small business owners
-
చిరు వ్యాపారులు, చిన్న పరిశ్రమలపై చంద్రబాబు దొంగ దెబ్బ
-
వైరల్ పోస్ట్: జొమాటో రియాక్షన్
సాక్షి,ముంబై: నాణేనికి రెండు వైపులా అన్నట్టు సోషల్ మీడియా పుణ్యమా అని ఇబ్బందుల్లో ఉన్న చిరు వ్యాపారులకు, ఇతర బాధితులకు భారీ ప్రయోజనమే లభిస్తోంది. ఇటీవల మనవరాలి చదువుకోసం ఇల్లునే అమ్ముకున్న ఒక పెద్దాయన పట్ల నెటిజన్లు మానవత్వంతో స్పందించారు. అంతకుముందు ఢిల్లీకి చెందిన ‘బాబా కా దాబా’ వృద్ధ దంపతులకు సోషల్‌మీడియా ద్వారా మద్దతు లభించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆర్థిక సంక్షోభంలో పడి విలవిల్లాడుతున్న ముంబైకి చెందిన ‘లిట్టీ చోఖా’ అమ్ముకుని జీవించే చిరువ్యాపారి కథనం వైరల్‌గా మారింది. జర్నలిస్టు ప్రియాన్షు ద్వివేది మొదలు పెట్టిన ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్‌కు భారీ స్పందన లభించింది. ప్రధానంగా ప్రముఖ ఫుడ్‌డెలివరీ సంస్థ జొమాటోతో పాటు, ఇతర దాతలు స్పందించిన తీరు విశేషంగా నిలిచింది.(జొమాటో వివాదం: ఇదట సంగతి...ఫన్నీ వీడియో వైరల్) ఫ్రీలాన్స్ జర్నలిస్టు ప్రియాన్షు ద్వివేది సోషల్ మీడియాలో ఈ కథనాన్ని పోస్ట్ చేశారు. వివరాలను పరిశీలిస్తే అహ్మదాబాద్‌కు చెందిన యోగేశ్ ముంబైలోని వెర్సోవా బీచ్‌లో లిట్టి చోఖా అమ్మకుని జీవనం సాగించేవాడు. స్టాల్లో రెగ్యులర్‌గా లీట్టీలను ఆస్వాదించే ద్వివేది మాటల సందర్బంలో యోగేశ్ కరోనా కారణంగా వ్యాపారం దెబ్బతిని ఆర్థికంగా ఇబ్బందుల్లో పడినట్టు తెలుసుకున్నారు. పాపులర్ లిట్టి-చోఖాను చట్నీ, బటర్, సలాడ్‌తో కలిపి కేవలం ఇరవై రూపాయలకు అమ్ముతున్నా కొనేవారు కరువైన పరిస్థితి. చివరికి దుకాణం కూడా మూసి వేయాల్సిన దుస్థితి ఏర్పడింది. సోదరుడితోపాటు, తమ జీవనం దుర్భరంగా మారిపోయిందంటూ ఈ సందర్భంగా ద్వివేదితో వాపోయారు ఈ నష్టాలను భరించే శక్తి ఇక తనకు లేదనీ, స్టాల్‌ను మూసివేయడం తప్ప వేరే మార్గం లేదంటూ యోగేశ్ ఆవేదన చెందారు. దీంతో చలించిన ద్వివేది యోగేశ్‌కు సాయం చేయాల్సిందిగా కోరుతూ ఒక పోస్ట్ పెట్టారు. అంతేకాదు దీన్ని జోమాటోను ట్యాగ్ చేస్తూ మార్చి 16 న ట్వీట్ చేశారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. ఈ ట్వీట్ రెండు వేలకు పైగా లైక్‌లను సంపాదించింది. అలాగే జొమాటోలో అతడి దుకాణాన్ని నమోదు చేయాలని నెటిజన్లు కూడా అభ్యర్థించారు. ముఖ్యంగా బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. జొమాటో స్పందన దీనికి జొమాటోతో పాటు కొంతమంది నెటిజన్లు కూడా సానుకూలంగా స్పందించారు. యోగేశ్‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. అతని వివరాలను సేకరించేపనిలో పడింది. ప్రతిస్పందన ఆలస్యం అయినందుకు క్షమించండి. వీలైతే, దయచేసి యోగేశ్ కాంటాక్ట్ నంబర్‌తో పాటు, ఇతర వివరాలను తమకు అందించాలని కోరింది. దీనిపై ద్వివేది సంతోషం వ్యక్తం చేశారు. సాయం చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. లిట్టీ-చోఖా: బిహార్‌కు చెందిన వంటకం ఇది. గోధుమపిండితో చేసిన చపాతిలో పప్పులు, ఇతర మసాలాలను స్టఫ్ చేసి, నిప్పులపై కాలుస్తారు. దీన్ని నేతితోనూ, వంకాయ కూర లేదా ఆలూకూరతో కలిపి తింటారట. Hi Priyanshu, sorry for the delay in response. If possible, please help us with his contact number over a private message and our team will be reaching out to him at the earliest to assist him with the listing procedure.https://t.co/jcTFuHa5Ue — zomato care (@zomatocare) March 17, 2021 @zomatoin please help this gentleman with his endeavour!!🙏 https://t.co/0l9ZKOYI8d — manoj bajpayee (@BajpayeeManoj) March 17, 2021 -
చిన్న పరిశ్రమలపై నోట్ల రద్దు ఎఫెక్ట్
-
మరో రోజు.. క్యూలోనే..
