హోంవర్క్ చేయలేదని..
నెక్కొండ: హోంవర్క్ చేయలేదని ఓ చిన్నారిని పాఠశాల కరస్పాండెంట్ చితకబాదిన సంఘటన వరంగల్ జిల్లాలో వెలుగుచూసింది. నెక్కొండ మండల కేంద్రంలోని స్నేహ ప్రగతి స్కూల్లో యూకేజీ చదువుతున్న బానోతు సిద్ధును పాఠశాల కరస్పాండెంట్ కోడూరి అశోక్ కుమార్ తీవ్రంగా దండించాడు. శనివారం పాఠశాలకు వచ్చిన చిన్నారి హోంవర్క్ చేయకపోవడంతో.. ఆగ్రహించిన అశోక్ కుమార్ తీవ్రంగా కొట్టాడు. జరిగిన విషయాన్ని చిన్నారి తల్లిదండ్రులకు చెప్పడంతో.. ఆగ్రహించిన వారు పాఠశాల తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.