంది. టెన్షలో ఉన్నప్పుడు, ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు వీరి స్కిట్స్ చూస్తాను. ‘చిత్రం భళారే విచిత్రం’, ‘అహ నా పెళ్లంట’, ‘ప్రేమకథా చిత్రం’లా ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. నాగబాబు మాట్లాడుతూ– ‘‘రిస్క్ అనుకోకుండా ఈ ముగ్గురిపై ఫోకస్ పెట్టి సినిమా తీసిన దర్శక, నిర్మాతలకు నా అభినందన లు. గెటప్ శ్రీను వజ్రం లాంటి ఆర్టిస్ట్. 90 రకాల గెటప్‌లతో రకరకాల బాడీ లాంగ్వేజెస్‌తో అతను అలరిస్తాడు’’ అన్నారు. ‘‘అందరినీ పక్కాగా నవ్విస్తాం’’ అని గెటప్ శ్రీను, రామ్‌ప్రసాద్ అన్నారు. ‘‘ఫస్టాఫ్‌లో నవ్విస్తాం, సెకండాఫ్‌లో ఏడిపిస్తాం’ అని సుడిగాలి సుధీర్ అన్నారు. ‘‘స్క్రిప్ట్‌ను నమ్మి చేసిన చిత్రం ఇది’’ అన్నారు అనిల్ కుమార్. ‘‘స్క్రిప్ట్ వినగానే ఆ ముగ్గురితోనే సినిమా చేయాలని పట్టుబట్టి ఈ చిత్రాన్ని నిర్మించాం’’ అన్నారు నిర్మాత నగేశ్. -
‘ఇందూ’ శ్యాంప్రసాద్‌రెడ్డికి హైకోర్టులో ఊరట
► వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ► హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసుల్లో నిందితునిగా ఉన్న ‘ఇందూ’ శ్యాంప్రసాద్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. లేపాక్షి నాలెడ్జ్ పార్క్, ఇందూ టెక్ జోన్, ఇందూ-హౌసింగ్ బోర్డు చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాల్లో జరుగుతున్న కేసుల విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి ఆయనకు హైకోర్టు మినహాయింపునిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంతవరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. లేపాక్షి, ఇందూ టెక్ జోన్, హౌసింగ్ ప్రాజెక్టులకు సంబంధించి సీబీఐ మూడు వేర్వేరు కేసులు నమోదు చేసింది. ఈ మూడింటిలోనూ శ్యాంప్రసాద్‌రెడ్డి నిందితులుగా ఉన్నారు. ఈ కేసులపై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరుపుతోంది. ఇందులో భాగంగా ప్రతీ శుక్రవారం కోర్టు ముందు విచారణకు ఆయన హాజరు కావాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిని న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది కె.శ్రీనివాసరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఇందూగ్రూప్ చైర్మన్, ఎండీ హోదాలో శ్యాంప్రసాద్‌రెడ్డి విదేశాలకు వెళ్లాల్సి వస్తోందని, దీనివల్ల ప్రతీ శుక్రవారం కోర్టు విచారణకు హాజరు కావడం కష్టసాధ్యంగా ఉందన్నారు. విదేశాల్లో జరిగే సమావేశాల నుంచి అర్ధంతరంగా రావాల్సి వస్తోందన్నారు. దీనిపై స్పందించేందుకు సీబీఐ న్యాయవాది కేశవరావు గడువు కోరారు. దీంతో వ్యక్తిగత హాజరు నుంచి శ్యాంప్రసాద్‌రెడ్డికి మినహాయింపునిస్తూ న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. -
రోజూ రకరకాల పాత్రలు... వేర్వేరు నిర్ణయాలు!
మా తాతగారు ఎం.ఎస్. రెడ్డి గారు, మా నాన్న గారు శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి గారు - ఇద్దరూ చిత్ర నిర్మాణంలో చాలా కాలంగా ఉండడం వల్ల ‘మల్లెమాల ఎంటర్ టైన్మెంట్స్’ ద్వారా టీవీ సీరియల్స్, షోల నిర్మాణ రంగంలో నా ప్రవేశం చాలా సులభంగా జరిగిందని అనుకుంటారు. కానీ, కాదు. ఏ రంగంలోనైనా మహిళ ముందుకు రావాలంటే, తల్లితండ్రుల నుంచి, భర్త నుంచి కుటుంబ పరంగా చాలా మద్దతు ఉండాలి. అందరూ చెప్పే విషయం అనుకున్నా సరే, ఇది పచ్చి నిజం. నేను ఈ రంగానికి వస్తానన్నప్పుడు మా కుటుంబమంతా మొదట వ్యతిరేకించారు. కానీ, మా నాన్న గారు సపోర్ట్ చేశారు. టీవీ, సినిమాలనే కాదు... ఎక్కడ ఆడవాళ్ళు ముందడుగు వేయాలన్నా మొదట చాలా ఇబ్బందులు ఉంటాయి. ఒక్కసారి గాడిలో పడ్డాక, ఇక అంతా సజావుగా ముందుకు నడుస్తుంది. నాకూ మొదట చాలా ఇబ్బందులు వచ్చాయి. పరిమిత బడ్జెట్‌తో, రోజు వారీగా పని చేయాల్సిన టీవీ రంగానికి తగ్గ సరైన టీమ్‌ను సమకూర్చుకోవడం కొంత ఇబ్బంది అయింది. అలాగే, మొదట్లో మేము తీసిన సీరియల్‌ను కొద్దివారాలకే టీవీ చానల్ నుంచి తొలగించారు. బెంగాలీ సీరియల్‌కు రీమేక్‌గా తీసిన ‘శ్రావణ మేఘాలు’ ఆదరణ పొందలేదు. అలా పాఠాలెన్నో నేర్చుకున్న తరువాత ‘తూర్పు వెళ్ళే రైలు’ సీరియల్ నుంచి, గేమ్ షో ‘ఢీ’ నుంచి విజయాల బాటలోకి వచ్చాం. తరువాత ‘జీన్స్’, ‘క్యాష్’, ‘జబర్దస్త్’ లాంటి హిట్ షోలు చాలా చేశాం. ‘ఢీ’ ఇప్పుడు 7వ సీజన్ నడుస్తోంది. ‘జబర్దస్త్’ సిరీస్‌లు ఎంత పాపులరో చెప్పనక్కర్లేదు. పెళ్ళి కానప్పుడు మీరు తెల్లవార్లూ కష్టపడగలుగుతారు. కానీ, ఒకసారి తల్లి అయ్యాక పిల్లల బాధ్యత కూడా మీ మీద ఉంటుంది. రెండేళ్ళ క్రితం బాబు పుట్టాక ఆ సంగతి నాకు అర్థమైంది. అందుకే, వర్కింగ్ ఉమన్ అంటే నాకెంతో గౌరవం. మగవాళ్ళతో పోలిస్తే, ఆడవాళ్ళు ఒక తల్లిగా, చెల్లిగా, కూతురిగా, భార్యగా - ఏకకాలంలో చాలా పాత్రలు పోషించాల్సి ఉంటుంది. ఈ పాత్రలకు తగ్గట్లు ఒకే రోజు విభిన్నమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి కాబట్టే, ఒకే పని స్త్రీ, పురుషులిద్దరికీ ఇస్తే - ఆడవాళ్ళు ఒక అడుగు ఎక్కువే కష్టపడాల్సి ఉంటుంది. కానీ, ఆధునిక మహిళలు దీన్ని ఒక సవాలుగా తీసుకొని, ముందుకు వస్తున్నారు. మా చెల్లెలు డాక్టర్ మైత్రి కూడా గైనకాల జిస్ట్గా పేరు తెచ్చుకుంటోంది. ఇలాంటి మహిళల విజయాలన్నీ గుర్తు చేసుకోవ డానికీ, మన జీవితంలో మనకు మార్గదర్శకులుగా నిలిచిన అమ్మనూ, అక్కనూ, అత్తనూ, టీచర్లనూ అందరినీ పలకరించి, వారికి కృతజ్ఞత చెప్పుకోవడానికి ఈ ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ చక్కటి అవకాశం. ప్రపంచాన్ని మరింత అందంగా, ఆహ్లాదంగా మార్చిన మహిళామూర్తులందరికీ శుభాకాంక్షలు! - దీప్తీరెడ్డి, టీవీ షోలు, సీరియళ్ల నిర్మాత ( ‘జబర్దస్త్’, ‘ఢీ’ ఫేమ్)