smart phone applications
-
యాప్.. ట్రాప్.. అత్యధిక యాప్‌లతో వ్యక్తిగత గోప్యతకు భంగం!
విజయనగరానికి చెందిన రమేశ్ కొన్ని రోజుల క్రితం తమ బంధువుల గృహప్రవేశం కోసం హైదరాబాద్‌లోని కోకాపేటకు వెళ్లారు. అక్కడ కాలక్షేపం కోసం ఫోన్లో ఫేస్బుక్ చూడసాగారు. అంతే.. హైదరాబాద్‌లోని కోకాపేట, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లోని రియల్ ఎస్టేట్ ప్రకటనలు వరుసగా వచ్చేస్తున్నాయి. ఏనాడూ తన ఫేస్బుక్లో కనిపించని ఈ ప్రకటనలను చూసి ఆయన ఆశ్చర్యపోయారు. తాను హైదరాబాద్ వచ్చిన విషయం, కోకాపేట ప్రాంతంలో ఉన్న విషయం తనకు సంబంధం లేని వారికి తెలిసిపోయిందని గుర్తించారు. లోన్‌యాప్ కంపెనీల ఆగడాలు మరీ దుర్మార్గం. అప్పు తీసుకున్న వ్యక్తి ఫోన్లో ఉన్న కాంటాక్ట్ నంబర్లు, ఫొటోలు అన్నీ ఆ కంపెనీలు తీసుకుంటాయి. అత్యధిక వడ్డీలు వేసి ఇచ్చిన రుణానికి నాలుగు, ఐదింతలు ఎక్కువ డిమాండ్ చేస్తాయి. అడిగినంత చెల్లించకపోతే ఫోన్ నుంచి తీసుకున్న రుణ గ్రహీత ఫొటోలను మార్ఫింగ్ చేసి, కాంటాక్ట్ నంబర్లలో ఉన్న బంధువులు, మిత్రులకు పంపించి వేధిస్తుంటాయి. సాక్షి, అమరావతి: మన ఫోన్లోని కాంటాక్ట్ నంబర్లు, ఫొటోలు, ఇతర సమాచారం తెలియాల్సింది మనకు ఒక్కరికే కదా! బయటకు ఎలా వెళ్తోంది? ఇదెలా సాధ్యం అంటే.. మొబైల్ యాప్‌లే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. వ్యక్తుల ప్రమేయం లేకుండానే వారి కదలికలు, లావాదేవీలు, ఇతర సమాచారం మొత్తం గుర్తుతెలియని వ్యవస్థలకు యాప్‌ల ద్వారా చేరిపోతున్నాయి. మన అవసరాల కోసం స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొనే ఈ యాప్‌లతో సౌలభ్యం ఎంతుందో.. వ్యక్తిగత గోప్యతకు ప్రమాదం కూడా అంతే ఉంది. వ్యక్తులు ఉన్న ప్రదేశం, వారి కదలికలు, సామాజిక మాధ్యమాల్లో చూసే వివిధ అంశాలు.. ఇలా అన్నీ యాప్‌లు నిరంతరం పరిశీలిస్తూనే ఉంటాయి. ఫోన్ కాంటాక్ట్ నంబర్లు, ఫోన్లోని ఫొటోలతోపాటు చివరికి వేలి ముద్రలు, ఎస్ఎంఎస్లు వేరెవరికో వెళ్లిపోతుంటాయి. అప్రమత్తతే శ్రీరామరక్ష.. ► యాప్‌ను డౌన్లోడ్ చేసుకునే ముందు దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి ► మొబైల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకునేటప్పుడు వివిధ అనుమతులు అడుగుతుంది. వాటిని నిశితంగా చదివిన తరువాతే అనుమతించాలి. డౌన్లోడ్ చేసుకునే తొందర్లో నిబంధనలను చదవకుండా అనుమతిస్తే తరువాత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ► మనమున్న ప్రదేశం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్న యాప్‌లకే లొకేషన్ యాక్సెస్ ఇవ్వాలి. యాప్ వినియోగించేటప్పుడు మాత్రమే యాక్సెస్ అనుమతించేలా చూసుకోవాలి ► ప్రజల భద్రత కోసం పోలీసు శాఖ ప్రవేశపెట్టే యాప్‌లకు అన్నింటినీ యాక్సెస్ ఇవ్వాలి. అది అత్యవసర సమయాల్లో పోలీసులు మనకు సహకరించేందుకు ఉపయోగపడుతుంది ► నిషేధిత సంస్థలు, అనుమతి లేని ఆర్థిక సంస్థలు, నాన్ బ్యాంకింగ్ సంస్థల యాప్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్ లోడ్ చేసుకోకూడదు ► ఎస్ఎంఎస్లు, వాట్సాప్ సందేశాలు చదివేందుకు, వేలిముద్రను తెలుసుకునేందుకు యాప్‌లకు అనుమతించకూడదు ఆండ్రాయిడ్ యాప్‌లు.. ► 75 శాతం ఇండియన్ ఆండ్రాయిడ్ యాప్‌లతో ఆ ఫోన్ యజమాని ఉన్న ప్రదేశం తెలిసిపోతోంది ► 59 శాతం యాప్‌లు వాటిని ఉపయోగించని సమయంలో కూడా మనం ఉన్న ప్రదేశాన్ని వెల్లడిస్తున్నాయి ► 57 శాతం యాప్‌లు ఫోన్లోని మైక్రోఫోన్‌ను వాడుకుంటున్నాయి ► 76 % యాప్‌లకు కెమెరా యాక్సెస్ ఉంది ► 43 శాతం యాప్‌లతో ఫోన్లోని కాంటాక్ట్ నంబర్లు తెలిసిపోతాయి ► 32 శాతం యాప్‌లతో ఫోన్‌కు వచ్చిన ఎస్ఎంఎస్లు కూడా తెలుసుకోవచ్చు ► 25 శాతం యాప్‌లతో ఫోన్‌ను అన్‌లాక్ చేసేందుకు వేసే వేలిముద్ర తెలిసిపోతుంది ఐవోఎస్ యాప్‌లు... ► 83 శాతం ఐవోఎస్ యాప్‌లతో మీరు ఉన్న ప్రదేశం తెలిసిపోతుంది ► 81 శాతం యాప్‌లను ఉపయోగిస్తున్నప్పుడు కెమెరాతో యాక్సెస్ లభిస్తుంది ► 90 శాతం యాప్‌లతో ఫోన్ గేలరీలో ఉన్న ఫొటోలు బట్టబయలైపోతాయి ► 64 శాతం యాప్‌లతో ఫోన్లోని మైక్రోఫోన్‌తో యాక్సెస్ వస్తుంది ► 49 శాతం యాప్‌లతో ఫోన్లోని కాంటాక్ట్ నంబర్లు తెలిసిపోతాయి ► 36 శాతం యాప్‌లతో ఫోన్లోని క్యాలండర్‌తో యాక్సెస్ లభిస్తుంది. అర్కా సంస్థ అధ్యయనం.. ప్రముఖ ప్రైవసీ మేనేజ్మెంట్ ప్లాట్‌ఫాం అర్కా కంపెనీ ‘స్టేట్ ఆఫ్ డాటా ప్రైవసీ’ పేరిట నిర్వహించిన సర్వేలో ఆందోళన కలిగించే ఇటువంటి పలు అంశాలు వెల్లడయ్యాయి. అర్కా సంస్థ 200 మొబైల్ యాప్‌లు, వెబ్సైట్లను అధ్యయనం చేసింది. వాటిలో మన దేశంలోని 25 రంగాలకు చెందిన 100 యాప్‌లు, వెబ్సైట్లు ఉన్నాయి. అమెరికాకు చెందినవి 76, యూరోపియన్ యూనియన్లకు చెందినవి 24 ఉన్నాయి. పిల్లలకు సంబంధించిన 30 యాప్‌ల గురించి కూడా ఈ సంస్థ ప్రత్యేకంగా అధ్యయనం చేసింది. ఆ యాప్‌లను డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మనం ఇచ్చే అనుమతులు, ట్రాకర్లు, కుకీలతో వ్యక్తిగత సమాచారం ఇతర సంస్థలకు చేరిపోతున్నాయి. వ్యక్తిగత గోప్యతకు అత్యధికంగా గూగుల్ కంపెనీ భంగం కలిగిస్తోందని ఈ నివేదిక వెల్లడించింది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ మొబైల్ యాప్‌లకు సంబంధించి ఈ సంస్థ అధ్యయనం చేసింది. ఆ అధ్యయనంలో ప్రధాన అంశాలను వెల్లడించింది. -
పిల్లలు ఆన్లైన్లో ఏం చూస్తున్నారు?
