బైబై...కామిక్ కాన్
చిత్ర విచిత్రాలకు వేదికగా, నవ్వింతల కవ్వింతల మాలికగా అలరించి... సిటీలో జరిగిన మూడు రోజుల కామిక్ కాన్ ఫస్ట్ ఎడిషన్ సూపర్ హిట్టయింది. బాహుబలి సినిమా క్యారెక్టర్ల ప్రదర్శన, సిల్వర్ సర్ఫర్, గ్రీన్ లాంత్రెన్ బుక్స్‌తో పాపులరైన అమెరికన్ కామిక్ బుక్ రైటర్ రాన్ మార్జ్, న్యూయార్క్ బెస్ట్ సెల్లింగ్, అవార్డ్ విన్నింగ్ ఆథర్ వివేక్ తివారీ వంటి సెలబ్రిటీ రైటర్ల సెషన్స్‌తో అటు వినోదం ఇటు విజ్ఞానాల మిక్స్డ్ ఈవెంట్‌గా అలరించింది. చిన్నారుల అభిమాన కామిక్ , సూపర్‌హీరో, గేమింగ్ క్యారెక్టర్లు అక్కడ ప్రత్యక్షమై సందడి చేశారు.
సూపర్ లూజర్స్ కామెడీ ప్లే ఆకట్టుకుంది. సైనగిరి స్టూడియోస్ ది రోబోస్ ధర్మ, రాహుల్ ఫిలిప్ అందించిన లైవ్కాన్సెప్ట్ ఆర్ట్, సిద్సూద్ నిర్వహించిన ఫ్రీ స్టైల్ ర్యాపింగ్లు అలరించాయి. ఈవెంట్లో భాగంగా కాంటెస్ట్‌లలో లక్కీ విన్నర్లకు బహుమతులు అందించారు. గరుడ, ఐటమ్ ధమాకా, సెవెన్బీట్స్, డ్రాగన్ కింగ్, సర్వసంగ్రామ్ బుక్ లాంచ్‌లు సందడిగా సాగాయి. ఫంకీ డిజైన్స్, కలెక్టిబుల్ టాయ్స్ వంటి ఇంట్రెస్టింగ్ ఐటమ్స్‌తో ఏర్పాటు చేసిన ‘పాప్ కల్చర్ విలేజ్’ విజిటర్స్ అటెన్షన్ అందుకుంది. ఈ ఏడాది వచ్చిన స్పందన అద్భుతమైన ఇన్స్పిరేషన్ ఇచ్చిందని.. వచ్చే ఏడాది మరింత భారీగా సిటీలో నిర్వహిస్తామని కామిక్‌కాన్ ఇండియా ఫౌండర్ జతిన్ వర్మ చెప్పారు.