signals problems
-
నాసా వ్యోమనౌక నుంచి సిగ్నల్స్ కట్, వోయేజర్–2కు మళ్లీ జీవం!
ఇతర గ్రహాలపై పరిశోధనల కోసం అమెరికా అంతరిక్ష పశోధనా సంస్థ 46 ఏళ్ల క్రితం ప్రయోగించిన వోయేజర్–2 వ్యోమనౌక మళ్లీ యథాతథంగా పనిచేయడం ప్రారంభించింది. ఒకరకంగా చెప్పాలంటే కీలకమైన ఈ స్పేస్‌క్రాఫ్ట్ మళ్లీ ప్రాణం పోసుకుంది. ఈ వ్యోమనౌక ప్రస్తుతం భూమికి దాదాపు 12 బిలియన్ల మైళ్ల (దాదాపు 2,000 కోట్ల కిలోమీటర్లు) దూరంలో ఉంది. కమ్యూనికేషన్ వ్యవస్థలో చోటుచేసుకున్న పొరపాటు వల్ల గత నెల 21 తేదీన వోయేజర్–2 నుంచి భూమికి సంకేతాలు ఆగిపోయాయి. కంట్రోలర్లు పొరపాటున తప్పుడు కమాండ్ పంపించడమే కారణమని సమాచారం. ఫలితంగా వోయేజర్–2 యాంటెనా స్వల్పంగా పక్కకు జరిగింది. దాంతో సంకేతాలు నిలిచిపోయాయి. నాసా సైంటిస్టులు వెంటనే రంగంలో దిగారు. సంకేతాల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. భారీ రేడియో యాంటెనాలతో కూడిన డీస్ స్పేస్ నెట్వర్క్ ద్వారా కమాండ్ పంపించారు. దీనికి వోయేజర్–2 స్పందించి 18 గంటల తర్వాత భూమిపైకి సంకేతాలను పంపించింది. నాసా శాస్త్రవేత్తలు వోయేజర్–2 యాంటెనాను సరిచేసే పనిలో విజయం సాధించారు. ఇందుకోసం కమాండ్‌ను పంపించారు. స్పేస్‌క్రాఫ్ట్‌తో కమ్యూనికేషన్‌ను దాదాపు పూర్తిస్థాయిలో పునరుద్ధరించినట్లు ఇస్రో సైంటిస్టులు ప్రకటించారు. వోయేజర్–2 ఎప్పటిలాగే పనిచేస్తోందని, యధావిధిగా సేవలు అందిస్తోందని హర్షం వ్యక్తం చేసింది. ఏమిటీ వోయేజర్–2? అంతరిక్షంలో భూమికి కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న శనిగ్రహం, కుజ గ్రహం, బృహస్పతి, గురుగ్రహంపై పరిశోధనల కోసం ‘నాసా’ 1977 సెప్టెంబర్ 5న వోయేజర్–1, 1977 ఆగస్టు 20న వోయేజర్–2 వ్యోమనౌకలను పంపించింది. కాలిఫోర్నియాలో నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబ్‌లో వీటిని రూపొందించారు. భూమికి సంబంధించిన శబ్ధాలు, చిత్రాలు, సందేశాలను ఇందులో చేర్చారు. గత 36 ఏళ్లుగా నిరి్వరామంగా పనిచేస్తున్నాయి. ఇతర గ్రహాల సమాచారాన్ని భూమిపైకి చేరవేస్తున్నాయి. 2012 ఆగస్టులో వోయేజర్–1 ఇంటర్స్టెల్లార్ స్పేస్‌లోకి ప్రవేశించింది. అంటే అంతరిక్షంలో లక్షల కోట్ల ఏళ్ల క్రితం కొన్ని నక్షత్రాలు అంతరించిపోవడం వల్ల ఏర్పడిన ఖాళీ ప్రదేశంలోకి చేరుకుంది. ఆ తర్వాత వోయేజర్–2 కూడా ఈ స్పేస్‌లోకి ప్రవేశించింది. వోయేజర్–2 1986లో యురేనస్ గ్రహం సమీపానికి వచి్చంది. దాని ఉపగ్రహాలను గుర్తించింది. గురు, శనిగ్రహాలకి సంబంధించిన యూరోపా, ఎన్సిలాడస్ అనే ఉపగ్రహాలపై మంచు కింద సముద్రాల ఆనవాళ్లు ఉన్నట్లు కనిపెట్టింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సౌర తుపాను!.. జీపీఎస్, రేడియో సిగ్నళ్లకు అంతరాయం