నోట్ల మార్పిడి కోసం జనానికి తప్పని అవస్థలు - ఇంకా అందుబాటులోకి రాని రూ.500 నోట్లు - బ్యాంకులు, ఏటీఎంలు, పోస్టాఫీసుల వద్ద బారులు తీరుతున్న జనం - చిల్లర సమస్యతో వ్యాపారాలు బంద్ - కార్డు స్వైపింగ్ యంత్రాల కోసం వ్యాపారుల అర్జీలు సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు కష్టాలు సామాన్య జనాన్ని మరింతగా ముసురు కుంటున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా వ్యాపారాలు స్తంభించిపోయాయి. దినసరి కూలీలు మొదలు చిరు వ్యాపారులు, ఉద్యోగులు, వృద్ధులు, మహిళలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. షాపింగ్ మాల్స్, కార్పొరేట్, బడా వ్యాపార, వాణిజ్య సంస్థలన్నీ వెలవెలబోరుు కనిపిస్తున్నాయి. గురువారం కూడా బ్యాంకులు, పోస్టాఫీసులు, ఏటీఎం సెంటర్ల వద్ద జనం బారులు తీరారు. కొత్త రూ.500 నోట్లు ఇంకా రాకపోవడం, ఏటీఎంలలో సాఫ్ట్వేర్ మార్చి కొత్త నోట్లను అందుబాటులో ఉంచకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఏటీఎంలలో నగదు నిల్వచేసిన గంట, రెండు గంటలలోపే అరుుపోతున్నాయి. పలు జాతీయ బ్యాంకులు నగదు మార్పిడి కోసం వచ్చే వారికి సిరా చుక్క పెడుతున్నా.. పలు ప్రైవేటు బ్యాంకులు ఇంకా ఆ పని చేయకపోతుండడంతో కొందరు మళ్లీ, మళ్లీ క్యూ కడుతున్నారు. దీంతో అవసరమున్న వారికి నగదు అందడం లేదు. బ్యాంకర్లు వేలికి పెడుతున్న సిరా చుక్క కూడా సులువుగానే తుడిచివేయవస్తోందని పలువురు పేర్కొంటున్నారు. చిల్లర కోసం కష్టాలు: బ్యాంకుల్లో ఇస్తున్న రూ.2 వేల కొత్త నోట్లు కొత్త కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. నిత్యావసరాలు, పళ్లు, పాలు, కూరగాయల కోసం ఈ నోటుతో వెళితే వ్యాపారులు చిల్లర లేదంటూ తిప్పి పంపుతున్నారు. మాల్స్‌లోనూ రూ.2 వేల కొత్త నోటుతో వెళితే రూ.1,500 మేర కొనుగోలు చేయాల్సిందేనని నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. కొన్ని దుకాణాల్లో క్రెడిట్, డెబిట్ కార్డులను స్వైప్ చేసిన వారి నుంచి బిల్లుపై నాలుగు శాతం అదనంగా వసూలు చేస్తున్నారు. ఇక చిల్లర అందుబాటులో లేకపోవడంతో పలువురు చిరు వ్యాపారులు, దుకాణదారులు స్వైపింగ్ యంత్రాలు జారీ చేయాలని బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరోవైపు పలు ప్రైవేటు బ్యాంకులు తమ ఖాతాదారులకే నగదు మార్పిడి చేస్తుండడం, మరికొన్ని బ్యాంకుల్లో మధ్యాహ్నం వరకే నగదు మార్పిడికి అనుమతించడంతో సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల నల్లధనాన్ని వైట్‌గా మార్చుకునేందుకు బడాబాబులు కూలీలను వారి ఆధార్‌కార్డుతో సహా తీసుకొచ్చి క్యూలైన్లలో నిలబెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ముత్యాల వ్యాపారంపైనా ఎఫెక్ట్ పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ పాతబస్తీలోని బంగారం, వెండి, ముత్యాల వ్యాపారాలను తీవ్రంగా దెబ్బతీసింది. బంగారు ఆభరణాలు తయారు చేసే కార్మికులు, స్వర్ణకారులు పనిలేక ఇబ్బందులకు గురవుతున్నారు. నోట్ల రద్దుతో అడ్డాకూలీలు సైతం పనుల్లేక, చేతిలో డబ్బుల్లేక దీనంగా కాలం వెల్లదీస్తున్నారు. ప్రతి గురువారం జరిగే జుమ్మెరాత్‌బజార్ సంత కొనుగోలుదారులు లేక వెలవెలబోరుుంది. -
