sixth place
-
ఆరో స్థానంలో హంపి
వార్సా (పోలాండ్): ప్రపంచ మహిళల ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ఆరో స్థానంలో నిలిచింది. నిర్ణీత 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో హంపి 7.5 పాయింట్లు సాధించింది. హంపి నాలుగు గేముల్లో గెలిచి, ఏడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకుంది. హంపితోపాటు మరో ఎనిమిది మంది కూడా 7.5 పాయింట్లు స్కోరు చేశారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా హంపికి ఆరో స్థానం దక్కింది. రష్యా గ్రాండ్‌మాస్టర్ కొస్టెనియుక్ 9 పాయింట్లతో తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది. బిబిసారా (కజకిస్తాన్–8.5) రన్నరప్ నిలిచింది. గునీనా (రష్యా), కాటరీనా (రష్యా), సెరిక్బె (కజకిస్తాన్) మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. -
ఇటలీని దాటేసిన భారత్
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి విపరీతంగా పెరిగింది. ప్రపంచ దేశాల్లో ఇటలీని దాటి ఆరో స్థానానికి చేరడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కరోనా మన దేశంలో బయటపడ్డాక ఒకే రోజు దాదాపుగా 10 వేల కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో ఇటలీని దాటేసిన భారత్ ప్రపంచ పట్టికలో ఆరోస్థానానికి చేరింది. కొత్తగా 9,887 కేసులు నమోదు కావడంతో శనివారం నాటికి కేసుల సంఖ్య 2,36,657కి చేరుకుంది. ఇటలీలో ఇప్పటి వరకు 2,34,801 కేసులు నమోదయ్యాయి. 70% మృతులకు వేర్వేరు వ్యాధులు ఒకే రోజు 294 మంది ప్రాణాలు కోల్పోవడంతో దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య 6,642కి చేరుకుంది. రికవరీ రేటు పెరగడం ఊరటనిచ్చే అంశం. ఇప్పటివరకు 48.20% మంది కోవిడ్ రోగులు కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరణించిన వారిలో 70శాతానికి మందికిపైగా ఇతర వ్యాధులతో బాధుపడుతున్నవారే ఉన్నారని తెలిపింది. రకరకాల వ్యాధులు ఉన్న వారు కరోనాబారినపడి∙ప్రాణాలు కోల్పోతున్నారని వెల్లడించింది. అయిదుగురు ఈడీ అధికారులకు కోవిడ్ కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉద్యోగులు అయిదుగురికి కరోనా వైరస్ సోకింది. వారిలో స్పెషల్ డైరెక్టర్ ర్యాంకు అధికారి ఉన్నారు. దీంతో ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయాన్ని సీజ్ చేశారు. సోమవారం వరకు ఆఫీస్‌ను మూసేస్తారు. భారత్‌లో సామూహిక వ్యాప్తి దశ భారత్ సరైన్ సమయంలో లాక్డౌన్ విధించడంతో ఇప్పటివరకు కరోనాని బాగా నియంత్రించిందని డబ్ల్యూహెచ్ఓ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అయితే దేశాన్ని అన్‌లాక్ చేసే క్రమంలో కేసులు భారీగా పెరిగే అవకాశాలున్నాయని హెచ్చరించారు. ఈ దశలో కేసులు మూడు వారాల్లోనే రెట్టింపు అవుతాయని డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీస్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటిక్ డైరెక్టర్ మైకేల్ రయాన్ అంచనా వేశారు. అత్యధిక జనాభా కలిగిన భారత్‌లో నమోదవుతున్న కేసుల్ని చూస్తే దానిని విజృంభణగా భావించలేమన్నారు. ఇప్పుడు మార్కెట్ల తాళాలు తెరుస్తూ ఉండడంతో విస్తృతంగా కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. లాక్డౌన్ వంటి చర్యలతో వైరస్ వ్యాప్తిని సమర్థంగా అడ్డుకున్నప్పటికీ భారీగా వలసలు, నగరాల్లో అత్యధిక జనసాంద్రత, రోజూ పని చేస్తే తప్ప ఎందరికో పూట గడవని దుస్థితి వంటి అంశాలు వైరస్ నియంత్రణకు సవాళ్లుగా మారతాయని రయాన్ అభిప్రాయపడ్డారు. ఇప్పుడే భారత్ సామూహిక వ్యాప్తి దశకు చేరుకుంటోందని, మితి మీరి కేసులు నమోదవకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా ప్రభావం భారత్‌లో ప్రాంతానికి ప్రాంతానికి మధ్య మారిపోతోందని వైరస్ వ్యాప్తి చెందడంలో పట్టణాలు, పల్లెల మధ్య చాలా వ్యత్యాసం ఉందని రయాన్ వివరించారు. సెప్టెంబర్ నాటికి అంతం! కరోనా వైరస్ భారత్‌లో సెప్టెంబర్ రెండో వారం నాటికల్లా అంతమవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన ప్రజారోగ్య నిపుణులు డాక్టర్ అనిల్‌కుమార్, డాక్టర్ రూపాలీ రాయ్ చెబుతున్నారు. గణిత నమూనా ఆధారంగా చేసిన ఓ విశ్లేషణను బట్టి వారు ఈ అంచనాకు వచ్చారు. ఎపిడిమోలజీ ఇంటర్నేషనల్ అనే ఆన్లైన్ జర్నల్‌లో ఈ వివరాలు ప్రచురించారు. ఈ విశ్లేషణ కోసం వారు బెయిలీ గణిత నమూనాను ఉపయోగించారు. -
ఆ జాబితాలో కోహ్లికి ఆరో స్థానం
లండన్: కరోనా కారణంగా గత మూడు నెలలుగా అంతర్జాతీయస్థాయిలో ఎలాంటి ఈవెంట్స్ జరగకపోయినా... పలువురు స్టార్ క్రీడాకారుల ఆదాయంలో మాత్రం ఎలాంటి తగ్గుదల కనిపించడంలేదు. లాక్డౌన్ సమయంలోనూ వీరు భారీగానే ఆర్జించారు. మార్చి 12 నుంచి మే 14 మధ్య కాలంలో సామాజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ స్టార్ క్రీడాకారులు ఎంత మొత్తం సంపాదించారనే లెక్కలను ఓ అంతర్జాతీయ సంస్థ విడుదల చేసింది. భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచి టాప్–10లో స్థానం పొందిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. గత రెండు నెలల కాలంలో ఇన్‌స్టాగ్రామ్‌లో తమ వాణిజ్య ప్రకటనల ద్వారా కోహ్లి మొత్తం 3,79,294 పౌండ్లు (రూ. 3 కోట్ల 64 లక్షలు) ఆర్జించాడు. ఈ జాబితాలో పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో టాప్ ర్యాంక్‌లో నిలిచాడు. రొనాల్డో మొత్తం 18 లక్షల పౌండ్లు (రూ. 17 కోట్ల 27 లక్షలు) సంపాదించాడు. 12 లక్షల పౌండ్లతో (రూ. 11 కోట్ల 52 లక్షలు) అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ రెండో స్థానంలో... 11 లక్షల పౌండ్లతో (రూ. 10 కోట్ల 56 లక్షలు) బ్రెజిల్ ఫుట్‌బాల్ ఆటగాడు నెమార్ మూడో స్థానంలో నిలిచారు. 5,83,628 పౌండ్లతో (రూ. 5 కోట్ల 60 లక్షలు) అమెరికా బాస్కెట్‌బాల్ ప్లేయర్ షకీల్ ఓనీల్ నాలుగో స్థానంలో... 4,05,359 పౌండ్లతో (రూ. 3 కోట్ల 89 లక్షలు) ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ డేవిడ్ బెక్‌హామ్ ఐదో స్థానంలో నిలిచారు. జ్లాటన్ ఇబ్రహీమోవిచ్ (స్వీడన్ ఫుట్‌బాలర్; రూ. కోటీ 77 లక్షలు), డ్వేన్ వేడ్ (మాజీ బాస్కెట్‌బాల్ ప్లేయర్; రూ. కోటీ 37 లక్షలు), డానీ అల్వెస్ (బ్రెజిల్ ఫుట్‌బాలర్; రూ. కోటీ 28 లక్షలు), ఆంథోనీ జోషువా (బ్రిటన్ బాక్సర్; రూ. కోటీ 16 లక్షలు) వరుసగా ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది ర్యాంక్‌ల్లో ఉన్నారు. -
మన మహిళలే బెస్ట్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ...కొత్త రాష్ట్రం మరో సరికొత్త రికార్డుకు వేదికైంది. ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలున్న మహిళలకు తెలంగాణ నెలవుగా మారింది. ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలున్నవారిలో మహిళలు, పురుషులను కలుపుకుని చూస్తే తెలంగాణ ఆరో స్థానంలో ఉన్నప్పటికీ మహిళల పరంగా మాత్రం మొదటిస్థానంలో నిలిచింది. ఈమేరకు ఇండియా స్కిల్ రిపోర్టు –2020 నివేదిక వెల్లడించింది. 2019 జూలై నుంచి నవంబర్ వరకు నేషనల్ ఎంప్లాయబిలిటీ టెస్టు సర్వేను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సహకారంతో ‘ది వీ బాక్స్’నిర్వహించింది. ఈ సర్వేలో భాగంగా దేశంలోని 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 3 లక్షల మంది విద్యార్థులను, వివిధ రంగాలకు చెందిన 150 కంపెనీలను కలిసి సర్వే చేసింది. ఆ సర్వే నివేదికలోని ప్రధానాంశాలు. పెరిగిన మహిళల సంఖ్య... ►ఉద్యోగానికి కావాల్సి న నైపుణ్యాలున్న మహిళల సంఖ్య ఈసారి పెరిగింది. 2018లో నైపుణ్యాలు కలిగిన మహిళల సంఖ్య 46% ఉంటే 2019లో 47 శాతానికి పెరిగింది. ►ఉద్యోగ నైపుణ్యాలున్న మహిళలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. రాజస్తాన్ రెండో స్థానంలో నిలిచింది. ►నగరాల పరంగా చూస్తే ఉద్యోగ నైపుణ్యాలున్న మహిళలు ఎక్కువగా ఉన్న నగరాల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. తగ్గిన పురుషుల సంఖ్య.. ►ఉద్యోగ నైపుణ్యాలు కలిగిన పురుషుల సంఖ్య 2018 సంవత్సరంలో 48% ఉంటే 2019లో 46 శాతానికి తగ్గిపోయింది. ఉద్యోగ నైపుణ్యాలున్న పురుషులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఢిల్లీ, పంజాబ్ తొలి రెండు స్థానాల్లో ఉండగా, తెలంగాణ పదో స్థానానికి పరిమితమైంది. ►నగరాల పరంగా చూస్తే ముంబై మొదటి స్థానం లో ఉండగా, ఘజియాబాద్ రెండో స్థానంలో, హైదరాబాద్ మూడో స్థానంలో ఉంది. మొత్తంగా చూస్తే రెండోస్థానంలో హైదరాబాద్.. ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలు కలిగినవారు ఎక్కువ మంది (స్త్రీ, పురుషులు) ఉన్న నగరాల్లో మొదటి స్థానంలో ముంబై నిలువగా, రెండో స్థానంలో హైదరాబాద్ నిలిచింది. ఉద్యోగ నైపుణ్యాలు కలిగిన వారు ముం బైలో 70.27% మంది ఉంటే హైదరాబాద్‌లో 66.52% ఉన్నట్లు తేలింది. 63.20%తో పుణే మూడో స్థానంలో ఉండగా, 62.86%తో ఢిల్లీ నాలుగో స్థానంలో ఉంది. 54.83%తో బెంగళూరు ఐదో స్థానంలో ఉంది. 46.09%తో విశాఖపట్నం 8వ స్థానంలో నిలిచింది. రాష్ట్రాల్లో మొదటి స్థానంలో మహారాష్ట్ర.. ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలు కలిగిన యువతను (స్త్రీ, పురుషులు) అందించడంలో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచింది. అక్కడ 67.99 శాతం మంది ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలు కలిగిన వారు ఉన్నారు. తమిళనాడు 62.97 శాతం మందితో రెండో స్థానంలో, ఉత్తరప్రదేశ్ 61.78%తో మూడో స్థానంలో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ 53.56%తో నాలుగో స్థానంలో, కర్ణాటక 52.83%తో ఐదో స్థానంలో, తెలంగాణ 50.39%తో ఆరో స్థానంలో నిలిచాయి. ఆ తరువాత స్థానాల్లో వరుసగా ఢిల్లీ (49.99%), రాజస్తాన్ (38.09%), పశ్చిమ బెంగాల్ (37.30%), గుజరాత్ (30.39%) ఉన్నాయి. యువతలో తగ్గిన ఉద్యోగ నైపుణ్యాలు.. ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలు కలిగిన యువత సంఖ్య దేశంలో ఈసారి తగ్గింది. ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలున్న వారు 2018 లో 47.38% ఉంటే , 2019లో వారి సంఖ్య 46.21 శాతానికి పడిపోయింది. -
భారత్‌కు ఆరో స్థానం
లండన్: హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నమెంట్లో భారత్‌కు ఆరో స్థానం లభించింది. 5–6 స్థానాల కోసం ఆదివారం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్ 2–3తో కెనడా చేతిలో ఓడిపోయింది. ఈ విజయంతో కెనడా జట్టు వచ్చే ఏడాది భారత్‌లో జరిగే ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ (7వ, 22వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించాడు. కెనడా జట్టుకు గార్డన్ (3వ, 44వ నిమిషాల్లో) రెండు గోల్స్... కీగన్ (40వ నిమిషంలో) ఒక గోల్ అందించారు. -
మెట్టు దిగిన భారత్ మార్కెట్
• ఐదో స్థానం నుంచి ఆరో స్థానానికి • దేశంలో పెట్టుబడులకు తగ్గిన ఆసక్తి • పీడబ్ల్యూసీ అంతర్జాతీయ సీఈఓల సర్వే దావోస్: అవకాశాలతో భారత్ ఊరిస్తోంది. వచ్చే 12 నెలల కాలానికి వృద్ధి అవకాశాలతో అంతర్జాతీయ ఎగ్జిక్యూటివ్‌లను ఆకర్షిస్తున్న మార్కెట్లలో భారత్ ఆరో స్థానంలో ఉంది. కానీ, ఇది గతేడాది కంటే ఓ మెట్టు తక్కువే. గతేడాది టాప్ 5లో భారత్‌కు చోటు లభించింది. వృద్ధికి అవకాశాలున్నా...