Signaling
-
వైర్లు లేని స్మార్ట్ సిగ్నల్ వ్యవస్థ
సౌతాంప్టన్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన రంగంలో ఎప్పటికప్పుడు వస్తోన్న మార్పులను అందిపుచ్చుకొని ప్రతి రంగాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోయినప్పుడే నిజమైన పురోభివృద్ధి మానవ జాతి సాధించగలదన్నది తెల్సిందే. కాలుష్యం నియంత్రణలో భాగంగా ఇంగ్లండ్ ప్రభుత్వం గత కొంత కాలంగా మోటారు వాహనాల స్థానంలో సైకిళ్లను ప్రోత్సహిస్తూ వస్తోన్నది. అయినప్పటికీ వాహనాల సంఖ్య తగ్గక పోగా, ప్రతి కూడలి వద్ద రద్దీగా పెరుగుతుండడంతో సైకిళ్లపై ప్రయాణించడమన్నది సైక్లిస్టులకు భారంగా తయారయింది. ఈ నేపథ్యంలో ప్రతి కూడలి వద్ద వారికి అనుకూలమైన సిగ్నలింగ్ వ్యవస్థ తీసుకురావాలని ప్రభుత్వం సంకల్పించింది. ఒకప్పుడు పాదాచారులకు ప్రాధాన్యమిచ్చిన తీరులో ఇప్పుడు సైక్లిస్టులు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేయడమే ఇంగ్లండ్ ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యత. గతంలో పాదాచారుల కోసం నిర్దిష్ట సమయంలో గ్రీన్ సిగ్నల్ వెలగ్గా, ఇప్పుడు నిర్దిష్ట సంఖ్యలో సైకిళ్లను చూసి వెంటనే వాటికి ముందుగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ప్రభుత్వం ప్రవేశ పెడుతోన్న స్మార్ట్ సిగ్నలింగ్ వ్యవస్థ లక్ష్యం. ఇందుకు విద్యుత్ వైర్లు అవసరం లేని ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ను ఉపయోగిస్తోంది. ఈ స్మార్ట్ వ్యవస్థను ముందుగా ప్రయోగాత్మకంగా లండన్‌తోపాటు వోల్వర్హామ్టన్, కోవెంట్లీ, సౌతాంప్టన్‌లో ముందుగా ప్రవేశపెడుతున్నారు. తర్వాత దీన్ని అన్ని నగరాలకు విస్తరించనున్నారు. ఈ స్మార్ట్ వ్యవస్థను ఇంతకుముందే అమల్లోకి తీసుకరావాలనుకున్నారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. (చదవండి: ఒక్కసారిగా ఏడ్చేసిన కిమ్) -
ఆ ‘వెసులుబాటే’ కొంపముంచిందా..?
సాక్షి, హైదరాబాద్: కాచిగూడ రైల్వే స్టేషన్.. నవంబర్ 11, ఉదయం 10.30 గంటలు.. అంతకు ఐదు నిమిషాల క్రితం లింగంపల్లి నుంచి వచ్చి ఫలక్‌నుమా వెళ్లేందుకు రెండో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ఎంఎంటీఎస్ రైలు సిగ్నల్ లేకున్నా ముందుకు కదిలింది. చూస్తుండగానే వేగం గంటకు దాదాపు 40 కి.మీ. అందుకుంది. సరిగ్గా 500 మీటర్ల దూరం వెళ్లి మరో ప్లాట్‌ఫామ్ వద్దకు వెళ్లేందుకు లైన్ క్రాస్ చేస్తూ ఎదురుగా వచ్చిన కర్నూలు టౌన్–సికింద్రాబాద్ హంద్రీ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ను బలంగా ఢీకొంది. ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్ ఎంఎంటీఎస్ లోకోపైలట్ క్యాబిన్లోకి చొచ్చుకెళ్లింది. రైళ్ల కదలికల్లో సిగ్నళ్లదే కీలక పాత్ర. వాటిని గమనించకుండా లోకోపైలట్లు రైళ్లను ముందు కు కదిలించరు. మరి సిగ్నల్ ఇవ్వకున్నా ఎంఎంటీఎస్ రైలు లోకోపైలట్ దాన్ని ముందుకు ఎందుకు తీసుకెళ్లారు అన్నది అర్థంకాని ప్రశ్న. సమాధానం చెప్పేందుకు ఆయన ప్రస్తుతం ప్రాణాలతో లేరు. అక్కడి పరిస్థితులను పరిశీలించిన రైల్వే కమిషనరేట్ అధికారులు ప్రమాదానికి కారణాలను శోధించే పనిలో రెండు రోజులు పర్యటించారు. తుది నివేదిక ఇవ్వాల్సి ఉంది. కానీ.. అధికారులు మాత్రం ప్రమాదానికి ఓ ‘వెసులుబాటే’ కారణమని దాదాపు నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఏంటది? నగరంలో ఎంఎంటీఎస్ రైళ్లకు ప్రత్యేకంగా సిగ్నళ్లకు సంబంధించి ఓ వెసులుబాటు ఉంది. ఏదైనా స్టేషన్లో ఎంఎంటీఎస్ రైలు ఆగిన తర్వాత రెండు నిమిషాలకు తిరిగి బయలుదేరుతుంది. సాధారణంగా మిగతా రైళ్లు సిగ్నల్ ఇచ్చే వరకు వేచి ఉంటాయి. ఎంఎంటీఎస్ రైళ్లకు మాత్రం ఈ విషయంలో ఓ వెసులుబాటు ఉంది. రెండు నిమిషాల్లో సిగ్నల్ పడకున్నా రైలును ముందుకు తీసుకెళ్లచ్చు. అయితే ఆ సమయంలో దాని వేగం 12 కి.మీ. లోపే ఉండాల్సి ఉంటుంది. తక్కువ వేగంతో ఉన్నప్పుడు బ్రేక్ వేసి ఆపే అవకాశం ఉంటుంది. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, ఫలక్‌నుమా, లింగంపల్లి, హఫీజ్‌పేట స్టేషన్లలో మాత్రం ఈ వెసులుబాటు ఉండదు. ఈ ఆరు స్టేషన్లలో లూప్ లైన్లు ఉన్నందున రైళ్లు ఎదురుగా వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ ఆరు స్టేషన్లలో మాత్రం కచ్చితంగా సిగ్నల్ ఇచ్చిన తర్వాతనే ముందుకు కదలాలి. కాచిగూడ స్టేషన్లో ఆ వెసులుబాటు లేదనే విషయాన్ని మరిచి సిగ్నల్ లేకున్నా లోకోపైలట్ రైలును ముందుకు తీసుకెళ్లాడని అధికారులు దాదాపు నిర్ధారణకు వచ్చారు. ఆ సమయంలో వేగం 40కి.మీ.కి చేరుకోవటం పట్ల వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎంఎంటీఎస్ రైలు బయలుదేరేముందు లోకోపైలట్ తన క్యాబిన్‌లోనే బెల్ మోగిస్తాడు, గార్డు కూడా తిరిగి బెల్ మోగిస్తేనే లోకోపైలట్ రైలును ముందుకు నడిపించాల్సి ఉంటుంది. ప్రమాద సమయంలో ‘బెల్’ విషయంపై అధికారులు గార్డును విచా రించారు. అధికారులు మాత్రం ప్రమాదానికి సిగ్నల్‌తో సంబంధం లేకుండా ఎంఎంటీఎస్ ముందుకు వెళ్లేందుకు ఉన్న వెసులుబాటే కారణమని భావిస్తుండటం విశేషం. -
టికెట్ బుకింగ్ సేవక్
త్వరలో అందుబాటులోకి..రైల్వే స్టేషన్లలో టికెట్లు ఇచ్చేందుకు..కాంట్రాక్టు ప్రాతిపదికన నియామకం 207 స్టేషన్లలో ఏర్పాటు దక్షిణమధ్య రైల్వే ప్రకటన సాక్షి, సిటీబ్యూరో: రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు టికెట్లు ఇచ్చేందుకు ప్రత్యేకంగా ‘స్టేషన్ టికెట్ బుకింగ్ సేవక్ ’లు అందుబాటులోకి రానున్నారు. దక్షిణమధ్య రైల్వే పరిధిలో గుర్తించిన 207 స్టేషన్లలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఇలాంటి సిబ్బందిని నియమించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం స్టేషన్‌మాస్టర్లు, సహాయ స్టేషన్‌మాస్టర్లే అన్నిరకాల విధులు నిర్వహిస్తున్న దృష్ట్యా వారిపై పని ఒత్తిడిని తగ్గించేం దుకు కొత్తగా ‘స్టేషన్ టిక్కెట్ బుకింగ్ సేవ క్’లకు (ఎస్‌టీబీఎస్) శ్రీకారం చుట్టినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు తెలిపారు. చాలా స్టేషన్లలో రైళ్ల రాకపోకల సమయంలో సిగ్నలింగ్ విధులు నిర్వహించడంతో పాటు స్టేషన్ మాస్టర్లే ప్రయాణికులకు టికెట్లు ఇవ్వడం వల్ల తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో బారులు తీరి ఉంటారు. అదే సమయంలో ఏదో ఒక ట్రైన్‌కు సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో స్టేషన్‌మాస్టర్ టికెట్ బుకింగ్‌ను నిలిపివేసి ప్లాట్‌ఫామ్‌పైకి వెళ్లవలసి వస్తుంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బం దికి గురవుతారు. ఇలాంటి ప్రతికూలతలను అధిగమించేందుకు ఎస్‌టీబీఎస్‌లు దోహదం చేస్తారని రైల్వే అధికారులు భావిస్తున్నారు. దరఖాస్తుల ఆహ్వానం పదోతరగతి చదివిన 18 - 35 ఏళ్ల వయసున్న వాళ్లు ఎస్‌టీబీఎస్‌లు కావచ్చని సీపీఆర్వో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకొనే సమయంలో మొదట రూ.2000 చెల్లించాలి. ఎంపికైన తరువాత ఈ సొమ్మును తిరిగి ఇచ్చేస్తారు. అలాగే ఎంపికైన ఎస్‌టీబీఎస్‌లు రూ.20 వేల బ్యాంక్ గ్యారెంటీతోపాటు, రూ.ఐదు వేల విలువైన సెక్యూరిటీ డిపాజిట్ డిమాండ్డ్రాఫ్ట్లను రైల్వేకు అందజేయాలి. అలాగే అభ్యర్థి కాండక్ట్, నివాస ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. సికింద్రాబాద్ డివిజన్లోని 57స్టేషన్లు, హైదరాబాద్ డివిజన్లోని 27 స్టేషన్లు, విజయవాడ డివిజన్లో 58, గుంటూరు డివిజన్లో 13, గుంతకల్ డివిజన్లో 37, నాందేడ్‌లో 14 స్టేషన్లలో ఎస్టీబీఐలను నియమిస్తారు.