రూ.10లక్షల వరకు షూరిటీ లేని రుణాలు
ఖాతాదారులకు మెరుగైన సేవలే లక్ష్యం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫీల్డ్ జనరల్ మేనేజర్ కనేకల్ చంద్రశేఖర్ తిరుపతి సిటీ: చిరు వ్యాపారులు, చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం కింద రూ.10 లక్షల వరకు షూరిటీ లేకుండా రుణాలు ఇస్తున్నామని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫీల్డ్ జనరల్ మేనేజర్ కనేకల్ చంద్రశేఖర్ తెలిపారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో శుక్రవారం తిరుపతిలోని జీవనోపాధి వనరుల కేంద్రంలో రూ.377.38 కోట్ల రుణాలు పంపిణీ చేశారు. చంద్ర శేఖర్‌తో పాటు రీజనల్ హెడ్ ఏజీఎం రాంప్రసాద్ మిశ్రా, డెప్యూటీ రీజనల్ హెడ్ డి.మహేశ్వరయ్య ముఖ్య అతిథులుగా హాజరై రుణాలు పంపిణీ చేశారు. చంద్రశేఖర్ మాట్లాడుతూ లబ్ధిదారులు తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఖాతాదారులకు మెరుగైన సేవలందించడమే తమ బ్యాంక్ లక్ష్యమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 220 శాఖలున్నాయని, త్వరలో కుప్పం, అనంతపురం, హిం దూపురం, బుచ్చిరెడ్డిపాళెం, సంత్రవేలు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూని యన్ లోన్ పాయింట్ మేనేజర్ ఎస్.వాసంతి, అసిస్టెంట్ మేనేజర్ న్రూపెన్ చక్రవర్తి, బ్యాంక్ అధికారులు మాసిలామణి, ప్రశాంత్సాహు, సోమెన్, జితేంద్ర, రంజీబ్, రెడ్డెప్ప పాల్గొన్నారు. -
అధిక వడ్డీలు ఆశ చూపి...
* రూ.8కోట్ల సొమ్ముతో ఉడాయించిన పెద్ద మనిషి * లబోదిబోమంటున్న పేదలు, చిరు వ్యాపారులు * షిర్డీకి వెళ్తున్నామని ఉడాయింపు విజయనగరం కంటోన్మెంట్ : అత్యవసర పని ఉంది.. అధికంగా వడ్డీలు ఇస్తామని చెప్పి సుమారు రూ. 8 కోట్లకు కుచ్చు టోపీ వేశారు ఆ దంపతులు. పాఠశాల యజమానిగా పరిచయం చేసుకొని దొరికిన కాడికి దోచుకుపోయారు. షిర్డీ వెళ్తున్నామని చెప్పి పక్కా ప్రణాళిక ప్రకారం పిల్లల టీసీలు తీసుకొని మరీ ఉడాయించారు. మోసపోయామని గ్రహించిన బాధితులు సోమవారం కలెక్టరేట్‌కు వచ్చి గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఒబ్బిలిశెట్టి రాజశేఖర్, గాయత్రి దంపతులు విజయనగరంలోని వక్కలంకవారి వీధిలో అద్దె ఇంట్లో ఉండేవారు. పదేళ్ల క్రితం సాయిరాం పబ్లిక్ స్కూల్‌ను స్థాపించారు. మరో పక్క లార్వెన్స్ స్కూల్లో ఓ డెరైక్టర్‌గా పరిచయం చేసుకున్నారు. పెద్ద మనుషులుగా చలామణి అయ్యారు. చుట్టుపక్కల అందరితో వరుసలు కలిపారు. లార్వెన్స్, పెన్ స్కూళ్లలో భాగస్వామ్యం ఉందన్నారు. రోటరీ క్లబ్లో కూడా సభ్యులయ్యారు. పాఠశాలకు వచ్చే పేద, మధ్యతరగతి ప్రజలతో కలుపుగోరుగా ఉండేవారు. కల్లబొళ్లి కబుర్లు చెప్పి ఎక్కువ వడ్డీలిస్తామని ఆశచూపి దొరికిన వారి వద్ద వేలు, లక్షల్లో అప్పులు చేశారు. సమాజంలో స్థితిమంతులైన వారి దగ్గరి నుంచి ఇళ్లల్లో పాచిపనులు చేసుకునే వారిని, పాల ప్యాకెట్లు అమ్ముకునే వారిని బుట్టలో వేసుకున్నారు. ఫంక్షన్లకు వెళ్తామని చెప్పి మహిళల వద్ద నగలు కాజేశారు. పథకం ప్రకారం... దాదాపు రూ.8 కోట్ల సొమ్ము, విలువైన నగలతో ముందుగా వేసుకున్న పథకం ప్రకారం షిర్డీ వెళ్తున్నామని చెప్పి