Small Investors
-
పెట్టుబడుల్లో రిటైలర్ల జోరు
న్యూఢిల్లీ: సరికొత్త బుల్ట్రెండ్లో సాగుతున్న దేశీ స్టాక్ మార్కెట్లలో రిటైల్ ఇన్వెస్టర్లు దూకుడు చూపుతున్నారు. ఓవైపు సెకండరీ మార్కెట్లో నెలకొన్న రికార్డులకుతోడు.. మరోపక్క ప్రైమరీ మార్కెట్ స్పీడ్ పలువురు చిన్న ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లు భారీ సంఖ్యలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు. వెరసి ఈ ఏడాది తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో సరికొత్త రికార్డుకు తెరలేచింది. ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీలలో తాజాగా రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 7.18 శాతాన్ని తాకింది. ఇది మార్కెట్ చరిత్రలోనే అత్యధికంకాగా.. మార్చి చివరికల్లా ఎన్ఎస్ఈ కంపెనీలలో 6.96 శాతం వాటాను సొంతం చేసుకున్నారు. ప్రైమ్‌ఇన్ఫోబేస్.కామ్ అందించిన వివరాల ప్రకారం విలువరీత్యా రిటైల్ ఇన్వెస్టర్ల వాటాల విలువ 16 శాతం వృద్ధితో రూ. 16.18 లక్షల కోట్లకు చేరింది. క్యూ4(జనవరి–మార్చి)లో ఈ విలువ రూ. 13.94 లక్షల కోట్లుగా నమోదైంది. ఇదే కాలంలో ప్రామాణిక ఇండెక్సులు సెన్సెక్స్(బీఎస్ఈ) 6 శాతం, నిఫ్టీ(ఎన్ఎస్ఈ) 7 శాతం చొప్పున మాత్రమే పురోగమించడం గమనార్హం! డీఐఐలు డీలా.. క్యూ1లో దశీ మ్యూచువల్ ఫండ్స్ వాటా ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీలలో నామమాత్రంగా తగ్గి 7.25 శాతానికి పరిమితమైంది. మార్చి క్వార్టర్(క్యూ4)లో 7.26 శాతంగా నమోదైంది. ఎన్ఎస్ఈలో లిస్టయిన 1,699 కంపెనీలకుగాను 1,666 కంపెనీలలో వెలువడిన వాటాల వివరాల ప్రకారం రూపొందిన గణాంకాలివి. వెరసి రిటైల్ ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ మార్గంకంటే షేర్లలో ప్రత్యక్ష పెట్టుబడులకే ఇటీవల మొగ్గు చూపుతున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీకి 295 కంపెనీలలో గల వాటా జూన్‌కల్లా 3.74 శాతానికి నీరసించింది. 2021 మార్చి చివరికల్లా 3.83 శాతంగా నమోదైంది. ఎల్ఐసీకి 1 శాతానికంటే అధికంగా వాటా గల కంపెనీల వివరాలివి! ఎంఎఫ్‌లు, బీమా కంపెనీలు, బ్యాంకులు తదితరాలతో కూడిన డీఐఐల వాటా జూన్‌కల్లా 13.19 శాతానికి నీరసించింది. మార్చిలో ఈ వాటా 13.42 శాతంగా నమోదైంది. ఇక ఇదే సమయంలో ఎఫ్‌పీఐల వాటా 22.46 శాతం నుంచి 21.66 శాతానికి తగ్గడం ప్రస్తావించదగ్గ విషయం! -
బ్యాంకుల్లో తగ్గిన వడ్డీ రేట్లు.. లాభాలు అక్కడే అంటున్న జనం
ముంబై : స్టాక్‌మార్కెట్, మ్యుచవల్ ఫండ్స్ పట్ల భారతీయుల్లో ఉన్న భయాలు క్రమంగా తొలగిపోతున్నాయి. రిస్క్ ఎక్కువని ఇంత కాలం వీటికి దూరంగా ఇండియన్లు తాజాగా స్టాక్‌మార్కెట్ పెట్టుబడులపై ఆసక్తి చూపిస్తున్నారు. చరిత్రలో ఎన్నడూ లేనంత తక్కువ వడ్డీని బ్యాంకులు ఆఫర్ చేస్తుండటంతో.. రిస్క్ ఉన్నా పర్వాలేదనే ధోరణి స్మాల్ ఇన్వెస్టర్లలో పెరుగుతోంది. ‘మార్కెట్’పై ఆసక్తి గత ఆర్థిక సంవత్సరంలో 1,.42 లక్షల మంది కొత్తగా స్టాక్మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించారు. ఇందులో 1.22 లక్షల మంది సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ దగ్గర ఖాతాలు ప్రారంభించగా మరో 19.7 లక్షల మంది నేషనల్ సెక్కూరిటీ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ దగ్గర ఖాతాలు ఓపెన్ చేశారు. ఇటీవల కాలంలో ఏకంగా 44 లక్షల మంది రిటైల్ ఇన్వెస్టర్లుగా రిజిస్ట్రర్ అయ్యారు. తగ్గిన వడ్డీ కరోనా కారణంగా తలెత్తిన ఆర్థిక విపత్తును ఎదుర్కొనేందుకు బ్యాంకుల వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా తగ్గించింది. ముఖ్యంగా రిస్క్ లేకుండా గ్యారంటీ రిటర్న్‌గా పేరున్న ఫిక్స్డ్ డిపాజిట్లపై అయితే మరీ దారుణంగా వడ్డీ రేట్లు తగ్గించింది. దీంతో ఇన్వెస్టర్లు ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆసక్తి కోల్పోతున్నారని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. విత్‌డ్రాకే మొగ్గు గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు డిపాజిట్లు 150 ట్రిలియన్ మార్క్‌ని టచ్ చేసింది. ఈసారి 2021 ఏప్రిల్ 21 నుంచి మే 21 వరకు కేవలం రూ. 32,482 కోట్లు డిపాజిట్లే బ్యాంకులో జమ అయినట్టు అసోసియేషన్ ఆఫ్ మ్యూచవల్ ఫండ్స్ ఇన్ ఇండియా తెలియజేసింది. అంతకు ముందు ఏడాది ఇదే సమయానికి బ్యాంకు డిపాజిట్ల మొత్తం రూ. 1.20 ట్రిలియన్లుగా ఉంది. చాలా మంది తమ ఫిక్స్డ్ డిపాజిట్లు కొనసాగించడం లేదనే దానికి ఈ గణాంకాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. మ్యూచువల్స్‌కి మళ్లింపు మరోవైపు 2021 మేలో మ్యూచువల్ ఫండ్స్‌కి భారీగా నగదు పోటెత్తింది. ఏకంగా రూ. 10,000 కోట్ల రూపాయలు వచ్చాయి. దీంతో మే చివరి నాటికి మ్యూచ్‌వల్ ఫండ్స్ గతంలో ఎన్నడూ లేనతంగా రూ. 33 లక్షల కోట్లను టచ్ చేసినట్టు ఓమ్ ( అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ AUM) తెలిపింది. సెబి లెక్కలు మ్యూచవల్ ఫండ్ మేనేజర్లు చెబుతున్న లెక్కలను సెబీ గణాంకాలు బలపరుస్తున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 1.42 కోట్ల డిమ్యాట్ అకౌంట్లు పప్రారంభం అయ్యాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య కేవలం 49 లక్షలకే పరిమితమైంది. దాదాపు మూడింతలు డిమ్యాట్ అకౌంటర్లు పెరిగాయి. -
చిన్న ఇన్వెస్టర్ల బడా ‘గేమ్’!
