Siachen avalanche
-
38 ఏళ్ల తర్వాత ఆర్మీ జవాన్ మృతదేహం లభ్యం
న్యూఢిల్లీ: మంచు తుపాను కారణంగా గల్లంతైన జవాను ఆచూకీ 38 ఏళ్ల తర్వాత లభ్యమైంది. సియాచిన్ వద్ద హిమాలయాల్లో ఓ మంచుదిబ్బ వద్ద రెండు మృతదేహాల్ని జవాన్లు కనుగొన్నారు. అక్కడే లభించిన ఐడెంటిఫికేషన్ డిస్క్‌పై ఉన్న సంఖ్య ఆధారంగా ఆ అమర సైనికుడిని లాన్స్ నాయక్ చంద్రశేఖర్‌గా గుర్తించింది రాణిఖేట్‌లోని సైనిక్ గ్రూప్ సెంటర్. 19 కుమావోన్ రెజిమెంట్‌లో సభ్యుడైన చంద్రశేఖర్ హర్బోలా స్వస్థలం ఉత్తరాఖండ్ అల్మోరా జిల్లాలోని ద్వారాహట్. 1975లో సైన్యంలో చేరారు. లాన్స్ నాయక్ హోదాలో భారత సైన్యంలో పని చేశారు. 1984లో 'ఆపరేషన్ మేఘ్‌దూత్'లో భాగంగా పాకిస్థాన్‌తో పోరాడేందుకు చంద్రశేఖర్ సహా మొత్తం 20 మంది జవాన్ల బృందాన్ని రంగంలోకి దింపింది భారత సైన్యం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధక్షేత్రం సియాచిన్‌లో వారిని మోహరించింది. మే 29వ తేదీన ఒక్కసారిగా మంచు తుపాను విరుచుకుపడింది. చంద్రశేఖర్ సహా మొత్తం 20 మందిని మంచు రక్కసి మింగేసింది. సైన్యం 15 మంది మృతదేహాల్ని వెలికితీసింది. ఎంత ప్రయత్నించినా మిగిలిన ఐదుగురి ఆచూకీ దొరకలేదు. అందులో చంద్రశేఖర్ ఒకరు. చంద్రశేఖర్ గల్లంతు కావడానికి 9 ఏళ్ల ముందు.. అల్మోరాకు చెందిన శాంతి దేవితో ఆయనకు వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు(వయసు 4 ఏళ్లు, ఏడాదిన్నర). అప్పుడు శాంతి దేవి వయసు 28 సంవత్సరాలు. అప్పటినుంచి చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు ఆయన పరిస్థితి ఏంటో తెలియకుండానే గడుపుతున్నారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్ హల్ద్వానీలో నివాసం ఉంటున్నారు. చంద్రశేఖర్ మృతదేహం సోమవారం రాత్రికి స్వగ్రామం చేరుకోనుంది. హల్ద్వానీ సబ్ కలెక్టర్ మనీశ్ కుమార్, తహసీల్దార్ సంజయ్ కుమార్.. జవాను ఇంటికి వెళ్లారు. పూర్తిస్థాయి మిలిటరీ గౌరవంతో అత్యక్రియలను నిర్వహిస్తామని తెలిపారు. ఇదీ చదవండి: అట్టారీ-వాఘా సరిహద్దుల్లో అట్టహాసంగా బీటింగ్ రీట్రీట్ వేడుకలు -
వీర జవాను కుటుంబానికి ఆర్థిక సాయం
విజయవాడ: సియాచిన్‌లో మృతి చెందిన ఆర్మీ జవాను ముస్తాక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. కర్నూలు జిల్లాకు చెందిన ముస్తాక్ సియాచిన్ మంచు చరియల్లో చిక్కుకుపోయి మరణించిన విషయం తెలిసిందే. ముస్తాక్ అహ్మద్ మాతృదేశం కోసం ప్రాణాలర్పించిన ధీరోదాత్తుడని, యువతకు ఆదర్శంగా నిలిచారని శనివారం ఓ ప్రకటనలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొనియాడారు. దేశం కోసం చివరి శ్వాస వరకూ పోరాడిన ముస్తాక్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా బాసటగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆర్థిక సాయంతోపాటు ఇల్లును మంజూరు చేసినట్లు ప్రకటించారు. -
హనుమంతప్ప త్వరగా కోలుకోవాలి: వైఎస్ జగన్
సియాచిన్ మంచుతుపానులో చిక్కుకుని, ఐదు రోజుల తర్వాత బయటపడిన వీర సైనికుడు లాన్స్ నాయక్ హనుమంతప్ప త్వరగా కోలుకోవాలని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. ఆయనకు భగవంతుడు దీర్ఘాయుష్షు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. సియాచిన్ ప్రాంతంలో భారీ మంచుతుపాను కారణంగా మంచు చరియల కింద కూరుకుపోయి దాదాపు 10 మంది సైనికుల జాడ తెలియలేదు. వారిలో చివరకు లాన్స్‌నాయక్ హనుమంతప్ప మాత్రం కొన ఊపిరితో బయటపడ్డారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో మృత్యువుతో పోరాడుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. దేశవాసులంతా హనుమంతప్ప బతకాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు. Prayers for the speedy recovery and long life of the #SiachenAvalanche survivor Lance Naik Hanumanthappa — YS Jagan Mohan Reddy (@ysjagan) February 10, 2016 -
అమరులైన ‘సియాచిన్’ సైనికులు
* 10 మంది సైనికుల మరణాన్ని * అధికారికంగా ధృవీకరించిన సైన్యం * వీరులకు సెల్యూట్.. ఘటన బాధాకరం: ప్రధాని ట్వీట్ జమ్మూ: సియాచిన్‌లో మంచుతుపాను కారణంగా భారీ మంచు దిబ్బల్లో కూరుకుపోయిన 10 మంది సైనికులు అమరులయ్యారని సైన్యం అధికారికంగా ధృవీకరించింది. రెండ్రోజులుగా.. వైమానిక దళం, ఆర్మీ చేపడుతున్న సహాయక కార్యక్రమాల్లో పురోగతి కనిపించకపోవటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, భారీ ఐస్ కట్టర్లతో వెతికినా, స్నిఫర్ డాగ్స్‌తో గాలింపు చర్యలు ముమ్మరం చేసినా.. సైనికుల ఆచూకీకి సంబంధించిన ఎలాంటి సానుకూల అంశం కనిపించలేదు. దీంతో మద్రాస్ రెజిమెంట్‌కు చెందిన జూనియర్ కమిషన్డ్ అధికారి (జేసీవో)తోపాటు వివిధ హోదాల్లోని పదిమంది అమరులైనట్లు ఆర్మీ ప్రకటించింది. ‘సియాచిన్‌లో పదిమంది సైనికుల దుర్మరణం బాధాకరం. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరులకు సెల్యూట్ చేస్తున్నాను. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. రక్షణ మంత్రి మనోహర్ పారీకర్ కూడా సైనికుల మృతికి సంతాపం తెలిపారు. సరిహద్దు రక్షణలో ప్రాణాలను పణంగా పెట్టిన అమరులకు జాతి యావత్తూ సెల్యూట్ చేస్తోందని.. నార్తర్న్ కమాండ్, ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హుడా ఓ ప్రకటనలో తెలిపారు. లడఖ్ ప్రాంతంలోని ఉత్తరాది సియాచిన్‌కు 19,600 అడుగుల పైభాగాన ఉన్న సైనిక స్థావరంపై మంచు ఆకస్మికంగా పేరుకుపోయింది. సియాచిన్‌లో రాత్రిళ్లు మైనస్ 42 డిగ్రీల సెల్సియస్, పగలు 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కారణంగా గాలింపు చర్యలు ముందుకు సాగటం లేదు. నో.. థ్యాంక్స్: గాలింపు చర్యలకు సహకరిస్తామంటూ పాకిస్తాన్ చేసిన ప్రకటనను ఇండియన్ డెరైక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్.. లెఫ్టినెంట్ జనరల్ రణ్‌బీర్‌సింగ్ సున్నితంగా తిరస్కరించారు. సహాయం చేస్తామన్న పాక్ మిలటరీ మేజర్ జనరల్ అమిర్ రియాజ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సరిహద్దులో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఇరుదేశాల సైనికులు సహకారం అందిస్తామనడం సహజమేనన్నారు. -
'వద్దు.. మీ సాయం అవసరం లేదు'
న్యూఢిల్లీ: సియాచిన్‌లో గల్లంతైన భారత సైనికులను గుర్తించేందుకు తాము కూడా సహాయం చేస్తామని పాకిస్థాన్ చేసిన ప్రతిపాదనను భారత సైనిక లెఫ్టినెంట్ జనరల్ రణ్‌బీర్ సింగ్ తిరస్కరించారు. ఇప్పటికే తాము అవసరమైన చర్యలు తీసుకున్నామని, వారు గాలింపు చర్యల్లో నిమగ్నమై ఉన్నారని చెప్పారు. దాదాపు 19 వేల అడుగుల ఎత్తులోని సియాచిన్ గ్లేసియర్ వద్ద మంచుకొండచరియలు విరిగిపడి దానికింద దాదాపు 10 మంది సైనికులు ఇరుక్కుపోయిన సంగతి తెలిసిందే. వారి కోసం నిన్నటి నుంచి గాలింపు చర్యలు జరుగుతునే ఉన్నాయి. కాగా, ప్రమాదం చోటుచేసుకున్న 30గంటల తర్వాత స్పందించిన పాక్.. భారత సైనికులను గుర్తించడంలో తాము సహాయం చేస్తామని చెప్పింది.