Slum People
-
వెంటపడి మరీ పోలీసుల భరతం పట్టారు
భువనేశ్వర్: ఒడిశాలో పోలీసులపై స్థానికులు తిరుగుబాటు చేశారు. అన్యాయాన్ని సమర్ధించేలా వ్యవహరించిన పోలీసులను చితకబాదారు. భువనేశ్వర్ జిల్లా లక్ష్మీ సాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హల్దీపదా స్లమ్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సంతోష్ జెనా అనే వ్యక్తి తన భార్య బతికుండగానే హల్దీపదా అనే స్లమ్ ఏరియాకు చెందిన బాలికతో లోబరుచుకొని చేసి ఆమెను గర్భవతిని చేశాడు. అనంతరం నిరాకరించాడు. దీంతో ఆమె తల్లిదండ్రులు లక్ష్మీ సాగర్ పోలీస్ స్టేషన్ ను సంప్రదించినా న్యాయం జరగలేదు. పోలీసులు కనీసం ఎఫ్ ఐఆర్ ను కూడా నమోదు చేయలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు సంతోష్ జెనాను చెట్టుకు కట్టేసి దాడి చేశారు. అతడిని కాపాడేందుకు లక్ష్మీసాగర్ ఇన్స్పెక్టర్ రజత్ రాయ్, సబ్ ఇన్స్పెక్టర్ అశోక్ హన్స్దా తదితరులు అక్కడికి రావడంతో అప్పటికే ఖాకీలపై ఆగ్రహంతో ఉన్న గ్రామస్థులు పోలీసులపై తిరుగుబాటు చేశారు. వచ్చిన పోలీసులను వచ్చినట్లే చితకబాదారు. గ్రామస్థులంతా ఏకమై తమ ఆక్రోశాన్ని చూపించారు. -
నోరుకొడితే ‘నోటా’నే!
ప్రస్తుత ఎన్నికల్లో ‘నన్ ఆఫ్ ది అబౌ(నోటా)’ ఆప్షన్‌కు పెరిగిన ప్రజాదరణకు ఇదో ఉదాహరణ. ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం ఎలాంటి నోటీసు ఇవ్వకుండా.. ప్రత్యామ్నాయ పునరావాసం చూపించకుండా అకస్మాత్తుగా తమ గుడిసెలను కూల్చేసి.. వీధుల పాలు చేసినందుకు కోల్‌కతాలోని తప్సియా ప్రాంత మురికి వాడల ప్రజలు ఈ ఎన్నికల్లో నోటాతో నిరసన తెలపాలనుకుంటున్నారు. 2012 నవంబర్లోనే వారిని అక్కడినుంచి పంపించేసినా.. ఆ పాత అడ్రస్‌తోనే వారికి ఎన్నికల గుర్తింపు కార్డులున్నాయి. తప్సియా స్లమ్స్‌లో దాదాపు 300కు పైగా కుటుంబాలుండేవి. ఇళ్లను కూల్చేసే సమయంలో వారికి నామమాత్రంగా పరిహారం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది. అప్పటినుంచి వారంతా రోడ్డు పక్కన, ఫుట్‌పాత్‌లపై జీవనం సాగిస్తున్నారు. నేతలకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని, అందుకే తామంతా ఈసారి ఎవరికీ ఓటేయకుండా ‘నోటా’ మీట నొక్కుతామని చెబుతున్నారు.