రూ. 40లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం
కడప: సిద్ధవటం అటవీప్రాంతంలో మంగళవారం టాస్క్ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ. 40 లక్షల విలువైన ఎర్రచందనం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందిన ప్రాథమిక సమాచారం మేరకు పోలీసులు సిద్ధవటం అటవీప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.