ఉడాయించేశారు. షిర్డీ వెళ్లిన వీరు ఇంకా రాలే దేంటని బాధితులు సాయిరాం పబ్లిక్ స్కూల్‌కు వెళ్లి ఆరా తీశారు. మరొకరికి పాఠశాల నిర్వహణ బాధ్యతలు అప్పగించి ఉడాయించేశారన్న విషయం తెలుసుకొని లబోదిబోమంటున్నారు. భారీ ఎత్తున డబ్బులు ఇచ్చిన వారు కూడా ఇన్‌కంటాక్స్ ఇబ్బందులు ఉన్నాయని బయటకు రాలేదని బాధితులు చెబుతున్నారు. ఈ ఘరానా మోసంపై టూ టౌన్‌పోలీస్ స్టేషన్లో గతంలో ఫిర్యాదు చేసిన వీరు సోమవారం కలెక్టరేట్‌కు వచ్చి గ్రీవెన్స్‌లోను ఫిర్యాదు చేశారు. నగలు తీసుకుపోయారు ఎన్నాళ్లో కూడబెట్టిన డబ్బులతో సంక్రాంతి పండగ ముందు నల్లపూసలు, నగలు చేయించుకున్నాను. 8 తులాల నగలు దాదాపు రెండున్నర లక్షల విలువైనవి. మెచ్యూర్ ఫంక్షన్‌కు వేసుకెళ్తామని చెప్పి తీసుకుపోయారు. ఇలా ఊరొదిలి వెళతారనుకోలేదు. - సీహెచ్ సూర్యకళ, విజయనగరం పారిపోతామా? అన్నారు. పాఠశాల అభివృద్ధి చేసుకుంటానంటే నా వద్ద ఉన్న డబ్బులతో పాటు వస్తువులు పెట్టి పలుమార్లు రూ.7.50లక్షలు అప్పిచ్చాను. వడ్డీ కూడా ఇస్తామన్నారు. ఇటీవల నా కుమార్తె అల్లుడు కలసి వచ్చారు. అల్లుడు వెళ్లి గట్టిగా అడిగాడు. మార్చిలో స్కూల్ ఫీజులొస్తాయి. అప్పుడిస్తానన్నాడు. గాయత్రి వచ్చి ఇప్పుడు అంత డబ్బులు మీకేం అవసరం వదినా? మేమేం పారిపోతామా అని అడిగింది. ఇస్తారు కదా అనుకుంటే పారిపోయారు. - గూడిపూడి నాగమణి, వక్కలంక వీధి రూ.7.50 లక్షలు ఇచ్చాను టిఫిన్ దుకాణం నడుపుతున్నాను. చీటీలు ఎత్తేవారు నాకు డబ్బులిచ్చి వెళ్తుంటారు. అలా ఇచ్చిన డబ్బులను వారికిచ్చాను. దాదాపు రూ.7.50లక్షలు ఇచ్చాను. దీంతో పాటు మరో రూ.60 వేల చీటీ డబ్బులు ఇచ్చాను. దేనికీ కాగితాలు రాసివ్వలేదు. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. - పి అప్పలకొండ, చిన్నిపిల్లి వీధి నాకు తెలియకుండా నా భార్య ఇచ్చేసింది రాజశేఖర్ భార్య గాయత్రి వచ్చి మాయ చేసి అడిగితే నాకు తెలియకుండా నా భార్య పద్మజ రూ.7 లక్షలు ఇచ్చేసింది. భూమి అమ్మితే వచ్చిన డబ్బు ఇంట్లో ఉందని తెలుసుకుని వచ్చి మాయ చేశారు. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాం. కలెక్టర్ దృష్టిలో పెట్టాలని అందరం వచ్చాం. - ఎం జగదీశ్వరరావు, బాధితుడు నా డబ్బులెలా వస్తాయో.. నేను నాలుగైదు వీధుల్లో పాల ప్యాకెట్లు విక్రయిస్తాను. అలాగే సాయిరాం ఆలయం ముందు కొబ్బరి కాయలు విక్రయిస్తాను. నేను పైసా పైసా కూడబెట్టి రూ.30 వేలు పోగేశాను. ఆ డబ్బులు ఉన్నాయని తెలిసి వచ్చారు. మళ్లీ వడ్డీతో సహా ఇస్తామని చెబితే ఇచ్చాను. నా డబ్బులెలా వస్తాయో..! - చిన్నిపిల్లి రమణమ్మ, పన్నీరువారి వీధి రూ. 3లక్షల చీటీ, రెండు లక్షల అప్పు ఇచ్చాం నా భర్త ప్రైవేటు ఇన్‌కంటాక్స్ ఫైళ్లు రాస్తుంటారు. మేం చీటి వేసిన రూ. 3లక్షలకు నేనే ష్యూరిటీ ఉంటానని తీసుకెళ్లిపోయాడు. అలాగే మరో రెండు లక్షలకు మధ్య ఉన్నాం. మొత్తం ఐదు లక్షలు కాజేశారు. ఇలా అర్ధాంతరంగా స్కూల్ మూసేసి వెళ్లిపోతారనుకోలేదు. - కె.సూర్యకళ, విజయనగరం -
వీధివ్యాపారులపై అలసత్వం
చిరువ్యాపారులు.. నిగనిగలాడే పండ్లు, కూరగాయలు, తినుబండారాలను విక్రయించే వీరి జీవితాల్లో ఎలాంటి మెరుపూ ఉండదు. అద్దెలు, ఖర్చులు, పోలీసు మామూళ్లు, రోజువారీ వడ్డీలకు పోగా రోజంతా నిలువుకాళ్ల జీతంతో చేసే వ్యాపారంలో మిగిలేది స్వల్పమే. వీరిని వీధివ్యాపారులుగా గుర్తిస్తూ, కేంద్రప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసినా, అమలులో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. ప్రత్యేక జోన్లు లేవు. గుర్తింపు కార్డుల పంపిణీలేదు. పావలా వడ్డీ రుణాల ప్రసక్తే లేదు. - కేంద్రప్రభుత్వం చేసిన చట్టం అమలులో తీవ్ర నిర్వక్ష్యం - ప్రత్యేక జోన్లు లేవు, గుర్తింపు కార్డులు సంగతి సరేసరి - పావలా వడ్డీ రుణాల ఊసే లేదు తెనాలి : జిల్లాలో అధికారుల అంచనా ప్రకారమే 4,397 మంది చిరువ్యాపారులు ఉన్నారు. వాస్తవ సంఖ్య యాభై శాతం అధికంగా ఉంటుందని చెబుతారు. ప్లాట్‌ఫారాలు, తోపుడుబండ్లపై, రోడ్డు పక్కన బుట్టల్లో వ్యాపారాలు చేసుకొనే పేదలకు ఆదాయం అస్తుబిస్తుగానే ఉంటుంది. సరుకు కొనుగోలుకు వడ్డీ వ్యాపారుల నుంచి రోజువారీ రూ.5, రూ.10 వడ్డీకి అప్పులు తెచ్చుకొని అమ్మకం ఆరంభిస్తారు. పెట్టుబడికి వడ్డీ, తోపుడుబండి అద్దె, తమ సాదర ఖర్చులు, వారం వంతున పోలీసులకు చెల్లించే మామూళ్లు పోతే చిరువ్యాపారులకు మిగిలేది స్వల్పమే. ఇళ్లు, దుకాణాల ఎదుట సరుకు పెట్టుకొని వ్యాపారం చేస్తే, ఆ గృహస్తులు/దుకాణ యజమానులకు రోజుకు ఇంతని డబ్బు చెల్లించాల్సిందే. చట్టం చేసిన కేంద్రం.. కేంద్ర ప్రభుత్వం 2004లో వీరిని వీధి వ్యాపారులుగా గుర్తిస్తూ చట్టం చేసింది. మార్గదర్శకాలను రాష్ట్రాలకు పంపింది. వీరు వ్యాపారం చేసుకొనేందుకు ప్రత్యేక జోన్లు ఏర్పాటుచేయాలనీ, గుర్తింపుకార్డులు మంజూరు చేయాలని ఆదేశించింది. దీంతో పోలీసుల, రౌడీల మామూళ్ల బెడద ఉండదని ప్రభుత్వ భావన. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం వీధివ్యాపారులకు పావలా వడ్డీ రుణాలను కల్పించాలని నిర్ణయించింది. సూక్ష్మరుణాలను పట్టణ దారిద్య్ర నిర్మూలన పథకం (మెప్మా) కింద అందజేస్తామని ప్రకటించారు. కొనసాగుతున్న నిర్లక్ష్యం.. ప్రస్తుత ప్రభుత్వం హయాంలో అలసత్వం కొనసాగుతోంది. గుంటూరు రీజియన్‌లో వీధివ్యాపారుల గుర్తింపు కేవలం 42 శాతమే జరగడంపై ఈనెల 19న గుంటూరులో జరిగిన సమీక్షా సమావేశంలో స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఎండీ డి.మురళీధరరెడ్డి సిబ్బందిపై అసహనం వ్యక్తంచేశారు. జిల్లాలో గుర్తించిన వీధివ్యాపారులు 4,397 కాగా, వాస్తవంగా మరో రెండువేలమంది అదనంగా ఉంటారనే వాదన ఉంది. ఉదాహరణకు తెనాలిలో గుర్తించిన చిరు వ్యాపారులు సంఖ్య 227 కాగా, పండ్ల, చిల్లర వర్తక సంక్షేమ సంఘం సభ్యులు 380 ఉండగా, దెబ్బతిన్న పండ్లు, కూరగాయలు తీసుకెళ్లి వే రేచోట అమ్మేవారు. రోడ్డుపక్క ఇడ్లీ, దోసె వేసి అమ్మేవారు మరో 300 ఉంటారని సంక్షేమ సంఘం అధ్యక్షురాలు బొల్లు సుబ్బులమ్మ చెప్పారు. అధికారుల అంచనా ప్రకారమే జిల్లాలోని 4,397 మందికిగాను ఇప్పటికీ 274 మందికి మాత్రమే గుర్తింపుకార్డులు ఇచ్చారు. ఇక రుణాల సంగతి వీరిలో ఎవరికీ తెలియదు. పొన్నూరులో మున్సిపాలిటీ చొరవతో డ్వాక్రా తరహాలో పొదుపు చేయించి, కొందరికి రుణాలిచ్చినట్టు తెలిసింది. ఇకనైనా చిరువ్యాపారులను ఆదుకోవలసిన అవసరం ఉంది. -
డబ్బాల తొలగింపుతో ఉద్రిక్తత
♦ ఆర్టీసీ అధికారులతో యజమానుల వాగ్వాదం ♦ పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన పరిస్థితి చేవెళ్ల : మండల కేంద్రంలోని బస్‌స్టేషన్ ఎదుట హైదరాబాద్-బీజాపూర్ ప్రధాన రహదారిపై ఉన్న డబ్బాలు, చిరువ్యాపారుల తోపుడుబండ్లను ఆదివారం ఆర్టీసీ అధికారులు తొలగిం చారు. వారితో దుకాణా యజమానులు వాగ్వాదానికి దిగడంతో కొద్దిసేపు స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. చివరకు పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. వివరాలిలా ఉన్నాయి. సుమారు ఐదేళ్లక్రితం చేవెళ్ల బస్‌స్టేషన్ ఆవరణలో ఆర్టీసీ అధికారులు దుకాణాల సముదాయం నిర్మించారు. వీటికి టెండర్లు పిలిచి కొందరికి దుకాణాలు కేటాయించారు. అయితే వాటి ఎదుటే ఎన్నో ఏళ్లుగా డబ్బాలు, తోపుడు బండ్లను పెట్టుకుని పండ్లు, పూలు, కొబ్బరిబొండాం, టిఫిన్‌సెంటర్, చెప్పులు కుట్టేవారు తదితర చిరువ్యాపారులు వ్యాపారం చేసుకుంటున్నారు. బస్సులు నిలపడానికి స్థ లంలేకపోవడంతో రోడ్డుపైనే నిలపడం, హైదరాబాద్-బీజాపూర్ రహదారికి బస్‌స్టేషన్ ఆనుకునే ఉండ టంతో ఇక్కడి నుంచి డబ్బాలను ఖాళీ చేయాలని యజమానులకు ఆర్టీసీ అధికారులు కొన్ని నెలలక్రితం నోటీసులిచ్చినా పట్టిం చుకోలేదు. లక్షల రూపాయలు వెచ్చించి నిర్మిం చిన దుకాణాల సముదాయం నిరుపయోగంగా ఉంది. అలాగే ఇటీవల రాష్ర్ట రవాణా మంత్రి పి.మహేందర్‌రెడ్డి తాండూరుకు వెళ్లే సమయంలో బస్సులు స్టేషన్లోకి వెళ్లడానికి స్థలంలేక కాన్వాయ్‌కు అడ్డంగా నిలిపారని పోలీసు లు ఆర్టీసీ డ్రైవర్లకు జరిమానా విధించారు. అంతేగాక బస్‌స్టేషన్ ఎదుట ప్రధాన రహదారికి ఆనుకుని వీటిని ఏర్పాటు చేసుకోవడంతో నిత్యం ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతున్నాయి. చివరకు ఆదివారం ఉదయం పోలీసు ల బందోస్తు మధ్య జేసీబీ సాయంతో వాటిని తొలగించారు. ఈ కార్యక్రమాన్ని వికారాబాద్ ఇన్చార్జి డీఎం రాఘవేందర్‌రెడ్డి, డిప్యూటీ సీటీఎం విజయభాను పర్యవేక్షించారు. దీంతో అధికారులతో డబ్బా యజ మానులు కొద్దిసేపు వాగ్వాదానికి దిగారు. సీపీఐ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి కె.రామస్వా మి, బీజేపీ మం డల మాజీ అధ్యక్షుడు ఎ.శ్రీ నివాస్ తదితరులు మాట్లాడుతూ చిరువ్యాపారులకు ప్రత్యామ్నా యం చూపించాలని డిమాండ్ చేశారు. 35ఏళ్లుగా పూల వ్యాపారం 35ఏళ్లుగా బస్‌స్టేషన్ ముందు పూల వ్యాపారం చేసుకుంటున్నా. తాత్కాలికంగా కట్టెలతో చిన్న షెడ్ వేసుకుని పూలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. అధికారులు నిర్దాక్షిణ్యంగా వీటిని తొలగించారు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్లాలి. ఎక్కడైనా స్థలం కొందామన్నా వేలకువేలు పెట్టినా గజం భూమికూడా దొరికే పరిస్థితిలేదు. ఏంచేయాలో తోచడంలేదు. - సీతారాం, పూల వ్యాపారి, చేవెళ్ల కుటుంబాన్ని ఎలా పోషించాలి ఎన్నో ఏళ్లనుంచి బస్‌స్టేషన్ వద్ద పండ్లు అమ్ముకుంటున్నాను. నాకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. భర్త గ్రామాల్లో తిరిగి పాత ఇనుప సామాను కొంటాడు. ఇప్పుడు తోపుడుబండిని తొలగిస్తే మేము ఏం చేసుకుని బతకాలి. ప్రభుత్వమే ఏదో ఒకచోట స్థలం చూపించాలి. లేకుంటే బతకడమే కష్టమవుతుంది. - జాహేదా, పండ్ల వ్యాపారి, చేవెళ్ల -
