Shyamalan
-
శారద ఇన్స్పిరేషన్..శ్యామల రోల్‌మోడల్
కర్నూలు(కల్చరల్) : ‘‘నేను 8వ తరగతి చదివేటప్పుడు న్యాయం కావాలి సినిమా చూశాను. అందులో శారద పాత్ర నాపై ప్రగాఢమైన ప్రభావాన్ని చూపింది. అన్యాయానికి గురైన రాధికకు అండగా నిలిచి న్యాయం జరిగేటట్లు లాయర్ శారద పోరాటం చేయడం నాకు చాలా నచ్చింది. దీంతో నేను కూడా ఒక ‘అన్‌కాంప్రమైజింగ్’(రాజీలేని) ఫైటర్స్ పక్షాన నిలబడాలనే సదాశయంతో న్యాయవాద వృత్తి చేపట్టి ఈ స్థాయికి వచ్చాను’’ అని అన్నారు జిల్లా కోర్టు ప్రిన్సిపల్ జడ్జి అనుపమ చక్రవర్తి. మౌనపోరాటం సినిమాలో యమున పాత్ర కూడా తనకు చాలా నచ్చిందని, మ హిళలు ధైర్యంగా నిలబడితే న్యాయం వారి పక్షాన నిలుస్తుందనే వాస్తవికతను ఈ పాత్ర చూపిందన్నారు. అన్యా యానికి గురైనప్పుడు మహిళలు కుంగిపోకూడదని, చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కుటుంబ సభ్యులు సైతం..మహిళలపై వివక్ష చూపకూడదని, వారి ఇష్టా ఇష్టాలను గౌరవించాలన్నారు. జిల్లా జడ్జి అనుభవాలు ఆమె మాటల్లోనే.. ‘‘ మా సొంత ఊరు శ్రీకాకుళం. అమ్మ మహాలక్ష్మి, నాన్న కృష్ణచందర్‌రావు..ఇద్దరూ నన్ను చాలా ప్రేమగా పెంచారు. ఆడపిల్లనని వివక్ష చూపలేదు. ఏం చదవాలో, ఏం కావాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ నాకిచ్చారు. ప్రాథమిక విద్య నుంచి మెట్రిక్యులేషన్ వరకు శ్రీకాకుళంలోని సెయింట్‌జోసెఫ్ స్కూలులో చదివాను. ఇంటర్ శ్రీకాకుళం గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో పూర్తి చేశాను. ఇంటర్ పూర్తి కాగానే పెళ్లి.... ఆ రోజుల్లో ఉండే పరిస్థితులను బట్టి నాకు ఇంటర్ పూర్తి కాగానే పెళ్లి చేశారు. అయితే నాన్న.. మా బంధువుల వద్ద, మా వారి వద్ద నా చదువు పట్ల హామీ తీసుకునే పెళ్లి చేశారు. అందుకే నేను అమితంగా ఇష్టపడే ఐదేళ్ల లా కోర్సు విశాఖపట్టణంలోని నందమూరి బసవతారకం లా కళాశాలలో దిగ్విజయంగా పూర్తి చేయగలిగాను. నేనొక్కదాన్నే కాదు.. నాతో పాటు మా తమ్ముడు కూడా అదే కాలేజీలో చేరి లా కోర్సు పూర్తి చేశాడు. మా నాన్న గర్వపడ్డారు... నేను, మా తమ్ముడు హైదరాబాద్‌లో ఒకే రోజు లాయర్లుగా పేర్లు నమోదు చేసుకొని నల్ల కోటు తొడుక్కొని హైకోర్టులో అడుగుపెట్టాం. ఆ రోజున మా నాన్న చాలా గర్వంతో ఆనందించారు. 1994 నుంచి 2008 వరకు హైకోర్టు లాయర్‌గా సుదీర్ఘ ప్రస్థానం కొనసాగించాను. 2008లో ప్రవేశ పరీక్షరాసి జి ల్లా జడ్జిగా ఎంపికయ్యాను. చిత్తూరు, కడప జిల్లాల్లో జడ్జిగా పలు సవాళ్లను ఎదుర్కొన్నాను. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక విజయవాడలో మహిళా సెషన్స్ జడ్జిగా, కృష్ణా జిల్లా ఫుల్ అడిషనల్ చార్జ్ డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ జడ్జిగా పనిచేశాను. 2016 జూలై నుంచి కర్నూలు జిల్లా కోర్టు ప్రిన్సిపల్ జడ్జిగా చేస్తున్నాను. స్త్రీ తల్లి పాత్రను బాగా పోషిస్తే.. సమాజంలో ప్రతీ స్త్రీ తల్లి పాత్రను బాగా పోషిస్తే బిడ్డలు నేరస్తులు కారు. ఏది తప్పో, ఏది ఒప్పో చక్కగా చెప్పి మానవీయ విలువలను నేర్పితే సమాజం తీరుతెన్నులు మారిపోతాయి. స్త్రీల పట్ల అఘాయిత్యాలు, అత్యాచారాలు వేధింపులు జరగడానికి దుర్మార్గులు ఒక కారణమైతే స్త్రీలలోని పిరికితనం, అవగాహన లోపం కూడా ఒక కారణం. మహిళా సాధికారత బాగా ప్రచారంలోనికి వచ్చిన ఈ రోజుల్లో కూడా స్త్రీలు వివక్షకు, వేధింపులకు గురికావడం సబబు కాదు. మహిళలు కూడా తమ వేషధారణ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. హక్కుల కోసమే కాకుండా బాధ్యతల నిర్వహణ కూడా పరిగణనలోనికి తీసుకోవాలి.’’ గర్భిణిగా పరీక్షలకు హాజరు.. లా చదువుతున్న రోజుల్లో నేను నిండు గర్భిణిగా ఉండి పరీక్షకు హాజరై పాసయ్యాను. అంతేకాదు... బాబు పుట్టిన కొన్ని రోజులకే మరో పరీక్షకు వెళ్లవలసి వచ్చింది. ఏ మాత్రం మానసిక ఒత్తిడికి గాని, శారీరక ఒత్తిడికి గాని గురి కాకుండా అందరి ప్రోత్సాహంతో నేను హాయిగా పరీక్ష రాశాను. మానసికంగా బలవంతులైతే మనం ఏ పనినైనా సాధించవచ్చు. పిరికితనం, అధైర్యం వల్ల అడుగడుగునా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చట్టాలపై అవగాహన ఉండాలి.. మహిళలు చట్టాలు తెలుసుకొని వాటిని బాగా వినియోగించుకోవాలి. నిర్భయ, గృహహింస నిరోధక, చైల్డ్ అబ్యూజ్ , పీసీసీ.. చాలా అద్వితీయమైన చట్టాలు. వీటిని వినియోగించుకోవడంలో చదువుకున్న మహిళలు విఫలం కాకూడదు. ఈ చట్టాలపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించేందుకు మేం నేషనల్ లీగల్ అథారిటీ ఆధ్వర్యంలో లీగల్ లిటరసీ క్యాంపులు నిర్వహిస్తున్నాం. మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకున్న నాడు నిర్భయంగా నిస్సంకోచంగా సమాజంలో జీవించగలరు. ఆమె చూపిన అభిమానం మరువలేనిది.. సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ (శ్రీకాకుళం)లో చదువు చెప్పిన శ్యామలా టీచర్ నాకు రోల్ మోడల్. ఆమె ఇంగ్లిష్ బోధించిన తీరు ఇప్పటికీ నన్ను ఆశ్చర్యపరుస్తుంది. ఎంత పెద్ద పదాన్నైనా సిలబల్ చేసి ఆమె నేర్పిం చిన తీరు మరచిపోలేను. నేర్చుకోకపోతే ఆమె వేసిన చిన్న శిక్షలు, నేర్చుకున్నాక ఆమె చూపిన అభిమానం నాలో క్రమశిక్షణను పెంచాయి. మానవీయ బంధాలు ఏర్పడాలి.. ‘‘ ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటారు’’ అన్నది ఒక ఆర్యోక్తి. కాని నా విషయంలో ఒక ప్రత్యేకత ఉంది. నా విజయం వెనుక మా నాన్న, మా వారు, మా తమ్ముడు ఉన్నారు. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. సమాజంలో ఇటువంటి మానవీయ బంధాలు ఏర్పడితే స్త్రీలు ఏ ఆంక్షలు లేకుండా తమ ఆకాంక్షల మేరకు ఆశయాలు సాధిస్తారు. చాలా కుటుంబాల్లో కట్టుబాట్లతో స్త్రీల చదువును నిరోధిస్తారు. దీంతో స్త్రీలు ఆశయాలను, ఆకాంక్షలను అణగదొక్కుకోవాల్సి వస్తోంది. -
‘నా సినిమా జపాన్, బ్రెజిల్లో కూడా..’
లాస్ఎంజెల్స్: బ్రెజిల్, జపాన్ వెండితెరలపై తన చిత్ర ప్రీమియర్‌ను వీక్షించేందుకు ‘స్ప్లిట్’ను విడుదల చేసేందుకు తాను చాలా ఆతురతతో ఉన్నానని ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు ఎం నైట్ శ్యామలన్ చెప్పారు. సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ చిత్రాన్ని బ్రెజిల్, జపాన్‌లో త్వరలో ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. త్వరలోనే తాను ఆ దేశాలను సందర్శిస్తున్నాను అని చెప్పారు. ‘స్ప్లిట్ చిత్ర ప్రదర్శనను ప్రారంబించేందుకు బ్రెజిల్, జపాన్‌కు ఎగిరిపోతున్నాను. నేనిక ఏమాత్రం ఎదురు చూడలేను’ అని చెప్పారు. జేమ్స్ మెక్ అవాయ్ ప్రధాన పాత్రలో నటించారు. స్ప్లిట్ పర్సనాలిటితో సాధారణంగా అపరిచితుడు చిత్రంలో మూడు కోణాల్లో విక్రమ్ నటించగా 23 రకాల భిన్నపార్శ్యాల్లో జేమ్స్ నటించాడు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు టెన్షన్ టెన్షన్‌గా సైకలాజికల్ థ్రిల్లర్‌గా ఉంటుంది. -
33 కోట్ల సినిమాకు 500 కోట్ల వసూళ్లు!
కేవలం 30 రోజులే షూటింగ్ యూనిట్లో పాతికమందే నో గ్రాఫిక్స్ నో బ్యాగ్రౌండ్ స్కోర్ ఓ చిన్న సినిమా హాలీవుడ్‌ను ఉలిక్కిపడేలా చేసింది. ఓ భారీ బడ్జెట్ సినిమా పబ్లిసిటీకి ఖర్చు పెట్టేంత డబ్బుతో ఓ హారర్ సినిమా తీసి బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టుకోవమంటే మాటలు కాదు. ఆ సినిమా పేరు ‘ది విజిట్’. దాని బడ్జెట్ ఎంతో తెలుసా? కేవలం 33 కోట్ల రూపాయలు. తీసింది మనవాడే. ఎస్... మన భారతీయ మూలాలున్న మనోజ్ నైట్ శ్యామలన్. ద సిక్త్స్ సెన్స్... అన్ బ్రేకబుల్... ది విలేజ్.. సైన్స్... ది లాస్ట్ ఎయిర్ బెండర్... ఆఫ్టర్ ఎర్త్.. ఈ సినిమాలన్నీ తీసింది శ్యామలన్. తండ్రి మలయాళీ, తల్లి తమిళం చిన్నతనంలోనే అమెరికాలో స్థిరపడిన శ్యామలన్ హాలీవుడ్లో తనకంటూ ఓ సిగ్నేచర్ ఏర్పరచుకున్నాడు. ఇటీవల కాలంలో శ్యామలన్ తీసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడ్డాయి. ఇక దుకాణం బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఓ రకమైన నైరాశ్యం. ఆ టైమ్‌లో శ్యామలన్ బుర్ర షార్ప్‌గా పనిచేసింది. చాలా లో బడ్జెట్లో హారర్ సినిమా తీయాలి. అదీ తన మార్కులో ఉండే సినిమా. ఇందులో ఆర్టిస్టులెవ్వరూ వెల్‌నోన్ ఫేసులు కాదు. ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టులు... మిగతా వాళ్లంతా పేరులేని యాక్టర్స్. నో గ్రాఫిక్స్... నో సెట్స్... అంతా నేచురల్ సెటప్. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ సినిమాకి నో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. అలా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లేకుండా సినిమా చేయాలనేది శ్యామలన్ కొన్నేళ్ల నాటి డ్రీమ్. ఈ సినిమాతో అది నెరవేర్చుకున్నాడు. మామూలుగా హారర్ సినిమాలకు బ్యాక్‌గ్రౌండ్ స్కోరే ఇంపార్టెంట్. చాలామంది దాని మీదే డిపెండ్ అవుతారు. శ్యామలన్ మాత్రం సెలైన్స్నే నమ్ముకున్నారు. ఎంత సెలైంట్‌గా ఉంటే అంత వయొలెంట్‌గా ఉంటుందనుకున్నాడేమో! తలుపు చప్పుళ్లు... అడుగుల శబ్దాలు...ఇవన్నీ సౌండ్ ఎడిటర్స్ ఒరిజినల్‌గా లొకేషన్లోనే రికార్ట్ చేశారు. స్క్రిప్టు ఆర్డర్‌లోనే షూటింగ్ కూడా చేశారు. టీమ్ కూడా చాలా తక్కువే. కేవలం పాతిక మంది టెక్నీషియన్స్ 30 రోజుల్లో షూటింగ్ పార్ట్ కంప్లీట్. ఎడిటింగ్ రూమ్‌లో ఫస్ట్ కట్ చూసి అందరూ షాక్. ఏదో ఆర్ట్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్. సెకండ్ కట్ అయితే ఇంకా దారుణం. కామెడీ ఫిల్మ్‌లా అనిపించింది. శ్మామలన్ రాత్రింబవళ్లూ ఎడిటింగ్ రూమ్‌లోనే కూర్చున్నాడు. సీన్ బై సీన్ చూస్తూ దగ్గరుండి ఎడిటింగ్ చేయించుకున్నాడు. ఫైనల్ అవుట్‌పుట్ రెడీ. 2014 ఏప్రిల్ 15న ఫస్ట్ ట్రైలర్ వదిలాడు. ఓ బామ్మ తన మనవరాల్ని తన చేతుల్తో స్టీమ్ ఓవన్లో తోసేస్తుంది. ట్రైలర్ చూసి అందరూ షాక్. అప్పట్నుంచీ సినిమాపై క్యూరియాసిటీ మొదలైంది. 2015, సెప్టెంబరు 11న ‘ది విజిట్’ రిలీజైంది. ఫస్ట్ షోకే రిజల్ట్ తెలిసిపోయింది. సినిమా సూపర్‌హిట్. ఇప్పటివరకూ 500 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. వరల్డ్‌లో ఇంకా చాలా చోట్ల రిలీజ్ కావాల్సి ఉంది. ఇండియాలో కూడా ఇంకా రిలీజ్ కాలేదు. మొత్తానికి శ్యామలన్ హాలీవుడ్‌ను గెలిచాడు. ఇందుకు మనమూ హ్యాపీ ఫీలవ్వాలి. ‘ది విజిట్’ కథ ఏంటంటే క్రిస్మస్ను తమ అమ్మమ్మ, తాతయ్యల దగ్గర జరపుకోవాలని రెబెక్కా, టైలర్లు భావిస్తారు. ఎప్పటి నుంచో వాళ్లకూ, వీళ్లకూ మధ్య రాకపోకలుండవు. అయినా ఈసారి ఎలాగైనా వెళ్లి అక్కడి అనుభవాలను ఓ డాక్యుమెంటరీగా తీయాలనుకుంటారు. ఇద్దరూ వాళ్ల అమ్మను ఒప్పించి అక్కడికి వెళతారు. మనవడు, మనవరాలిని చూసి ఆనందంతో ఉబ్బితబ్బిబవుతారు వాళ్లు. అంతా బాగానే ఉంటుంది. కానీ రాత్రి 9:30 దాటితే వాళ్లున్న గది నుంచి బయటకు రాకూడదని కండీషన్ పెడతారు. సడన్‌గా వాళ్ల ప్రవర్తనలో తేడా వస్తుంది. అసలు వాళ్లు నిజంగా అమ్మమ్మ, తాతయ్యలేనా? ఆ ఇంట్లో ఏం జరుగుతోంది? అక్కణ్ణుంచీ తప్పించుకోవడానికి వీళ్లు ఎన్ని తిప్పలు పడ్డారన్నది మిగిలిన కథ. -
ఊహాతీత దర్శకుడు
డా. మాల్కమ్ క్రోవ్ ఒక చైల్డ్ సైకాలజిస్ట్. అతని దగ్గరకో విచిత్రమైన కేసు వస్తుంది. 9 ఏళ్ల కోల్ సియర్కి సంబంధించిన కేస్ అది. క్లాస్‌రూమ్‌లో కూర్చున్నప్పుడో లేక హోమ్ వర్క్ చేసుకుంటుండగానో ఏమౌతుందో తెలియదు కాని హఠాత్తుగా దేన్నో చూసి భయపడుతుంటాడు కోల్. దానికి కారణం... ఆ పిల్లాడికి దెయ్యాలు కనిపిస్తుండటం. మొదట క్రోవ్ నమ్మడు. కానీ ఓ సంఘటన వల్ల అది నిజమే అని అర్థమవుతుంది.‘‘అనుకోకుండానో, అదృష్టవశాత్తో నీకు మరణించిన వారి ఆత్మలను చూడగలిగే శక్తి వచ్చింది. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, నీకు కనపడే ఆత్మలు ఒకప్పుడు మనుషులే కదా. మనుషుల నుండి నీకు ఏ ముప్పూ లేనప్పుడు, ఆత్మల నుండి కూడా ఏ ముప్పూ ఉండదు’’ అని అతని భయాన్ని పోగొడతాడు క్రోవ్. తన డాక్టర్ చెప్పినట్టుగానే ఆత్మలను చూసి భయపడడం మానేసి, వాటితో స్నేహంగా ఉంటూ, ఆనందంగా జీవితాన్ని గడుపుతాడు కోల్.ఇది 1999లో విడుదలైన ‘ది సిక్త్స్ సెన్స్’ అనే సినిమా కథాంశం. హాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ చిత్రాన్ని తీసింది మనోజ్ నైట్ శ్యామలన్ అనే ప్రవాస భారతీయుడు. స్పీల్బర్గ్ వీరాభిమాని అయిన మనోజ్ శ్యామలన్ తీసే సినిమాల్లో కథ కన్నా కథనం కొత్తగా ఉంటుంది. అంతకుమించి వింతగా ఉంటుంది. ఆత్మలు, అతీంద్రియ శక్తులు లాంటి కథాంశాలకు ఏదో విధంగా మానవీయ స్పర్శను ఆపాదించడం శ్యామలన్ శైలి. ఇద్దరు సాధారణ వ్యక్తులను తీసుకెళ్లి అసాధారణ సందర్భంలో పారేయడం శ్యామలన్ సక్సెస్ ఫార్ములా. మనలో ఒకడు అనుకునే కేరెక్టర్ని ఎవ్వరూ ఊహించని సందర్భంలో పడేసి, ‘అరె! మనక్కూడా ఇలా జరగొచ్చు’ అని సినిమా చూసేంతసేపూ అదే ఆలోచనలో ఉండేలా చేస్తాయి శ్యామలన్ సినిమాలు. ‘అన్బ్రేకబుల్’, ‘సైన్స్’, ‘ది విలేజ్’ ఇవన్నీ ఈ కోవకు చెందినవే! పుట్టి పెరిగింది అమెరికాలోనే అయినా శ్యామలన్ మూలాలతో పాటు ఆలోచనలు కూడా భారతీయతతో నిండి ఉంటాయి. ప్రతి చిత్రంలోనూ భారతీయ ఆధ్యాత్మికత, తాత్విక విషయాలను మిస్టరీలో జొప్పించి, థ్రిల్లర్లను తెరకెక్కించడం అతని ప్రత్యేకత. ‘సిక్త్స్ సెన్స్’ కథను కాస్త నిశితంగా పరిశీలిస్తే ‘ఆత్మ శాంతి’ అనే భారతీయ అంశాన్ని తెరకెక్కించాడని మనకే అర్థమౌతుంది. అలాగే - ‘ది లాస్ట్ ఎయిర్‌బెండర్’ అనే సినిమాలో దేవుడి అవతారాల గురించి చెబుతాడు. ఇలా అతని కథలు ఒక ఎత్తయితే, వాటి స్క్రీన్‌ప్లే ఇంకొక ఎత్తు. ఎంతో సాధారణమైన కథతో సినిమా తీసినా, క్లైమాక్స్‌ను మాత్రం ప్రేక్షకులు అస్సలు ఊహించని విధంగా తీస్తాడు. సినిమా ఆఖరి టైటిల్స్ పడేంత వరకూ కథ నడుస్తూనే ఉంటుంది. అంతేకాదు, అతని ప్రతి చిత్రంలోనూ చివర్లో ఒక ఆశ్చర్యకర సంఘటన ఉంటుంది. ఇదే అతని సినిమాల ప్రత్యేకత. ఈ కొత్త రకమైన మేకింగ్ వికటించి, ఎన్నో డిజాస్టర్లు అందించినా ఆ పద్ధతిని మాత్రం వదల్లేదు. అందుకే ఇప్పటికీ హాలీవుడ్లో వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ పెయిడ్ స్క్రీన్‌ప్లే రైటర్‌గా చెలామణి అవుతున్నాడు మనోజ్. సాధారణ జీవితం, అసాధారణ సంఘటనలు, ఊహకందని మలుపులు - ఇదే శ్యామలన్ ట్రేడ్ మార్క్. అవును ఇంతకీ ‘సిక్త్స్ సెన్స్’లో శ్యామలన్ ట్రేడ్ మార్క్ గురించి చెప్పనేలేదు కదూ! అందులో క్రోవ్ కేవలం డాక్టరే కాదు... ఒక ఆత్మ కూడా!