ఎనిమిది, పదకొండేళ్ల వయసున్న ఇద్దరు అబ్బాయిలు ఆడుకోవడానికని వచ్చిన పక్కింటి అమ్మాయిని తమ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్లోని వీడియోలో చూసిన విధంగా ఉండాలని అడిగినందకు కాదంది. పైగా ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెబుతానని చెప్పడంతో భయపడిన అబ్బాయిలు ఆ అమ్మాయిపై రాళ్లతో దాడి చేయడంతో చనిపోయింది. విచారించిన పోలీసులు వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చారు. పదకొండేళ్ల బాలుడి దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ అతని తండ్రిది. ఆన్లైన్ క్లాసుల కోసం తండ్రి కొడుక్కి ఇచ్చిన స్మార్ట్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలు, వీడియోలు ఉండటం.. వాటిని చూడటానికి అలవాటుపడిన పిల్లవాడు చేసిన నేరం తాలూకు పరిణామం ఇది. అస్సాంలోని నాగావ్ జిల్లాలో ఇటీవల జరిగిన ఈ సంఘటన పిల్లలున్న తల్లిదండ్రులంందరినీ పునరాలోచించుకునేలా చేసింది. ఆన్లైన్లో లభ్యమయ్యే అశ్లీల, హింసాత్మక కంటెంట్ దుష్ప్రభావాలకు పిల్లలు గురికాకుండా కుటుంబం దిశానిర్దేశం చేయాల్సిన అవసరాన్ని ఈ సంఘటన తెలియజేస్తోందని నాగావ్ ఎస్పీ ఈ సందర్బంగా తెలిపారు. పిల్లలు ఆరుబయట నలుగురితో కలిసి ఆడుకునే రోజులు చాలా వరకు తగ్గిపోయాయి. ఇప్పుడు చాలా వరకు సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, మెసేజింగ్ రూమ్‌లు, వర్చువల్ వరల్డ్‌లు, బ్లాగుల్లోనే కలుస్తున్నారు. ఆటలైనా, పాటలైనా, వినోదం ఏదైనా.. అన్నీ ఇంటర్నెట్లోనే. ఇలాంటప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అనేక ప్రతికూలతలనూ పిల్లలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకని ఆన్లైన్లో మీ పిల్లల భద్రత గురించి ఆలోచించడమూ అత్యంత ముఖ్యం. తెలుసుకోవాల్సిన నాలుగు స్తంభాలు పిల్లవాడు ముందుగా ఫోన్లో లేదా కంప్యూటర్లో గేమ్ ఆడుకోవాలని మారాం చేస్తాడు. గేమ్ కదా అని ఇంటర్నెట్ వ్యవస్థని పిల్లల చేతిలో పెడితే అది పెద్దలకే ముప్పు కలిగించవచ్చు. గతంలో ఓ పిల్లవాడు వీడియో గేమింగ్‌కు అలవాటుపడి తల్లి క్రెడిట్ కార్డుల నుంచి రూ.16 లక్షల వరకు ఖర్చు చేసిన విషయం కూడా మనకు తెలుసిందే. ఇంటర్నెట్ ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలను పిల్లలకు బహుమతిగా ఇవ్వడం, ఇచ్చింది లాగేసుకోవడమూ రెండూ చేయకూడదు. అలాగే ఇచ్చేసి వదిలేయకూడదు. పిల్లలతో పాటు ఆన్లైన్ ట్రావెలింగ్ చేయలేకపోతే డిజిటల్ పరికరాలను అస్సలు ఇవ్వకూడదు. డిజిటల్ వేదికల మీదకు పిల్లలను తీసుకువచ్చినప్పుడు వారికి ప్లే సేఫ్, సేఫ్ సెర్చ్, పేరెంటల్ కంట్రోల్, ఫ్యామిలీ ఇ–మెయిల్ .. ఈ నాలుగూ నాలుగు స్తంభాలని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఇ– మెయిల్ ఐడీ తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉన్నదైతే సమస్యను అర్థం చేసుకోవడానికి మార్గం సులువవుతుంది. పర్యవేక్షణ అవసరం మన శ్రేయస్సుకు ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా నేర్చుకోవాలో పిల్లలకు నేర్పడంలో తల్లిదండ్రులు వారికి సాయపడాలి. అందుకు పిల్లలతో కలిసి ఆన్లైన్ చూడటం, అందులో