sivasena leader
-
చంద్రబాబుకు అధికారంలో ఉండే హక్కు లేదు: సంజయ్ రౌత్
ఢిల్లీ: ఏపీ కూటమి అరాచకపాలనకు నిరసనగా వైఎస్సార్సీపీ చేపట్టిన ధర్నాకు శివసేన(యూబీటీ) పార్టీ సంఘీభావం తెలిపింది. బుధవారం మధ్యాహ్నాం వైఎస్ జగన్‌ను కలిసిన ఆ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌రౌత్ తమ పార్టీ మద్దతు ప్రకటించారు. ఏపీ పరిస్థితులకు సంబంధించిన ఫోటో గ్యాలరీని ఆయన సందర్శించారు. అనంతరం సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఒక్కరోజు కూడా అధికారంలో కొనసాగే హక్కు లేదు. వైఎస్ జగన్‌కు అండగా నిలవడం కోసం నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. మా పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే నాకు ఒకే విషయం చెప్పారు. ప్రభుత్వాలు వస్తుంటాయి. పోతుంటాయి. కానీ, ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవడం సరికాదు. ఆంధ్రప్రదేశ్‌లో గత 45 రోజులుగా నరమేధం కొనసాగుతోంది. ఈ రాజకీయ కక్ష సాధింపు ఏదైతే ఉందో.. అది దేశానికే మంచిది కాదు. .. దేశంలో కేంద్ర హోం మంత్రి, ఆ మంత్రిత్వ శాఖ ఉంటే.. వెంటనే స్పందించాలి. ప్రత్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపాలి. అక్కడ జరుగుతున్న దాడుల, విధ్వంసంపై సమగ్ర విచారణ జరిపించాలి. దాడులకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు చూసిన తర్వాత.. మేము ఒక విషయం స్పష్టం చేయదల్చాము. రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఒక్కరోజు కూడా అధికారంలో ఉండే హక్కు లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం లేదు. అందుకే మేము వైఎస్ జగన్‌కు, ఆయన పార్టీకి పూర్తి మద్దతు ఇస్తున్నాము. వైఎస్ జగన్ పోరాటానికి అండగా నిలబడతాం’ అని ఆయన అన్నారు.కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలి..శివసేన(యూబీటీ) ఎంపీ, ఆ పార్టీ లోక్‌సభ పక్ష నేత అరవింద్ సావంత్ వైఎస్సార్సీపీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఏపీలో జరిగిన దాడలకు సంబంధించి.. ఫొటో గ్యాలరీ సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ నేను శివసేన లోక్‌సభ పక్ష నేతను. మా ఆత్మకు క్షోభ కలిగించే ఘటనలు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నాయి. మేము గతంలో చంద్రబాబుతో కలిసి, కూటమిలో ఉన్నాము. ఎన్డీఏలో కూడా కొనసాగాం. శివసేన పార్టీలో చీలిక వచ్చినప్పుడు, చాలా మంది పార్టీని వీడారు. కానీ ఉద్ధవ్ ఠాక్రే గట్టిగా నిలబడ్డారు. సరిగ్గా వైఎస్ జగన్ కూడా రాజకీయాల్లో అలా నిలబడ్డారు. అందుకే మేము మా పార్టీలో జగన్ గురించి మాట్లాడుకుంటాము. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, అన్నీ తట్టుకుని నిలబడ్డారు. ప్రజల మద్దతుతో సీఎం అయ్యారు. నేను ఈరోజు ఇక్కడ కొన్ని చిత్రాలు, వీడియోలు చూశాను. రాజకీయాల్లో గెలుపు, ఓటములు ఉంటాయి. కానీ ఈ తరహాలో ప్రతీకార దాడులు, కక్ష సాధింపు సరికాదు. ఈరోజు నీవు అధికారంలో ఉండొచ్చు. రేపు దాన్ని కోల్పోవచ్చు. కానీ, ఈ విధంగా గెల్చిన తరవాత, ఓడిన పార్టీపై దాడులు చేయడం, ఆ పార్టీ నాయకులను ఎంచుకుని మరీ చంపడం, వారిపై దాడులు చేయడం, వారి ఆస్తులు ధ్వంసం చేయడం.. ఏ మాత్రం సమర్థనీయం కాదు.ఏపీలో సీఎం కుమారుడు ఏకంగా రెడ్ బుక్ పట్టుకుని తిరుగుతున్నారు. విపక్షంపై దాడులను ప్రోత్సహిస్తున్నాడు. రాజకీయాల్లో ఈ తరహా చర్యలు ఏ మాత్రం సరికాదు. ఏపీలో జరుగుతోందే.. మహారాష్ట్రలో కూడా కొనసాగుతోంది. ఈడీ దాడులు. సీబీఐ కేసులు. వేధింపులు. నీవు ఈరోజు అధికారంలోకి రావొచ్చు. రాకపోవచ్చు. రాజకీయాల్లో గెలుపు, ఓటమిలు సహజం. దేన్నైనా స్వీకరించాలి. అంతేకానీ, ఈ తరహాలో విపక్షంపై దాడులు, వేధింపులు సరికాదు. అందుకే వైఎస్ జగన్, ఆయన పార్టీకి అండగా నిలవడానికి, మద్దతు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను. .. మా ముంబైలో తెలుగు ప్రజలు చాలా మంది ఉన్నారు. నేను కేంద్ర ప్రభుత్వానికి ఒక విషయం స్పష్టం చేస్తున్నాను. ఏపీలో ఇంత జరుగుతున్నా, మీరు ఇలాగే కళ్లు మూసుకుని కూర్చుంటే, అది మరో మణిపూర్ అవుతుంది. ఇది ఏ మాత్రం సరికాదు. కాబట్టి, వెంటనే జోక్యం చేసుకొండి. ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడండి. ఈ పోరాటంలో మేము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి అండగా నిలుస్తా. పార్లమెంటులో కూడా వారితో కలిసి పని చేస్తాం’ అని అన్నారు. -
దారుణం: లైవ్‌లో మాట్లాడుతుండగా శివసేన నేత హత్య
ముంబై: శివసేన (ఠాక్రే) వర్గానికి చెందిన నాయకుడు అభిషేక్ ఘోసల్కర్ దారుణంగా హత్యచేయబడ్డారు. ఆయన లైవ్ వీడియోలో మాట్లాడుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపారు. తాజాగా ఈ ఘటన సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వ్యాపారవేత్త మోరిస్ నోరోన్హాను అనుమానితుడిగా భావిస్తున్నారు. గురువారం సాయంత్రం సబర్బన్ ముంబైలోని బిరివాలిలోని మోరిస్ నోరోన్హా కార్యాలయంలోనే ఈ కాల్పులు జరగటం గమనార్హం. ఫేస్బుక్లో లైవ్ వీడియో మాట్లాడతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పులు జరిగిన వెంటనే అభిషేక్ ఘోసల్కర్‌ను స్థానిక కరుణ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అభిషేక్ ఘోసల్కర్ మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. అభిషేక్ ఘోసల్కర్... శివసేన(యూబీటీ) మాజీ ఎమ్మెల్యే వినోద్ ఘోసల్కర్ కుమారుడు. వ్యాపారవేత్త అయిన మోరిస్ నోరోన్హాకు అభిషేక్ ఘోసల్కర్ మధ్య ఇటీవల చోటుచేసుకున్న వివాదాల కారణంగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ కాల్పులు జరిగినప్పుడు ఘటన స్థలంలో మెహుల్ పారిఖ్ అనే వ్యక్తి ఉన్నట్లు సమాచారం అందటంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు నోరోన్హా కూడా తనను తాను కాల్చుకొని మృతి చెందాడని వార్తలు వస్తున్నాయి. గత వారంలో బీజేపీ ఎమ్మెల్యే ఒకరు శివసేన (షిండే) వర్గం నేతపై పోలీస్ స్టేషన్లోనే కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. -
‘వాళ్ల కాళ్లు విరగొట్టండి.. నేను బెయిల్ ఇస్తా’.. ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు!
