Sitaramapuram
-
రోజూ పేదల రక్తం కళ్ల చూస్తూ అన్నం తింటున్నావ్ ముద్దేలా దిగుతుంది బాబు
-
సంఘటనకు ముందే ఎస్ఐ వచ్చి ఎందుకు ఆపలేకపోయాడు... రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా..!
-
చంపేయమని ఆదేశించిన లోకేష్, బాబుపై కూడా కేసు పెట్టాలి
-
పోలీసులు చూస్తుండగానే నాటుతుపాకులతో సుబ్బారాయుడి హత్య
-
హామీలు తీర్చలేకే అరాచకాలు.. సిగ్గుండాలి చంద్రబాబు..! ముందు అన్న మాట మీద నిలబడు
-
మరో సర్కారీ హత్య.. పోలీసుల సాక్షిగా టీడీపీ నేతల కిరాతకం
సాక్షి ప్రతినిధి కర్నూలు: నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామాపురంలో శనివారం అర్ధరాత్రి 12.20 గంటలకు టీడీపీ నేతలు పోలీసుల సమక్షంలో వైఎస్సార్సీపీ నేత పసుపులేటి సుబ్బరాయుడు అలియాస్ పెద్దన్న(65) ఇంట్లోకి వెళ్లి బయటకు లాగి.. కత్తులు, రాడ్లు, రాళ్లతో దాడి చేసి కిరాతకంగా హత్య చేశారు. పోలీసులు గుడ్లప్పగించి చూస్తుండగా సుబ్బరాయుడు అతి దారుణంగా ప్రాణాలు కోల్పోయాడు. హత్య జరిగే ప్రమాదముందని మూడు గంటల ముందే పోలీసులకు సమాచారం ఇచ్చినా, కనీస చర్యలు తీసుకోకపోవడంతో ఈ దారుణం చోటుచేసుకుంది. హత్య జరిగిన తీరు, ఘటన పూర్వాపరాలు నిశితంగా పరిశీలిస్తే ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహం, పోలీసుల వైఫల్యమే ఇందుకు కారణమని స్పష్టమవుతోంది. బాధితులు, స్థానికుల కథనం మేరకు.. సీతారామాపురంలో రాత్రి 9.45 గంటలకు టీడీపీ నేత శేఖర్‌రెడ్డి వైఎస్సార్సీపీ నేత పెద్దిరెడ్డి ఇంటికి వెళ్లాడు. పెద్దిరెడ్డి ఇంట్లో లేకపోవడంతో మహిళలను ఇష్టానుసారం బూతులు తిట్టాడు. ఊళ్లో కేకలు వినపడటంతో వైఎస్సార్సీపీ నేత జయనారపురెడ్డి వెళ్లి మహిళలను దూషించడం సరికాదని చెప్పారు. దీంతో శేఖర్‌రెడ్డి వెనుదిరిగాడు. ‘నారపురెడ్డి, వైఎస్సార్సీపీ నాయాళ్ల కథ తేల్చాల్సిందే..’ అని ముఠాను పోగు చేశాడు. ఆ గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి నంద్యాలలో ఉంటే అతనికి సమాచారం ఇచ్చాడు. ఇదంతా గమనించిన జయనారపురెడ్డి.. ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్‌కు ఫోన్ చేసి పరిస్థితి వివరించాడు. ఫోన్ చేసిన 40 నిమిషాలకు ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, హోంగార్డుతో అక్కడికి వచ్చారు. టీడీపీ నేతలు గుంపులు గుంపులుగా వచ్చి శేఖర్‌రెడ్డి ఇంటి వద్ద పోగవుతుండటాన్ని చూస్తూనే ఉన్నారు. ఇంతలోనే శ్రీనివాసరెడ్డి మూడు కార్లతో తన ఇటుకల ఫ్యాక్టరీ, గోడౌన్ సమీపానికి చేరుకున్నారు. జయనారపురెడ్డిని పథకం ప్రకారం పక్కకు పంపి.. ఎస్ఐ నాగేంద్రప్రసాద్.. జయనారపురెడ్డిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. మహానంది