దేశంలో పెట్టుబడుల ఆసక్తి మూడేళ్లుగా తగ్గిపోయింది. పీడబ్ల్యూసీ నిర్వహించిన వార్షిక అంతర్జాతీయ సీఈవోల సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దావోస్‌లో ఈ సంస్థ తన అధ్యయన నివేదికను విడుదల చేసింది. అత్యధిక వృద్ధికి అవకాశాలున్న మార్కెట్‌గా అమెరికా నంబర్ 1 స్థానంలో ఉంది. 43 శాతం సీఈవోలు ఇందుకు అనుకూలంగా ఓటేశారు. చైనా (33 శాతం ఓటు), జర్మనీ (17 శాతం), బ్రిటన్ (15 శాతం), జపాన్ (8శాతం), ఇండియా (7 శాతం) వరుస స్థానాల్లో ఉన్నాయి. సంస్థాగత సంస్కరణలు నిదానంగా పట్టాలెక్కడం, కరెన్సీ విలువల్లో క్షీణత వంటివి దేశంలో పెట్టుబడుల విషయంలో సీఈవోల ఆసక్తి సన్నగిల్లడానికి కారణాలు. అయితేనేమి, బలమైన వృద్ధి, ద్రవ్య, విధానపరమైన సంస్కరణలతో భారత్ టాప్ 6లో చోటు దక్కించుకోవడం విశేషం. ముఖ్యాంశాలు... ⇔ తాజా సర్వే ప్రకారం పెట్టుబడులకు అమెరికా, జర్మనీ, బ్రిటన్ ప్రాధాన్య దేశాలు కాగా, భారత్, బ్రెజిల్, రష్యా, అర్జెం టీనా విషయంలో పెట్టుబడుల ఆసక్తి తగ్గుముఖం పట్టింది. ⇔ ఈ ఏడాదికి సంబంధించి ఎంతో ఆందోళనతో ఉన్నట్టు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన సీఈవోలు పేర్కొన్నారు. అయినప్పటికీ 38% సీఈవోలు వచ్చే 12 నెలల కాలంలో తమ కంపెనీల వృద్ధి అవకాశాల పట్ల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. ⇔ ప్రపంచ ఆర్థిక రంగం ఈ ఏడాది పుంజుకుంటుందని 29 శాతం మంది చెప్పారు. ⇔ రక్షణాత్మక, వ్యక్తిగత ప్రయోజనాలే పరమావధి అనే ధోరణి పెరిగిపోతుందన్న ఆందోళన సీఈవోల మాటల్లో వ్యక్తమైంది. 59% మంది రక్షణాత్మక వైఖరి పెరిగిపోతుండటంపై ఆందో ళన వ్యక్తం చేశారు. అమెరికా, మెక్సికోల్లో ఇలా భావిస్తున్న సీఈవోల శాతం 64గా ఉంది. ట్రంప్‌తో తిరోగమనం, బ్రెగ్జిట్ ఈయూ నుంచి తప్పుకోవడం వంటి ఆందోళన పరిచే అంశాలున్నప్పటికీ అమెరికా, బ్రిటన్ సహా ప్రపంచ వ్యాప్తంగా ఆశావహ పరిస్థితులు ఉండటం ఊరట కలిగించేదే. దేశీయ సీఈవోల్లో ఆశావాదం వచ్చే ఏడాది కాలంలో తమ కంపెనీలు వృద్ధిని కొనసాగిస్తాయన్న నమ్మకాన్ని భారత్‌లో 71 శాతం సీఈవోలు వ్యక్తం చేయడం విశేషం. గతేడాది ఇదే అంశంపై 33 పాయింట్లు రాగా, ఈ ఏడాది సర్వేలో 38 పాయింట్లు వచ్చాయి. ‘‘భారత ఆర్థిక రంగం పట్ల ఉన్న విశ్వాసం తమ కంపెనీలు వృద్ధి చెందుతాయన్న సీఈవోల ఆశావాదంతో ప్రస్ఫుటమైంది. అయితే, నైపుణ్య మానవ వనరుల అందుబాటు, టెక్నాలజీల కారణంగా ఎదురవుతున్న నష్టం అనేవి ఆందోళన కలిగించే అంశాలు’’ అని పీడబ్ల్యూసీ ఇండియా చైర్మన్ శ్యామల్ ముఖర్జీ అన్నారు. అసమానతలు పెరిగాయ్: మిట్టల్ కంపెనీలు సమాజం వైపూ చూడాలని సూచన దావోస్: గత దశాబ్ద కాలంలో అసమానతలు గణనీయంగా పెరిగిపోయాయని ప్రముఖ పారిశ్రామికవేత్త సునీల్ మిట్టల్ అన్నారు. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశంలో భాగంగా ‘భవిష్యత్ భారీ వ్యాపారాలు’ అన్న అంశంపై మిట్టల్ ప్రసంగించారు. దాతృత్వ కార్యక్రమాలు కంపెనీలను వినియోగదారులకు చేరువ చేస్తాయన్నారు. ‘‘నేడు ప్రపంచం ఉద్యోగాల్లేని వృద్ధిని చూస్తోంది. దాతృత్వ కార్యక్రమాలు హృదయానికి సంబంధించినవే. కానీ, వీటి వల్ల వినియోగదారులు మిమ్మల్ని మరింత సానుకూలంగా చూస్తారు. భారత్‌లో కంపెనీలు తమ లాభాల్లో 2% నిధులను కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఖర్చు చేయాల్సి ఉంటుంది’’ అని మిట్టల్ తెలిపారు. కొత్త ఆవిష్కరణలతో అవకాశాలు: గుర్నానీ ఆధునిక ఆవిష్కరణలైన ఆటోమేషన్ (యాంత్రీకరణ), ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ స్సు)లను అవకాశాలుగా మలుచుకోవాలని ప్రముఖ ఐటీ కంపెనీ టెక్ మహీంద్రా సీఈవో అయిన సీపీ గుర్నానీ సూచించారు. అయితే, ఈ విభాగాలకు సంబంధించిన నైపుణ్యాలను అలవరుచుకోవడమే ఓ సవాల్ వంటిదన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను ఎవరైనా అనుసరించకుంటే వారు ఇంటెలిజెంట్ కారని వ్యాఖ్యానించారు. ఆటోమేషన్, నూతన ఆవిష్కరణలు ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తాయన్న మాటలను ఆయన కొట్టిపడేశారు. -
హంపికి ఆరో స్థానం
టెహ్రాన్ (ఇరాన్): ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ఆరో స్థానంలో నిలిచింది. మంగళవారం ముగిసిన ఈ టోర్నమెంట్లో హంపి మొత్తం ఆరు పాయింట్లు సాధించింది. చివరిదైన 11వ రౌండ్లో తెల్ల పావులతో ఆడిన హంపి 61 ఎత్తుల్లో ప్రపంచ మాజీ చాంపియన్ అంటొనెటా స్టెఫనోవా (బల్గేరియా)ను ఓడించింది. ఈ టోర్నీలో హంపి మూడు గేముల్లో గెలిచి, రెండు గేముల్లో ఓడిపోయి, మిగతా ఆరు గేమ్‌లను ‘డ్రా’గా ముగించింది. ఇదే టోర్నీలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 4.5 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. చివరిదైన 11వ రౌండ్లో జు వెన్జున్ (చైనా)తో తలపడిన హారిక 50 ఎత్తుల్లో గేమ్‌ను ‘డ్రా’ చేసుకుంది. హారిక ఒక గేమ్‌లో గెలిచి, మూడింటిలో ఓడిపోయి, మిగతా ఏడింటిని ‘డ్రా’గా ముగించింది. హారిక, పియా క్రామ్లింగ్ (స్వీడన్), వాలెంటినా గునీనా (రష్యా) ముగ్గురూ 4.5 పాయింట్లు సంపాదించినా... మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా క్రామ్లింగ్ ఎనిమిదో స్థానంలో, హారిక తొమ్మిదో స్థానంలో, వాలెంటినా పదో స్థానంలో నిలిచారు. మొత్తం 12 మంది అగ్రశ్రేణి క్రీడాకారిణులు పాల్గొన్న ఈ టోర్నీలో జు వెన్జున్ 7.5 పాయింట్లతో విజేతగా నిలిచింది. -
రక్షణ మనదే..
ప్రపంచ దేశాలపై ప్రభావం చూపా లంటే.. మన సమర్థత ఏమిటో తెలియాలి. సుదూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలిగే ‘అగ్ని'లాంటి ఖండాంతర అణ్వస్త్ర క్షిపణులతో ఈ రంగంలో మనం ప్రపంచంలోనే ఆరో స్థానంలో ఉన్నాం. దీంతోపాటు అణ్వస్త్రాల అభివృద్ధిలోనూ ముందంజ వేస్తున్నాం. ఇక కాఫీ ఉత్పత్తిలోనూ, బిలియనీర్ల సంఖ్యలోనూ మనది ఆరోస్థానం.