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యే ప్రకాష్ సర్వే చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ‘వాళ్ల చేతులు విరగొట్టలేకపోతే, కాళ్లు విరగొట్టండి. ఆ తర్వాతి రోజునే నేను మీకు బెయిల్ ఇస్తా’ అని తన అనుచరులకు సూచించారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో షిండే వర్గం ఎమ్మెల్యే ప్రకాష్ సర్వేపై పోలీసులకు ఫిర్యాదు చేసింది ఉద్ధవ్ థాక్రే వర్గం. ఆగస్టు 14వ తేదీన ముంబైలోని కొకాని పడా బుద్ధ విహార్ ప్రాంతంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే ప్రకాష్ సర్వే. ‘ఎవరైనా మీతో ఏదైనా అంటే వారికి సమాధానం ఇవ్వండి. ఎవరి దాదాగిరిని ఉపేక్షించేది లేదు. వారిని తరిమికొట్టండి. నేను ప్రకాష్ సర్వే, మీకోసమే ఇక్కడ ఉన్నాను. మీరు వాళ్ల చేతులు విరగొట్టలేకపోతే, కనీసం వారి కాళ్లు విరగొట్టండి. ఆ తర్వాతి రోజునే మీకు నేను బెయిల్ ఇస్తాను. ఎలాంటి ఆందోళన అవసరం లేదు. మేము ఎవరితో గొడవ పెట్టుకోము. కానీ, మాతో ఎవరైనా గొడవకు దిగితే ఊరుకోము.’ అని పేర్కొన్నారు ఎమ్మెల్యే ప్రకాష్ సర్వే. ఎమ్మెల్యే ప్రకాష్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టింది ఉద్ధవ్ థాక్రే వర్గం. దహిసర్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన క్రమంలో విపక్షాలు దీనిపై ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే విలేకరులతో మాట్లాడనున్నారు. ఇదీ చదవండి: కలెక్టర్ హత్య కేసులో జీవిత ఖైదీ.. జైలు కాదు దర్జాగా భార్యాకొడుకులతో ఇంట్లో!! ఫొటో దుమారం -
Maharashtra Political Crisis: క్లైమాక్స్ కు చేరిన మహా సంక్షోభం..
-
Maharashtra: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.. ఉద్ధవ్ ఠాక్రే కు కరోనా పాజిటివ్..
-
నిలువెల్లా బంగారమే..
హిమాయత్‌నగర్(హైదరాబాద్): సాధారణంగా వేళ్లకు ఉంగరాలు, చేతికి బ్రాస్లెట్, మెడలో గొలుసు...సహజంగా పసిడి ప్రియులకు ఉండే ఆభరణాలు. అయితే ముంబైకి చెందిన ఓ వ్యాపారి ఏకంగా నాలుగు కేజీల బంగారంతో ఏకంగా చొక్కానే కుట్టించి పసిడిపై తనకున్న మమకారాన్ని చెప్పకనే చెప్పాడు. అంతే కాదు... మరో రెండు నెలల్లో పుత్తడి ప్యాంట్ కుట్టించుకొనేందుకు ముచ్చట పడుతున్న విషయాన్ని బైటపెట్టాడు. నాలుగు కేజీల చొక్కాతోపాటు మూడు కేజీల బరువున్న బంగారు బూట్లు, పలు నగలు నగలు ఆయన ఒంటిపై ఉండటం గమనార్హం. ఆయన పేరు పంకజ్ పరేఖ్, వస్త్రవ్యాపారి అయిన అతడు ముంబైలో శివసేన నాయకుడు. సోదరుడు ప్రదీప్ పరేఖ్ గృహప్రవేశం కోసం హైదరాబాద్ వచ్చిన అతడు బుధవారం రాత్రి హిమాయత్‌నగర్‌లో సందడి చేశాడు. ధరలకు భయపడి జనం వస్త్ర సన్యాసమే చేస్తున్న ఈరోజుల్లో బంగారంతోనే చొక్కా కుట్టించుకున్న పంకజ్ పరేఖ్ జనాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. అయితే పోలీసులు మాత్రం ఆందోళనకు గరయ్యే పరిస్థితి నెలకొంది. కాగా, తనకు చిన్నతనం నుంచే బంగారమంటే మహాపిచ్చి అని పంకజ్ తెలిపారు. ప్యాంట్కూడా రెండు నెలల్లో అందుబాటులోకి వస్తే గిన్నీస్ బుక్‌లో స్థానం కోసం దరఖాస్తు చేయనున్నట్లు సెలవిచ్చారు. ఇతనికి రక్షణగా నలుగురు గార్డులు అనుక్షణం వెన్నంటి ఉంటారు.