పోలీసుస్టేషన్‌కు వెళ్లి, అక్కడ ఫొటో దిగి తన వాట్సాప్‌కు పంపాలని చెప్పారు. ఇక్కడ ఇంత జరుగుతుంటే తాను పోలీస్‌స్టేషన్‌కు వెళ్లడం ఏంటని.. పోలీసు బందోబస్తును పిలిపించండని నారపురెడ్డి కోరాడు. ‘సీఐ, డీఎస్పీకి ఫోన్ చేసినా స్పందించడం లేదు.. నువ్వు స్టేషన్‌కు వెళ్లు.. నేను చూసుకుంటా’ అని ఎస్ఐ చెప్పడంతో ఐదుగురితో కలిసి జయనారపురెడ్డి మహానంది స్టేషన్‌కు వెళ్లి ఫొటో దిగి ఎస్ఐకి పంపారు. నారపురెడ్డి ఊరు దాటగానే బుడ్డారెడ్డి శ్రీనివాసరెడ్డి ముఠా ఒక్కసారిగా ఊళ్లోకి దూసుకొచ్చింది. శ్రీనివాసరెడ్డి, శేఖర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, పుల్లారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, లక్ష్మిరెడ్డితో పాటు 30 మంది నేరుగా సుబ్బరాయుడి ఇంటిపై పడ్డారు. తొలుత సుబ్బరాయడిని ఇంట్లోంచి బయటికి లాక్కొచ్చారు. అడ్డొచ్చిన భార్య సుబ్బమ్మపై రాడ్లతో దాడి చేసి గాయ పరిచారు. ఆమె చేయి, కాళ్లకు గాయాలయ్యాయి. పోలీసులు జోక్యం చేసుకోకూడదని బెదిరిస్తూ శ్రీనివాసరెడ్డి ముఠా విధ్వంసం సృష్టించింది. అప్పటికే ఊళ్లో వాళ్లంతా అక్కడికి చేరుకున్నారు. మరో వైపు పోలీసులు చూస్తూనే ఉన్నారు. అందరి కళ్లెదుటే సుబ్బరాయుడిని కత్తులతో పొడిచి.. రాడ్లు, రాళ్లతో కొట్టి అతి కిరాతకంగా చంపేశారు. అనంతరం శ్రీనివాసరెడ్డి ముఠా ఊరు దాటి వెళ్లిపోయింది.హంతకులు పారిపోయాక స్పందిస్తారా?ఊళ్లో ఏం జరుగుతుందో తెలీక జయనారపురెడ్డి మౌనంగా పోలీస్‌స్టేషన్‌లో కూర్చుని ఉన్నాడు. ఇంతలో సుబ్బరాయుడి కుమారుడు ప్రసాద్ ఫోన్ చేసి ‘నాన్న ఇంగ లేడు. వాళ్లు సంపేసినారు’ అని బోరున విలపించాడు. దీంతో అర్ధరాత్రి 12.59కి జయనారపురెడ్డి ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణాకు ఫోన్ చేశాడు. ‘సీతారామాపురంలో టీడీపీ వాళ్లు దాడులు చేస్తున్నారని, చంపడానికి వచ్చారని 9.30 నుంచి ఎస్ఐకి చెప్పాం. సీఐ, డీఎస్పీకి కూడా చెప్పాం. బందోబస్తు పంపాలని కోరాం. అయినా పంపలేదు. మనిషిని చంపేశారు’ అని రోదించారు. జయనారపురెడ్డి అర్ధరాత్రి 1.02 గంటలకుకు మళ్లీ ఎస్పీకి ఫోన్ చేశాడు. శ్రీనివాసరెడ్డి కార్లు తమ ఇంటి ముందు నుంచి వెళుతున్నాయని, తన ఫోన్లోని సీసీ కెమెరాల ద్వారా చూస్తే తెలిసిందని వాళ్లు ఏ దారిలో వెళతారో కూడా చెప్పాడు. 1.08 గంటలకు మళ్లీ ఫోన్ చేసి, తాము ఎస్పీ ఆఫీసుకు వస్తున్నామని తెలిపారు. 3.18 గంటలకు మరోసారి ఫోన్ చేశాడు. హంతకుల ముఠాలోని ‘రమణ’ అనే వ్యక్తిని పట్టుకున్నామని, వాడిని అప్పగించడానికి ఎస్పీ ఆఫీసు వద్దకు వచ్చామని, బయటే ఉన్నామని చెప్పాడు. 