ట్యాక్స్ రిటర్న్స్ ఇక సులభం..
న్యూఢిల్లీ: పన్ను రిటర్నుల ఈ-వెరిఫికేషన్ ప్రక్రియను సరళతరం చేసే దిశగా ఆదాయ పన్ను విభాగం చర్యలు తీసుకుంది. బ్యాంకు ఖాతాలు, డీమ్యాట్ ఖాతాల వివరాలను సమర్పించడం ద్వారా కూడా ఐటీఆర్‌ల ఈ-వెరిఫికేషన్ కోడ్లను పొందే వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపింది. పన్ను చెల్లిం పుదారు తన బ్యాంకు ఖాతా నంబరు, ఐఎఫ్ఎస్సీ కోడ్, ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబరు వివరాలను ముందస్తుగా సమర్పిస్తే వాటిని ధ్రువీకరించుకున్న తర్వాత కోడ్లను ఈ-ఫైలింగ్ పోర్టల్ ఆయా చెల్లింపుదారుల ఫోన్ నంబరు, ఈమెయిల్‌కు పంపుతుంది.
డీమ్యాట్ విషయంలో పాన్ నంబరు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇంటర్నెట్ బ్యాం కింగ్, ఈమెయిల్ లేదా ఆధార్ నంబరు ద్వారా వన్ టైమ్ పాస్‌వర్డ్‌ను పొంది ఐటీఆర్‌లను ఎలక్ట్రానిక్ పద్ధతిలో పరిశీలించుకునే వీలు ఉంది. ఐటీ విభాగం. బెంగళూరులోని సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్‌కి పేపరు రూపంలో అక్నాలెడ్జ్మెంటు పంపే విధానానికి పూర్తిగా స్వస్తి చెప్పే దిశగా ఐటీ విభాగం ఈ చర్యలు చేపడుతోంది.