‘బలవంతమైన సర్పము చలిచీమల చేతజిక్కి చావదే సుమతీ‘ అని సుమతీ శతకకారుడి పద్యంలో చదువుకున్నాం. అలాగే స్టాక్ మార్కెట్ల చిన్న చిన్న ఇన్వెస్టర్లంతా కూడబలుక్కుని బడా ఇన్వెస్టర్లపై పడితే? ఎలా ఉంటుంది? అచ్చం అమెరికాలో గేమ్‌స్టాప్ కంపెనీ షేర్ల కహానీలా ఉంటుంది. సోషల్ మీడియాలో చిన్న ఇన్వెస్టర్లు కూడబలుక్కుని బడా ఫండ్స్‌కు ముచ్చెమటలు పట్టించిన ఈ ఉదంతం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆర్థిక అంశాల్లోనూ సోషల్ మీడియా సత్తా చాటుతోంది. అమెరికాకు చెందిన గేమ్‌స్టాప్ (జీఎంఈ) అనేది ప్రపంచంలోనే అతి పెద్ద వీడియో గేమ్స్ విక్రయ సంస్థ. అయితే, ఆన్లైన్ గేమింగ్ ప్రాచుర్యంలోకి వచ్చే కొద్దీ దీని ప్రాభవం తగ్గుతూ వచ్చింది. గత నాలుగేళ్లుగా ఆదాయాలు గణనీయంగా పడిపోయాయి. దీనికి తగ్గట్లుగానే షేరు కూడా అయిదేళ్ల వ్యవధిలో దాదాపు 90 శాతం పడిపోయింది. కంపెనీ ఇంకా కష్టాల్లో కూరుకుపోతుందనే అంచనాలతో జీఎంఈ షేర్లను షార్ట్ చేసిన హెడ్జ్ ఫండ్స్ గణనీయంగా లాభపడ్డాయి. కొద్ది రోజుల క్రితం దాకా అంతా బాగానే జరిగింది. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. సోషల్ మీడియా ఇన్వెస్టర్ల ఎంట్రీ.. రెడిట్ అనే సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్లో వాల్ స్ట్రీట్ బెట్స్ (డబ్ల్యూఎస్బీ) పేరుతో ఉన్న డిస్కషన్ ఫోరంలో రిటైల్ ఇన్వెస్టర్లు.. వివిధ స్టాక్స్ గురించి చర్చించుకుంటూ ఉంటారు. ఇందులోనే .. జీఎంఈకి వ్యాపారపరంగా సవాళ్లున్నప్పటికీ కంపెనీ కోలుకుంటుందని, షేరు కూడా పుంజుకుంటుందని మెల్లగా చర్చలు మొదలయ్యాయి. రిటైలర్లు షేర్లను కొనడం మొదలుపెట్టడంతో రేటు కూడా క్రమంగా పెరగడం మొదలైంది. దీంతో కొందరు షార్ట్ సెల్లర్లు కాస్త నష్టానికి పొజిషన్లను కవర్ చేసుకున్నారు. మరికొందరు మాత్రం రేటు మళ్లీ తగ్గుతుందనే ఉద్దేశంతో పొజిషన్లు కొనసాగించారు. షేరు ఒక రేటు దగ్గర స్థిరపడుతున్న తరుణంలో.. భారీగా షార్ట్ సెల్లింగ్ పొజిషన్లు ఉన్నాయన్న సంగతిని రెడిట్ ఫోరంలోని చిన్న ఇన్వెస్టర్లు గుర్తించారు. క్రమంగా షేర్లను కొనడం ప్రారంభించారు. నెమ్మదిగా మొదలైన ఈ కొనుగోళ్లు ఆ తర్వాత తుఫాన్‌లా మారాయి. 2020 డిసెంబర్ 31న 18 డాలర్లుగా ఉన్న షేరు ధర 2021 జనవరి 28 నాటికి ఏకంగా 483 డాలర్లకు ఎగిసింది. 2,583 శాతం పెరిగిపోయింది. దీంతో షార్ట్ చేసి కూర్చున్న బడా సంస్థలు .. పొజిషన్లను కవర్ చేసుకునేందుకు ఆదరాబాదరాగా పరుగులు తీశాయి. అయినప్పటికీ భారీగా నష్టాలు తప్పలేదు. ఉదాహరణకు సిట్రన్ క్యాపిటల్ అనే హెడ్జ్ ఫండ్ .. జీఎంఈ షేరును 40 డాలర్ల దగ్గర షార్ట్ చేసింది. 