3.20 గంటలకు ఎస్పీ తిరిగి జయనారపురెడ్డికి ఫోన్ చేశారు. ‘రమణ’ను 3వ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించాలని చెప్పారు. పోలీసులపై నమ్మకం లేదని మీకు అప్పగిస్తామని జయనారపురెడ్డి చెప్పారు. దీంతో కొందరు పోలీసులు వచ్చి రమణను ఎస్పీ ఆఫీసులోకి తీసుకెళ్లారు.నెత్తి నోరు కొట్టుకుని చెప్పా.. పట్టించుకోలేదు శనివారం రాత్రి 9.30 గంటలకు ఎస్ఐకి ఫోన్ చేశా.. ఎస్ఐ ముందే శేఖర్‌రెడ్డి మందిని గుంపు చేసినాడు. రాడ్లు తీసుకుని తిరుగుతున్నారు. బందోబస్తును పిలిపించు సార్ అని నెత్తి నోరు కొట్టుకుని చెప్పా.. సీఐ, డీఎస్పీ కూడా పట్టించుకోలేదు. నన్ను స్టేషన్‌కు వెళ్లి ఫొటో దిగి పంపమన్నారు. అలా ఎందుకు చెప్పాడో తెలీదు. నేను వెళ్లిన తర్వాత సుబ్బరాయుడిని చంపేశారని ఆయన కొడుకు ఫోన్ చేసి సెప్పి ఏడ్చాడు. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఈ హత్య జరిగి ఉండేది కాదు. – జయనారపురెడ్డి, వైఎస్సార్సీపీ నేతహత్య విషయం ఎమ్మెల్యేకు ముందే తెలుసా? ఎన్నికల ఫలితాల తర్వాత చెప్పినట్లు ‘అందరి కథా తేలుస్తా.. చర్మం వలుస్తా.. ఎవ్వర్నీ వదిలేదే లేదు’ అని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి హెచ్చరించిన నేపథ్యంలో ఈ హత్య ఆయనకు తెలిసే జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యను నివారించేందుకు సమయం ఉన్నా బందోబస్తు రాకపోవడం.. సీఐ, డీఎస్పీ మిన్నకుండిపోవడం, ఒక మనిషిపై హత్యకు తెగిస్తుంటే ఎస్ఐ ఫైరింగ్ ఓపెన్ చేయక పోవడం.. ఇవన్నీ చూస్తుంటే ఒక పథకం ప్రకారం వ్యవహరించి ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డితో ప్రధాన నిందితుడు బుడ్డారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి(ఫైల్) ముందుగానే ఎందుకు బందోబస్తు పంపలేదు?రాత్రి 9.30 గంటలకు గొడవ జరిగింది. జయనారపురెడ్డి పోలీసులకు అప్పుడే ఫోన్ చేసి చెప్పాడు. 10.10 గంటలకు ఎస్ఐ వచ్చాడు. ఎస్ఐ ముందే హత్యకు ప్రణాళికలు జరుగుతున్నా, ఎందుకు అదనపు బందోబస్తును పిలిపించలేకపోయాడు? సీఐకి విషయం తెలుసు. ఆపై డీఎస్పీ నోటీసుకు వెళ్లింది. అయినా ఎందుకు బందోబస్తు పంపలేదు? మూడు గంటల పాటు రాని బందోబస్తు 12.30 గంటలకు సుబ్బరాయుడు హత్య జరిగాక.. అదీ శ్రీనివాసరెడ్డి ముఠా ఊరు దాటిన తర్వాత మాత్రమే ఎందుకొచ్చింది? సీతారామాపురం నుంచి డీఎస్పీ, ఎస్పీ ఆఫీసుకు 12 కిలోమీటర్లు. 10 నిమిషాల్లో రావచ్చు. ఎందుకు 3 గంటల తర్వాత బందోబస్తు ఊళ్లోకి వచ్చింది? ఈ ప్రశ్నలకు పోలీసులు, ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాలి. -
నరసాపురం లేసులు.. ఒలింపిక్స్ వరకూ అల్లుకున్నాయి..
పారిస్ అంటే ఫ్యాషన్‌కు పుట్టినిల్లు. కానీ, మన తెలుగు మహిళలు ఆ ఫ్యాషన్ కేంద్రానికే ఫ్యాబ్రిక్స్ ఎగుమతి చేస్తున్నారు. పారిస్‌లో జరగనున్న ఒలింపిక్స్‌లో క్రీడాకారులు ఉపయోగించే లేస్ వస్త్రాలు, దిండ్లు, తువాళ్లు మన నరసాపురం నుంచి తయారయ్యి విమానం ఎక్కాయి. ఇదీ మన ఘనత.సూది మొనకు దారం తగిలించి చకచకా వారి మునివేళ్లు కదిలించారంటే చాలు వన్నెచిన్నెల లేసులు క్షణాల్లో కళ్లముందు ఆవిష్కృతమవుతాయి. ఔరా అనిపించేలా హ్యాండ్ మేడ్ ఉత్పత్తులు సిద్ధమవుతాయి. అబ్బురపరిచే అల్లికలతో గోదావరి జిల్లాలకు ఖండాంతర గుర్తింపు తెచ్చిన అతివల హస్త నైపుణ్యం ఇప్పుడు పారిస్‌లో జరగనున్న ఒలింపిక్స్ వరకూ చేరింది. ఆ ఘనతను సాధించింది జిల్లా, నరసాపురం రూరల్‌కి చెందిన మారుమూల గ్రామం సీతారామపురం.లేసుల పరిశ్రమబ్రిటిష్ కాలంలో నరసాపురం జలరవాణాకు‡కేంద్రంగా ఉండేది. అప్పట్లో ఇక్కడకు వచ్చిన క్రిస్టియన్ మిషనరీ సంస్థలు పేద మహిళలకు ఉపాధిగా లేసు అల్లికలు నేర్పించారు. కాలక్రమంలో ఈ పని పెద్ద పరిశ్రమగా విస్తరించింది. పేద, ధనిక తేడా లేకుండా తీరిక వేళల్లో కాలక్షేపంగా అల్లికలు సాగిస్తుంటారు. నరసాపురం కేంద్రంగా కోనసీమ, రాజ మహేంద్రవరం, భీమవరం ్రపాంతాల్లో వేలాది కుటుంబాలు ఈ హస్తకళ ద్వారా జీవనోపాధి పొందుతున్నాయి. ఈ పనిలో ఉన్న మహిళలకు తోడ్పాటును అందించేందుకు 2005లో నాటి సి.ఎం. వైఎస్ రాజశేఖరరెడ్డి సీతారాంపురం వద్ద లేస్‌పార్క్‌ను ్రపారంభించారు. టవల్స్, టేబుల్ క్లాత్స్, లంచ్ మ్యాట్స్, క్రోషే బ్యాగ్స్, డెకో కుషన్స్, బీచ్ కలెక్షన్స్ తదితర మన హ్యాండ్ మేడ్ లేసు ఉత్పత్తులకు విదేశాల్లో మంచి ఆదరణ ఉంది. నరసాపురం పరిసరాల్లో లేసు ఉత్పత్తులను ఎగుమతి చేసే కంపెనీలు వంద వరకు ఉన్నాయి. మారుతున్న ఫ్యాషన్, అభిరుచులు, ఆర్డర్లకు అనుగుణంగా తమ నైపుణ్యానికి మెరుగులు దిద్దుకుంటూ ట్రెండింగ్‌లో ఉంటూ చైనా, వియత్నాం దేశాలకు గట్టిపోటీనిస్తున్నారు గోదావరి జిల్లాల మహిళలు.. ఎంతో గర్వంగా ఉంది పారిస్ ఒలింపిక్స్‌కు మన లేసు, క్లాత్‌తో తయారుచేసిన ఉత్పత్తులు అందించే అవకాశం రావడం చాలా గర్వంగా ఉంది. ఈ లేస్ ఇండస్ట్రీని ప్రభుత్వాలు గుర్తించి వ్యవస్థీకృతం చేస్తే విదేశాల్లో మనదేశ మహిళల నైపుణ్యానికి గుర్తింపు వస్తుంది. ఒలింపిక్స్‌కు పని చేసే అవకాశాన్ని మహిళలు ఎంత సంతోషంగా స్వీకరించారంటే ప్రతి ఒక్కరూ తామే గోల్డ్‌మెడల్ సాధించినంత ఆనందంగా ఉన్నారు.