ఏ క్షణంలోనైనా తేజ్పాల్ను అరెస్ట్ చేసే అవకాశం
న్యూఢిల్లీ: తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ కేసు విషయంలో గోవా క్రైం బ్రాంచ్ పోలీసులు ఢిల్లీ చేరుకున్నారు. ముగ్గురు సభ్యుల పోలీసుల బృందం తెహల్కా ఆఫీసుకు చేరుకుంది. తరణ్ తేజ్ పాల్, తెహల్కా మేనేజింగ్ ఎడిటర్ సోమా చౌదరి మధ్య ఉత్తరప్రత్యుత్తరాలను పరిశీలిస్తున్నారు. ల్యాప్‌టాప్, హార్డ్‌డిస్క్, ఐప్యాడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఏ క్షణంలోలైనా తరణ్ తేజ్ పాల్‌ను గోవా పోలీసులు
అరెస్టు చేసే అవకాశం ఉంది.
గోవా ముఖ్యమంత్రి పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో ఘటనపై విచారణ ప్రారంభించారు. లైంగికదాడి జరిపి పత్రిక ఎడిటర్‌గా ఆరునెలలు తప్పుకోవడమే శిక్షగా పరిగణించాలంటే కుదరదని ఇప్పటికే రాజకీయ పక్షాలు స్పష్టం చేశాయి. తేజ్పాల్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా, లైంగిక వేధింపుల ఆరోపణలపై తరుణ్ తేజ్పాల్పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏ క్షణమైనా అతనిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది.