కాసర్లపహాడ్‌లో చెట్టు కింద కూర్చొని వర్క్ చేస్తున్న బుషిపాక శ్రీనివాస్
సూర్యాపేట, అర్వపల్లి (తుంగతుర్తి) : కరోనా వైరస్ కట్టడికి చేపట్టిన లాక్‌డౌన్‌తో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కూడా అవస్థలు పడుతున్నారు. లాక్‌డౌన్ కారణంగా హైదరా బాద్‌తోపాటు దేశవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ కంపెనీలు మూసివేయడంతో అందులో పనిచేసే ఇంజనీర్లు స్వగ్రామాలకు వచ్చారు. అయితే కంపెనీలు వర్క్ ఫ్రం హోం చేయాలని ఆదేశించడంతో గ్రామాల్లో ఇంటర్ నెట్ సిగ్నల్ అందక నానా పాట్ల పడుతున్నా రు. బీఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బాండ్ ఇంటర్నెట్ కేబుల్ సేవలు అందక ప్రైవేట్ నెట్‌వర్క్‌ల సిగ్నల్‌పైనే ఆధారపడాల్సిన వస్తోందంటున్నారు. మొబైల్ ద్వారానే నెట్‌సేవలను ఉపయోగించుకుంటున్నా రు. అయితే ఇంటర్ నెట్ సిగ్నల్ అందక ఇంటి డాబాలు, ఎల్తైన ప్రదేశాలు, ఆరుబయట చెట్ల కింద ల్యాప్ టాప్‌లతో వర్క్ చేయాల్సిన పరిస్థితి తలెత్తిందని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో జాజిరెడ్డిగూడెం మండలంలోని అర్వపల్లి, కాసర్లపహడ్ గ్రామాల్లో కొందరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఇంటిడాబాలు, చెట్ల కింద కూర్చొని ల్యాప్‌టాపుల్లో ఆఫీస్‌లకు సంబంధించిన వర్క్ చేస్తున్నారు.
అర్వపల్లిలో ఇంటి డాబాపై ల్యాప్‌టాప్‌లో వర్క్ చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నీలం శ్రీనాథ్
Comments
Please login to add a commentAdd a comment