sivaram prasad
-
లింగమనేని శివరాంప్రసాద్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
-
భోజన ఏజెన్సీలకు గ్యాస్ కనెక్షన్లు తప్పనిసరి
అనంతపురం అర్బన్: జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లోని మధ్యాహ్న భోజన ఏజెన్సీలు తప్పనిసరిగా వంట గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలని నిర్వాహకులకు జిల్లా సరఫరాల శాఖ అధికారి శివరాంప్రసాద్ ఆదేశాలను జారీ చేశారు. ప్రతి ఏజెన్సీ ఒక రోజు వ్యవధిలో గ్యాస్ కనెక్షక్షన్ తీసుకోవాలని చెప్పారు. ఏజెన్సీలను ప్రత్యేక కేటగిరీ కింద పరిగణించి గృహావసర కనెక్షన్ ఇస్తారని తెలిపారు. గ్యాస్ కనెక్షన్ తీసుకున్న, తీసుకోని వివరాలను అందించాలని సీఎస్డీటీలను ఆదేశించారు. నిర్దేశించిన గడువులోపు కనెక్షన్ తీసుకొని ఏజెన్సీలపై చర్యలు ఉంటాయన్నారు. -
'తిరుమలలో చిరుతలను బంధించలేం'
తిరుమల : తిరుమలలో సంచరిస్తున్న చిరుతలను బంధించలేమని డీఎఫ్‌వో శివరాంప్రసాద్ స్పష్టం చేశారు. వాటిని దారి మళ్లించేందుకు ప్రయత్నిస్తామన్నారు. శుక్రవారం తిరుమలలో డీఎఫ్‌వో శివరాంప్రసాద్ విలేకర్లతో మాట్లాడుతూ... కొన్ని రోజులపాటు భక్తులు, స్థానికులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాత్రి సమయాల్లో ఒంటరిగా బయట తిరగవద్దు అని ఆయన భక్తులకు సూచించారు. తిరుమలలో మూడు చిరుతలు సంచరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానికులు, భక్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. -
బడి బస్సు..నిబంధనలు తుస్సు
కర్నూలు, న్యూస్‌లైన్: కొత్త ఆశలు..ఆశయాలతో తమ పిల్లలను బడికి పంపిస్తున్న తల్లిదండ్రులకు పాఠశాల బస్సుల ఫిట్‌నెస్‌పై ఆందోళన నెలకొంది. పిల్లలు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే వరకు వారి కోసం కళ్లల్లో ఒత్తులు పెట్టుకొని ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. పాఠశాల యాజమాన్యం అడిగినంత ఫీజులు చెల్లిస్తున్నా విద్యార్థుల భద్రత గాలిలో దీపంలా మారింది. స్కూలు బస్సుల సామర్ధ్యం(ఫిట్నెస్) గడువు ముగిసినప్పటికీ ఇటు యాజమాన్యాలు అటు రవాణా శాఖ అధికారుల ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. డ్రైవర్ నిర్లక్ష్యం, వాహన కండీషన్ సరిగా లేని కారణంగా స్కూలు బస్సులు తరచూ ప్రమాదాలకు గురవుతుండటంతో వాటిలో పంపడానికి తల్లిదండ్రులు జంకుతున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే రవాణా శాఖ అధికారులు హడావుడి చేయటం పరిపాటిగా మారింది. మే 15తో ముగిసిన గడుపు.. మే నెల 15వ తేదితో జిల్లాలో ఉన్న ప్రైవేటు పాఠశాలలు, కళాశాల బస్సుల ఫిట్నెస్ గడువు ముగిసింది. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 890 బస్సులు ఉన్నాయి. వీటన్నింటికి మే 15 నుంచి జూన్ 1వ తేది మధ్యనే రవాణా శాఖ అధికారులతో ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలి. అయితే ఇప్పటి వరకు ప్రైవేటు పాఠశాల యాజమాన్యం బస్సుల సామర్థ్యం(ఎఫ్‌సి)పై దృష్టి సారించలేదు. నిబంధనలన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ వాహనం సీట్లను బట్టి రూ.1800 నుంచి రూ.2 వేల వరకు రవాణా శాఖ అధికారులు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వడానికి మామూళ్లు దండుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈనెల 2వ వారం నుంచి పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అధిక శాతం పాఠశాలలు మొదటి వారంలోనే తెరుచుకున్నాయి. కేవలం వారం రోజుల గడువులో అన్ని స్కూళ్ల బస్సులకు సామర్థ్యం పరీక్షలు నిర్వహించడం అసాధ్యం. ఇప్పటికే స్కూల్ బస్సుల సామర్థ్యం మెరుగు పరుచుకుని రవాణా శాఖ అధికారుల అనుమతులు పొందాల్సి ఉంది. విద్యా సంస్థలు తల్లిదండ్రుల సమావేశాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు బస్సుల్లో కల్పిస్తున్న సౌకర్యాలపై అవగాహ కల్పించాలి. బస్సుల్లో ప్రయాణించే విద్యార్థుల వివరాలను కూడా పొందు పరుస్తూ నోటీసు బోర్డు ఏర్పాటు చేయాలి. అందుకోసం రవాణా శాఖ అధికారులు, పాఠశాలల బస్సుల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేయాల్సి ఉన్నా ఆ దిశగా ఇప్పటి వరకు చర్యలు చేపట్టలేదు. కండీషన్ లేకుండా బస్సులు తిప్పితే సీజ్ చేస్తాం : డీటీసీ శివరాం ప్రసాద్ కండీషన్ లేకుండా పాఠశాల బస్సులు తిప్పితే సీజ్ చేసి యాజమాన్యాలను ప్రాసిక్యూట్ చేస్తాం. ఇందుకోసం ఈనెల 12వ తేది నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ఫిట్నెస్ లేని బస్సులు వినియోగిస్తున్న ప్రైవేటు విద్యా సంస్థల నిర్వహకులపై చర్యలు తీసుకుంటాం. ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందాలని ఆయా స్కూళ్ల యాజమాన్యాలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. లెసైన్స్ లేని డ్రైవర్లపై కేసులు నమోదు చేస్తాం. డ్రైవర్ అర్హతలు ఇవి.. డ్రైవర్‌కు 40 నుంచి 55 సంవత్సరాల వయస్సు ఉండాలి. పాఠశాల యాజమాన్యం డ్రైవర్ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించాలి. అనుభవం, లెసైన్స్ ఉన్న వ్యక్తిని మాత్రమే నియమించుకోవాలి. డ్రైవింగ్ లెసైన్స్ తదితర అంశాలపై సంబంధిత ఆర్టీఏ అధికారులను సంప్రదించాలి.బస్సు డ్రైవింగ్‌లో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. డ్యూటీలో డ్రైవర్, అటెండర్ తప్పనిసరిగా యూనిఫాం ధరించాలి ఇవీనిబంధనలు మోటారు వాహనాల చట్టం ప్రకారం ప్రతి బస్సుకు పసుపు రంగు వేయాలి. బస్సుపై నల్ల రంగులో పెద్ద అక్షరాలతో పాఠశాల పేరును రాయించాలి. అందరూ గుర్తించేలా బడికి వెళ్తున్న విద్యార్థుల బొమ్మలు వాహనంపై ముద్రించాలి. పిల్లలు చేతులు బయట పెట్టకుండగా బస్సు కిటికీలకు గ్రిల్‌ను అమర్చాలి. అనుకోని పరిస్థితుల్లో బస్సు ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు చిన్నారులు ప్రమాదం నుంచి బయట పడటానికి అత్యవసర ద్వారాలు ఏర్పాటు చేయాలి. చిన్న పిల్లలకు బస్సుల్లో ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే వైద్యం చేయడానికి ఫస్ట్ ఏయిడ్ బాక్స్‌ను అందుబాటులో ఉంచాలి. అందులో స్పిరిట్, దూది, కట్టు, గాయాలకు పూసే మందు ఉండేలా చూడాలి. విద్యా సంస్థ పేరు, టెలిఫోన్ నంబర్ లేదా మొబైల్ నంబర్, పూర్తిచిరునామా బాక్సుకు ఎడమవైపు స్పష్టంగా రాయాలి. సీట్ల కింది భాగంలో బ్యాగులు పెట్టుకునేలా అరలు ఏర్పాటు చేయాలి చిన్న పిల్లలు బస్సు ఎక్కేటప్పడు, దిగేటప్పుడు ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా చూసేందుకు సహాయకుడిని తప్పకుండా నియమించాలి. బస్సు తలుపులు సురక్షితమైన లాకింగ్ సిస్టమ్‌తో ఉండాలి సైడ్ విండోలకు అడ్డంగా మూడు లోహపు కడ్డీలను ఏర్పాటు చేయాలి సీటింగ్ సామర్థ్యం కంటే ఎక్కువ మందిని తీసుకెళ్లకూడదు. బస్సు ఇరువైపులా వెనుక కనిపించేలా అద్దాలు ఉండాలి. అప్పుడే ప్రమాదాలను నివారించవచ్చని మోటారు వాహనాల తనిఖీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
అంతర్ రాష్ట్ర చెక్‌పోస్టులు ప్రారంభం.
కర్నూలు/శ్రీశైలం ప్రాజెక్టు, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ నేపథ్యంలో కర్నూలు జిల్లాలోని సరిహద్దు ప్రాంతంలో రెండు అంతర్ రాష్ట్ర చెక్‌పోస్టులు బుధవారం ప్రారంభమయ్యాయి. కర్నూలు శివారులోని పంచలింగాల క్రాస్‌రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ శివరాం ప్రసాద్ ప్రారంభించారు. కార్యక్రమంలో మోటారు వాహనాల తనిఖీ అధికారులు రమణ, చంద్రబాబు, శ్రీనివాసరావు, అసిస్టెంట్ మోటారు వాహనాల తనిఖీ అధికారులు శివలింగయ్య, నారాయణ నాయక్ తదితరులు పాల్గొన్నారు. శ్రీశైలం నుంచి హైదరాబాద్‌కు వెళ్లే రహదారిలోని జిల్లా సరిహద్దు సున్నిపెంట దగ్గర ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును నంద్యాల మోటారు వాహనాల తనిఖీ అధికారి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఏఎంవీఐలు రవిశంకర్ నాయక్, రాజేశ్వరరావు, శివకుమార్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక్కో చెక్‌పోస్టు వద్ద ఎంవీఐ ఒకరు, ఏఎంవీఐలు ముగ్గురు నిరంతరం విధుల్లో ఉంటారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు వెళ్లే వాహనాలకు సంబంధించి టెంపరరీ పర్మిట్లు ఇక్కడనే జారీ చేసే ఏర్పాట్లు చేశారు. మూడు రోజుల నుంచి 30 రోజుల వరకు కూడా తాత్కాలిక పర్మిట్లు ఆయా చెక్‌పోస్టుల వద్ద పొందే వెసులుబాటు కల్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణకు వెళ్లాలన్నా.. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రావాలన్నా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా రవాణా శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. 2015 మార్చి 31 వరకు ఎలాంటి ట్యాక్సులు చెల్లించకుండానే రెండు రాష్ట్రాల్లో వాహనాలు తిరగవచ్చునని డిప్యూటీ కమిషనర్ శివరాం ప్రసాద్ తెలిపారు. -
ఇప్పటికి మేల్కొన్నారు
కర్నూలు, న్యూస్‌లైన్: మృత్యువు చేల‘రేగింది’. 45 మందిని పొట్టన పెట్టుకుంది. మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకున్న ప్రైవేట్ బస్సు ఘటనతో ఇప్పుడు ఆ వాహనాలంటేనే ప్రజలు హడలిపోయే పరిస్థితి. అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదేమోననే చర్చతో వారిలో కదలిక వచ్చింది. అయితే వీరు ఎంతకాలం ఇలా తనిఖీలుతో సంబంధిత యాజమాన్యాలను దారిలోకి తీసుకొస్తారనేది ప్రశ్నార్థకం. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు కర్నూలు నగర శివారులోని టోల్‌ప్లాజా వద్ద ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పర్మిట్ల గడువు ముగిసినప్పటికీ అక్రమంగా తిప్పుతున్న నాలుగు బస్సులను సీజ్ చేశారు. రీ రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా తిప్పుతున్న మరో నాలుగు బస్సులపై కేసులు నమోదు చేశారు. బస్సు రిజిస్ట్రేషన్ల కాగితాలు, డ్రైవర్ల లెసైన్స్‌లతో పాటు అధిక లోడ్ వివరాలను పరిశీలించారు. రవాణా శాఖ ఉప కమిషనర్ శివరాంప్రసాద్ నేతృత్వంలో మోటారు వాహనాల తనిఖీ అధికారులు చంద్రబాబు, రమణ, శ్రీనివాసులు, శేషాద్రి, ఏఎంవీఐలు శివలింగయ్య, రాజేశ్వరరావు, రవిశంకర్ నాయక్, నారాయణ నాయక్, కుసుమ, జయశ్రీ, విజయకుమారి తదితరులు రెండు బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. సహారా ట్రావెల్స్‌కు సంబంధించిన బస్సు హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తుండగా తనిఖీ చేశారు. అలాగే హైదరాబాద్ నుంచి బళ్లారికి వెళ్తున్న దివాకర్ ట్రావెల్స్.. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న పీయూఎన్ ట్రావెల్స్, బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఏపీ టూరిస్ట్ ట్రావెల్స్ వాహనాలను పరిశీలించారు. పర్మిట్ల గడువు ముగిసినట్లు తనిఖీల్లో తేలడంతో కేసులు నమోదు చేశారు. అలాగే రీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి మూడు వాహనాలపై కేసులు నమోదు చేసి సీజ్ చేశారు. వాహనాల క్రయవిక్రయాల సందర్భంగా 12 మాసాల్లోపు రిజిస్ట్రేషన్ బదలాయించి నంబర్లు మార్చుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న(కర్ణాటక) బస్సులను తనిఖీ చేసి రీ అసైన్మెంట్ కింద కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు(మర్చంటైల్ గూడ్స్) టాప్‌పైన అధిక లోడుతో వెళ్తున్న వాహనాన్ని తనిఖీ చేసి కేసు కట్టారు. వీటికి సంబంధించి దాదాపు రూ.2 లక్షల అపరాధ రుసుముతో పాటు ప్రాసిక్యూషన్ కోసం కోర్టుకు అప్పగించేందుకు వాహనాలు సీజ్ చేసి కొత్త బస్టాండ్ సమీపంలోని ఆర్టీసీ డిపోకు తరలించారు. అదేవిధంగా నంద్యాలలో ఆర్టీఓ వెంకట్రామిరెడ్డి నేతృత్వంలో మోటారు వాహనాల తనిఖీ అధికారి వెంకటేశ్వరరావు, రాజబాబు, శివకుమార్, అనిల్‌కుమార్ నేతృత్వంలో మరో బృందం నంద్యాల జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించి 12 కేసులు నమోదు చేసింది. ఈ సందర్భంగా డీటీసీ శివరాం ప్రసాద్ మాట్లాడుతూ సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సులో ఇద్దరు డ్రైవర్లను కచ్చితంగా నియమించుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహన యజమానులపై కఠిన చర్యలు తప్పవని, తనిఖీలు నిరంతరాయంగా కొనసాగిస్తామని హెచ్చరించారు.