– కలువకొలను రామ్చంద్రుడు, జేజే ఎక్స్‌పోర్ట్స్ అధినేతపదేళ్లుగా లేసు అల్లికలుమా చిన్నతనంలో మా అమ్మ, పిన్నమ్మలు అంతా కూడా లేసు అల్లికలు అల్లేవారు. నాకు అçప్పటి నుంచి అల్లికలపై అవగాహన ఉంది. గత 10 ఏళ్లుగా లేసు అల్లికలు చేస్తున్నాను. పిల్లలిద్దరినీ కూడా ఉన్నత చదువులు చదివించుకోగలుగుతున్నాం. ఇంట్లో పనులు అయ్యాక ఖాళీ సమయంలో లేసు అల్లికల ద్వారా కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి. – పులపర్తి లక్ష్మికుమారి, మొగల్తూరుపారిస్ వేదిక మీద మన లేసుఈ నెల 26 నుంచి పారిస్ వేదికగా ్రపారంభం కానున్న ఒలింపిక్స్ క్రీడా సంగ్రామంలో నరసాపురం ఉత్పత్తులు కొలువుదీరే అవకాశం దక్కింది. సీతారాంపురంలోని జేజే ఎక్స్‌పోర్ట్స్ సంస్థ కేంద్రం పరిధిలోని ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఫర్ హ్యాండీక్రాప్ట్స్ (ఈపీసీహెచ్) ద్వారా ఈ అర్డర్ సాధించినట్టు సంస్థ నిర్వాహకులు తెలిపారు. దాదాపు వంద రకాల డిజైన్లు పంపిస్తే వాటిలో ఆరు డిజైన్లను నిర్వాహకులు ఎంపిక చేశారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు, ప్రపంచ నలుమూలల నుంచి తరలివచ్చే సందర్శకులకు గుర్తుండిపోయే విధంగా ఒలింపిక్స్ థీమ్, లోగోలతో లేస్, ఫ్యాబ్రిక్లను ఉపయోగించి టవల్స్, డెకో కుషన్స్, బీచ్ కలెక్షన్స్, క్రోషే మ్యాట్స్ తదితర హ్యాండ్ మేడ్ ఉత్పత్తులను డిజైన్ చేసి సిద్ధం చేసి పారిస్‌కి పంపారు. త్వరలో మన లేసు ఉత్పత్తులు ఒలింపిక్స్ క్రీడాకారులతో పాటు సందర్శకుల చేతుల్లోకి చేరనున్నాయి. తమ ఉత్పత్తులకు అరుదైన గుర్తింపు దక్కడం పట్ల ఈ ్రపాంత మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు– విజయ్‌కుమార్ పెనుపోతుల, సాక్షి, భీమవరం.ఫొటోలు : సవరం కృష్ణానందం -
కౌలురైతును కాటేసిన కరెంట్
సీతారామపురం : ఆయనకు సెంటు పొలం లేదు. ఆస్తిపాస్తులు లేని నిరుపేద కుటుంబం. ఈ నేపథ్యంలో కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని సేద్యం చేస్తూ, వచ్చే అరకొర ఫలసాయంతో బతుకుబండి లాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయనను కరెంట్ కాటేసింది. కానరాని లోకాలకు తీసుకెళ్లిపోయింది. విద్యుదాఘాతానికి గురై పొలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. సీతారామపురంలోని పడమటివీధికి చెందిన ఆకుల రామయ్య(49)కు భార్య నాగేశ్వరమ్మ, పదహారేళ్ల కుమారుడు ఉన్నారు. వీరికి సెంటు పొలం కూడా లేకపోవడంతో రామయ్య నాలుగేళ్లుగా 4 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని సేద్యం చేస్తున్నాడు. రూ.17 వేల చొప్పున కౌలు చెల్లిస్తున్నాడు. ప్రస్తుతం ఆ భూమిలో కొంత మేర సజ్జ, వరి పంట సాగు చేస్తుండగా, మిగిలిన భూమిని సాగుకు సిద్ధం చేస్తున్నాడు. ఈ క్రమంలో పొలంలోని విద్యుత్ మోటారు మరమ్మతులకు గురైంది. దానికి మరమ్మతులు చేయించేందుకు మంగళవారం మెకానిక్‌ను పొలంలోకి తీసుకెళ్లాడు. మరమ్మతుల నేపథ్యంలో పొలం పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ను ఆపారు. పని పూర్తయిన తర్వాత రామయ్య ట్రాన్స్ఫార్మర్ ఆన్ చేయడానికి వెళ్లాడు. అయితే ఆన్ చేసే సమయంలో ప్రమాదవశాత్తు వైర్లు త గలడంతో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో సీతారాంపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఖాకీల పడగ నీడలో..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : పోలీసుల దాష్టీకంతో ఆ ఎనిమిది పల్లెలు క్షణ క్షణం భయంతో వణికిపోతున్నాయి. మగవాళ్లందరూ ఊళ్లలోంచి పారిపోవటంతో వృద్ధులు, మహిళలు, పిల్లలు బితుకుబితుకుమంటూ క్షణమొక యుగంలా బతుకుతున్నారు. కాకరాపల్లిలో ఈస్టుకోస్ట్ థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి వత్తాసు పలుకుతున్న కాంగ్రెస్ సర్కార్ ఆదేశాల మేరకు పోలీసులు గత నెల 31న అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో ఖాకీల పడగ నీడలో..ఇళ్లలోకి చొరబడి పలువురిని అరెస్ట్ చేసినప్పటి నుంచి హనుమంతనాయుడు పేట, ఆకాశలక్కవరం. బాలానాయుడు పేట, పోతినాయుడు పేట, యామలపేట, నవాబుపేట, సీతారామపురం(టెంకపేట), శీరపుపేట గ్రామాల్లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. పస్తుతం థర్మల్ విద్యుత్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరాహార దీక్షలు మాత్రమే జరుగుతున్నాయి. ఉద్రిక్త పరిస్థితులేవీ లేవు. అయినా ఎందుకు అరెస్ట్‌లు చేస్తున్నారో తెలియక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కాగా, హనుమంతునాయుడు పేటకు చెందిన శీరపు నరసింహమూర్తి, దల్ల చిన్న ఎర్రయ్య, కొయ్య ప్రసాదరెడ్డి, ఆకాశలక్కవరం గ్రామానికి చెందిన కప్ప గవర్రాజు, లింగూడు నాగేశ్వరావు, బాలానాయుడు పేటకు చెందిన బుడ్డెపు తేజారావు, నీలాపు అప్పలస్వామిలను 31 అర్ధరాత్రి అరెస్ట్ చేసి మరుసటి రోజు కోర్టులో హాజరు పరిచారు. వీరికి గురువారం బెయిల్ రాగా జైలు నుంచి బయటకు రాగానే పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో థర్మల్ గ్రామాల్లో భయోత్పాత్పం సృష్టించటమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టమవుతున్నది. పోలీసోళ్లు భయపెడుతున్నరు... పోలీసులు అరెస్ట్‌లు చేసిన గ్రామాలతోపాటు మరో ఐదు గ్రామాల్లో ‘సాక్షి ప్రతినిధి’ గురువారం పర్యటించారు. ఏ గ్రామంలోనూ యువకులు కనిపించలేదు. మహిళలు, వృద్ధులు దీనస్థితిలో ఇళ్ల ముందు, గోడల చాటున కూర్చొని కనిపించారు. ఎవరిని కదిలించినా ఒకటే మాట. ‘పోలీసోళ్లు ఇష్టమొచ్చినట్లు భయపెడుతున్నరు. బయటకు పోవాలంటేనే భయంగా ఉంది. మొగోళ్లు ఊళ్లు వదిలి వె ళ్లిపోయారు. పోలీసోళ్లు వెళితేనే తిరిగొస్తారు. గొడ్డూ గోదా ఎలాగున్నాయో చూడండి. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు’ అని పలువురు మహిళలు వాపోయారు. అడుగడుగునా పోలీసులు... సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం రైల్వేగేట్ వద్ద నుంచి జగన్నాథపురం గ్రామం వరకు సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో రోడ్డు వెంట పోలీసులు పహారా కాస్తూ కనిపించారు. ప్రతి ఊరి పొలిమేర వద్ద గస్తీ తిరుగుతున్నారు. ఎవరు వెళ్లినా.. ఎందుకొచ్చారంటూ కొరకొరగా చూస్తున్నారు. హనుమంతనాయుడుపేటలోకి వెళ్లేందుకు సాక్షి బృందం పొలిమేర వద్ద ఉన్న ప్రాథమిక పాఠశాల ఎదురుగా వాహనాన్ని ఆపింది. అయితే పోలీసులు ఇక్కడ ఆపేందుకు వీలులేదంటూ ఊరిబయటకు పంపేశారు. అక్కడ ఎవరూ నిలబడేందుకు వారు అంగీకరించలేదు. పాఠశాల గదులన్నీ పోలీసుల బ్యాగులతో నిండిపోయాయి. దీంతో టీచర్లు, పిల్లలు ఒకే హాలులో కిక్కిరిసి కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలీసులు ఎక్కడికక్కడ గుంపులు గుంపులుగా కూర్చున్నారు. తమ వాహనాలను రోడ్లపైనే నిలబెట్టారు. అక్కడి పరిస్థితులు చూస్తే ఎవరైనా భయపడాల్సిందే. ప్లాంట్ వాహనాలకు ప్రత్యేక బందోబస్తు తో లోపలికి తీసుకెళుతున్నారు. ప్రభుత్వ అధికారులు ప్లాంట్‌లోకి వెళ్లి అక్కడివారికి భరోసా ఇచ్చి రావటం కనిపించారు. లోపలికి వెళ్లేందుకు సాక్షి బృందాన్ని అనుమతించలేదు. సాక్షి ప్రతినిధి సంస్థ సీఈవోకు ఫోన్ చేస్తే ఒకసారి రింగయింది. రెండోసారి చేస్తే స్విచ్ ఆఫ్ చేసి ఉంది. ప్లాంట్ గేట్ ముందు పోలీసులు ప్రత్యేక టెంట్ వేసుకుని కాపలా కాస్తున్నారు. నిజానికి ప్లాంట్ వద్దకు రెండేళ్లుగా ఉద్యమకారులు, బాధితులు వెళ్లనేలేదు. పైగా సంస్థ వారు తమకు కేటాయించిన స్థలంలో నిలువెత్తు గోడలు నిర్మించారు. ఆ గోడల చుట్టూ పోలీసులు ఇనుప ముళ్ల కంచెలు వేశారు. ఏ విధమైన ఆందోళనలు లేనప్పటికీ ఈ స్థాయిలో పోలీసులను ఎందుకు మోహరించారన్నది తెలియటం లేదు. చిన్న సంఘటనకు అరెస్ట్‌లు.. భారీ సంఖ్యలో పోలీసులా!? వాస్తవానికి ఇటీవల కొంతమంది ఆందోళనకారులు, భారీ వాహనాలు గ్రామాల్లోని రోడ్లపై నుంచి ప్లాంట్ ఆవరణలోకి పోకుండా అడ్డుకున్నారు. రహదార్లు పూర్తిగా కుంగిపోతుండటంతో ఈ చర్య చేపట్టారు. దీంతో సంస్థ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే తక్షణం వందల సంఖ్యలో పోలీసులు దిగిపోయారు. బెయిల్‌పై విడుదలైన నిందితులు జైలు గోడలు దాటగానే మళ్లీ అరెస్ట్డిసెంబర్ 31న పోలీసులు అరెస్ట్ చేసిన ఏడుగురు కోర్టులో గురువారం బెయిల్ తీసుకున్నారు. బెయిల్ కాగితాలను నరసన్నపేటలోని సబ్‌జైలుకు తీసుకువెళ్లిన కానిస్టేబుల్ వాటిని జైలర్‌కు ఇవ్వగానే నిందితులను విడుదల చేశారు. కానీ వారు జైలు గోడ దాటగానే అక్కడే మధ్యాహ్నం నుంచి కాపుకాచి ఉన్న ఎస్ఐతోపాటు మరికొందరు పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఈ సంఘటన రుజువు చేస్తున్నది. మా మొగోళ్లెప్పుడొత్తారో.. ‘పోలీసోళ్లు పోవడం లేదు.. మా మొగోళ్లు ఊళ్లోకి రావడం లేదు.. ఈళ్లెప్పుడు పోతారో.. ఆళ్లెప్పుడు వత్తారో.. ఏం చేత్తాం... ఎవరికి చెప్పుకుంటాం.. ఎవరికీ ఈ కష్టం రాకూడదయ్యా’..అని హనుమంతునాయుడు పేటకు చెందిన పలువురు మహిళలు వాపోయారు.