జోరుగా దొంగనోట్ల చెలామణి
భద్రాచలం : భద్రాచలంలో దొంగనోట్లు జోరుగా చెలామణి అవుతున్నాయి. దొంగనోట్ల కారణంగా చిరువ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. పట్టణంలోని పాత మార్కెట్ సెంటర్లో గల కూరగాయల దుకాణాల నిర్వహించే వారికి కొంతమంది దొంగనోట్లను అంటగట్టారు. రెండు రోజులుగా ఇదే తంతు జరుగుతుండటంతో వారు తీవ్రంగా నష్టపోతున్నారు. రోజంతా కూరగాయలు అమ్మితే రూ.200ల వరకూ ఆదాయం వస్తుందని, కానీ దొంగనోట్ల వల్ల దీన్ని పోగొట్టుకుంటున్నామని వెంకటమ్మ అనే కూరగాయల వ్యాపారి తెలిపింది. రూ.100 నోటు వస్తే తీసుకొని కూరగాయలు ఇవ్వటంతో పాటు, తిరిగి చిల్లర కూడా ఇచ్చానని చెప్పింది. తీరా సాయంత్రం వ్యాపారికి డబ్బులు కట్టే సమయంలో అది దొంగనోటు అని తెలియటంతో ఆ చిరు వ్యాపారి గుండెలు గుబేలు మన్నాయి. రోజంతా మండుటెండులో కూర్చుని అమ్మిన ఆదాయం పోయిందిన ఆవేదన వ్యక్తం చేసింది. మార్కెట్ సెంటర్లో ఇటీవల కాలంలో ఏదో ఒకచోట ఇలా దొంగనోట్లు బయట పడుతున్నాయి. ఇందులో మార్కెట్ ఏరియాలో ఉన్న కొంతమంది ప్రముఖ వ్యాపారుల పాత్ర కూడా ఉందనే అనుమానాలు ఉన్నాయి. ఇటీవలనే దొంగనోట్ల ముఠాను భద్రాచలం పోలీసులు పట్టుకున్నారు. కానీ దొంగనోట్ల చెలామణి మాత్రం ఆగకపోవటంతో పట్టణ వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు దీనిపై నిఘా ఏర్పాటు చేయాలని చిరు వ్యాపారులు కోరుతున్నారు. -
చల్లపల్లి కేంద్రంగా జోరుగా జూదం
బడుగులను చిదిమేస్తున్న నంబర్లాట రోడ్డున పడుతున్న బడుగులు రోజుకు రూ.5 లక్షలకు పైగా చేతులు మారుతున్న వైనం పట్టించుకోని పోలీసులు చల్లపల్లి : నంబర్లాట బడుగుల బతుకులను చిదిమేస్తోంది. ప్రత్యేకించి కాయకష్టం చేసి పొట్టపోసుకొనే వారిని టార్గెట్ చేసుకుని సాగుతున్న ఈ ఆట వల్ల సామాన్యుల జీవితాలు రోడ్డున పడుతున్నాయి. పగలంతా కష్టపడి సంపాదించిన సొమ్మును అరవెరైట్లు పెరుగుతుందన్న ఆశతో సాయంత్రం వేళ ఆటలో పెట్టి, తీవ్రంగా నష్టపోతున్నారు. ఒకప్పుడు చల్లపల్లికి మాత్రమే పరిమితమైన నంబర్లాట ఇప్పుడు ఘంటసాల, మోపిదేవి మండలాలకు విస్తరించింది. ఇదంతా పోలీసులకు తెలిసినా పట్టించుకోక పోవడం విమర్శలకు తావిస్తోంది. నంబర్లర్లాట ఇలా.. చల్లపల్లి ప్రాంతంలో నంబర్లాటను బ్రాకెట్ అంటారు. ప్రతిరోజూ ఓ దినపత్రికలో వచ్చే అసోం లాటరీ నంబర్లను ఎంచుకుని ఆట మొద లెడతారు. చివరి రెండు నంబర్లను ఎంచుకున్న వారిని డబుల్డిజిట్ అంటారు. ఈ ఆటలో వారు కోరుకున్న చివరి రెండు నంబర్లు వస్తే.. వారు లాటరీలో పెట్టినప్రతి రూపాయికి రూ.66 చొప్పున (66 రెట్లు) చెల్లిస్తారు. ఓపెనింగ్, క్లోజింగ్‌లో ఒక నంబరును ఎంచుకునే వారిని సింగిల్ డిజిట్ అంటారు. ఈ ఆటలో కోరుకున్న నంబర్లు వచ్చిన వారికి రూపాయికి పదిరూపాయలు మాత్రమే ఇస్తారు. రోజుకు రూ.5లక్షలు చల్లపల్లి కేంద్రంగా జరుగుతున్న నంబర్లాటలో రోజుకు రూ.5లక్షల వరకూ చేతులు మారుతున్నట్లు తెలిసింది. నలుగురు నిర్వాహకుల పరిధిలో 45 మంది బుక్కర్లు ఉదయం ఏడు గంటలకే ఆయా గ్రామాల్లోకి వెళ్ళి ఒక్కొక్కరు 25 నుంచి 60 మంది ఆటగాళ్ల నుంచి నంబర్లు, పందెం డబ్బు సేకరిస్తారు. ఒక్కో వ్యక్తి రూ.5 రూపాయల నుంచి రూ.వెయ్యి వరకూ నంబర్లపై పందెం కాస్తుంటారు. బుక్కర్లు చిన్న కాగితాలపై ఆ నంబర్లను రాసి ఇస్తారు. ప్రతిరోజూ సాయంత్రం 4గంటలకు చల్లపల్లిలోని ఓ నెట్ సెంటర్లో అసోం లాటరీని నెట్లో ఓపెన్‌చేసి నిర్వాహకులు దాని కాపీని తీసుకుంటారు. అనంతరం ఆ లిస్టును బుక్కర్లకిచ్చి ఎంచుకున్న నంబర్లు వచ్చినవారికి ఒప్పందం ప్రకారం డబ్బులిచ్చేస్తారు. సుమారు 3వేల మంది ఈ ఆటకు బానిసలుగా మారారంటే ఆట ఏస్థాయిలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. బలవుతున్న బడుగులు చిరు వ్యాపారులు, ముఠా, దినసరి కూలీలు, రిక్షాపుల్లర్లు, ఆటోడ్రైవర్లు, షాపుల్లో పనిచేసే వర్కర్లు నంబర్లాట ఎక్కువగా ఆడుతుంటారు. చివరి రెండు నంబర్లు ఎంచుకున్నవారికి 66 రెట్లు సొమ్ము వస్తుండటంతో ఎక్కువ మంది ఆశగా ఈ ఆటనే ఆడుతుంటారు. ఈ ఆట ద్వారా డబ్బు గెలుచుకునేది చాలా తక్కువమంది. డబ్బు పోగొట్టుకున్నవారే అధికం. కొందరైతే పనిచేస్తే వచ్చే డబ్బులు చాలక అప్పులు తెచ్చి ఆటలో పెట్టి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. గ్రామాలకు పాకుతోంది.. గతంలో ఈ ఆట చల్లపల్లి పరిసర ప్రాంతాల్లో మాత్రమే సాగేది. ప్రస్తుతం మోపిదేవి, ఘంటసాల మండలాకు విస్తరించింది. చల్లపల్లి సెంటర్, నారాయణరావునగర్, పాగోలు, పురిటిగడ్డ, పెదకళ్లేపల్లిరోడ్, సాలిపేట, రామానగరం, లక్ష్మీపురం, యార్లగడ్డరోడ్, పురిటిగడ్డ, నదకుదురు, మోపిదేవి మండలం వెంకటాపురం, కఫ్తానుపాలెం, పెదప్రోలు, ఘంటసాల మండలం కొడాలి, చిట్టూర్పులకు పాకింది. పోలీసుల ప్రోత్సాహంతోనే .. నాలుగేళ్ల క్రితం చల్లపల్లి కేంద్రంగా నంబర్లాట జోరుగా సాగింది. అప్పట్లో పలుమార్లు గొడవలు జరగడం, చాలామంది పేదలు రోడ్డున పడటంతో అప్పటి ఎస్పీ హరికుమార్ తీవ్ర చర్యలు తీసుకోవడంతో రెండేళ్ల పాటు ఈ ఆట కనుమరుగైంది. ఆ తర్వాత చల్లపల్లికి బదిలీపై వచ్చిన ఓ ఎస్.ఐ ఈ ఆటను పునఃప్రారంభించేందుకు ప్రోత్సాహం అందించారు. తద్వారా నిర్వాహకుల నుంచి పెద్ద ఎత్తున ముడుపులు పొందారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అనంతరం వీఆర్‌పై ఎస్ఐ బదిలీ అయినప్పటికీ తరువాత వచ్చిన పోలీస్ అధికారులు జోరందకున్న నంబర్లాటను అరికట్టలేక పోయారు. ఇప్పుడు కూడా పోలీసులకు పెద్ద ఎత్తున ముడుపులు ముట్టజెపుతున్నట్టు నిర్వాహకులు బహిరంగంగానే చెబుతున్నారు. నంబర్లాటపై పత్రికల్లో, టీవీల్లో వార్తలు రాకుండా చూసుకోవాలని పోలీసులే ఉచిత సలహా ఇచ్చినట్టు తెలిసింది. గతంలో ‘సాక్షి’లో పలుసార్లు నంబర్లాటపై కథనాలు వచ్చినపుడు కొద్దిరోజులు కట్టడి చేసినప్పటికీ తరువాత మళ్లీ మామూలయిపోయింది. పోలీస్‌స్టేషన్‌కు దగ్గరలోనే.. చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌కు అతి సమీపంలోనే నంబర్లాట జరుగుతున్నప్పటకీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్ధానిక సంతబజార్, ప్రధాన సెంటర్లోని పెట్రోల్ బంకు సమీపంలో నిర్వాహకులు యథేచ్చగా నంబర్లాట సాగిస్తున్నప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదు. బడుగుల జీవితాలను రోడ్డు పాలు చేస్తున్న నంబర్లాటను అరికట్టేందుకు పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.