దూర ప్రయాణాలకు వెళితే...
వింటర్ టిప్స్
ప్రయాణాలంటే అమితమైన ఇష్టం ఉన్నవారు కాలాలను పట్టించుకోరు. కానీ ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చూపితే సందర్శనీయ స్థలాలలో ఆనందించలేరు. మిగతా కాలాలతో పోల్చితే చలికాలంలో ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటారు. మీ విహారం అత్యద్భుతంగా సాగాలంటే...
మందులు: ఎన్ని రోజుల ప్రయాణమో ముందుగానే నిర్ణయించుకుంటారు కాబట్టి మీకున్న ఆరోగ్య సమస్యలు డాక్టర్ చెకప్‌ల ద్వారా నిర్ధారించుకోవాలి. అలాగే వైద్యులు సూచించిన మందులను తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. చలికాలంలో వచ్చే సమస్యలకు సాధారణ మందులతోబాటు స్థానిక ఫార్మసీ నిపుణుల సాయంతో కొన్ని రిలీఫ్, రిలాక్స్ కలిగించే ఔషధాలను తీసుకెళ్లడం ఉత్తమం.
పరీక్షించుకోవడం: ప్రయాణంలో ఎవరికి వారు ఆరోగ్య పరీక్షలు జరుపుకునే బీపీ, షుగర్.. వంటి టెస్టింగ్ పరికరాలను వెంట ఉంచుకోవాలి. దూర ప్రయాణంలో పరీక్షించుకొని, సమస్యగా ఉంటే మీ డాక్టర్‌కు ఫోన్ చేసి, సలహా తీసుకోవచ్చు.