Skeleton case
-
అదృశ్యమై.. హీరో ఫాంహౌస్‌లో అస్థిపంజరంలా తేలాడు
అన్నంటే అతడికి ప్రాణం.. ఒకరినొకరు విడిచి క్షణమైనా ఉండే వారు కాదు.. రక్తం పంచుకొని పుట్టిన అన్న అనారోగ్యానికి గురై మృతిచెందాడు.. అన్న లేని జీవితం వ్యర్థమని.. తాను కూడా ఇక తనువు చాలిస్తానంటూ లేఖ రాసి పెట్టిన ఓ యువకుడు.. నాలుగేళ్ల కిందట ఇంట్లో నుంచి వెళ్లిపోయి.. బుధవారం అస్థి పంజరమై కనిపించాడు. ఈ సంఘటన కేశంపేట మండలం పాపిరెడ్డిగూడలో చోటుచేసుకుంది. సాక్షి, కేశంపేట (షాద్‌నగర్): నాలుగేళ్ల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయిన వ్యక్తి బుధవారం అస్థిపంజరమై కనిపించాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మండలంలోని పాపిరెడ్డిగూడలో వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చిన్న అంజయ్య, అంజమ్మ దంపతులకు హన్మంత్, రాజు, కుమార్, పాండు నలుగురు కుమారులు. వీరిలో చిన్న కుమారుడు పాండు (32) నాలుగేళ్ల కిందట ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. వీరికి ఫరూఖ్‌నగర్ మండలం వెలిజర్ల గ్రామ శివారులో కొంత వ్యవసాయ పొలం ఉంది. కుమార్, పాండు మధ్య అనుబంధం విడదీయలేనిది. అయితే నాలున్నరేళ్ల కిందట కుమార్‌కు వివాహమైంది. పెళ్లయిన కొద్ది నెలలకే అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో కుటుంబం తట్టుకోలేకపోయింది. ముఖ్యంగా పాండు తన అన్న మృతితో కుంగిపోయాడు. కుమార్ వైద్యం కోసం కుటుంబసభ్యులు ఉన్న భూమిని అమ్మేశాడు. ఆ అప్పును చిన్న కుమారుడు పాండు తరచూ కుటుంబసభ్యులతో చెప్పేవాడు. అయితే అప్పులు ఎంతకీ తీరే మార్గం కనిపించకపోవడంతో తప్పని పరిస్థితుల్లో కుటుంబసభ్యులు తమ భూమిని అమ్మేశారు. ప్రాణంగా ఇష్టపడే అన్న మృతిచెందడం.. ఇటు తనకు ఇష్టమైన వ్యవసాయ భూమిని విక్రయించడాన్ని తట్టుకోలేకపోయిన పాండు తాను చనిపోతున్నానంటూ లేఖ రాసి అదృశ్యమయ్యాడు. అమ్మంటే తనకు చాలా ఇష్టమని.. ఆమెను బాగా చూసుకోవాలని లేఖలో పేర్కొన్నాడు. అన్న కుమార్ పెళ్లి సందర్భంగా తనకు తెచ్చిన దుస్తులు వేసి అంతిమసంస్కారాలు జరిపించాలని లేఖలో కోరాడు. నాలుగేళ్ల క్రితం పాండు రాసిన సూసైడ్ నోట్ నాగార్జున ఫాంహౌస్‌లో అస్థిపంజరం.. నాలుగేళ్ల క్రితం ఇంట్లో నుంచి అదృశ్యమైపోయిన పాండు హీరో నాగార్జున పాపిరెడ్డిగూడ గ్రామ శివారులో కొనుగోలు చేసిన ఫాంహౌస్‌లోని ఓ భవనంలో అస్థిపంజరమై కనిపించాడు. అయితే పాండుకు సంబంధించిన వ్యవసాయం పొలం పక్కనే నాగార్జున ఫాంహౌస్ ఉండడం, దీనికి చివరలో ఓ పాత భవనం ఉండడంతో అక్కడకు ఎవరూ వెళ్లేవారు కాదు. లేఖ రాసి పెట్టిన పాండు నేరుగా ఇక్కడకు వచ్చి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీసీపీ శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, చేవెళ్ల ఏసీపీ వెంకట్‌రెడ్డి, సీఐలు రామకృష్ణ, చంద్రబాబు, కేశంపేట ఎస్ఐ వెంకటేశ్వర్లు గురువారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడికి సంబంధించిన వివరాల కోసం ఆరా తీశారు. సంఘటనా స్థలంలో లభించిన ఆధార్‌కార్డులు, ఐడీ కార్డులు, చెప్పులు, ఇయర్ఫోన్లు, ఒక జత దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడు పాపిరెడ్డిగూడకు చెందిన పాండుగా గుర్తించారు. ఇతను కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకొని తాగి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. వీఆర్వో మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. -
సీఎం నివాసంలో అస్తిపంజరం ; మళ్లీ కలకలం
అగర్తలా : త్రిపుర అభివృద్ధిబాటలో మాణిక్ సర్కార్‌ను కూడా కలుపుకొని వెళతామంటూనే.. ఆయనను ఇరుకునపెట్టే ప్రయత్నాలను ముమ్మరం చేసింది బీజేపీ! కాషాయదళం విజయానికి కారకుడైన సునీల్ దేవ్‌ధర్ శనివారం పేల్చిన ఓ ట్వీట్.. రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ‘‘త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్‌కు నాదొక విన్నపం.. అధికారిక నివాసాల్లోకి చేరబోయేముందు అక్కడి సెప్టిక్ ట్యాంకులను ఓ సారి శ్రుభ్రం చేయించండి. గతంలో మాణిక్ సర్కార్ నివాసంలో మహిళ అస్తిపంజరం లభించిన అనుభవం దృష్ట్యా మీరీ పని తప్పక చెయ్యాలి..’ అని దేవ్‌ధర్ కామెంట్ చేశారు. సీఎం నివాసంలో అస్తిపంజరమా? : అగర్తలాలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో మాణిక్ సర్కార్ 1998 నుంచి మొన్నటిదాకా ఉన్నారు. కాగా, 2005 జనవరి4న ఆ అధికారిక నివాసంలోని సెప్టిక్ ట్యాంకులో ఓ మహిళ అస్తిపంజరం బయటపడటం అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించింది. సెప్టిక్ ట్యాంకును శుభ్రం చేయడానికి వచ్చిన మున్సిపల్ సిబ్బంది దానిని గుర్తించారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న మాణిక్ సర్కార్ కేసును సీఐడీకి అప్పగించారు. ఆ తర్వాత అది సీబీఐకి బదిలీ అయింది. 13ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఆ కేసు ఇంకా కొలిక్కిరాకపోవడంతో పలు విమర్శలకు తావిచ్చినట్లైంది. ‘ఇది మాణిక్ నియంత పాలనకు నిదర్శనమని’ సీపీఎం ప్రత్యర్థులు ఆరోపిస్తారు. ఇప్పుడు ఉన్నపళంగా సునీల్ దేవ్‌ధర్ ‘అస్తి పంజరం’ ఉదంతాన్ని కోట్ చేస్తూ ట్వీట్ చేయడం వ్యూహంలో భాగమా, లేక యాదృశ్చికమా తెలియాల్సిఉంది. ఇంతకీ ఆ స్కెలిటన్ ఎవరిది? : సీఎం నివాసంలోని సెప్టిక్ ట్యాంక్‌లో తేలిన అస్తిపంజరం ఎవరిదనేదానిపై త్రిపురలో భిన్నకథనాలు ప్రచారంలో ఉన్నాయి. నేపాల్‌కు చెందిన పని అమ్మాయిని.. సీఎం సిబ్బందిలో ఒకరు లేదా కొందరు అత్యాచారం చేసి, హతమార్చి ఉంటారని నాటి కాంగ్రెస్ నేత సమీర్ రాజన్ బర్మన్ ఆరోపించారు. హత్యాచారం కేసును తొక్కిపెట్టేక్రమంలో మృతురాలి కుటుంబాన్ని బలవంతంగా నేపాల్‌కు పంపించేశారని ఆయన పేర్కొన్నారు. మాణిక్ సర్కార్‌పై దినేశ్ కాంజీ అనే రచయిత రాసిన ‘మాణిక్ సర్కార్ : ది రియల్ అండ్ వర్చువల్’ అనే పుస్తకంలోనూ అస్తిపంజరం వ్యవహారాన్ని ప్రస్తావించారు. ‘‘అప్పట్లో జాతీయ స్థాయి మీడియాలో సైతం చర్చనీయాంశమైన ఈ కేసులో బర్మన్(కాంగ్రెస్ నేత) ఆరోపణలను ఏఒక్కరూ పట్టించుకోకపోవడం కొంత ఆశ్చర్యం అనిపిస్తుంద’ని రచయిత రాసుకొచ్చారు. దేవ్‌ధర్ తాజా ట్వీట్‌పై సీపీఎం శ్రేణులు ఇంకా స్పందించాల్సిఉంది. I request @BjpBiplab, new CM of Tripura, to get septic tanks of all minister quarters cleaned before occupying them. It should be recollected that a woman’s skeleton was found in septic tank of Ex CM Manik Sarkar's quarter on Jan 4, 2005 but the case was deliberately suppressed. — Sunil Deodhar (@Sunil_Deodhar) 10 March 2018 -
సీపీఐ లీడర్ చెంప చెళ్లుమనిపించాడు!
మిడ్నాపూర్: నివాసంలో పుర్రెను ఉంచుకుని దొరికిపోయిన సీపీఐ లీడర్ సుశాంత్ ఘోష్‌ను కోర్టు ప్రాంగణంలో ఓ వ్యక్తి చెంప చెళ్లుమనిపించాడు. ఆ పుర్రె తన బిడ్డదేనని ఆయన తెలిపారు. కోర్టులో విచారణకు హాజరైన ఘోష్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో లోపలికి వచ్చిన మనోరంజన్ సింగ్ అనే వ్యక్తి ఘోష్ ఎడమ చెంపపై కొట్టారు. ఆ పుర్రె తన బిడ్డ స్వపన్ సింగ్‌దని, కొన్నేళ్ల కిందట మిస్ అయిందని తెలిపారు. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ పోలీసులు వెంటనే సింగ్‌ను అరెస్టు చేశారు. ఈ సంఘటనతో షాక్ తిన్న ఘోష్ తృణమూల్ కాంగ్రెస్ కుట్ర అని ఆరోపించారు. 2011లో ఘోష్ పూర్వీకులకు సంబంధించిన ఇంటి నుంచి మొత్తం 8 పుర్రెలను పోలీసులు సీజ్ చేశారు. దీనిపై విచారణ జరుగుతుండగా.. సుప్రీంకోర్టుకు వెళ్లిన ఘోష్ బెయిల్ తెచ్చుకున్నారు. -
తల్లీతమ్ముడే చంపేశారు..
పరిగి: ఇటీవల పరిగిలో వెలుగుచూసిన ‘అస్థిపంజరం’ కేసు మిస్టరీ వీడింది. హత్యకు గురైంది పరిగికి చెందిన ఆరెకటికె రాకేష్(22)గా పోలీసులు గుర్తించారు. వేధింపులు తాళలేక అతడిని తల్లీ, తమ్ముడే చంపేశారు. సోమవారం పరిగి సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ ప్రసాద్ కేసు వివరాలు తెలిపారు. పరిగి బాహర్పేట్ కాలనీకి చెందిన ఆరెకటికే బాలాజీకి భార్య బుజ్జీబాయి, కుమారులు రాకేష్(22), కమాల్ ఉన్నారు. బుజ్జీబాయి, చిన్నకొడుకు కమాల్‌తో కలిసి పరిగిలోని కల్లు దుకాణం వద్ద బజ్జీలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తుండేది. భర్త, పెద్ద కుమారుడు ఖాళీగా తిరుగుతూ మద్యం తాగుతుండేవారు. డబ్బులు అవసరమైన ప్రతిసారి తండ్రీకొడుకులు బుజ్జీబాయి ని వేధించడమో.. లేక చిన్నచిన్న చోరీలు చేస్తుండేవారు. ఈక్రమంలో వారు గతంలో జైలుకు కూడా వెళ్లివచ్చారు. వేధింపులు భరించలేక.. ఆరునెలలుగా తండ్రీకొడుకులు బాలా జీ, రాకేష్‌లు డబ్బుల కోసం బుజ్జీబాయి, కమాల్‌ను తీవ్రంగా వేధించసాగారు. ఈక్రమంలో బాలాజీ ఇటీవల గండేడ్ మండలంలో మేకల చోరీకి పాల్పడడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. ఆయనకు బెయిల్ ఇప్పించేం దుకు డబ్బులు ఇవ్వాలని రాకేష్ తల్లిని వేధించాడు. దీంతో బుజ్జీబాయి కొంతడబ్బు పోగుచేసి ఇటీవల బెయిల్‌కు సంబంధించిన ఫీజు ఇచ్చింది. అయినా రాకేష్ డబ్బులు అడుగుతూనే ఉన్నాడు. వేధింపులు భరించలేని కమాల్, బుజ్బీబాయిలు ఎలాగైనా రాకేష్‌ను చంపేయాలని నిర్ణయించుకున్నారు. అనంతరం మనసు మార్చుకున్నారు. మద్యం తాగి వచ్చిన ప్రతీసారి రాకేష్ కుటుంబీకులను వేధించడంతో బుజ్జీబాయి, కమాల్ అతడి కాళ్లు, చేతులు కట్టేసి ఇంట్లో ఉన్న టేబుల్‌కు కట్టేసి తమ పనులు చూసుకునేవారు. ఈ విషయం ఇరుగుపొరుగు వారికి కూడా తెలుసు. హత్యకు దారితీసిన పరిస్థితి.. ఈనెల 1న ఉదయం 10 గంటల సమయంలో రాకేష్ మద్యం తాగి ఇంటికి వచ్చాడు. తల్లీతమ్ముడిని దూషించి వారిపై దాడికి యత్నించాడు. దీంతో ఎప్పటిమాదిరిగానే బుజ్జీబాయి చిన్నకొడుకు కమాల్‌తో కలిసి రాకేష్ కాళ్లుచేతులు కట్టేసి ఇంట్లో ఉన్న టేబుల్‌కు బిగించి తమ పనుల్లో నిమగ్నమైపోయారు. రాత్రి ఇంటికి వచ్చి భోజనం చేసిన తర్వాత తల్లీకొడుకులు రాకేష్ కట్లు విప్పారు. అనంతరం రాకేష్ తమ్ముడు, తల్లితో గొడవకు దిగాడు. అతడి వేధింపులు భరించలేని వారు రాకేష్‌పై దాడిచేశారు. ఈక్రమంలో అతడు కిందపడిపోవడంతో బుజ్జీబా యి రాకేష్ కాళ్లను గట్టిగా పట్టుకుంది. కమాల్ గొంతు నులిమి చంపేశాడు. అనంతరం అర్ధరాత్రి తల్లీకొడుకులు రాకేష్ శవాన్ని గోనెసంచిలో తీసుకెళ్లి సమీపంలో ఉన్న గుంతలో పడేశారు. మృతదేహంపై కిరోసిన్ పోసి తగులబెట్టారు. మరుసటి రోజు ఉదయం కమాల్ వెళ్లి చూడగా మృతదేహం పూర్తిగా కాలిపోలేదు. దీంతో గడ్డి వేసి మరోసారి నిప్పంటించాడు. అప్పటికీ శవం పూర్తిగా కాలిపోకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో పక్కనే ఉన్న గ్లోబల్ కాలేజ్ ప్రిన్సిపాల్ ముజీబ్ వెళ్లి చూడగా శవం కనిపించింది. ఏదో జంతువు కళేబరం అయి ఉండొచ్చని భావించిన ఆయన గత మంగళవారం పంచాయతీ కార్మికులతో తగులబెట్టించారు. అయినా దుర్వాసన తగ్గకపోవడంతో ప్రిన్సిపాల్ గత గురువారం ఘటనా స్థలానికి వెళ్లి చూశాడు. కొన్ని ఎముకలు, పుర్రె కనిపించటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు ఇలా ఛేదించారు.. వైద్యులు పుర్రె, ఎముకలు మనిషివేనని నిర్ధారించారు. కాగా దుస్తులు లేకపోవడం.. అప్పటికే కుళ్లిపోవడంతో ఆడా.. ? మగా.. అనే విషయం తెలియలేదు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యా ప్తు ప్రారంభించారు.అస్థిపంజరం బయటపడటంతో అప్రమత్తమైనబుజ్జీబాయి తన కొడుకు కనిపించటంలేదని బంధువులకు, తెలిసిన వారితో చె ప్పటం ప్రా రంభించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈక్రమంలో స్థానికులను విచారించారు. రాకేష్ ప్రవర్తన.. అతడి కుటుంబీకుల గురించి తెలుసుకున్నారు. దీంతో అనుమానించి బుజ్జీబాయి, కమాల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య విషయం అంగీకరించి పైవిషయాలు తెలిపారు. ఈమేరకు నిందితుల్ని సోమవారం రిమాం డుకు తరలించారు. కేసును ఛేదించిన ఎస్ఐలు కృష్ణ, శంషొద్దీన్, కానిస్టేబుళ్లు పాండుగౌడ్, చంద్రశేఖర్‌లను ఈ సందర్భంగా సీఐ ప్రసాద్ అభినందించారు.