some
-
కలర్‌ఫుల్ ఓనమ్
పంటలు ఇంటికి వచ్చిన వేళ..వంటలు ఘుమఘుమలాడిన వేళ..ఇంట్లో పండగ వేళ... ఇలా ఓనమ్ పండగను ఘనంగా జరుపుకున్నారు కొందరు తారలు.కేరళప్రాంతంలో పంటలు వచ్చే ఈ మాసంలో ఓనమ్ పండగ జరుపుకుంటారు. మంగళవారం పండగ సందర్భంగా పలువురు కథానాయికలు అందంగా ముస్తాబై, మెరిసిపోయారు. ఓనమ్ సాద్య పేరుతో దాదాపు 26 రకాల వంటకాలను అరిటాకులో వడ్డించుకుని, ఆరగించారు. పండగ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ∙మిర్నా మీనన్ ∙మాళవికా మోహనన్ ∙కల్యాణి ∙అపర్ణా దాస్ అదా శర్మ -
ఆ బ్యాంక్ అనుమానాస్పద ఖాతాలు రద్దు
న్యూఢిల్లీ: డీమానిటైజేషన్ తర్వాత ఉద్యోగుల అవినీతితో ప్రముఖ ప్రయివేటు బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుపోయింది. పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకు సిబ్బంది పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడడం బ్యాంక్ ప్రతిష్టను దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో యాక్సిస్ డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు దిగింది. కొన్ని అనుమానాస్పద ఖాతాలను తాత్కాలింగా రద్దు చేసింది. ఉద్యోగుల అక్రమాలపై కఠిన చర్యల్లో భాగంగా "అపూర్వమైన అడుగు" తీసుకున్నామని సోమవారం వెల్లడించింది. అనుమానాస్పద లావాదేవీల ఖాతాల వివరాలను దర్యాప్తు సంస్థలకు అందించినట్టు యాక్సిస్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. కొంతమంది అనుమానిత ఖాతాల అనుమానాస్పద లావాదేవీల నివేదికలను (ఎస్.టి.ఆర్.లను) ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ దాఖలు చేసినట్టు తెలిపింది. దీంతోపాటు ప్రభుత్వం చేపట్టిన పెద్దనోట్ల రద్దు ప్రక్రియ విజయవంతానికి, డిజిటల్ లావాదేవీలకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. కాగా గతవారం మూడు కిలోల బంగారాన్ని సీజ్ చేసిన ఈడీ ఇద్దరు యాక్సిస్ బ్యాంకు మేనేజర్లను అరెస్ట్ చేసింది. మనీ లాండరింగ్ చట్టం కింద కేసులు నమోదుచేశారు. అటు బ్యాంకు కూడా అక్రమ లావాదేవీల ఆరోపణలతో 19 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఐటీ అధికారులు ఢిల్లీ బ్రాంచ్ పై దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. -
బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నానంటూ టోకరా
బార్కోడ్ తెలుసుకొని రూ.5వేలు డ్రా కూసుమంచి: ఆంధ్రాబ్యాంక్ హెడ్డాఫీస్ నుంచి మాట్లాడుతున్నానంటూ..కూసుమంచికి చెందిన కూరపాటి న రేష్ అనే యువకుడికి ఒకరు ఫోన్ చేసి..అతని ఏటీఎం బార్ కోడ్‌తెలుసుకొని..రూ.5వేలను డ్రా చేసుకున్నారు. ఈ మేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతను తెలిపిన వివరాల ప్రకారం..శనివారం ఓ వ్యక్తి నరేష్ సెల్‌కు ఫోన్‌చేసి హిందీలో మాట్లాడాడు. తాను ఆంధ్రాబ్యాంకు హెడ్డాఫీస్ నుంచి మాట్లాడుతున్నానని, మీ ఏటీఎం ఇకపై పనిచేయదని, బార్కోyŠ నెంబర్ చెబితే సరిచేస్తామని నమ్మబలికాడు. దీంతో సదరు యువకుడు..తొలుత ఏటీఎం కార్డుపై ఉన్న 16 అంకెల బార్కోడ్ చెప్పాడు. దీంతో నరేష్ సెల్‌కు ఐదు నిమిషాల్లోనే రూ. 5వేలు డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో ఖంగుతిన్న బాధితుడు బ్యాంక్‌కు వెళ్లి బ్యాలెన్స్ చూసుకోగా రూ. 11 వేలకు బదులు రూ. 6వేలే ఉన్నాయి. తాను మోసపోయానని గ్రహించి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.