Silent strike
-
సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కట్టడికి, రైతు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టేలా చూడాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు అఖిలపక్ష నాయకులు విజ్ఞప్తి చేశారు. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ రాష్ట్ర నాయకురాలు పశ్య పద్మ రాజ్‌భవన్‌లో సోమవారం గవర్నర్‌ను కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. కరోనా వ్యాప్తిని నివారించేందుకు లాక్‌డౌన్‌తో పాటు వైద్య వ్యవస్థను బలోపేతం చేయడానికి లాక్డౌన్ కాలాన్ని ఉపయోగించేలా చూడాలని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల ద్వారా పేదలకు ఇచ్చే సహాయాన్ని పెంచాలని కోరారు. ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని పెంచేందుకు మరింత పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. ధాన్యం కొనుగోలు అస్తవ్యస్తంగా ఉందని, గోనె సంచులు లేక, ట్రాన్స్‌పోర్టు అందక, హమాలీలు దొరక్క కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని, దాని నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని విన్నవించారు. అఖిలపక్ష నాయకులు లేవనెత్తిన ఈ సమస్యలు వెంటనే పరిష్కారం అయ్యేలా చూడాలని ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ పేర్కొన్నారు. నేడు టీజేఎస్ మౌన దీక్ష రాష్ట్రంలో కరోనా వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, ఆకలి, రైతు, వలస కూలీల అవస్థల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఈనెల 5న టీజేఎస్ ఆ«ధ్వర్యంలో మౌన నిరసన దీక్ష నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జి.వెంకట్‌రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పార్టీ కార్యాలయంలో టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో ఈ దీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
మొగుడి కోసం మౌన పోరాటం
హిందూపురం అర్బన్ : వరంగల్‌కు చెందిన సంయుక్త అనంతపురం జిల్లా హిందూపురంలోని తమ అత్తారింటి ఎదుట మౌన దీక్షకు కూర్చున్నారు. నాలుగు రోజులుగా ఆమె దీక్ష కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... నా పెళ్లి హిందూపురానికి చెందిన డాక్టర్ జక్కా నరేంద్రకుమార్‌తో 2006లో అయింది. 2008లో మాకు పాప ప్రణవి పుట్టింది. ఉన్నత విద్య కోసం మా ఆయన లండన్ వెళ్లారు. నన్ను కూడా వెంట తీసుకెళ్లారు. అక్కడ మా మధ్య సఖ్యత కుదరక వెనక్కి వచ్చేశా. అప్పటి నుంచి మా తల్లిదండ్రులు, అన్న కలసి కాపురాన్ని హైదరాబాద్‌కు మార్చి నన్ను ఎంబీబీఎస్ చదివించారు. 2010లో హైదరాబాద్‌లో స్థిరపడ్డాక నరేంద్రను కూడా హైదరాబాద్‌కు వచ్చేయమన్నాం. అందుకు అతను అంగీకరించలేదు. హిందూపురంలోనే ప్రాక్టీస్ చేస్తానని చెప్పారు. ఆ తరువాత ఆయన కోర్టును ఆశ్రయించారు. నేనను కాపురానికి రావడం లేదని, ఫ్యామిలీ రైట్స్(ఆర్‌హెచ్‌సీ) కావాలని కోరారు. ఈ కేసు 2012 వరకు సాగింది. కోర్టులో రెండుసార్లు కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. అయినా మా సంసారం కుదుట పడకపోవడంతో నా భార్య నుంచి విడాకులు ఇప్పించాలంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో నేను 2012లో తిరిగి భర్త వద్దకు వస్తే ఆయన నన్ను ఇంట్లోకి పిల్చుకోకపోగా, గొడవపెట్టుకని నా సామన్లు బయటకు పడేశారు. రెండో పెళ్లి చేసుకున్నాడని తెలిసి వచ్చా.. నా భర్త నరేంద్ర అనంతపురానికి చెందిన అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడని, వారికి మూడు నెలల బాబు కూడా ఉన్నాడని తెలిసి వచ్చా. నాకు, నా బిడ్డకు అన్యాయం చేశారు. మాకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని ఆమె అంటున్నారు. పరస్పర ఫిర్యాదులు నా భార్య ఆస్పత్రి ఎదుట హంగామా చేస్తోందని అతను వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, నాకు, నా బిడ్డకు న్యాయం చేయాలంటూ సంయుక్త కూడా వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డాక్టర్ నరేంద్ర ఏమంటున్నారంటే... నేను ఎవరికీ అన్యాయం చేయలేదు. పెళ్ల య్యాక కాపురానికి రాకుండా ఆమె అమ్మానాన్నల వద్దే ఉంది. ఇప్పుడు నా పరువు తీయడానికి క్లినిక్ వద్దకు వచ్చి కూర్చుంది. విడాకు ల కేసు కోర్టులో నడుస్తోంది. కోర్టు ఏం తీర్పు చెబితే నేను దానికి కట్టుబడి ఉంటా. నేను రెండో పెళ్లి చేసుకున్నట్లు ఆమె ఆరోపిస్తోంది. ఆమె రుజువు చూపాలి. నా బిడ్డపై ప్రేమతోనే ఆస్పత్రికి ప్రణవి అనే పేరు కూడా పెట్టుకున్నాను. నా బిడ్డకు అన్యాయం చేయను. -
ప్రియుడి కోసం..
పత్తాలేని యువకుడి కుటుంబ సభ్యులు సుందరాడ(తెర్లాం రూరల్) : ప్రేమించిన వాడితో పెళ్లి చేయాలని కోరుతూ సుందరాడ గ్రామానికి చెందిన పద్మ చేపట్టిన మౌనదీక్ష సోమవారం నాటికి 13వ రోజుకు చేరుకుంది. వివరాల్లోకి వెళితే.. సుందరాడ గ్రామానికి చెందిన పద్మ, అదే గ్రామానికి చెందిన శివాజీ ప్రేమించుకున్నారు. అయితే పద్మకు ఆమె తల్లిదండ్రులు పార్వతీపురం మండలం అడ్డాపుశీల గ్రామానికి చెందిన వేరే వ్యక్తితో వివాహం చేశారు. వివాహ అనంతరం భార్యాభర్తలు హైదరాబాద్ వెళ్లిపోయారు. కొద్ది రోజులు పోయిన తర్వాత శివాజీ హైదరాబాద్ వెళ్లి పద్మతో మళ్లీ పరిచయం పెంచుకున్నాడు. భర్తతో విడాకులు తీసుకుంటే పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. ఇదే విషయం పద్మ తన భర్తకు తెలియజేయడంతో ఇరువురు గ్రామ పెద్దల సమక్షంలో విడాకులు తీసుకున్నారు. అయితే ఇంతవరకు పెళ్లి చేసుకుంటానని చెప్పిన శివాజీ ప్రస్తుతం ముఖం చాటేశాడు. దీంతో పద్మ మళ్లీ పెద్దమనుషుల సమక్షంలో పంచారుుతీ పెట్టినా శివాజీ పెళ్లికి నిరాకరించడంతో ఈ నెల 13వ తేదీ నుంచి అతని ఇంటి ముందు మౌనదీక్ష చేస్తోంది. ఇదిలా ఉంటే పద్మ మౌనదీక్ష చేపట్టినప్పటినుంచే శివాజీ కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారు.