sivaraj sing chowhan
-
‘నేనెక్కడికీ వెళ్లడంలేదు’ రోదిస్తున్న మహిళలకు శివరాజ్ భరోసా!
శివరాజ్ సింగ్ చౌహాన్.. మహిళల నుంచి ఎనలేని ఆదరణ పొందిన మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. ఆయన సీఎం పదవికి దూరమైనా.. అభిమానుల నుంచి ఆయనకు దక్కుతున్న ప్రేమ, అభిమానంలో ఏ మాత్రం తేడా కనిపించడం లేదు. రాష్ట్రంలోని ప్రజలు శివరాజ్‌ను ప్రేమగా అన్న, మామ అని పిలుచుకుంటారు. శివరాజ్ సింగ్ చౌహాన్‌తో అతని అభిమానులు, మద్దతుదారుల అనుబంధం విడదీయరానిది. ఇటీవల ఆయన విదిశలో తన మద్దతుదారులను, అభిమానులకు కలిసేందుకు వచ్చినప్పుడు భావోద్వేగ వాతావరణం ఏర్పడింది. వీరిలో మహిళలు అధికంగా ఉండటం విశేషం. శివరాజ్ సింగ్ చౌహాన్ తిరిగి రాష్ట్ర పగ్గాలు చేపట్టాలని వారంతా డిమాండ్ చేయడం విశేషం. శివరాజ్ సింగ్ చౌహాన్ తన హయాంలో మహిళల కోసం పలు ప్రజా సంక్షేమ పథకాలు చేపట్టారు. ఇవే అతనిని మహిళల ఆదరణకు పాత్రుడిని చేశాయి. ఆయన విదిశకు వచ్చినప్పుడు మద్దతుదారులు, అభిమానులు కురిపించిన ప్రేమను చూసిన ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. తన దగ్గరకు వచ్చి, రోదిస్తున్న మహిళలతో శివరాజ్ సింగ్..‘నేను ఎక్కడికీ వెళ్లడం లేదు. మధ్యప్రదేశ్‌లో మీ మధ్యనే ఉంటున్నానని’ వారికి భరోసా ఇచ్చారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు శివరాజ్‌సింగ్ మధ్యప్రదేశ్ సీఎంగా ప్రజల ఆదరణ అందుకున్నారు. అయితే డిసెంబర్ 11న నూతన సీఎంగా మోహన్ యాదవ్ నియమితులయ్యారు. శివరాజ్ సింగ్ చౌహాన్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సెహోర్ జిల్లాలోని బుద్ని నుంచి లక్షకు పైగా ఓట్ల తేడాతో రికార్డు స్థాయి విజయం సాధించారు. ఇది కూడా చదవండి: కరడుగట్టిన నియంత ఏడ్చిన వేళ.. -
పెళ్లి వద్దన్న శివరాజ్.. చివరికి ఎందుకు అంగీకరించారు?
మధ్యప్రదేశ్ బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ చురుకైన రాజకీయవేత్తగా పేరు పొందారు. 2023లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తా ఏమిటో మరోసారి రుజువు చేశారు. శివరాజ్ సింగ్ నాయకత్వంలో బీజేపీ 163 స్థానాలను గెలుచుకుంది. శివరాజ్ సింగ్ నాయకత్వంలో బీజేపీ అమోఘ విజయాన్ని నమోదు చేసుకుంది. గతంలో అంటే 2013లో శివరాజ్ నేతృత్వంలో బీజేపీ 165 సీట్లు గెలుచుకుంది. అయితే 2003లో మధ్యప్రదేశ్‌లో బీజేపీ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. నాడు ఉమాభారతి నేతృత్వంలో పార్టీ 230 స్థానాలకు గాను 173 స్థానాలను గెలుచుకుంది. శివరాజ్ సింగ్ వ్యక్తిగత విషయాలు అప్పుడప్పుడు తళుక్కుమంటుంటాయి. ‘మామ’ పేరుతో ప్రసిద్ధి చెందిన శివరాజ్ సింగ్ తొలుత తన జీవితాంతం పెళ్లి చేసుకోకూడదని నిశ్చయించుకున్నారు. రైతు కుటుంబం నుండి వచ్చిన శివరాజ్ తన యుక్తవయస్సులో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో చేరాడు. సంస్థలో చేరిన తర్వాత ఆర్ఎస్ఎస్ విలువలకు అనుగుణంగా ఉండాలంటే జీవితాంతం పెళ్లి చేసుకోకూడదని అనుకున్నారు. అయితే శివరాజ్ నిర్ణయాన్ని అతని కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. శివరాజ్ 1991లో విదిశ సీటును గెలుచుకోవడం ద్వారా తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులు అతనిని పెళ్లి చేకోవాలంటూ మరింతగా ఒత్తిడి తెచ్చారు. ఎట్టకేలకు తన సోదరి ఒప్పించిన మీదట శివరాజ్ సింగ్.. సాధన సింగ్‌ను కలుసుకున్నారు. ఆమెను చూసిన వెంటనే శివరాజ్ తన మనసు మార్చుకుని, సాధనతో పెళ్లికి అంగీకరించారు. సాధనకు కూడా శివరాజ్ సింగ్ సింప్లిసిటీ ఎంతగానో నచ్చింది. ఆమె కూడా పెళ్లికి ఓకే చెప్పారు. అయితే శివరాజ్ సింగ్ ..సాధనకు తన రాజకీయ లక్ష్యాల గురించి తెలియజేశారు. తనను వివాహం చేసుకుంటే తక్కువ సమయం కేటాయించగలుగుతానని వివరించారు. శివరాజ్ మాటతీరు, వ్యవహారశైలి నచ్చిన సాధన అతనితో కలసి నడిచేందుకు సమ్మతించారు. తరువాత వారిద్దరు తమ అభిప్రాయాలను పరస్పరం తెలియజేసుకుంటూ లేఖలు రాసుకునేవారు. ఈ నేపధ్యంలోనే వారికి వివాహం జరిగింది. ప్రస్తుతం వారికి ఇద్దరు కుమారులు. ఇది కూడా చదవండి: భార్యను ఓడించిన భర్త.. అన్నను మట్టికరిపించిన చెల్లి! -
రూ. 1500 కోట్ల పెట్టుబడి.. ఐటీసీ ఆలోచన ఏంటంటే?
సెహోర్‌లో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ లాజిస్టిక్స్ ఫెసిలిటీ & స్థిరమైన ప్యాకేజింగ్ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి మధ్యప్రదేశ్‌లో రూ. 1,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు 'ఐటిసి' తాజాగా వెల్లడించింది. ఈ రెండు ప్రాజెక్టులు దాదాపు 57 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉండటం వల్ల.. రాష్ట్రంలో వ్యవసాయ, తయారీ రంగాలకు మరింత అనుకూలంగా ఉంటుందని కంపెనీ వెల్లడించింది. మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 'శివరాజ్ సింగ్ చౌహాన్' ఈ ప్రాజెక్టులను ప్రకటిస్తూ.. బడియాఖేడిలోని రెండు కర్మాగారాలకు భూమి పూజ జరిగింది. ఇక్కడ దాదాపు 1,500 కోట్ల రూపాయల పెట్టుబడి జరగబోతోంది, దీని వల్ల దాదాపు 5000 మందికి ఉపాధి లభిస్తుందని స్పష్టం చేశారు. మనం పండించే ప్రతిదానికి ఇక్కడే సరైన ధర లభించేలా.. మన పిల్లలకు ఇక్కడే ఉపాధి కల్పించేలా చేయడమే లక్ష్యమని కూడా శివరాజ్ తెలిపారు. వ్యవసాయానికి పరిమితులున్నాయి, కావున శాశ్వత ఉద్యోగావకాశాలు లభించాలంటే ప్రత్యామ్నాయ మార్గాలు ఉండాలి. దీని కోసం పెట్టుబడులను తీసుకురావడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోందని శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడారు. ఇదీ చదవండి: చిరిగిన కరెన్సీ నోట్లను ఫ్రీగా మార్చుకోవడం ఎలా? ఆర్బీఐ రూల్స్ ఇలా.. ఐటీసీ కంపెనికి చెందిన ఫుడ్ ప్లాంట్ ఆటా బ్రాండ్ ఆశీర్వాద్.. సన్‌ఫీస్ట్ బిస్కెట్లు, ఇప్పీ నూడిల్స్ కోసం ఉత్పత్తులు తయారు చేస్తోంది. అంతే కాకుండా స్థిరమైన ప్యాకేజింగ్‌లో అగ్రగామిగా ఉంటుందని, ఎలక్ట్రానిక్ వస్తువులకు ప్యాకేజింగ్, ఫుడ్ అండ్ డ్రింకింగ్ రంగం వంటి రంగాలలో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయానికి దోహదపడుతుందని భావిస్తున్నారు. కాగా ITC ఇప్పటికే రాష్ట్రంలో ఫుడ్స్ అండ్ అగర్బత్తీల కోసం సహ తయారీ యూనిట్లతో గణనీయమైన ఉనికిని కలిగి ఉంది. आज बड़ियाखेड़ी में दो फैक्ट्रियों का भूमिपूजन हुआ है। लगभग ₹1500 करोड़ का निवेश यहाँ होने वाला है, जिससे हमारे 5 हजार बच्चों को रोजगार मिल सकेगा। pic.twitter.com/zOKMTvrTTI — Shivraj Singh Chouhan (@ChouhanShivraj) September 3, 2023 -
కొవిడ్ మృతుల కుటంబాలకు రూ.లక్ష ఆర్థిక సాయం
భోఫాల్: మధ్యప్రదేశ్‌లో కరోనా విజృంభన కొనసాగుతుంది.కరోనా మృతుల విషయంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెకండ్ వేవ్‌లో కరోనా మహమ్మారి వల్ల మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ. లక్ష ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. గురువారం ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించించిన అనంతరం సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వల్ల తమ వారిని కోల్పోయిన లోటు తీరలేనదని, ఆ బాధలలో ఉన్నవారికి కొంత ఉపసమనం కలిగించాలని నిర్ణయించామని సీఎం అన్నారు. ఇందులో భాగంగా వారికి కొంతమేరకు కొంత ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు.కరోనా బారినపడినవారిని కాపాడాలని తాము తీవ్రంగా ప్రయత్నించం ,కానీ రక్షించలేకపోయాం. అందువల్ల వారిని వారి కుటుంబాలకు రూ.లక్ష నష్టపరిహారం ఇస్తుమని వెల్లడించారు. కాగా, ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు కరోనాతో చనిపోతే వారి కుటుంబ సభ్యులకు రూ.5 లక్షలు అక్కడి ప్రభుత్వం అందిస్తున్నది. (చదవండి:పెళ్లికి వెళ్లిన అతిథులు.. ఊహించని పని చేసి వచ్చారు) -
సచివాలయానికి రాని సీఎంను ఎక్కడా చూడలేదు
సాక్షి, హైదరాబాద్: సచివాలయానికి రాని సీఎంను తానెక్కడా చూడలేదని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ కేసీఆర్‌పై మండిపడ్డారు. కూటమి ఆవిర్భావానికి ముందే విఫలమైందని, తెలంగాణలో టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమ న్నారు. విభజన తరువాత తెలంగాణ అన్ని రంగాల్లోనూ విఫలమైందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్ తాజ్‌బంజారాలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో బీజేపీ తిరిగి అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. మోదీ చేపట్టిన సంక్షేమ పథకా లు ఆయా రాష్ట్రాల్లో బీజేపీని తిరిగి గెలుపుతీరాలకు చేరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు.. ‘సీఎంగా నేను 13 ఏళ్లుగా పనిచేస్తున్నా. ఇప్పటికీ నేను నా కార్యాలయంలోనే పనులు చేసుకుంటా. కానీ ఇక్కడ సీఎం సచివాలయానికి రారని తెలిసి నేను ఆశ్చర్యపోయాను. ఇంటినే క్యాంప్ ఆఫీసు చేసుకున్న సర్కారు ఇదే. ఎన్నో ఆశలు, ఆశయాలతో నీళ్లు, నిధులు, నియామకాల కోసం సుదీర్ఘ పోరా టాలు చేసిన చరిత్ర తెలంగాణ ప్రజలది. ప్రాజెక్టుల రీడిజైన్ పేరిట ప్రభుత్వం అంచనాలు పెంచేసింది. సాగుభూమి పెరగలేదు, సాగు వ్యవస్థ మెరుగవలేదు, ఇంటింటికీ తాగునీరు రాలేదు.. రెవెన్యూ మిగులున్న రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చా రు. మౌలిక సదుపాయాల్లోనూ వెనకబడ్డారు. మొత్తం నిధులన్నీ నీళ్లలో కలిపారు. రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి తోశారని విమర్శించారు. ఇక నియామకాల విషయానికి వస్తే, లక్ష ఉద్యోగాల హామీ ఏమైంది? కేవలం 16,000 ఉద్యోగాలు భర్తీ చేసి చేతులు దులుపుకున్నారు. పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణ ఆకాంక్షలను కేసీఆర్ నీరుగార్చారు. దళిత సీఎం హామీ అటకెక్కించి ఆయనే సీఎం అయ్యారు. కేబినెట్లో దళితులకు ప్రాధాన్యం లేదు. డబుల్ బెడ్రూం అంటూ ఊదరగొట్టి ఎన్నింటి ని నిర్మించి ఇచ్చారు? గొప్పలకు పోయి పేదలకు చిన్న ఇంటినీ దూరం చేశారు. టీఆర్ఎస్, కేసీఆర్ విధానాల వల్ల బంగారంలాంటి అనేక అవకాశాలను తెలంగాణ కోల్పోయింది. బీజేపీ పాలనలో ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్‌ల స్వరూపం మారిపోయింద’ని చౌహాన్ అన్నారు. కాంగ్రెస్ టీడీపీలది తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధమైన కూటమి అని, ఆవిర్భావానికి ముందే అది విఫలమైందన్నా రు. సమావేశంలో నేతలు జీవీఎల్ నరసింహారావు, దత్తాత్రేయ, కృష్ణసాగర్‌రావు పాల్గొన్నారు. -
