వ్యవ‘సాయానికి’ చక్కటి యాప్స్ | Agriculture app | Sakshi
Sakshi News home page

వ్యవ‘సాయానికి’ చక్కటి యాప్స్

Published Thu, Sep 4 2014 1:28 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

వ్యవ‘సాయానికి’  చక్కటి యాప్స్ - Sakshi

వ్యవ‘సాయానికి’ చక్కటి యాప్స్

  • స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు    
  •  సులువుగా మర్కెట్ వివరాలు
  • వి.కోట: వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉన్న వున దేశానికి ఆధునికత మరింత తోడ్పాటు అందించాల్సిన అవసరముంది. ఇటీవల వచ్చిన స్మార్ట్‌ఫోన్లలోని కొత్త ఫీచర్లకు అనుగుణంగా పనిచేసే వ్యవసాయ అప్లికేషన్లు సైతం విశేష ప్రచారాన్ని చూరగొంటున్నాయి. వ్యవసాయ చట్టాలు, వాతావరణ  వివరాలు, పంటలను ఆశించే వివిధ రకాల తెగుళ్లు, వా టి నివారణకు చక్కటి మర్గాలను చూపే యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటి వినియోగానికి ఆండ్రాయిడ్ లేదా విండోస్ ఆపరేటింగ్ సిస్టం గల మొబైల్‌తో పాటు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటేచాలు. అందులో ముఖ్యమైనవి మీకోసం..
     
    పంటల సవుగ్ర సవూచారం కోసం..

     
    వివిధ రకాలైన పంటలు, ధాన్యాలు, పండ్ల పెంపకం, సుగంధ ద్రవ్యాల గురించి క్రాప్‌ఇన్ఫో యూప్ ద్వారా తెలుసుకోవచ్చు. పంటలకు అవసరవుయ్యే నేల తయారీ, విత్తన మోతాదు, పంటకాలం, రకాలు, నాటే సమయ, ఎరువుల కాంబినేషన్, మొక్కకు మొక్కకూ దూరం, సవుగ్ర పోషకాల అందజేత, నీటి పారుదల, కోతలు, దిగుబడి తదితర అంశాలపై సూచనలు అందజేస్తుంది.

    ముఖ్యమైన వూర్కెట్ల గురించి

    అగ్రిపోర్టల్ అనే యాప్ ద్వారా దేశంలోని ముఖ్యమైన మర్కెట్లలో కూరగాయలు, ధాన్యాలు, పండ్ల ధరలు తెలుసుకోవచ్చు. వాతావరణ విశేషాలుసైతం సులువుగా అర్థమవుతాయి. ఇంగ్లిషుతో పాటు తెలుగు, తమిళ వర్షన్‌లు త్వరలో అందుబాటులోకి వస్తాయని ప్రోగ్రాం డెవలపర్స్ చెబుతున్నారు.
     
    డిసీస్ ఐడీ

    డిసీస్ ఐడీ యాప్ ద్వారా పంటలను ఆశించే వివిధ రకాలైన తెగుళ్లు, వాటి నివారణ గురించి తెలుసుకోవచ్చు. అయితే ఇందులో వున దేశంలో పండే కాయగూరల విషయాలు తక్కువగా ఉన్నాయి. తెగుళ్లు, వాటి కారకాలను మత్రం ఫొటోలతో సహా చక్కగా వివరించారు.
     
    వీడ్ ఐడీ
     
    వివిధ రకాలైన పంటల్లో వచ్చే కలుపు మొక్కలు, వాటి నివారణా చర్యలను చక్కగా వివరించారు. దాదాపు వందల సంఖ్యలో ఉన్న కలుపు మొక్కల సవూచారం, జీవిత కాలం అంశాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. అగ్రిప్రెసిషన్ యాప్ ద్వారా మొబైల్‌తోనే పొలం విస్తీర్ణాన్ని కొలవవచ్చు.
     
     సూచనల కోసం అగ్రిప్లాజా

    వ్యవసాయ సూచనలు, ముఖ్యమైన సలహాల కోసం అగ్రిప్లాజా పేరిట యాప్ అందుబాటులో ఉంది. టవూట, బం గాళాదుంపల సాగుపై నిపుణులు అందుబాటులోకి వస్తారు. తెగులు సోకిన భాగాన్ని ఫొటో తీసి వారికి అప్‌లోడ్ చేసిన కొద్ది సేపటికి వాటి నివారణ , వాడాల్సిన మందులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు అందుతాయి.
     
    వ్యవసాయూనికి సంబంధించిన చట్టాల కోసం..

    భారతదేశంలో వ్యవసాయూనికి సంబంధించిన చట్టాలు అనేకమున్నాయి. నాణ్యమైన ఎరువుల కొనుగోలు, నకిలీ విత్తనాలు, ఆగ్రో సేవలు, రైతుకు చట్టపరమైన భద్రత తదితర అంశాలపై పూర్తి స్థాయిలో సమాచారం అందుబాటులో ఉంది. అగ్రికల్చర్ ఆక్ట్ పేరిట ఉన్న ఈ యాప్‌ను ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
     
    వాతావరణం గురించి ముందే తెలుసుకోండిలా..
     
    వారం రోజుల వరకు వాతావరణంలో కలిగే వూర్పుల ను ఆక్యువెదర్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆం డ్రాయిడ్ ఫోన్లను వాడేవారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫోన్‌లో ఉన్న సిమ్ నెట్‌వర్క్‌కు సంబంధించి ఇంటర్నెట్ ప్యాక్‌తో రీచార్జ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులు తెలుస్తాయి. ముఖ్యంగా పురుగుల వుందులను పిచికారీ చేసిన వెంటనే వర్షం పడితే రైతులకు కలిగే నష్టం అంతా ఇంతా కాదు. ఈయాప్ ద్వారా వర్ష సూచన లు, గాలిలో తేమాశాతం, ఎన్ని డిగ్రీల ఎండ కాస్తోంది వంటి విలువైన విషయాలు తెలుసుకోవచ్చు.
     
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement