Small Medium Enterprises
-
స్టార్టప్‌లకు ఉచితంగా 5జీ టెస్ట్‌బెడ్
న్యూఢిల్లీ: గుర్తింపు పొందిన అంకుర సంస్థలు, చిన్న..మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) 2024 జనవరి వరకూ 5జీ టెస్ట్ బెడ్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చని కేంద్రం వెల్లడించింది. మిగతా పరిశ్రమవర్గాలు, విద్యారంగం, సర్వీస్ ప్రొవైడర్లు, పరికరాల తయారీ సంస్థలు మొదలైన వర్గాలు నామమాత్రపు రేటుతో దీన్ని ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. ఇప్పటికే పలు స్టార్టప్‌లు, కంపెనీలు తమ ఉత్పత్తులు, సర్వీసులను పరీక్షించేందుకు ఈ టెస్ట్ బెడ్‌ను ఉపయోగిస్తున్నాయని తెలిపింది. 5జీ సేవలకు ఊతమిచ్చే విధంగా రూ. 224 కోట్లతో దేశీ 5జీ టెస్ట్ బెడ్‌ను రూపొందించే ప్రాజెక్టుకు 2018లో టెలికం శాఖ ఆమోదముద్ర వేసింది. 2022 మే 17న ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని జాతికి అంకితం చేశారు. ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ మద్రాస్ మొదలైన ప్రతిష్టాత్మక సంస్థలు టెస్ట్ బెడ్ రూపకల్పనలో పాలుపంచుకున్నాయి. -
దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారు
సాక్షి, న్యూఢిల్లీ : నిరుపేదలు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు నేరుగా డబ్బు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ తప్పు బట్టారు. ఈ నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. పేదలకు తక్షణమే 10వేల రూపాయలు అందించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలపై కరోనా చూపిన ప్రభావాలను వివరించిన ఓ వార్తా నివేదికను రాహుల్ ట్విటర్లో షేర్ చేశారు. (బ్లాక్ మార్కెటింగ్ విషయలో కఠినంగా ఉంటాం ) Govt is actively destroying our economy by refusing to give cash support to people and MSMEs. This is Demon 2.0.https://t.co/mWs1e0g3up — Rahul Gandhi (@RahulGandhi) June 6, 2020 ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల మధ్య పరిశ్రమలు గట్టెక్కాలంటే కేంద్రం ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాలని రాహుల్ పిలుపునిచ్చారు. కరోనా సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రజలు, పరిశ్రమలకు నేరుగా డబ్బు అందించడాన్ని నిరాకరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నేరమని రాహుల్ అభివర్ణించారు. భారత్‌లో కరోనా కట్టడి కోసం మోదీ ప్రభుత్వం విధించిన లాక్డౌన్ ఎలా విఫలం అయ్యిందో గ్రాఫ్లతో సహా వివరిస్తూ ట్విటర్లో పంచుకున్నారు. దేశంలో కేసులు పెరుగుతుంటే భారీ సడలింపులు ఇవ్వడంపై ఆనాడే ప్రశ్నించిన విషయాన్ని రాహుల్ గుర్తుచేశారు. (కరోనా ఎఫెక్ట్: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం) -
ఎస్ఎంఈ లిస్టింగ్‌తో చిన్న సంస్థలకు పెట్టుబడులు
విజయవాడ: స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎస్ఎంఈ) విభాగంలో పబ్లిక్ ఇష్యూ జారీచేయడం ద్వారా చిన్న కంపెనీలు వ్యాపారాభివృద్ధికి బయట నుంచి పెట్టుబడులు పొందవచ్చని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) బిజినెస్ డెవలప్మెంట్ చీఫ్ రవి వారణాసి చెప్పారు. సోమవారం విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఎస్ఎంఈ లిస్టింగ్‌తో చేకూరే ప్రయోజనాలను వివరించారు. రూ. 25 కోట్లలోపు చెల్లింపు మూలధనం ఉండే సంస్థలు ఎన్ఎస్ఈకి చెందిన ఎస్ఎంఈ విభాగంలో లిస్ట్ కావొచ్చని చెప్పారు. ఎస్ఎంఈలోకి వచ్చే కంపెనీలకు సంబంధించి గత మూడేళ్ల ట్రాక్ రికార్డు పరిశీలిస్తారన్నారు. పబ్లిక్ ఇష్యూలకు వచ్చే చిన్న కంపెనీలు దీని ద్వారా వస్తే మేలు జరుగుతుందని చెప్పారు. విజయవాడలో 20 కంపెనీలు ఎస్ఎంఈ ఫండింగ్‌లోకి రావటానికి ఆసక్తి చూపాయని చెప్పారు. వ్యాపారులు తమ వ్యాపార అభివృద్ధికి బ్యాంకు లోన్లు లేకుండా ఎస్‌ఎంఈకి అనుగుణంగా అన్నీ సిద్ధం చేసుకుంటే దీని ద్వారా ఇష్యూకి వెళ్ళి నిధుల్ని సమీకరించుకోవొచ్చని చెప్పారు.