20 డాలర్ల దగ్గరకు వస్తే కొనుగోలు చేసి లాభాలు గడించవచ్చనుకుంది. కానీ ఎకాయెకీ ర్యాలీ చేయడంతో లాభాల సంగతి పక్కన పెట్టి 100% నష్టానికి 80 డాలర్ల దగ్గర కవర్ చేసుకుని బతుకుజీవుడా అని బైటపడింది. ఇక మెల్విన్ క్యాపిటల్ అనే మరో సంస్థ 2.75 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.20,000 కోట్లు) నష్టపోవాల్సి వచ్చింది. ఇలా బడా ఫండ్స్‌కి చెమట్లు పట్టించిన చిన్న ఇన్వెస్టర్లు అటు పైన ఇలాంటి భారీ షార్ట్ పొజిషన్లు ఉన్న స్టాక్స్ ఇంకా ఉన్నాయేమోనని వేట మొదలెట్టారు. రివర్స్ గేర్..: అయితే, కథ ఇక్కడితో అయిపోలేదు. చిన్న ఇన్వెస్టర్ల చేసిన హంగామాతో గేమ్‌స్టాప్ షేరు అమాంతం పెరిగినప్పటికీ.. బడా ఇన్వెస్టర్లు సర్దుకుని మళ్లీ పరిస్థితిని క్రమంగా తమ చేతుల్లోకి తెచ్చుకోవడం మొదలుపెట్టారు. దీంతో షేరు పెరిగినంత వేగంగా.. రివర్స్ గేరు వేసింది. వారం క్రితం 483 డాలర్ల స్థాయిని తాకిన స్టాక్ తాజాగా 77 డాలర్లకు పడిపోయింది. మన దగ్గర... అమెరికాలో కాబట్టి ఇది సాధ్యపడింది కానీ భారత్‌లో మాత్రం ఇప్పుడిప్పుడే ఇలాంటివి జరగడానికి ఆస్కారం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. మన దగ్గర షార్ట్ సెల్లింగ్‌పై ఆంక్షలు, సర్క్యూట్ ఫిల్టర్లు మొదలైన నిబంధనలు కఠినతరంగా ఉండటం ఇందుకు ఒక కారణం కాగా అమెరికన్ ఇన్వెస్టర్లంతగా దేశీ ఇన్వెస్టర్లకు ఇలాంటి అంశాలపై అంత పట్టు లేకపోవడం మరో కారణమని విశ్లేషిస్తున్నారు. షార్ట్ సెల్లింగ్ అంటే.. చేబదులు తీసుకున్న షేర్లను మార్కెట్లో అమ్మేసి, రేటు తగ్గాక కొనుక్కుని బాకీ తీర్చేయడాన్ని షార్ట్ సెల్లింగ్ అంటారు. అనుకున్న విధంగా రేటు తగ్గితే లాభం వస్తుంది. కానీ పరిస్థితి రివర్సయి రేటు పెరిగిపోయిందంటే భారీగా నష్టపోవాల్సి వస్తుంది. -
అత్యాశతో కమోడిటీ మార్కెట్లోకి రావద్దు...
చిన్న ఇన్వెస్టర్లకు సెబీ చీఫ్ సిన్హా హెచ్చరిక ముంబై : తక్షణ లాభాలను ఆశించి కమోడిటీ మార్కెట్లోకి అడుగుపెట్టొద్దని చిన్న ఇన్వెస్టర్లను సెబీ చీఫ్ యూకే సిన్హా హెచ్చరించారు. కమోడిటీ లావాదేవీలు అత్యంత రిస్కుతో కూడినవని.. దీనికి చాలా నైపుణ్యం అవసమని కూడా ఆయన పేర్కొన్నారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను చెప్పారు. కమోడిటీ ట్రేడింగ్‌ను నియంత్రించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని... వచ్చే నెలకల్లా కమోడిటీ మార్కెట్ నియంత్రణ సంస్థ ఎఫ్‌ఎంసీని సెబీలో విలీనం చేసే ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. ‘కమోడిటీ ట్రేడింగ్‌లో తక్కు వ మార్జిన్‌తో భారీ లాభాలను ఆర్జించవచ్చంటూ కొంతమంది ఆశలు రేకెత్తిస్తుంటారు. వారి వలలో పడొద్దు. కమోడిటీ మార్కెట్ అనేది నిపుణులు, అధిక రిస్క్‌లను తట్టుకోవడం కోసం, హెడ్జింగ్ చేసే వారికోసం ఉద్దేశించింది. అంతేకానీ, చెమటోడ్చి సంపాదించిన సొమ్మును ఇందులో పెట్టుబడిగా పెట్టి.. ట్రేడింగ్ చేయడం ఏమాత్రం మంచిది కాదు’ అని చిన్న ఇన్వెస్టర్లకు సిన్హా సూచించారు.