న్యూయార్క్: సౌర తుపాను మంగళవారం భూమిని తాకనున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే జీపీఎస్, రేడియో సిగ్నళ్ల ప్రసారంలో అంతరాయం తప్పదు. ఈ నెల 19న సూర్యగోళం నుంచి విడుదలయ్యే పాము ఆకారంలోని ఫిలమెంట్ (సౌర తుపాను) ప్రభావం నేరుగా భూమికి ఢీకొట్టే ఆస్కారముందని డాక్టర్ తమిథా స్కోవ్ చెప్పారు. దీనివల్ల భూమిపై పలు ప్రాంతాల నుంచి ఆకాశంలో ధ్రువకాంతి (అరోరా) వీక్షించవచ్చని అన్నారు. అనంతరం మరికొన్ని చిన్నపాటి సౌర తుపాన్లు విరుచుకుపడే ప్రమాదముందన్నారు. ఈ నెల 20, 21న జి1–క్లాస్ తుపాను రావచ్చని స్పేస్‌వెదర్ సంస్థ ప్రకటించింది. సౌర తుపాను సమయంలో సూర్యుడి నుంచి వెలువడే శక్తి భూమిపై అన్ని విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏడాదిపాటు ఉత్పత్తి చేసే కరెంటు కంటే లక్ష రెట్లు అధికం. -
సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ‘సిగ్నల్’ అవస్థలు !
సూర్యాపేట, అర్వపల్లి (తుంగతుర్తి) : కరోనా వైరస్ కట్టడికి చేపట్టిన లాక్‌డౌన్‌తో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా అవస్థలు పడుతున్నారు. లాక్డౌన్ కారణంగా హైదరా బాద్‌తోపాటు దేశవ్యాప్తంగా సాఫ్ట్వేర్ కంపెనీలు మూసివేయడంతో అందులో పనిచేసే ఇంజనీర్లు స్వగ్రామాలకు వచ్చారు. అయితే కంపెనీలు వర్క్ ఫ్రం హోం చేయాలని ఆదేశించడంతో గ్రామాల్లో ఇంటర్ నెట్ సిగ్నల్ అందక నానా పాట్ల పడుతున్నా రు. బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బాండ్ ఇంటర్నెట్ కేబుల్ సేవలు అందక ప్రైవేట్ నెట్‌వర్క్‌ల సిగ్నల్‌పైనే ఆధారపడాల్సిన వస్తోందంటున్నారు. మొబైల్ ద్వారానే నెట్సేవలను ఉపయోగించుకుంటున్నా రు. అయితే ఇంటర్ నెట్ సిగ్నల్ అందక ఇంటి డాబాలు, ఎల్తైన ప్రదేశాలు, ఆరుబయట చెట్ల కింద ల్యాప్ టాప్‌లతో వర్క్ చేయాల్సిన పరిస్థితి తలెత్తిందని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో జాజిరెడ్డిగూడెం మండలంలోని అర్వపల్లి, కాసర్లపహడ్ గ్రామాల్లో కొందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇంటిడాబాలు, చెట్ల కింద కూర్చొని ల్యాప్‌టాపుల్లో ఆఫీస్‌లకు సంబంధించిన వర్క్ చేస్తున్నారు. అర్వపల్లిలో ఇంటి డాబాపై ల్యాప్‌టాప్‌లో వర్క్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ నీలం శ్రీనాథ్ -
పాదచారి భద్రత కోసం!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో పాదచారుల భద్రతకు పెద్దపీట వేయాలని ట్రాఫిక్ విభాగం అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న పోలీసులు పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు పై దృష్టి సారించారు. ఇప్పటికే ఠాణాల వారీగా అధ్యయనం పూర్తి చేసి ఎనిమిది ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల పరిధిలోని తొమ్మిది చోట్ల ఇవి అవసరమని తేల్చారు. ఈ మేరకు రూపొందించిన నివేదికలను జీహెచ్ఎంసీకి పంపారు. సిటీలో నిత్యం పాదచారుల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నగరంలో ఏటా రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారిలో పాదచారులది రెండో స్థానం. గత ఏడాది నగర పరిధిలో జరిగిన మొత్తం ప్రమాదాల్లో బాధితులుగా మారిన వారిలో పెడస్ట్రియన్స్ 36 శాతానికి పైగా ఉన్నారు. నగర ట్రాఫిక్ పోలీసులు ఏటా ప్రమాదాలపై విశ్లేషణ నిర్వహిస్తారు. ప్రమాదాలకు కారణమవుతున్న వాహనాలు, బాధితులుగా/మృతులుగా మారుతున్న వారిపై గణాంకాల ప్రకారం జాబితాలు రూపొందిస్తుంటారు. 2018కి సంబంధించి హైదరాబాద్ పోలీసులు రూపొందించిన రికార్డుల ప్రకారం సిటీలో చోటు చేసుకున్న ప్రమాదాలు రెండు వేలకు పైనే ఉన్నాయి. వీటిలో అనేక మంది మృత్యువాతపడ్డారు. రోడ్డు ప్రమాదాల్లో బాధితులుగా మారుతున్న వారిలో ద్విచక్ర వాహనచోదకులు తొలిస్థానంలో ఉండగా... రెండో స్థానం పాదచారులదే. గత కొన్నేళ్లుగా నమోదైన గణాంకాల ప్రకారం రోడ్డు ప్రమాద బాధితుల్లో పాదచారులే ఎక్కువగా ఉన్నారు. సిటీలో గత ఏడాది మొత్తం 2540 ప్రమాదాలు చోటు చేసుకోగా... 2550 మంది బాధితులుగా మారారు. వీటిలో ప్రమాదాలబారిన పడిన పాదచారుల సంఖ్య 924. మొత్తమ్మీద రోడ్డు ప్రమాద బాధితుల్లో 36 శాతం, మృతుల్లో 43 శాతం పాదచారులే ఉంటున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు ట్రాఫిక్ విభాగం అధికారులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మెహదీపట్నం రైతు బజార్ వద్ద ఓ పెలికాన్ సిగ్నల్ అందుబాటులో ఉంది. దీనికి తోడు మరిన్ని ఏర్పాటు చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా ఠాణాల వారీగా అధ్యయనం చేసిన అధికారులు మరో తొమ్మిది చోట్ల ఇవి అవసరమని తేల్చారు. ఆయా రహదారులపై ఉండే రద్దీతో పాటు రోడ్డు వెడల్పును పరిగణలోకి తీసుకుని ఈ పాయింట్స్ నిర్ధారించారు. గతంలో అక్కడ చోటు చేసుకున్న పాదచారుల ప్రమాదాలను లెక్కించారు. ఇప్పటికే దాదాపు ప్రతి కీలక జంక్షన్‌లోనూ పెడస్ట్రియన్ టైమ్‌తో సిగ్నల్స్ పని చేస్తున్నాయి. దీని ప్రకారం నిర్ణీత సమయానికి ఒకసారి జంక్షన్లో ఉండే అన్ని సిగ్నల్స్లోనూ రెడ్‌లైట్ వెలిగి వాహనాలు ఆగిపోతాయి. ఆ సమయంలో ప్రత్యేక శబ్ధంతో పెలికాన్ సిగ్నల్ వెలుగుతూ పాదచారులు రోడ్డు దాటేందుకు సహకరిస్తుంది. ఇవి దాదాపు అన్ని జంక్షన్స్‌లోనూ అందుబాటులో ఉండటంతో తాజా అధ్యయనాన్ని జంక్షన్లు కాని ప్రాంతాల్లో నిర్వహించారు. అయితే వీటిలో ఏ తరహాకు చెందిన పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలన్నది ఇంకా నిర్ణయించలేదు. పాదచారులు రోడ్డు దాటడానికి ఉపకరించే పెలికాన్ సిగ్నల్స్ సాధారణంగా రెండు రకాలైనవి ఉంటాయి. పాదచారులు రోడ్డు దాటాలని భావించినప్పుడు వారే రెడ్ లైట్ వచ్చేలా సిగ్నల్‌లోని బటన్స్ నొక్కే ఆస్కారం ఉన్నవి మాన్యువల్‌గా పని చేస్తుంటాయి. మరోపక్క నిర్ణీత సమయం తర్వాత కొన్ని సెకన్ల పాటు అన్ని రెడ్‌లైట్ వచ్చి పాదచారులు రోడ్డు దాటడానికి ఉపకరిస్తుంటుంది. ఈ రెండు విధాలైన సిగ్నల్స్‌లో ఉన్న మంచి చెడులతో పాటు వాటిని ఏర్పాటు చేసే ప్రాంతాల పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏ తరహాకు చెందినవి ఏర్పాటు చేయాలన్నది ఖరారు చేయనున్నారు. ప్రతిపాదిత ప్రాంతాలు ♦ బేగంపేట ట్రాఫిక్ ఠాణా పరిధిలోని మినిస్టర్స్ రోడ్లో ఉన్న కిమ్స్ హాస్పిటల్ ఎదురుగా ♦ సుల్తాన్‌బజార్ పోలీసుస్టేషన్ పరిధిలోని మహాత్మా గాంధీ బస్‌స్టేషన్ ఇన్‌గేట్ ఎదురుగా ♦ మలక్‌పేట పరిధిలో ప్రధాన రహదారిపై ఉన్న చర్మాస్ షోరూమ్ వద్ద ♦ నల్లకుంటలోని ట్రాఫిక్ పోలీసుస్టేషన్ పరిధిలోని వచ్చే తార్నాకలోని రైల్వే డిగ్రీకాలేజ్ సమీపంలో ♦ బహదూర్‌పుర పరిధిలోని తాడ్‌బండ్ వద్ద ఉన్న జూపార్క్ ప్రధాన ద్వారానికి అటు ఇటుగా ♦ తిరుమలగిరిలోని బోయిన్పల్లి మార్కెట్ ప్రాంతంలో ♦ ఫలక్‌నుమ ట్రాఫిక్ పోలీసుస్టేషన్ పరిధిలోని పిసల్‌బండ వద్ద ఉన్న డీఆర్డీఓ చౌరస్తా, బండ్లగూడ సమీపంలో ♦ మీర్‌చౌక్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న మాదన్నపేట మండి వద్ద -
కూటి కష్టాలు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఈపాస్ మిషన్స్ సిగ్నల్స్‌పై రేషన్ సరుకుల పంపిణీ ఆధారపడింది. ఒకప్పుడు కార్డు, డబ్బులు తీసుకెళ్తే సరుకులు అందజేసేవారు. ప్రస్తుతం పరిస్థితి మారింది. సిగ్నల్స్ ఉంటేనే సరుకులు పొందాల్సి వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కోసారి సిగ్నల్స్ సరిగా లేకపోవడంతో సరుకులు పంపిణీ ప్రక్రియ నిలిచిపోతోంది. ఫలితంగా పలుమార్లు కార్డుదారులు రేషన్ దుకాణాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. యంత్రాంగం చర్యల వల్ల ప్రజాధనం మిగులుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం కార్డుదారులు చాలా ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. వీటిని కూడా సరిచేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని జిల్లావాసులు వ్యక్తంచేస్తున్నారు. సమయ పాలన ఏదీ? చాలా రేషన్ దుకాణాల నిర్వాహకులు సమయపాలన పాటించడం లేదు. పట్టణం, పల్లె అనే తేడా లేకుండా ఉదయం, సాయంత్రం వేళల్లో విధిగా సరుకులు పంపిణీ చేయాలి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటలు, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు దుకాణాలు తెరిచే ఉండాలి. కానీ, సమయ పాలన ఎక్కడా అమలు కావడం లేదని ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. కొందరు డీలర్లు ఉదయం పూటకే పరిమితం చేస్తున్నారు. సాయంత్రం దుకాణం తెరవడం లేదు. మొబైల్ సిగ్నల్స్ లేకపోవడంతో షాపులను మూసివేయాల్సి వస్తోందని డీలర్లు చెబుతున్నారు. వేలి ముద్రల కష్టాలు బయోమెట్రిక్ విధానం మరికొందరు కార్డుదారులకు శాపంగా మారింది. వృద్ధులతో పాటు మట్టి, రాయి పని, మేస్త్రీలుగా పనిచేసే వారి వేలిముద్రలు చెరిగిపోవడం సహజం. ఇటువంటి కార్డుదారులు సరుకులు తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ–పోస్ యంత్రాలు వీరి వేలి ముద్రలు స్వీకరించడం లేదు. రెండుతో సరి! 2014 మే నెల వరకు రేషన్ దుకాణాల ద్వారా తొమ్మిది రకాల నిత్యావసర సరుకులు, వస్తువులు సరఫరా చేసేవారు. ఇప్పుడు సరుకుల సంఖ్యలో భారీగా కోతపడింది. చివరకు సరుకుల సంఖ్య రెండింటికే పరిమితం కావడంపై పేద కుటుంబాలు అసంతృప్తి వ్యక్తచేస్తున్నాయి. ఆహార భద్రత కార్డుదారులకు బియ్యం, కిరోసిన్ మాత్రమే అందజేస్తున్నారు. అంత్యోదయ కార్డుదారులకు దీనికి అందనంగా చక్కెర పంపిణీ చేస్తున్నారు. మిగిలిన సరుకులను కూడా అందజేస్తే తమకు భారం తప్పుతుందని కార్డుదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కార్డులను మరిచారు కొత్త రేషన్‌కార్డులు ఇంకా అందడం లేదు. దాదాపు ఏడాదిగా దరఖాస్తు చేసేకునే ప్రక్రియ కూడా నిలిచిపోయింది. కనీసం కార్డుల్లో చేర్పులు, మార్పులకు కూడా అవకాశం లేకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. చాలామంది లబ్ధిదారులు మీ–సేవ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. అంతేగాక ఇప్పటికే రేషన్ పొందుతున్న వారు ఇంటర్నెట్ పత్రాలపై ఆధాపడుతున్నారు. కనీసం వీరు కూడా శాశ్వత కార్డులకు నోచుకోవడం లేదు. రేషన్‌కార్డులు అందజేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా ఇంతవరకు అమలు కాలేదు. 15 రోజుల బెంగ ప్రతినెలా ఒకటి నుంచి 15వ తేదీల్లోపే రేషన్ సరుకులు పంపిణీ చేస్తామన్న ప్రభుత్వ నిర్ణయంతో కార్డుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ విధానాన్ని గత నెలలో అమలు చేశారు. సెలవులు అధికంగా రావడం వల్ల 17వ తేదీ వరకు సరుకులు అందజేసినా.. చాలా మంది వాటికి దూరమయ్యారు. ఈ నెల నుంచి నిక్కచ్చిగా 15వ తేదీ వరకే పంపిణీ చేయాలని స్పష్టమైన ఆదేశాలు అందడంతో కార్డుదారుల్లో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా కూలీ పనులకు వెళ్లేవారు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికే సిగ్నల్స్ సరిగా ఉండడం లేదు. పొట్టకూటి కోసం కూలీలు ఉదయం వెళ్లి చీకటి పడ్డాక ఇంటికి చేరుకుతుంటారు. ఇటువంటి వారికి పంపిణీ రోజుల కుదింపు శరాఘాతంగా మారుతోంది. కనీసం ప్రతినెలా 20వ తేదీ వరకైనా సరుకులు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక్కోకార్డుదారునికి 18 నిమిషాలు మొయినాబాద్ (చేవెళ్ల): మొబైల్ సిగ్నల్స్ సమయానికి అందకపోవడంతో చాలా మంది రేషన్ షాపులకు రోజుల తరబడి తిరుగుతున్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. మొయినాబాద్ మండల కేంద్రంలోని రేషన్ షాపును పరిశీలించగా.. రేషన్ తీసుకునేందుకు సుమారు యాబై మంది వరుసలో నిలిచి ఉన్నారు. సిగ్నల్స్ లేకపోవడంతో ఒక్కో కార్డుదారుడు రేషన్ సరుకులు పొందడానికి 18 నిమిషాల సమయం పట్టింది. మొయినాబాద్‌లో 700 రేషన్ కార్డులు ఉన్నాయి. అయితే ఈ నెల 1వ తేదీ నుంచే రేషన్ ఇవ్వాల్సి ఉండగా ఈ పాస్ మిషన్‌ను సాఫ్ట్వేర్ మార్పుకోసం తీసుకెళ్లి సోమవారం ఇచ్చారు. అదేరోజు సాయంత్రం, మంగళవారం సరుకుల పంపిణీకి డీలర్ ప్రయత్నించగా సిగ్నల్ సరిగా రాక కేవలం 50 మంది వరకు మాత్రమే అందజేశారు. 15వ తేదీ వరకు మాత్రమే రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలివ్వడంతో ఆ గడువులోగా పంపిణీ ఎలా పూర్తిచేయాలో అర్థంకావడం లేదని డీలర్ పేర్కొన్నాడు. వేలి ముద్రలు పడలేదని.. నా వేలి ముద్రలు పడడం లేదని ఈ నెల బియ్యం ఇవ్వలేదు. నాకు కొడుకులు లేరు. నా భర్త కూడా చనిపోయాడు. కార్డుపై నెలకు ఇచ్చే 35 కిలోలపై ఆధారపడి బతుకుతున్నాను. ఈ నెలలో సరుకులు ఇంకా ఇవ్వలేదు. ఇస్తారో లేదో కూడా చెప్పడంలేదు. – మొదళ్ల రుక్కమ్మ, మల్కారం, శంషాబాద్. 15 రోజులే షాప్ తీస్తున్నారు కూలికి వెళ్లి తిరిగి వచ్చేలోగా దుకాణాన్ని మూసి వేస్తున్నారు. బయో మెట్రిక్ విధానం అని వేలిముద్ర తీసుకొని బియ్యాన్ని ఇస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో సిగ్నల్స్ సరిగ్గా లేకపోవడంతో గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. దీంతో బియ్యం కోసం రెండు మూడు రోజులు రేషన్ దుకాణానికి వెళ్లాల్సి వస్తుంది. – గోవింద్, కేశంపేట ఈ–పాస్ మిషన్‌తో ఇబ్బందులు సిగ్నల్స్ లోపం, సర్వర్ సమస్యతో ఈ పాసు మిషన్ సక్రమంగా పనిచేయడం లేదు. పైగా నిత్యం కూలి పని చేసే లబ్ధిదారుల చేతి వేలి ముద్రలు రావడం లేదు. దీంతో వారికి రేషన్ సరుకులు సకాలంలో ఇవ్వలేక పోతున్నాం. కొంత మంది వృద్ధులకు కూడా వేలి ముద్రలు రావడం లేదు. ప్రతినెల 15వ తేదీలోపు సరుకులు ఇవ్వాలని నిబంధన. ఆ తరువాత వచ్చిన లబ్ధిదారులకు సరుకులు ఇవ్వడం కుదరదు. దీంతో లబ్ధిదారులు సరుకులు ఉండి కూడా ఎందుకు ఇవ్వవంటూ మాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. – సాతిరి సత్తయ్య, రేషన్ డీలర్, ఆరుట్ల -
ఫ్రీ జంక్షన్స్..ఫ్రీ టర్న్
గోల్కొండ క్రాస్‌రోడ్డు నుంచి సచివాలయానికి వెళ్లేందుకు కిశోర్ వాహనంపై బయలుదేరగా యూటర్న్ చాలా దూరంలో కన్పించగా...రూట్ మార్చాడు. గాంధీనగర్ నుంచి వెళ్లి అశోక్‌నగర్, ఇందిరాపార్కు మీదుగా సచివాలయం వెళ్లాలనుకున్నాడు. కానీ అశోక్‌నగర్ జంక్షన్ దాటడానికి అతడికి 15 నిమిషాలు పట్టింది. ఇలా గమ్యం చేరేలోగా పలు జంక్షన్లలో ట్రాఫిక్ జామ్‌లతో దాదాపు 45 నిమిషాల సమయం వృథా అయింది. ♦ నగర జంక్షన్లలో ట్రాఫిక్ సమస్యల కారణంగా తలెత్తు్తతున్న ఇబ్బందులకు ఇదో ఉదాహరణ. ఇలాంటి వాటిని అధిగమించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఈ మేరకు సమస్యాత్మకంగా ఉన్న 100 జంక్షన్లలో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించింది. తొలుత 34 జంక్షన్లలో విస్తరణ పనులు ప్రారంభించనుంది. ఇందుకు రూ.109 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. సాక్షి, సిటీబ్యూరో: నగరంలో పలు జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సమస్యల కారణంగా వాహనాలు సాఫీగా ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. ఈ పరిస్థితిని నివారించేందుకు జంక్షన్ల విస్తరణ..అభివృదిపనులు చేపట్టాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. నగరవ్యాప్తంగా దాదాపు 250 జంక్షన్లుండగా, వాటిల్లో 100 చోట్ల అభివృద్ధి పనులు చేయాలని నిర్ణయించింది. అర్బన్ జంక్షన్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ (యూజేఐపీ)లో భాగంగా ఈ జంక్షన్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. చాలా ప్రాంతాల్లో భూసేకరణ జరపాల్సి ఉండటంతో అందుకు ఎంతో సమయం పట్టనుంది. దీంతో భూసేకరణ సమస్యలు లేని ప్రాంతాల్లో తొలిదశలో జంక్షన్ల అభివృద్ధి పనులు చేసేందుకు సిద్ధమైంది. అలాంటి 34 జంక్షన్లను గుర్తించారు. ఇప్పటి వరకు ఐదు ప్రాంతాల్లో మాత్రం పనులకు శ్రీకారం చుట్టారు. మిగతా ప్రాంతాలకు సంబంధించి అంచనాలు, అనుమతుల మంజూరు వంటి దశల్లో ఉన్నాయి. మలిదశలో భూసేకరణ సమస్యలు తక్కువగా ఉన్న 30 జంక్షన్లలో, మిగతావాటిని ఆతర్వాతి దశలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. తొలిదశలో చేపట్టనున్న పనులకు రూ.109 కోట్లు ఖర్చుకాగలదని ప్రాథమికంగా అంచనా వేశారు. జీహెచ్ఎంసీ బడ్జెట్ పరిస్థితి దయనీయంగా ఉండటంతో రూ.100 కోట్లు తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీయూఎఫ్ఐడీసీ)నుంచి రుణంగా తీసుకోవాల్సిందిగా మునిసిపల్ మంత్రి కేటీఆర్ సూచించడంతో అధికారులు అందుకు సిద్ధమయ్యారు. జంక్షన్ల అభివృద్ధి ఇలా.. ⇒ ప్రధానంగా జంక్షన్చుట్టూ వంద మీటర్లకు తగ్గకుండా రోడ్లను వెడల్పు చేస్తారు. ⇒ ట్రాఫిక్ సాఫీగా సాగేలా నేరుగా వెళ్లే రోడ్డుతోపాటు కుడి, ఎడమవైపులకు వెళ్లే రోడ్లను కూడా విస్తరిస్తారు. ⇒ పాదచారులకు ప్రాధాన్యతనిస్తూ జంక్షన్ల వద్ద ఫుట్‌పాత్‌లు, రెయిలింగ్స్ ఏర్పాటుచేసి, నిర్దేశిత ప్రాంతంలోనే రోడ్డు దాటే ఏర్పాటు చేస్తారు. ⇒ జంక్షన్ల వద్ద ఏ దారి ఎటువైపు వెళ్తుందో సూచించేలా సైనేజీలతోపాటు పచ్చదనాన్ని అభివృద్ధి చేస్తారు. ⇒ రెడ్‌సిగ్నల్ పడినప్పుడు పాదచారులు రోడ్డు దాటుతారు కాబట్టి, అప్పటి వరకు వారు వేచి ఉండేందుకు సదుపాయంగా తగిన ప్లాట్‌ఫామ్స్ కూడా నిర్మిస్తారు. తొలిదశలో అభివృద్ధిచేయనున్న జంక్షన్లు.. 1.సుచిత్ర 2. ఐడీపీఎల్ 3.సిటీకాలేజ్ 4.అశోక్‌నగర్ 5.సైబర్‌సిటీ(ఖానామెట్) 6. ప్యారడైజ్ 7. హిమ్మత్‌పురా(శాలిబండ) 8.పురానాపూల్ 9.ఎన్ఎఫ్సీ 10.హైదర్‌గూడ(అత్తాపూర్) 11. కర్మన్‌ఘాట్ 12. బీఎన్ రెడ్డి 13. షెనాయ్ నర్సింగ్‌హోమ్ 14. ఐఐఐటీ 15. నిజాం కాలేజ్ 16. వీఎస్టీ 17. ఆజామాబాద్ 18. హస్తినాపురం 19. కవాడిగూడ 20. ఫీవర్ హాస్పిటల్ 21. రాణిగంజ్ 22. ఎతెబార్ చౌక్ 23. బీబీ బజార్ 24. అలీ కేఫ్ 25. బోరబండ బస్టాప్ 26. శివాజీ బ్రిడ్జి(దారుల్షాఫా) 27. మదీన 28. కేపీహెచ్‌బీ టెంపుల్ బస్టాప్ 29. రోడ్ నెంబర్ 6(అంబర్‌పేట) 30. బాలాజీనగర్ 31. రామంతాపూర్ చర్చి టి 32. నర్సాపూర్ 33. వీటీ కమాన్ 34. జోహ్రాబీ దర్గా. నగరంలో మూడు రోడ్ల జంక్షన్ల నుంచి 12 మార్గాల నుంచి వచ్చి కలిసే జంక్షన్లు కూడా ఉన్నాయి. వాటిలో ప్రధానంగా.... ⇒ నాలుగు కంటే ఎక్కువ రోడ్లు వచ్చి కలిసేవి ⇒ నాలుగు రోడ్ల జంక్షన్లు (చౌరస్తాలు) ⇒ మూడు రోడ్ల టీ జంక్షన్లు ⇒ మూడు రోడ్ల వై జంక్షన్లు ఈ జంక్షన్లలో వాహనదారులు ముందుకు కదిలేందుకు ఎంతో సమయం పడుతోంది. వీటిల్లో కొన్నింటికి ఇటీవల సిగ్నళ్లు లేకుండా కొంత దూరం ముందుకు తీసుకెళ్లి యూటర్న్ ఇచ్చినప్పటికీ సమస్య తగ్గకపోగా కొన్ని చోట్ల మరింత తీవ్రంగా మారింది. తార్నాక, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ తదితర ప్రాంతాల్లో యూటర్న్ సిస్టం ఫెయిలైంది. -
ఎడమ కుడైతే ప్రాణాంతకమే..!
- రైల్వేలో సిగ్నళ్ల తారుమారుతో ప్రమాద ఘంటికలు - ముందే గుర్తించే సూచిక బోర్డులు కనిపించవు.. - గుర్తించకుండా ముందుకెళ్తున్న లోకో పైలట్లు - ట్రాఫిక్ రద్దీతో ప్రయాణ నిడివి పెరిగి తగ్గుతున్న విశ్రాంతి సమయం - దక్షిణ మధ్య రైల్వే జీఎంకు లోకో పైలట్ల ఫిర్యాదు - సిగ్నళ్ల సమస్యల పరిష్కారానికి చర్యలు.. సాక్షి, హైదరాబాద్: రెడ్ సిగ్నల్ పడ్డా సిగ్నళ్లను చూసుకోకుండా లోకోపైలట్లు రైలును ముందుకు పోనిస్తే.. వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో దీపం కావాల్సిందే.. ఇటీవల వరంగల్‌లో రెడ్ సిగ్నల్ పడినా రైలు ముందుకు వెళ్లిన విషయం ఇప్పుడు రైల్వే శాఖలో కలకలం సృష్టిస్తోంది. అయితే దీని వెనుక కారణాలు అన్వేషించేందుకు రైల్వే అధికారులు విచారణ చేపట్టారు. అలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ నేరుగా లోకోపైలట్‌తో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా లోకోపైలట్లు వారి ఇబ్బందులు, సమస్యలను జీఎంతో చెప్పుకొన్నారు. లోకోపైలట్లు చెప్పిన అంశాలను రైల్వే బోర్డు దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 40 మంది లోకోపైలట్లతో భేటీ అయ్యారు. లోకోపైలట్లు చెప్పిన అంశాలు.. సాధారణంగా పట్టాలకు ఎడమవైపు సిగ్నల్ స్తంభాలు ఉంటా యి. సిగ్నళ్లను గమనిస్తూ లోకోపైలట్లు రైళ్లను నడుపుతారు. అయితే కొన్నిచోట్ల ఎడమవైపు స్థలం లేదనో, మరే ఇతర సమస్యలతోనో వాటిని కుడివైపు ఏర్పాటు చేశారు. కుడివైపు సిగ్నళ్లుండే విషయం ముందుగానే పైలట్లు గమనించేలా సూచికలను ఏర్పాటు చేయాలి. ఆ సూచికలు కనిపించట్లేదని లోకోపైలట్లు చెప్పారు. అవి సులభంగా కనిపించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరారు. సూచికలు కనిపించకపోవడంతో కుడివైపు సిగ్నళ్లు ఉన్న విషయం ఆలస్యంగా గుర్తిస్తున్నట్లు కొందరు జూనియర్ లోకోపైలట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్‌తో విశ్రాంతి కొరవ.. రెండో లైన్ అందుబాటులో లేని చోట్ల రైళ్ల ట్రాఫిక్ ఎక్కువగా ఉండి గమ్యం చేరటంలో జాప్యం జరుగుతోంది. దీంతో డ్యూటీకి డ్యూటీకి మధ్య విరామం తగ్గి విశ్రాంతి సమయం సరిపోవట్లేదని లోకోపైలట్లు పేర్కొన్నారు. లోకోపైలట్లు కొరత వల్ల కూడా కొన్ని చోట్ల విశ్రాంతి లేకుండానే వెంటనే డ్యూటీలకు రావాల్సిన పరిస్థితులు అప్పుడప్పుడు ఉంటున్నాయని కొందరు వాపోయారు. వీటితోపాటు సెలవులు, ఆరోగ్య సమస్యలు, క్యాబిన్లో వేడిమి, చలిలాంటి వాతావరణాలను తట్టుకునే ఏర్పాటు లేకపోవటం చాలా ఇబ్బందులకు గురిచేస్తోందని చెప్పారు. సిగ్నలింగ్ విభాగంతో సమన్వయ లోపం వంటి అంశాలను జీఎం దృష్టికి తెచ్చారు. దీంతో తన పరిధిలో ఉన్న అంశాలను వెంటనే పరిష్కరించేందుకు ఆయా విభాగాధిపతులతో జీఎం భేటీ అయి ఆదేశాలు జారీ చేశారు. పెద్ద సమస్యల పరిష్కారంపై రైల్వేబోర్డును ఆశ్రయించాలని నిర్ణయించారు.