వ్యాపమ్ స్కాంపై సీబీఐ ఛార్జిషీట్
భోపాల్ : అంతు చిక్కని మరణాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యాపం (యవసాయిక్ పరీక్షా మండల్) కుంభకోణం కేసులో సీబీఐ మంగళవారం ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఛార్జిషీటుల్ 490మంది పేర్లను సీబీఐ చేర్చింది. కాగా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సీబీఐ క్లీన్చిట్ ఇచ్చింది. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవని తెలిపింది. సీజ్ చేసిన హార్డ్‌డిస్క్‌ను ట్యాంపర్ చేసినట్లు దిగ్విజయ్ చేసిన ఆరోపణలపై ఎలాంటి ఎవిడెన్స్ లేదని పేర్కొంది. కాగా మధ్యప్రదేశ్ మెడికల్ కాలేజీలతోపాటు వివిధ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు, ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షల్లో అక్రమాలు చోటుచేసుకున్న అంశం ఆ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం తెలిసిందే. స్కాంతో ప్రమేయం ఉన్న పలువురు అనుమానాస్పదంగా మృతిచెందడంతో ఈ అంశం జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలో స్కాం విచారణ బాధ్యతలను సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్ మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు, పోలీసు, రెవెన్యూ, తదితర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో చోటుచేసుకున్న ఈ భారీ కుంభకోణానికి సంబంధించిన కేసులన్నింటి నుంచీ సిట్, ఎస్టీఎఫ్లను సుప్రీంకోర్టు తప్పించింది. ఈ కేసులన్నింటినీ సీబీఐకి అప్పగిస్తూ... స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. అలాగే వ్యాపం కుంభకోణం దర్యాప్తుకు సుప్రీంకోర్టు అనూహ్య తీర్పునిచ్చింది. 2008 నుంచి 2012 మధ్య ఎంబీబీఎస్‌లో చేరినవారి అడ్మిషన్లు చెల్లుబాటుకావంటూ సంచలన తీర్పును వెల్లడించింది. దీంతో దాదాపు 600 మంది విద్యార్థులపై ఈ తీర్పు ప్రభావం పడింది. అదే సమయంలో విద్యార్థులు వేసిన పిటిషన్లు కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ఇక కొత్తగా పునర్విచారణ పిటిషన్లకు దాదాపు అవకాశం లేకుండా పోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. -
పేలుడు మృతుల పరిహారం రూ.10లక్షలకు పెంపు
ఝబువా: మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లా పెట్లావద్ పట్టణంలో బావుల తవ్వకాల కోసం భారీ స్థాయిలో నిల్వ చేసిన పేలుడు పదార్థాలు శనివారం ఉదయం పేలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో భారీగా ప్రాణనష్టం జరిగిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రమాదంలో విచారం వ్యక్తం చేశారు. మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షల చొప్పున శనివారం ప్రకటించారు. అనంతరం ఆ పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచుతున్నట్టు ఆదివారం ప్రకటించారు. ఈ ప్రమాదంలో 90 మంది దుర్మరణం పాలవగా.. మరో 100 మందికి పైగా గాయడ్డారు.