తమదైన కంటెంట్‌ను కలిసి సృష్టించడమనేది అలవాటు చేయాలి. అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, వెబ్సైట్ సాధనాలు 13 ఏళ్ల వయసు గల పిల్లలకూ యాక్సెస్ ఇస్తున్నాయి. అందుకని, పిల్లలు ఆన్లైన్లో ఏం చేస్తున్నారో, చూస్తున్నారో తల్లిదండ్రులకు చెప్పాలి. తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఆన్లైన్ స్నేహాలను ప్రోత్సహించవద్దు. ఆన్లైన్ స్నేహితులు చెప్పే ప్రతీదాన్ని నమ్మవద్దు అని చెప్పాలి. తమ పూర్తి పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, రోజువారీ ప్రణాళికలు, పుట్టినరోజులు.. వంటి వ్యక్తిగత సమాచారాన్ని పిల్లలు గోప్యంగా ఉంచేలా ముందే జాగ్రత్తపడాలి. తమ టీచర్లు, కుటుంబం, స్నేహితులు చూడకూడదనేవాటిని ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ చేయవద్దని చెప్పాలి. ఆన్లైన్లో వచ్చిన ప్రతిదాన్ని నమ్మవద్దని చెప్పాలి. సైబర్ బెదిరింపులు వంటివి ఉంటే తప్పక తెలియజేయమనాలి. ఇ–మెయిల్ ఐడీ, యూజర్‌నేమ్, పాస్వర్డ్.. వంటివి ఇతరులకు చెప్పవద్దని సూచించాలి. ఆఫ్‌లైన్‌లో ఏవిధంగా ఉంటారో, ఆన్‌లైన్‌లోనూ అంతే మర్యాదగా ఉండాలని బోధించాలి. టీనేజర్లయినా .. నిబంధనలు తప్పనిసరి పేరెంటల్ కంట్రోల్ తప్పనిసరి. అలాగే, ఏ తరహా వెబ్సైట్లు చూడకూడదో ముందే సెట్ చేసుకోవడానికి ఫిల్టరింగ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. డబ్బులున్నాయి కదా అని ఈ వయసు పిల్లలకు మనీ ఎలా ఇవ్వకూడదో.. ఆన్లైన్లో జరిగే రకరకాల ప్రమాదాల గురించి చెప్పకుండా, పర్యవేక్షణ లేకుండా గ్యాడ్జెట్లు అలా ఇవ్వకూడదని గుర్తుపెట్టుకోవాలి. పెద్దలు ఉపయోగించే స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు పిల్లలు కూడా ఉపయోగించేటప్పుడు కొన్ని వెబ్సైట్లు, యాప్స్ యాక్సెస్‌ని పరిమితం చేయచ్చు. లేదంటే అభ్యంతరకరంగా అనిపించిన ఫంక్షన్స్‌ని స్విచ్డాఫ్ చేసి ఉంచవచ్చు. సెర్చింగ్ ప్రక్రియలో సురక్షిత విధానాలు ప్రతిదానికీ ఉంటాయి. కొన్ని యాప్ అప్లికేషన్స్‌ని సైన్‌ఔట్ చేసి ఉంచచ్చు. ఈ నిబంధనలు పాటించడం ద్వారా పిల్లలు అనుచితమైన కంటెంట్‌ను చూసే ప్రమాదం తప్పుతుంది. క్రమం తప్పకుండా ఇంటర్నెట్ గురించిన అవగాహన తీసుకువస్తే తప్ప పిల్లల స్థాయి దారుణాలు జరగకుండా కాపాడుకోవచ్చు. అలాగే ప్రతికూల పరిస్థితి ఎదురైనప్పుడు ఏం చేయాలో కూడా సిద్ధంగా ఉండాలి. పిల్లల్ని ఇబ్బందిపెట్టేది ఏదైనా ఇంటర్నెట్లో కనిపిస్తే ఏం చేయాలో వారితోనే మాట్లాడాలి. పిల్లలు ఇంటర్నెట్లో వర్క్ చేస్తున్నప్పుడు పెద్దలు వస్తే ల్యాప్‌టాప్ మూసేయడం, స్త్రీన్ ఆఫ్ చేయడం వంటివి చేయకూడదనే విషయాలు కఠినంగానైనా చెప్పాలి. ఇతరులు పంపిన క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం/ ఇతరులకు యుపిఐ/పిన్/ఓటీపీ వంటివి షేర్ చేయడం వల్ల డబ్బు, వ్యక్తిగత డేటా అపరిచితుల చేతుల్లోకి వెళుతుందని ముందే పిల్లలను నేర్పాలి. సురక్షితం అని భావించినప్పుడే పిల్లలను డిజిటల్ లోకంలోకి అనుమతివ్వడం అన్ని విధాల శ్రేయస్కరం. అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
సైబర్ క్రైమ్ ఎఫెక్ట్: 500 యాప్స్ గోవిందా!
వాషింగ్టన్: ఇటీవల సాంకేతిక ప్రపంచాన్ని వణికించిన వన్నాక్రై సైబర్ అటాక్ ప్రభావం ఇంకా కొనసాగుతోంది. యూజర్ల వ్యక్తిగత సమాచారం హ్యాక్ అవుతుందన్న కారణంతో సెర్చింజన్ దిగ్గజం గూగుల్ కంపెనీ ఏకంగా 500 అప్లికేషన్లను ప్లే స్టోర్ నుంచి తొలగించింది. అమెరికాకు చెందిన సాంకేతిక (సైబర్) నిపుణుల సూచన మేరకు గూగుల్ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. వన్నాక్రై సైబర్ దాడితో 41 యాప్స్ లో వైరస్ ఉన్నట్లు గతంలో గుర్తించారు. కానీ అది అంతటితో ఆగకుండా 500కు పైగా ప్లే స్టోర్ అప్లికేషన్లకు వ్యాప్తి చెందిందనట్లు సైబర్ నిపుణులు చెబుతున్నారు. ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకుంటున్న ఈ యాప్స్ ద్వారా వైరస్ లు వ్యాప్తి చెంది నెటిజన్ల వ్యక్తిగత సమాచారం హ్యాక్ చేసి హ్యాకర్లు సైబర్ దాడులకు పాల్పడుతున్నారు. గూగుల్ తొలగించిన అప్లికేషన్లలో మొబైల్ గేమ్స్, ఆన్ లైన్ రేడియో, ఫొటో ఎడిటింగ్, ఆరోగ్యం, వాతావరణం, వీడియో కెమెరా యాప్స్ ఉన్నట్లు సంస్థ ప్రతినిధి వెల్లడించారు. 'ఐజెక్సిన్' (Igexin) అనే సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ కిట్ (ఎస్డీకే) ను అప్లికేషన్లలో ఎంబాడ్ చేయడంతో వైరస్ సోకిన ఎలక్ట్రానిక్ వస్తువుల ద్వారా సైబర్ దాడులు జరుగుతున్నాయని తెలిపారు. స్మార్ట్ ఫోన్లు ప్రభావితమైన అనంతరం నకిలీ యాడ్ ను క్రియేట్ చేస్తూ హ్యాకర్లు డబ్బులు గుంజడానికి బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. అయితే కొన్ని సంస్థల కోడింగ్ డెవలపర్లకు యాప్స్‌లో వైరస్ వ్యాప్తి చెందుతోన్న విషయం తెలియకపోవటం గమనార్హం. -
వ్యవ‘సాయానికి’ చక్కటి యాప్స్
స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు సులువుగా మర్కెట్ వివరాలు వి.కోట: వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉన్న వున దేశానికి ఆధునికత మరింత తోడ్పాటు అందించాల్సిన అవసరముంది. ఇటీవల వచ్చిన స్మార్ట్ఫోన్లలోని కొత్త ఫీచర్లకు అనుగుణంగా పనిచేసే వ్యవసాయ అప్లికేషన్లు సైతం విశేష ప్రచారాన్ని చూరగొంటున్నాయి. వ్యవసాయ చట్టాలు, వాతావరణ వివరాలు, పంటలను ఆశించే వివిధ రకాల తెగుళ్లు, వా టి నివారణకు చక్కటి మర్గాలను చూపే యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటి వినియోగానికి ఆండ్రాయిడ్ లేదా విండోస్ ఆపరేటింగ్ సిస్టం గల మొబైల్‌తో పాటు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటేచాలు. అందులో ముఖ్యమైనవి మీకోసం.. పంటల సవుగ్ర సవూచారం కోసం.. వివిధ రకాలైన పంటలు, ధాన్యాలు, పండ్ల పెంపకం, సుగంధ ద్రవ్యాల గురించి క్రాప్ఇన్ఫో యూప్ ద్వారా తెలుసుకోవచ్చు. పంటలకు అవసరవుయ్యే నేల తయారీ, విత్తన మోతాదు, పంటకాలం, రకాలు, నాటే సమయ, ఎరువుల కాంబినేషన్, మొక్కకు మొక్కకూ దూరం, సవుగ్ర పోషకాల అందజేత, నీటి పారుదల, కోతలు, దిగుబడి తదితర అంశాలపై సూచనలు అందజేస్తుంది. ముఖ్యమైన వూర్కెట్ల గురించి అగ్రిపోర్టల్ అనే యాప్ ద్వారా దేశంలోని ముఖ్యమైన మర్కెట్లలో కూరగాయలు, ధాన్యాలు, పండ్ల ధరలు తెలుసుకోవచ్చు. వాతావరణ విశేషాలుసైతం సులువుగా అర్థమవుతాయి. ఇంగ్లిషుతో పాటు తెలుగు, తమిళ వర్షన్లు త్వరలో అందుబాటులోకి వస్తాయని ప్రోగ్రాం డెవలపర్స్ చెబుతున్నారు. డిసీస్ ఐడీ డిసీస్ ఐడీ యాప్ ద్వారా పంటలను ఆశించే వివిధ రకాలైన తెగుళ్లు, వాటి నివారణ గురించి తెలుసుకోవచ్చు. అయితే ఇందులో వున దేశంలో పండే కాయగూరల విషయాలు తక్కువగా ఉన్నాయి. తెగుళ్లు, వాటి కారకాలను మత్రం ఫొటోలతో సహా చక్కగా వివరించారు. వీడ్ ఐడీ వివిధ రకాలైన పంటల్లో వచ్చే కలుపు మొక్కలు, వాటి నివారణా చర్యలను చక్కగా వివరించారు. దాదాపు వందల సంఖ్యలో ఉన్న కలుపు మొక్కల సవూచారం, జీవిత కాలం అంశాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. అగ్రిప్రెసిషన్ యాప్ ద్వారా మొబైల్‌తోనే పొలం విస్తీర్ణాన్ని కొలవవచ్చు. సూచనల కోసం అగ్రిప్లాజా వ్యవసాయ సూచనలు, ముఖ్యమైన సలహాల కోసం అగ్రిప్లాజా పేరిట యాప్ అందుబాటులో ఉంది. టవూట, బం గాళాదుంపల సాగుపై నిపుణులు అందుబాటులోకి వస్తారు. తెగులు సోకిన భాగాన్ని ఫొటో తీసి వారికి అప్లోడ్ చేసిన కొద్ది సేపటికి వాటి నివారణ , వాడాల్సిన మందులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు అందుతాయి. వ్యవసాయూనికి సంబంధించిన చట్టాల కోసం.. భారతదేశంలో వ్యవసాయూనికి సంబంధించిన చట్టాలు అనేకమున్నాయి. నాణ్యమైన ఎరువుల కొనుగోలు, నకిలీ విత్తనాలు, ఆగ్రో సేవలు, రైతుకు చట్టపరమైన భద్రత తదితర అంశాలపై పూర్తి స్థాయిలో సమాచారం అందుబాటులో ఉంది. అగ్రికల్చర్ ఆక్ట్ పేరిట ఉన్న ఈ యాప్‌ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాతావరణం గురించి ముందే తెలుసుకోండిలా.. వారం రోజుల వరకు వాతావరణంలో కలిగే వూర్పుల ను ఆక్యువెదర్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆం డ్రాయిడ్ ఫోన్లను వాడేవారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫోన్లో ఉన్న సిమ్ నెట్‌వర్క్‌కు సంబంధించి ఇంటర్నెట్ ప్యాక్‌తో రీచార్జ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులు తెలుస్తాయి. ముఖ్యంగా పురుగుల వుందులను పిచికారీ చేసిన వెంటనే వర్షం పడితే రైతులకు కలిగే నష్టం అంతా ఇంతా కాదు. ఈయాప్ ద్వారా వర్ష సూచన లు, గాలిలో తేమాశాతం, ఎన్ని డిగ్రీల ఎండ కాస్తోంది వంటి విలువైన విషయాలు తెలుసుకోవచ్చు.